పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : నారయ కృతి ఆరంభంబు

  •  
  •  
  •  

2-108-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నము దన కడపలఁ దాఁ
నెఱుగని కరణి విభుఁడు దా నెఱుఁగఁ డనన్
నప్రసవము లే దన
గునే సర్వజ్ఞతకును హాని దలంపన్.

టీకా:

గగనము = ఆకాశము; తన = తన యొక్క; కడపలన్ = చివరలను; తాన్ = తాను; తగన్ = తగినట్లు; ఎఱుఁగని = తెలియని; కరణిన్ = విధముగ; విభుఁడు = భగవంతుడు {విభుడు - ప్రభువు}; తాన్ = తాను; ఎఱుఁగన్ = తెలియడు; అనన్ = అనుట వలన; గగన = ఆకాశము; ప్రసవము = పుట్టుట; లేదు = లేదు; అనన్ = అన్నట్లుగ; అగునే = వీలగునా ఏమి; సర్వజ్ఞతకున్ = సర్వజ్ఞత్వమునకు; హాని = నష్టము; తలంపన్ = ఆలోచించినట్లైతే.

భావము:

ఆకాశం తన సరిహద్దులను తెలుసుకోలేదు. అదే విధంగా భగవంతుడు తన సమగ్రతను తానే ఎరుగలేడు. సరిహద్దుల నెరుగదు అన్నంత మాత్రాన ఆకాశ సర్వ వ్యాప్తిత్వాన్ని కాదన లేము కదా. అలాగే తన అంతు తనకే తెలియదు అన్నంత మాత్రాన భగవంతుని సర్వజ్ఞత్వానికి లోటు వాటిల్లదు.
బ్రహ్మదేవుడు నారదునికి భగవత్తత్వం ఉపదేశించే సందర్భంలో ఇలా చెప్తున్నాడు. భగవంతుడు సర్వజ్ఞుడు కనుక తన పరిధి, వ్యాప్తుల పరిమితులు తెలియవు అనడంలో అసంభవం ఏమి లేదు.