పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : లోకంబులు పుట్టుట

 •  
 •  
 •  

2-87-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

భునాత్మకుఁ డా యీశుఁడు
నాకృతితోడ నుండు బ్రహ్మాండంబున్
విరముతోఁ బదునాలుఁగు
విరంబులుగా నొనర్చె విశదంబులుగన్

టీకా:

భువన = భువనములు; ఆత్మకున్ = తానే అయినవాడు; ఆ = ఆ; ఈశుఁడు = ఈశ్వరుడు, అధికారి; భవన = భవనములు యొక్క; ఆకృతి = ఆకారము; తోడన్ = తో; ఉండు = ఉండెడి; బ్రహ్మాండంబున్ = బ్రహ్మాండమును; వివరము = వివిధ లక్షణములు; తోన్ = తో; పదునాలుగు = పద్నాలుగు; వివరంబులుగాన్ = రకములుగా; ఒనర్చెన్ = చేసెను; విశదంబుగన్ = విశదమగునట్లు, తెలియునట్లు.

భావము:

ప్రపంచ స్వరూపుడైన ఆ ఈశ్వరుడు ఒక భవనం లాగ ఉన్న బ్రహ్మాండాన్ని విడివిడిగాచేసి విపులమైన చతుర్దశభువనాలుగా తీర్చిదిద్దాడు.

2-88-మ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

హు పా దోరు భు జాన నేక్షణ శిరఃఫాలశ్రవోయుక్తుఁడై
విరించున్ బహుదేహి దేహగతుఁడై; విద్వాంసు లూహించి త
ద్బహురూపావయవంబులన్ భువనసంత్తిన్ విచారింతు; రా
నీయాద్భుతమూర్తి యోగిజన హృన్మాన్యుండు మేధానిధీ!

టీకా:

బహు = అనేకమైన; పాద = పాదములు, కాళ్ళు; ఊరు = తొడలు; భుజ = భుజములు; ఆనన = ముఖములు, నోర్లు; ఈక్షణ = కళ్ళు; శిరః = తలలు; ఫాల = నుదురులు; శ్రవ = చెవులు; యుక్తుడు = కలిగిన వాడు; ఐ = అయి; విహరించున్ = తిరుగుచుండును; బహు = అనేకమైన; దేహి = జీవుల {దేహి - దేహము కలవి, జీవులు}; దేహ = శరీరము లందు; గతుఁడు = ఉన్నవాడు; ఐ = అయి; విద్వాంసులున్ = బాగుగ తెలిసినవారు; ఊహించి = అర్థము చేసికొని; తత్ = ఆ; బహు = అనేకమైన; రూప = రూపములు; అవయవంబులన్ = అవయవము లందలి; భువన = లోకముల; సంపత్తిన్ = గొప్పతనమును; విచారింతురున్ = సంస్మరింతురు, విమర్శింతురు; ఆ = ఆ; మహనీయ = మహనీయమైన; అద్భుత = అద్భుతమైన; మూర్తిన్ = స్వరూపము కలవానిని; యోగి = యోగుల; జన = సమూహముల; హృత్ = హృదయములచేత; మాన్యుండున్ = గౌరవింబడువానిని; మేధా = మేధస్సు అను; నిధీ = నిధి కలవాడా.

భావము:

బుద్ధిమంతుడవైన నారదా! ఆ దేవుడు అనేకాలైన పాదాలూ, ఊరువులూ, భుజాలూ, ముఖాలూ, నేత్రాలూ, శిరస్సులూ, నోళ్లూ, చెవులతో కూడి ఉన్నాడు. అలా ఉంటూ అనేక ప్రాణుల శరీరాలలో నెలకొని విహరిస్తూ వుంటాడు. పండితులు చక్కగా విమర్శించి ఆ భగవంతుని అనేక రూపాలైన అవయవాలలోనే సమస్త భువనాల ఉనికినీ విచారిస్తూ ఉంటారు. మహామహూడూ, ఆశ్చర్యకర స్వరూపుడూ అయిన ఆ భగవానుడు యోగుల హృదయాలలో అర్చింపదగి ఉన్నాడు.

2-89-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

వినుము; చతుర్దశ లోకంబులందు మీఁది యేడు లోకంబులు శ్రీమహావిష్ణువునకుం గటి ప్రదేశంబున నుండి యూర్ధ్వదేహమనియునుఁ, గ్రింది యేడు లోకంబులు జఘనంబునుండి యధోదేహ మనియునుం, బలుకుదురు; ప్రపంచశరీరుండగు భగవంతుని ముఖంబువలన బ్రహ్మకులంబును, బాహువులవలన క్షత్రియకులంబును, నూరువులవలన వైశ్యకులంబునుఁ, బాదంబులవలన శూద్రకులంబును, జనియించె నని చెప్పుదురు; భూలోకంబు గటిప్రదేశంబు; భువర్లోకంబు నాభి; సువర్లోకంబు హృదయంబు; మహర్లోకంబు వక్షంబు; జనలోకంబు గ్రీవంబు; తపోలోకంబు స్తనద్వయంబు; సనాతనంబును బ్రహ్మనివాసంబునునైన సత్య లోకంబు శిరంబు; జఘనప్రదేశం బతలంబు; తొడలు విత లంబు; జానువులు సుతలంబు; జంఘలు తలాతలంబు; గుల్ఫంబులు మహాతలంబు; పాదాగ్రంబులు రసాతలంబు; పాదతలంబు పాతాళంబు నని లోకమయుంగా భావింతురు; కొందఱు మఱియుం బాదతలంబువలన భూలోకంబును నాభివలన భువర్లోకంబును; శిరంబున స్వర్లోకంబును; గలిగె నని లోకకల్పనంబు నెన్నుదురు; పురుషోత్తముని ముఖంబు వలన సర్వ జంతు వాచాజాలంబును, తదధిష్ఠాత యగు వహ్నియు నుదయించె; చర్మరక్తమాంసమేదశ్శల్యమజ్జాశుక్లంబులు సప్తధాతువు లని యందురు; పక్షాంతరంబున రోమ త్వఙ్మాంసాస్థి స్నాయు మజ్జా ప్రాణంబును సప్తధాతువు లని యందురు. అందు రోమంబు లుష్టి క్ఛందం బనియుఁ, ద్వక్కు ధాత్రీ ఛందం బనియు, మాంసంబు త్రిష్టు ప్ఛందం బనియు, స్నాయు వనుష్టు చ్ఛందం బనియు, నస్థి జగతీ ఛందంబనియు, మజ్జ పంక్తి చ్ఛందం బనియుఁ, బ్రాణంబు బృహతీ ఛందం బనియు, నాదేశింతురు; హవ్య కవ్యామృతాన్నంబులకు మధురాది షడ్రసంబులకు రసనేంద్రియంబునకు రసాధీశ్వరుండైన వరుణునికిని హరి రసనేంద్రియంబు జన్మస్థానంబు; సర్వ ప్రాణాదులకు వాయువునకు విష్ణునాసికా వివరంబు నివాసంబు; సమీప దూర వ్యాపి గంధంబులకు నోషధులకు నశ్విదేవతలకు భగవంతుని ఘ్రాణేంద్రియంబు నివాసంబు; దేవలోక సత్యలోకంబులకుఁ దేజంబునకు సూర్యునకు సకల చక్షువులకు లోకలోచనుని చక్షురింద్రియంబు స్థానంబు; దిశలకు నాకాశంబునకు శ్రుతి భూతంబులైన యంశంబులకు శబ్దంబునకు సర్వేశ్వరుని కర్ణేంద్రియంబు జన్మస్థానంబు; వస్తుసారంబులకు వర్ణనీయసౌభాగ్యంబులకుఁ బరమపురుషుని గాత్రంబు భాజనంబు; స్పర్శంబునకు వాయువునకు సకల స్నిగ్ధత్వంబునకు దివ్యదేహుని దేహేంద్రియంబు గేహంబు; యూప ప్రముఖ యజ్ఞోపకరణసాధనంబులగు తరుగుల్మలతాదులకుఁ బురుషోత్తముని రోమంబులు మూలంబులు; శిలాలోహంబులు సర్వమయుని నఖంబులు; మేఘజాలంబులు హృషీకేశుని కేశంబులు; మెఱుంగులు విశ్వేశ్వరుని శ్మశ్రువులు; భూర్భువస్సువర్లోక రక్షకు లైన లోకపాలకుల పరాక్రమంబులకు భూరాదిలోకంబుల క్షేమంబునకు శరణంబునకు నారాయణుని విక్రమంబులు నికేతనంబులు; సర్వకామంబులకు నుత్తమంబులైన వరంబులకుఁ దీర్థపాదుని పాదారవిందంబు లాస్పదంబులు; జలంబులకు శుక్లంబునకుఁ బర్జన్యునకుఁ బ్రజాపతి సర్గంబునకు సర్వేశ్వరుని మేఢ్రంబు సంభవనిలయంబు; సంతానమునకుఁ గామాది పురుషార్థంబులకుఁ జిత్తసౌఖ్యరూపంబు లగు నానందంబులకు శరీరసౌఖ్యంబునకు నచ్యుతుని యుపస్థేంద్రియంబు స్థానంబు; యమునికి మిత్రునికి మలవిసర్గంబునకు భగవంతుని పాయ్వింద్రియంబు భవనంబు; హింసకు నిరృతికి మృత్యువునకు నిరయంబునకు నిఖిలరూపకుని గుదంబు నివాసంబు; పరాభవంబునకు నధర్మంబునకు నవిద్యకు నంధకారంబునకు ననంతుని పృష్ఠభాగంబు సదనంబు; నదనదీ నివహంబునకు నీశ్వరుని నాడీ సందోహంబు జన్మమందిరంబు; పర్వతంబులకు నధోక్షజుని శల్యంబులు జనకస్థలంబులు; ప్రధానంబునకు నన్నరసంబునకు సముద్రంబులకు భూతలయంబునకు బ్రహ్మాండ గర్భుని యుదరంబు నివేశంబు; మనోవ్యాపారరూపంబగు లింగశరీరంబునకు మహామహిముని హృదయంబు సర్గభూమి యగు మఱియును.

టీకా:

వినుము = వినుము; చదుర్దశ = పద్నాలుగు; లోకంబులున్ = లోకములును; అందున్ = అందులో; మీఁది = పైన ఉండు; ఏడు = ఏడు; లోకంబులున్ = లోకములును; శ్రీ = శ్రీ; మహా = గొప్పవాడైన; విష్ణువున్ = విష్ణుమూర్తి; కున్ = కి; కటి = నడుము; ప్రదేశంబునన్ = ప్రాంతము; నుండిన్ = నుండి; ఊర్ధ్వ = పై; దేహము = శరీరము; అనియునున్ = అనియును; క్రింది = క్రిందనున్న; ఏడు = ఏడు; లోకంబులున్ = లోకములును; జఘనంబున్ = పిరుదులు; నుండిన్ = నుండి; అధో = క్రింది; దేహము = శరీరము; అనియునున్ = అనియును; పలుకుదురు = చెప్పుతారు; ప్రపంచ = విశ్వము {ప్రపంచము – పంచభూతాత్మక మైనది}; శరీరకుండు = దేహముగ కలవాడు; అగు = అయిన; భగవంతుని = భగవంతుని {భగవంతుడు - మహిమాన్వితుడు, విశ్వారంభమునకు మూలమైనవాడు}; ముఖంబున్ = ముఖము; వలనన్ = వలన; బ్రహ్మ = బ్రాహ్మణ; కులంబున్ = కులమును; బాహులన్ = చేతులు; వలనన్ = వలన; క్షత్రియ = క్షత్రియ; కులంబునున్ = కులమును; ఊరువులన్ = తొడలు; వలనన్ = వలన; వైశ్య = వైశ్యుల; కులంబునున్ = కులమును; పాదంబులన్ = పాదములు; వలనన్ = వలన; శూద్ర = శూద్ర; కులంబునున్ = కులమును; జనియించెన్ = సంభవించినవి; అని = అని; చెప్పుదురు = చెప్పుతారు; భూలోకంబున్ = భూలోకము; కటి = నడుము; ప్రదేశంబున్ = ప్రాంతము; భువర్లోకంబున్ = భువర్లోకము; నాభి = బొడ్డు; సువర్లోకంబున్ = సువర్లోకమును; హృదయంబున్ = హృదయము; మహర్లోకంబున్ = మహర్లోకము; వక్షంబున్ = వక్షస్థలము; జనలోకంబున్ = జనలోకము; గ్రీవంబున్ = మెడ; తపోలోకంబున్ = తపోలోకము; స్తన = స్తనముల; ద్వయంబున్ = జంట; సనాతనంబునున్ = శాశ్వతమైనది; బ్రహ్మ = బ్రహ్మకి; నివాసంబునున్ = నివసించునది; ఐన = అయినట్టి; సత్యలోకంబున్ = సత్యలోకము; శిరంబున్ = తల; జఘన = పిరుదులు; ప్రదేశంబున్ = ప్రాంతము; అతలంబున్ = అతలము; తొడలున్ = తొడలు; వితలంబున్ = వితలము; జానువులున్ = మోకాళ్ళు; సుతలంబున్ = సుతలము; జంఘలున్ = పిక్కలు; తలాతలంబున్ = తలాతలము; గుల్ఫంబులున్ = చీలమండలు; మహాతలంబున్ = మహాతలము; పాదాగ్రంబులున్ = పాదము పై భాగము; రసాతలంబున్ = రసాతలము; పాదతలంబున్ = అరికాలు; పాతాళంబున్ = పాతాళము; అని = అని; లోక = లోకములు; మయుంగా = కూడి ఉన్నవాడిగా; భావింతురున్ = అనుకుంటారు; కొందఱున్ = కొంతమంది; మఱియున్ = ఇంకను; పాదతలంబున్ = పాదతలము; వలన = వలన; భూలోకంబునున్ = భూలోకమును; నాభి = బొడ్డు; వలనన్ = వలన; భువర్లోకంబునున్ = భువర్లోకమును; శిరంబునన్ = తలవలన; స్వర్లోకంబును = స్వర్గలోకమును; కలిగెన్ = కలిగినవి; అని = అని; లోకన్ = లోకముల; కల్పనంబున్ = సృష్టిని; ఎన్నుదురు = చెప్పుదురు; పురుషోత్తమునిన్ = పురుషోత్తముని; ముఖంబున్ = నోరు; వలనన్ = వలన; సర్వ = సమస్త; జంతున్ = జంతువుల; వాచా = వాక్కుల; జాలంబున్ = సమూహమును; తత్ = దాని; అధిష్ఠాత = అధిష్ఠాన దేవత; అగు = అయిన; వహ్నియున్ = అగ్నియును; ఉదయించెన్ = పుట్టెను; చర్మ = చర్మము; రక్త = రక్తము; మాంస = మాంసము; మేదస్ = మెదడు; శల్య = ఎముకలు; మజ్జ = ఎముకలందలి మజ్జ; శుక్లంబులున్ = శుక్లములు అను; సప్త = ఏడు; ధాతువులున్ = ధాతువులు; అని = అని; అందురు = చెప్పుదురు; అందున్ = అటులనే; రోమంబున్ = రోమమును; ఉష్టిక్ = ఉష్టిక్ అను ఏడక్షరముల; ఛందంబున్ = ఛందస్సు; అనియున్ = అనియును; త్వక్ = చర్మము; ధాత్రీ = ధాత్రీ అను మూడక్షరముల; ఛందంబున్ = ఛందస్సు; అనియున్ = అనియును; మాంసంబున్ = మాంసము; త్రిష్టుప్ = త్రిష్టుప్ అను పదమూడక్షరముల; ఛందంబున్ = ఛందస్సు; అనియున్ = అనియును; స్నాయువు = సన్నటి నరములు; అనుష్టుప్ = అనుష్టుప్ అను ఎనిమిదక్షరముల; ఛందంబున్ = ఛందస్సు; అనియున్ = అనియును; అస్థి = అస్థిపంజరము; జగతీ = జగతీ అను పంన్నెండక్షరముల; ఛందంబున్ = ఛందస్సు; అనియున్ = అనియును; మజ్జ = ఎముకమజ్జ; పంక్తిస్ = పంక్తిస్ అను పదక్షరముల; ఛందంబున్ = ఛందస్సు; అనియున్ = అనియును; ప్రాణంబులున్ = ప్రాణములు; బృహతీ = బృహతి అను తొమ్మిదక్షరముల; ఛందంబున్ = ఛందస్సు; అనియున్ = అనియును; ఆదేశింతురు = నిశ్చయించిరి; హవ్య = హోమము చేయదగినది; కవ్య = పితృదేవతలకు సమర్పించతగినది; అమృత = అమృత సమానమైన; అన్నంబులున్ = ఆహారములు; మధుర = తీపి; ఆది = మొదలగు; షడ్రసంబులన్ = ఆరు రుచుల; కున్ = కు; రసన = నాలుక అను; ఇంద్రియంబున్ = ఇంద్రియముల; కున్ = కు; రసన్ = రుచికి; అధీశ్వరుండున్ = అధిదేవత; ఐన = అయిన; వరుణున్ = వరుణుడు; కిన్ = కి; హరి = భగవంతుని; రసనన్ = నాలుక అను; ఇంద్రియంబున్ = ఇంద్రియమును; జన్మ = పుట్టిన; స్థానంబున్ = స్థానము; సర్వ = సమస్త; ప్రాణ = ప్రాణవాయువు; ఆదులున్ = మొదలైనవాని; కున్ = కిని; వాయువున్ = వాయువు, గాలి; కున్ = కిని; విష్ణున్ = భగవంతుని; నాసికన్ = ముక్కు; వివరంబున్ = రంధ్రము; నివాసము = పుట్టిన స్థలము; సమీప = దగ్గరి; దూర = దూరము; వ్యాప్తిన్ = వ్యాపించు; గంధంబులున్ = వాసనల; కున్ = కిని; ఓషధులకున్ = పైర్లు {ఓషధులు - ఓషధయః ఫలకాంతాః, పంట పండగనే చనిపోవునవి. ఓషధులు, ధాన్యము, అరటి మొదలగునవి}; అశ్వి = అశ్వినీ; దేవతలున్ = దేవతల; కున్ = కిని; భగవంతునిన్ = విష్ణువు యొక్క; ఘ్రాణ = వాసన చూచు; ఇంద్రియంబున్ = ఇంద్రియము; నివాసంబున్ = పుట్టు స్థలము; దేవలోకన్ = దేవలోకము; సత్యలోకంబులున్ = సత్యలోకముల; కున్ = కు; తేజంబున్ = వెలుగు; కున్ = కు; సూర్యున్ = సూర్యుని; కున్ = కు; సకల = సమస్తమైన; చక్షువులున్ = చూసేవాని; కున్ = కి; లోక = లోకములే; లోచనుని = లోచనములు అయిన వాని; చక్షున్ = చూచు; ఇంద్రియంబున్ = ఇంద్రియము; స్థానంబున్ = పుట్టుక స్థానము; దిశలున్ = దిశల; కున్ = కు; ఆకాశంబున్ = ఆకాశము; కున్ = కు; శ్రుతి = వినబడు; భూతంబులున్ = లక్షణము కలవి; ఐన = అయిన; యశంబులున్ = కీర్తులు; కున్ = కి; శబ్దంబున్ = శబ్దము; కున్ = కు; సర్వేశ్వరుని = భగవంతుని {సర్వేశ్వరుడు - సమస్తమునకు అధిపతి, భగవంతుడు}; కర్ణన్ = కర్ణ; ఇంద్రియంబున్ = ఇంద్రియములు; జన్మ = పుట్టిన; స్థానంబున్ = స్థలములు; వస్తు = వస్తువులందలి; సారంబులున్ = సారములు, ముఖ్యపదార్థములు; కున్ = కు; వర్ణనీయ = వర్ణించుటకు వీలగు; సౌభాగ్యంబులున్ = సౌభాగ్యములు, సంపదలు; కున్ = కు; పరమపురుషునిన్ = భగవంతుని; గాత్రంబున్ = గొంతుక; భాజనంబున్ = పుట్టుక స్థలము; స్పర్శంబున్ = స్పర్శ; కున్ = కు; వాయువున్ = వాయువు; కున్ = కు; సకల = సమస్త; స్నిగ్దత్వంబులున్ = నునుపుదనము కలవాని; కున్ = కు; దివ్య = దివ్యమైన; దేహునిన్ = దేహము కలవాని, భగవంతుని; దేహ = శరీరము అను; ఇంద్రియంబున్ = ఇంద్రియము; గేహంబున్ = పుట్టుక స్థలము; యూపస్ = యూపస్తంభము; ప్రముఖ = మొదలైన ముఖ్య; యజ్ఞ = యజ్ఞమునకు; ఉపకరణన్ = ఉపకరించు; సాధనంబున్ = సాధనములు; అగు = అయిన; తరు = చెట్లు; గుల్మ = పొదలు; లత = లతలు; ఆదులున్ = మొదలగువాని; కున్ = కి; పురుషోత్తముని = భగవంతుని; రోమంబులున్ = రోమములు, వెంట్రుకలు; మూలంబులున్ = పుట్టుక స్థలము; శిలః = శిలలు; లోహంబులున్ = లోహములు; సర్వమయుని = భగవంతుని {సర్వమయుడు - సర్వము తన యందే ఉన్నవాడు}; నఖంబులున్ = గోర్లు; మేఘ = మేఘముల; జాలంబులున్ = సమూహములు; హృషీకేశునిన్ = భగవంతుని {హృషీకేశుడు - ఇంద్రియములకు అధిపతి}; కేశంబులున్ = తల వెంట్రుకలు; మెఱుంగులున్ = మెరుపులు; విశ్వేశ్వరుని = భగవంతుని {విశ్వేశ్వరుడు - విశ్వమునకు ప్రభువు}; శ్మశ్రువులున్ = మీశములు; భూర్ = భూ; భువః = భువః; సువర్ = సువర్; లోక = లోకముల; రక్షకులు = పాలకులు; ఐన = అయిన; లోక = లోకముల; పాలకులున్ = పాలకుల; పరాక్రమంబులున్ = పరాక్రమముల; కున్ = కు; భూర్ = భూమి; ఆది = మొదలగు; లోకంబులన్ = లోకముల; క్షేమంబున్ = క్షేమమును; కున్ = కు; శరణంబున్ = శరణము, రక్షణ; కున్ = కు; నారాయణుని = భగవంతుని {నారాయణుడు - నీటి యందు ఉండువాడు, భగవంతుడు}; విక్రమంబులున్ = పరాక్రమములు; నికేతనంబులున్ = పుట్టిన స్థలము; సర్వ = సమస్తమైన; కామంబులున్ = కోరికలు; కున్ = కు; ఉత్తమంబున్ = ఉత్తమములు; ఐన = అయిన; వరంబులున్ = వరములు; కున్ = కు; తీర్థపాదుని = భగవంతుని {తీర్థపాదుడు - తీర్థములకు మూలస్థానము, తీర్థముల వలె పవిత్రమైన పాదములు}; పాద = పాదములు అను; అరవిందంబులున్ = పద్మములు; ఆస్పదంబులున్ = పుట్టిన స్థలములు; జలంబులున్ = నీటి; కున్ = కి; శుక్లంబున్ = శుక్లము; కున్ = కు; పర్జన్యున్ = వానదేవుని, మేఘుని; కున్ = కి; ప్రజాపతి = ప్రజాపతుల {ప్రజాపతి - ప్రజలను సృష్టించు వాడు}; సర్గంబున్ = సృష్టి; కున్ = కి; సర్వేశ్వరుని = భగవంతుని {సర్వేశ్వరుడు - సర్వమునకు ప్రభువు}; మేఢ్రంబున్ = పురుషావయవము; సంభవ = పుట్టు; నిలయంబున్ = స్థలము; సంతానమున్ = సంతానము; కున్ = కి; కామ = కామము; ఆది = మొదలగు; పురుషార్థంబులున్ = పురుషార్థములు {పురుషార్థములు - కామాది - ధర్మ, అర్థ, కామ, మోక్షములు}; కున్ = కు; చిత్త = మనసునకు; సౌఖ్య = సౌఖ్యమునిచ్చు; రూపంబులున్ = లక్షణములు కలవి; అగు = అయిన; ఆనందములున్ = ఆనందములు; కున్ = కు; శరీర = శరీర; సౌఖ్యంబున్ = సౌఖ్యము; కున్ = కు; అచ్యుతుని = భగవంతుని {అచ్యుతుడు - స్థిరుడు, పడిపోవుట అనునది లేనివాడు, భగవంతుడు}; ఉపస్థ = ఉపస్తు, మర్మ; ఇంద్రియంబున్ = అవయవము; స్థానంబున్ = పుట్టు స్థలము; యమున్ = యముని; కిన్ = కి; మిత్రున్ = మిత్రుని; కిన్ = కి; మల = మలముల; విసర్గంబున్ = విసర్జకములు; కున్ = కు; భగవంతుని = భగవంతుని; పాయుః = గుద; ఇంద్రియంబున్ = ఇంద్రియము; భవనంబున్ = పుట్టిన స్థలము; హింస = హింస; కున్ = కు; నిరృతి = కీడు; కిన్ = కి; మృత్యువున్ = మరణము; కున్ = కు; నిరయంబున్ = నరకమున; కున్ = కు; నిఖిలరూపకుని = భగవంతుని {నిఖిలరూపకుడు - సమస్త రూపములు తానే అయినవాడు}; గుదంబున్ = గుదము; నివాసంబున్ = పుట్టిన స్థలము; పరాభవమున్ = అవమానము; కున్ = కు; అధర్మమున్ = అధర్మమున; కున్ = కు; అవిద్యన్ = అవిద్య; కున్ = కు; అంధకారమున్ = చీకటి; కున్ = కి; అనంతుని = భగవంతుని; పృష్టన్ = వీపు; భాగము = భాగము; సదనంబున్ = పుట్టిన స్థలము; నద = నదములు {నదములు - పడమటకు ప్రవహించునవి}; నదీ = నదులు {నది - తూర్పునకు ప్రవహించునవి}; నివాసంబులున్ = నివాసములు; కున్ = కు; ఈశ్వరుని = భగవంతుని; నాడీ = నాడుల; సందోహంబున్ = సమూహము; జన్మ = పుట్టిన; మందిరంబున్ = స్థలము; పర్వతంబులున్ = పెద్ద కొండలు; కున్ = కు; అధోక్షజుని = భగవంతుని {అధోక్షజుడు - అధః+అక్షజ+వాడు – వ్యు. (అక్షజం – ఇంద్రియ జ్ఢానము, అధి – అధరం, అధి అక్షజ అస్య – అధోక్షజ (బహువ్రీహి సమాసము), వేనిని తెలియుటకు ఇంద్రియ జ్ఞానము అసమర్థమైనదో అతడు, విష్ణువు, (ఆంధ్రశబ్దరత్నాకరము) }; శల్యంబులున్ = ఎముకలు; జనక = పుట్టిన; స్థలంబులున్ = స్థలము; ప్రధానంబున్ = మూలప్రకృతి; కున్ = కి; అన్న = ఆహార; రసంబున్ = సారము; కున్ = కు; సముద్రములున్ = సముద్రములు; కున్ = కు; భూత = భూతములు, జీవులు; లయంబున్ = లీనమగుట; కున్ = కి; బ్రహ్మాండ = బ్రహ్మాండములు; గర్భుని = గర్భమున కలవాని; ఉదరంబున్ = పొట్ట; నివేశంబున్ = పుట్టిన స్థలము; మనస్ = మనస్సు యొక్క; వ్యాపార = ప్రవర్తనల; రూపంబు = లక్షణము; అగు = అయిన; లింగ = లింగ, చిహ్న; శరీరంబున్ = శరీరమున; కున్ = కి; మహామహిమునిన్ = భగవంతుని {మహామహిముడు - గొప్ప మహిమ ఉన్నవాడు}; హృదయంబున్ = హృదయము; సర్గ = పుట్టిన; భూమి = స్థలము; అగున్ = అగును; మఱియునున్ = ఇంకను.

భావము:

ఈ పదునాలుగు లోకాలలో, పై యేడు లోకాలూ శ్రీ మహావిష్ణువునకు నడుమునుండి పై శరీరమంటారు. అలాగే క్రింది యేడు లోకాలూ నడుమునుండి క్రింది శరీరమని చెపుతారు. ప్రపంచమే భగవంతునికి శరీరం. ఆయన ముఖంనుండి బ్రహ్మకులము, బాహువులనుండి క్షత్రియకులము, తొడలనుండి వైశ్యకులము, పాదాలనుండి శూద్రకులము పుట్టాయని వర్ణిస్తారు. ఆ మహావిష్ణువుకు కటిస్థలం భూలోకం, నాభి భువర్లోకం, హృదయం సువర్లోకం, వక్షం మహర్లోకం, కంఠం జనలోకం, స్తనాలు తపోలోకం, శిరస్సు సనాతనమైన బ్రహ్మ నివసించే సత్యలోకం, జఘనం అతలం, తొడలు వితలం, మోకాళ్లు సుతలం, పిక్కలు తలాతలం, చీలమండలం మహాతలం, కాలిమునివేళ్లు రసాతలం, అరికాలు పాతాళం; ఈ కారణంగా ఆయనను లోకమయుడని భావిస్తారు. మరికొంతమంది ఆయన పాదతలం నుండి భూలోకమూ, బొడ్డునుండి భువర్లోకమూ, శిరస్సునుండి స్వర్లోకమూ పుట్టాయని మూడు లోకాల సృష్టినీ వివరిస్తారు. శ్రీమన్నారాయణుని ముఖంనుండి సమస్త ప్రాణుల వాక్కులూ, వాక్కుల కధిష్ఠానమైన అగ్నీ పుట్టాయి. చర్మం, రక్తం, మాంసం, మెదడు, ఎముకలు, మజ్జ, శుక్లం అనే ఇవి యేడు ఆ దేవుని యేడు ధాతువులని చెబుతారు. మరొక పద్ధతిలో రోమాలు, చర్మం, మాంసం, ఎముకలు, స్నాయువులు, మజ్జ, ప్రాణాలు అనే ఇవి ఏడు ధాతువులని వర్ణిస్తారు. వాటిలో రోమాలు ఉష్ణికం ఛందస్సనీ, చర్మం ధాత్రీఛందస్సనీ, మాంసం త్రిష్టుప్ ఛందస్సనీ, స్నాయువు అనుష్టుప్ ఛందస్సనీ, శల్యం జగతీఛందస్సనీ, మజ్జ పంక్తిచ్ఛందస్సనీ, ప్రాణం బృహతీ ఛందస్సనీ వ్యవహరిస్తారు. దేవతల కర్పించే పురోడాశరూపమైన హవ్యానికీ, పితృదేవతలకిచ్చే చరురూపమైన కవ్యానికీ, అమృతాన్నానికీ, తీపి మొదలయిన ఆరు రసాలకీ, రసనేంద్రియానికీ, రసానికీ అధీశ్వరుడైన వరుణుడికీ విష్ణుదేవుని రసనేంద్రియమే జన్మస్థానం. అలాగే అన్ని ప్రాణాదులకు, వాయువుకూ విష్ణుని నాసా రంధ్రం నెలవు. దగ్గరగానూ, దూరంగానూ వ్యాపించే వాసనలకూ, ఓషధులకూ, అశ్వినీ దేవతలకూ ఆ పరమేశ్వరుని ఘ్రాణేంద్రియం స్థానం. దేవలోకానికీ, సత్యలోకానికీ, తేజస్సుకూ, సూర్యుడికీ, సకల నేత్రాలకూ లోకనేత్రుడైన పరమాత్ముని చక్షురింద్రియమే నివాసం, దిక్కులకూ, ఆకాశానికీ, శ్రవణాంశాలకూ, శబ్దానికీ సర్వేశ్వరుని శ్రోత్రేంద్రియం జన్మభూమి. ప్రశస్తాలైన వస్తువులకూ, కొనియాడదగిన సౌందర్యాలకూ పరమ పురుషుని శరీరమే స్థానం. స్పర్శానికీ, గాలికీ, సకల స్నిగ్దత్వాలకి ఆ దివ్యశరీరుని త్వగింద్రియమే గృహం. యాగపశువును బంధించే స్తంభాది యజ్ఞపరికరాలైన చెట్లూ, పొదలూ, తీగలూ మొదలైన వాటికి పురుషోత్తముని రోమాలు స్థానాలు, రాళ్లూ, లోహాలు ఆ విశ్వమయునికి గోళ్లు, మబ్బులు సరోజాక్షుని శిరోజాలు. మెరపులు సర్వేశ్వరుని మీసాలు, భూలోక భువర్లోక సువర్లోకాలను కాపాడే లోకపాలకుల పరాక్రమాలకు, భూలోకం మొదలైన లోకాల క్షేమానికీ, శరణానికీ నారాయణుని పరాక్రమం నట్టిల్లు. ఎల్లకోరికలకూ, శ్రేష్ఠమైన వరాలకూ ఆ పవిత్రపాదుని పాదపద్మాలే నిలయాలు. జలాలు, శుక్లం, పర్జన్యు, ప్రజాపతి సృష్టి అనే వీటన్నింటికీ ఆ సర్వేశ్వరుని పురుషాంగం జన్మస్థలం. సంతతికీ, కామం మొదలైన పురుషార్థాలకూ, మనస్సుకూ కలిగించే ఆనందాలకూ, శరీరసుఖానికీ అచ్యుతుని గుహ్యేంద్రియం స్థానం. యముడికీ, మిత్రుడికీ, మలవిసర్జనానికీ ఆ దేవుని గుదేంద్రియం ఇల్లు. హింసకూ, నిరృతికీ, మృత్యువుకూ, నరకానికీ ఆ సర్వరూపుని గుదం నెలవు. అవమానానికీ, అధర్మానికీ, అవిద్యకూ, చీకటికీ, అంతము లేని ఆ దేవుని పృష్ఠప్రదేశం నివాసం. నదనదీ సమూహాలకు ఈశ్వరుని నాడీ సంఘం పుట్టిల్లు. కొండలకు అధోక్షజుని ఎముకలు జన్మస్థానాలు. ప్రధానానికీ, అన్నరసానికీ, సముద్రాలకూ, భూతాల విలయానికీ ఆ బ్రహ్మాండగర్భుని ఉదరం ఉనికిపట్టు. మానసిక వ్యాపార రూపమైన లింగదేహానికి గొప్పమహిమ గల ఆ దేవుని హృదయం సృష్టి స్థానం. అంతే కాదు.

2-90-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నీలకంధరునకు నీకు నాకు సనత్కు
మార ముఖ్య సుతసమాజమునకు
ర్మ సత్త్వ బుద్ధి త్త్వములకు నీశ్వ
రాత్మ వినుము పరమమైన నెలవు.

టీకా:

నీల = నల్లని; కంధరున్ = మెడ కలవాని; కున్ = కి; నీకున్ = నీకు (నారదునకు); నాకున్ = నాకు (బ్రహ్మకి); సనత్కుమార = సనత్కుమార; ముఖ్య = మొదలైన ముఖ్య; సుత = పుత్రుల; సమాజమున్ = సమూహము; కున్ = కు; ధర్మ = ధర్మము; సత్త్వ = సత్తునకు; బుద్ధి = బుద్ధి; తత్త్వములున్ = లక్షణములు; కున్ = కు; ఈశ్వర = ఈశ్వరుని; ఆత్మ = ఆత్మ, పరమాత్మ; వినుము = వినుము; పరమ = ఉత్కృష్టము; ఐన = అయిన; నెలవు = పుట్టిన స్థలము.

భావము:

శివునికీ, నీకూ, నాకూ, సనత్కుమారాదులకూ, ధర్మానికీ, సత్త్యానికీ, విజ్ఞానానికీ శ్రేష్ఠమైన ఉనికి పట్టు ఆ పరమేశ్వరుని అత్మే.

2-91-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ర సురాసుర పితృ నాగ కుంజర మృగ-
గంధర్వ యక్ష రాక్షస మహీజ
సిద్ధ విద్యాధర జీమూత చారణ-
గ్రహ తారకాప్సరోణ విహంగ
భూత తటిద్వస్తు పుంజంబులును నీవు-
ముక్కంటియును మహామునులు నేను
లిలనభస్థ్సలరములు మొదలైన-
వివిధ జీవులతోడి విశ్వమెల్ల

2-91.1-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

విష్ణుమయము పుత్ర! వేయేల బ్రహ్మాండ
తని జేనలోన డఁగి యుండు;
బుద్ధి నెఱుఁగరాదు భూతభవద్భవ్య
లోకమెల్ల విష్ణులోన నుండు.


[ఈ క్రింది యధిక పాఠము మూలమున “సోమృతస్యాభయస్య” అనుట మొదలుకొని, “పురుషస్తాభయాశ్రయః” అనువఱకు గల నాలుగు శ్లోకములకును వానికి శ్రీధరులు రచించిన వ్యాఖ్యానమునకునుఁ దెనుఁగై యీ ఘట్టమున నుండవలసినదియే. అయిన నిది పెక్కు వ్రాఁతప్రతులను నచ్చుప్రతులనుఁ గాన రాదు. ఒకానొక వ్రాఁతప్రతి యందే చూపట్టుచున్నది. మఱియుఁ బోతన మూలమున శ్రీధరవ్యాఖ్యాన సహితముగాఁ దెనిగించినవాఁడు. కనుకఁ క్రింది నాలుగు శ్లోకములు పోతనకు లభించిన మూలమున లేకుండవచ్చు నని తలంచినను వాని వ్యాఖ్యానము నం దైనను దప్పక కనుపట్టి యుండును. గాన వానినిఁ దెనిఁగింపకుండడు. అయిన నీ తెనిఁగింపు పోతన దాని యంత సమంజసమును బ్రౌఢమును గాకున్నది. వెలిగందల నారయ కవిత్వ మిందును గొంత చేరి యుండుననియుఁ గనుకనే యిది పోతన రచన వలె సమంజసమును బ్రౌఢమును గాదయ్యె ననియు నూహింపఁ దగి యున్నది. - తంజనగరము - తేవప్పెరుమాల్లయ్య వారి ప్రచురణ
3) 2-91/1-క.

దోనొకకర్మఫల
ప్రాదుర్భావ మగు లోక పాలన కే
కా దేవుం డభయప్రతి
పాక మగు మోక్షమునకుఁ తి యె ట్లన్నన్.
4) 2-91/2-వ.
వినుము, పరమాత్మయు నానందేశ్వరుం డ(డున)గు నవ్విష్ణునకుఁ బ్రపంచమాత్రాధికత్వం బేమి యద్భుత మ ట్లగుటంజేసి, యతని మహిమాతిశయం బస్మదాదులు నెఱుంగనేర్తురె, స్థిత్యర్థపాదుం డగు నీశ్వరుని పాదాంశంబు లందు భూభువస్సువర్లోకంబులు గుదురుకొని యుండుఁ. దదీయ విలయ సమయంబునం దదుపరి మహర్లోకంబు దపియింప నందుఁ గల జనంబు లంతరాళంబు నందక మహర్లోకశిరఃస్థానం బైన జనలోకంబుఁ బ్రవేశించి యత్యంతం బగు నవినాశి సుఖంబు లనుభవింతురు. తపోలోకంబు సంకర్షణానల శక్తిచేత నధస్త్రిలోకంబులుం దందహ్యమానంబు లగు నప్పుడు తదూష్మలం జెందక విలక్షం బై, క్షేమంబు గలిమిఁ దజ్జనం బంద సుఖించు. జన్మజరామరణభయంబులు లేక ముక్తికిఁ బ్రత్యాసన్ను లగుటం జేసి సత్యలోకపువాసు లంద యానందింతురు. భూభువస్సువర్లోకంబు లవ్విరాట్పురుషుని పద స్థలం బగుట నేక పాద్విభూతి యయ్యె. మహర్లోకంబు మధ్యమవిభూతి యన నమరె. జన తపో సత్య లోకంబు లమ్మహాపురుషుని శిరఃస్థానంబు గావున, నది త్రిపాద్విభూతి యనంబడుఁ. దదీయ లోకంబు బ్రహ్మచర్య వానప్రస్థ యతులకు దక్క నితరుల కసాధ్యంబు. గృహస్థు లయ్యు నితర త్రివిధాశ్రమధర్మంబులు గలిగినం జేకుఱు. క్షేత్రజ్ఞుం డైన పురుషుండు స్వర్గాపవర్గ హేతుభూతం బైన దక్షిణోత్తర కర్మ జ్ఞాన మార్గంబులు సృజించి యంతయుఁ దాన యై యుండు.]


టీకా:

నర = మానవులు; సుర = దేవతలు; అసుర = దానవులు; పితృ = పితృదేవతలు; నాగ = నాగులు; కుంజర = ఏనుగులు; మృగ = లేళ్ళు; గంధర్వ = గంధర్వులు; యక్ష = యక్షులు; రాక్షస = రాక్షసులు; మహీజ = చెట్లు {మహీజ - మహి+జ - భూమిని పుట్టినవి - చెట్లు}; సిద్ధ = సిద్ధులు; విధ్యాధర = విధ్యాధరులు; జీమూత = మేఘములు; చారణ = చారణులు; గ్రహ = గ్రహములు; తార = తారకలు; అప్సరస = అప్సరసల; గణ = సమూహము; విహంగ = పక్షులు; భూత = భూతములు; తటి = తటిల్లతికలు, మెరుపులు; వస్తు = సంపదల; పుంజములును = కట్టలు, గుంపులు; నీవున్ = నీవు (నారద); ముక్కంటియున్ = శివుడును {ముక్కంటి - మూడు కన్నులు ఉన్నవాడు - శివుడు}; మహా = గొప్ప; మునులు = మునులు; నేను = నేను (బ్రహ్మ); సలిల = నీటిలో; నభస్ = ఆకాశములో; స్థల = భూమిపైన; చరములు = చరించునవి, జీవులు; మొదలైన = మొదలగు; వివధ = రకరకముల; జీవులన్ = ప్రాణులు; తోడిన్ = తోకూడిన; విశ్వము = జగత్తు; ఎల్లన్ = అంతయు;
విష్ణు = భగవంతునితో; మయము = మయమైనవే, కలిసిఉన్నవే; పుత్ర = కుమారుడ; వేయి = వేయి రకముల చెప్పుట; ఏల = ఎందులకు; బ్రహ్మాండము = బ్రహ్మాండమే; అతని = అతని; జేన = జేన {జేన - సాగదీసిన బొటకన వేలు చూపుడు వేలుల కొనల మధ్య దూరము}; లోనన్ = లోపల; అడఁగిన్ = అణగి, ఇమిడిపోయి; ఉండున్ = ఉండును; బుద్ధిన్ = ఆలోచనలతో; ఎఱుఁగన్ = తెలిసికొనుటకు; రాదు = వీలుకాదు; భూత = భూతకాలపు,; భవత్ = వర్తమానకాలపు; భవ్య = భవిష్యత్తుకాలపు; లోకమున్ = లోకములు; ఎల్లన్ = అన్నియును; విష్ణు = భగవంతుని; లోనన్ = లోపల; ఉండున్ = ఉండును.2

భావము:

ఓ కుమారా! మానవులూ, దేవతలూ, దానవులూ, పితరులూ, ఉరగులూ, గజాలూ, మృగాలూ, గంధర్వులూ, యక్షులూ, రాక్షసులూ, వృక్షాలూ, సిద్ధులూ, విద్యాధరులూ, మేఘాలూ, చారణులూ, గ్రహాలూ, నక్షత్రాలూ, అచ్చరలూ, పక్షులూ, భూతగణాలూ, మెరపులూ, కనకాది ధనరాసులూ, నీవూ, శివుడూ, మహర్షులూ, నేనూ నీళ్లలోనూ, ఆకాశంలోనూ, భూమిమీదా సంచరించే వివిధ ప్రాణులతో గూడిన ఈ ప్రపంచమూ – అంతా విష్ణుమయమే. వేయిమాట లెందుకు బ్రహ్మాండభాండాలన్నీ అతని జేనలో ఇమిడిపోతాయి. కేవలం బుద్ధిబలంతో మనం ఆ దేవదేవుని తెలిసికోలేము. కడచినవీ, ఇపుడున్నవీ, రానున్నవీ అయిన లోకాలన్నీ విష్ణువులోనే వున్నాయి.

2-92-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మంలములోన భాస్కరుఁ
డుండి జగంబులకు దీప్తి నొసఁగెడి క్రియ బ్ర
హ్మాంములోపల నచ్యుతుఁ
డుండుచు బహిరంతరముల నొగి వెలిఁగించున్.

టీకా:

మండలమున్ = గోళము, లోకము; లోనన్ = లోపల; భాస్కరుఁడు = సూర్యుడు {భాస్కరుడు - భాసత్ +కరుడు - వెలుగునకు కారకుడు, సూర్యుడు}; ఉండిన్ = ఉండియే; జగంబులున్ = లోకములు; కున్ = కు; దీప్తిన్ = వెలుగును; ఒసఁగెడి = ఇచ్చు; క్రియన్ = విధముగ; బ్రహ్మాండమున్ = బ్రహ్మాండము; లోపలన్ = లోపల; అచ్యుతుఁడు = భగవంతుడు {అచ్యుతుడు - చ్యుతి లేనివాడు}; ఉండుచున్ = ఉంటూ; బహిర్ = బయట; అంతరములున్ = లోపటలను; ఒగిన్ = చక్కగ; వెలిఁగించున్ = వెలుగును ఇచ్చును.

భావము:

తన మండలంలోనే తానుంటు సూర్యుడు లోకాలకు కాంతి నిస్తున్నాడు. అలాగే అచ్యుతుడు బ్రహ్మాండంలో ఉంటూనే లోపలా, వెలుపలా ప్రకాశింపజేస్తున్నాడు.