పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : కంసుని అడ్డగించుట

  •  
  •  
  •  

10.1-26-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"న్నవు నీవు చెల్లెలికి; క్కట! మాడలు చీర లిచ్చుటో?
న్నన చేయుటో? మధుర మంజుల భాషల నాదరించుటో?
"మిన్నుల మ్రోతలే నిజము, మే"లని చంపకు మన్న! మాని రా
న్న! సహింపు మన్న! తగ న్న! వధింపకు మన్న! వేడెదన్.

టీకా:

అన్నవు = పెద్ద సోదరుడవు; నీవున్ = నీవు; చెల్లెలి = ఆడబడుచు; కిన్ = కి; అక్కట = అయ్యో; మాడలు = బంగారు బిళ్ళలు; చీరలు = కోకలు; ఇచ్చుటో = ఇవ్వడము కాని; మన్నన = గౌరవించుట; చేయుటో = చేయటము కాని; మధుర = తియ్యని; మంజుల = చక్కటి; భాషలన్ = మాటలతో; ఆదరించుటో = ఆదరించుట కాని అంతేకాని; మిన్నుల = ఆకాశ; మ్రోతలే = పలుకులే; నిజము = సత్యములు; మేలు = సరియైనవి; అని = అనుకొని; చంపకు = సంహరింపకుము; అన్న = అయ్య; మాని = ప్రయత్నము విరమించి; రావు = వెనుకకురమ్ము; అన్న = అయ్య; సహింపుము = ఓర్పువహించుము; అన్న = తండ్రి; తగదు = తగినపని కాదు; అన్న = నాయనా; వధింపకుము = చంపకుము; అన్న = అయ్య; వేడెదన్ = ప్రార్థించుచుంటిని.

భావము:

“బావా! కంసా! నీవు ఈ చిన్నదానికి అన్నగారివి కదా. నీ చెల్లెలికి ధనం ఇవ్వాలి చీరలు పెట్టాలి; ఆడపడుచు అని గౌరవించాలి; మధురమైన మాటలతో ఆదరించాలి; అంతేకానీ, అయ్యో ఇదేమిటి ఏవో గాలిమాటలు విని అవే నిజం అనుకుని ఈ అమాయకురాలిని వధించబోవడం సరికాదు కదా. చంపవద్దు బావా! దయచేసి వెనక్కు వచ్చేయి. ఓర్పుతెచ్చుకో. ఇది నీ వీరత్వానికి తగిన పని కాదు. ఆమెను వధించ వద్దు. నాయనా! నామాట విను నిన్ను వేడుకుంటున్నాను.