పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : శౌనకాదుల ప్రశ్నంబు

  •  
  •  
  •  

1-46-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భూణములు వాణికి, నఘ
పేణములు, మృత్యుచిత్త భీషణములు, హృ
త్తోణములు, కల్యాణ వి
శేణములు, హరి గుణోపచితభాషణముల్.

టీకా:

భూషణములు = అలంకారములు; వాణి = సరస్వతి, వాక్కు; కిన్ = కి; అఘ = పాపములను; పేషణములు = పొడిచేయునవి, పోగొట్టునవి; మృత్యు = మృత్యువు యొక్క; చిత్త = మనసునకు; భీషణములు = భయం కలిగించేవి; హృత్ = హృదయమునకు; తోషణములు = తుష్టి కలిగించేవి; కల్యాణ = శుభకరమైన; విశేషణములు = విశిష్టతలను ఇచ్చునవి; హరి = హరియొక్క; గుణ = గుణములతో; ఉపచిత = కూడిన; భాషణముల్ = పలుకులు.

భావము:

శ్రీమహావిష్ణువు యొక్క గుణకీర్తనములతో కూడిన పలుకులు, వాక్కులకు అధిదేవత యైన సరస్వతీ దేవికి అలంకారాలు. మృత్యు దేవతకు భయం కలిగించేవి. భక్తుల హృదయాలకు సంతోషాలు కలిగించేవి. సకల పాపాలను పోగొట్టునవి. నిత్యకల్యాణములను సమకూర్చేవి.