పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : శౌనకాదుల ప్రశ్నంబు

  •  
  •  
  •  

1-42-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గురువులు ప్రియశిష్యులకుం
మ రహస్యములు దెలియఁ లుకుదు, రచల
స్థి కల్యాణం బెయ్యది
పురుషులకును నిశ్చయించి బోధింపు తగన్.

టీకా:

గురువులు = గురువులు; ప్రియ = ప్రియమైన; శిష్యుల = శిష్యుల; కున్ = కు; పరమ = ఉత్కృష్టమైన; రహస్యములు = రహస్య జ్ఞానములను; తెలియన్ = తెలియునట్లు; పలుకుదురు = వివరిస్తారు; అచల = చాంచల్యము లేనిది; స్థిర = స్థిరత్వము కలిగించేది; కల్యాణంబు = శుభకరమైనది; ఎయ్యది = ఏదో; పురుషుల = మానవుల; కును = కు; నిశ్చయించి = నిర్ణయించి; బోధింపు = బోధింపుము (మాకు); తగన్ = తగినట్లుగా.

భావము:

గురువులైనవారు ప్రీతిపాత్రులైన శిష్యులకు అత్యంత రహస్యాలైన సంగతులెన్నో బోధిస్తారు కదా. ఈ లోకంలోని మానవులకు శాశ్వతమైనట్టి కల్యాణాన్ని కలిగించే విషయమేదో బాగా ఆలోచించి దాన్ని దయతో మాకు ఉపదేశించు.