పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : పరీక్షిత్తుని ప్రాయోపవేశంబు

  •  
  •  
  •  

1-507-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మ్మా! నినుఁ జూచిన నరుఁ
బొమ్మా యని ముక్తి కడకుఁ బుత్తు వఁట కృపన్
లెమ్మా నీ రూపముతో
మ్మా నా కెదుర గంగ! మ్యతరంగా!""

టీకా:

అమ్మా = తల్లీ; నినున్ = నిన్ను; చూచిన = దర్శించిన మాత్రముననే; నరున్ = మానవుని; పొమ్మా = వెళ్ళు; అని = అని; ముక్తి = మోక్షము; కడ = వద్ధ; కున్ = కి; పుత్తువు = పంపుదువు; అఁటన్ = అట; కృపన్ = దయతో; లే = లేచిరా; అమ్మా = తల్లీ; నీ = నీ యొక్క; రూపము = రూపము; తోన్ = తో; రా = రా; అమ్మా = తల్లీ; నాకు = నాకు; ఎదుర = ఎదురుగా; గంగ = గంగామాత; రమ్య = మనోహరమైన; తరంగా = కెరటాలు కలదానా.

భావము:

అమ్మా! మనోహర అలలతో అలరారే గంగమ్మతల్లి! నిన్ను దర్శించినంత మాత్రంచేతనే మోక్షానికి పంపిస్తావని విన్నాను, కదిలి రావమ్మా! కనికరించమ్మా!""
పుణ్యంతో స్వర్గం ప్రాప్తిస్తుంది. అర్హుడైన జ్ఞాని వైరాగ్యం పొంది తగిన సమయ మెరిగి చేసిన ప్రాయోపవేశంతో మోక్షం ప్రాప్తిస్తుంది. ఏ ఒక్కటి లేకపోయినా అది ఆత్మహత్యే, మహాపాపమే. పరమ జ్ఞాని పరీక్షిన్మహారాజుకి అర్హత ఉంది. శృంగిశాప మెరుగుటచే వైరాగ్యం సిద్దించింది. తక్షకవిషంతో మరణం తప్పదని తెలిసిన ఆ సమయం తగింది. పరమ పావనమైన గంగానది తగిన స్థలం. అప్పుడు అక్కడ పరీక్షిన్మహారాజు ప్రాయోపవేశానికి సిద్ద మయ్యి గంగమ్మ తల్లిని స్తుతించేడు. పరమయోగి శుకుడు వచ్చి మహామంత్రరాజం మహాభాగవతం చెప్పాడు. పరీక్షిత్తు మోక్షాన్ని అందుకున్నాడు.