పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : శృంగి శాపంబు

 •  
 •  
 •  

1-473-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఇట్లు రోషించి కౌశికీనదికిం జని జలోపస్పర్శంబు సేసి.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; రోషించి = రోషపడి – కినుక వహించి; కౌశికీ = కౌశికి అను; నది = నది; కిన్ = కి; చని = వెళ్ళి; జల = నీటిని; ఉపస్పర్శంబున్ = (సంకల్పమునకు) తాకుట, ఆచమనము; చేసి = చేసి.

భావము:

ఈ విధంగా కోపించి, (శృంగి) కౌశికీవదికి వెళ్లాడు. నీళ్ళు చేతిలోకి తీసుకొన్నాడు.

1-474-ఉ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

""క వింటికోపున మృతోరగముం గొని వచ్చి మాఱు మా
టాకయున్న మజ్జనకు నంసతలంబునఁ బెట్టి దుర్మద
క్రీడఁ జరించు రాజు హరకేశవు లడ్డినఁ నైనఁ జచ్చుఁ బో
యేవ నాఁడు తక్షకఫణీంద్ర విషానల హేతి సంహతిన్.""

టీకా:

ఓడక = జంకు లేకుండగ; వింటి = విల్లుయొక్క; కోపున = కొప్పున - చివరతో; మృత = చనిపోయిన; ఉరగమున్ = పామును; కొని = తీసికొని; వచ్చి = వచ్చి; మాఱు = బదులు; మాటాడక = చెప్పక; ఉన్న = ఉన్నట్టి; మత్ = నా; జనకున్ = తండ్రి యొక్క; అంస = భుజము, మూపు; తలంబునన్ = స్థలములో, భాగమున; పెట్టి = పెట్టి; దుర్ = చెడ్డ; మద = మదపు, గర్వపు; క్రీడన్ = ఆటతో; చరించు = తిరుగు; రాజు = రాజు; హర = శివుడును; కేశవులు = విష్ణువును; అడ్డినన్ = అడ్డువచ్చుట; ఐనన్ = జరిగినను; చచ్చున్ = మరణించి; పో = పోవుగాక; ఏడవ = ఏడవ (7); నాఁడు = దినమున; తక్షక = తక్షకుడు అను; ఫణి = పాములలో; ఇంద్ర = శ్రేష్ఠుని; విష = విషము యొక్క; అనల = అగ్ని; హేతి = జ్వాలల; సంహతిన్ = సమూహమునకు.

భావము:

“సంకోచం లేకుండా వచ్చిన సర్పాన్ని కొనివచ్చి మౌనముద్రలో ఉన్న మా తండ్రిగారి భుజంపైన పడవేసి దురహంకారంతో కన్నూ మిన్నూ కానని ఆ రాజు, హరిహరులు అడ్డుపడినా నేటికి ఏడవనాడు తక్షకుని విషాగ్ని జ్వాలలకు దగ్ధమైపోతాడు.”

1-475-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అని శమీకమహామునికుమారుం డయిన శృంగి పరీక్షిన్నరేంద్రుని శపియించి, నిజాశ్రమంబునకుం జనుదెంచి, కంఠలగ్న కాకోదర కళేబరుండైన తండ్రిం జూచి.

టీకా:

అని = అని; శమీక = శమీకుడు అను; మహా = గొప్ప; ముని = ముని యొక్క; కుమారుండు = పుత్రుడు; అయిన = అయినట్టి; శృంగి = శృంగి; పరీక్షిత్ = పరీక్షత్తు; నరేంద్రుని = మహారాజుని; శపియించి = శపించి; నిజ = తన; ఆశ్రమంబున = ఆశ్రమమున; కున్ = కు; చనుదెంచి = వచ్చి; కంఠ = కంఠమందు; లగ్న = తగిలి ఉన్న; కాకోదర = పాము; కళేబరుండు = శవము కలవాడు; ఐన = అయిన; తండ్రిన్ = తండ్రిని; చూచి = చూసి.

భావము:

అని పరీక్షిన్నరేంద్రుణ్ణి భయంకరంగా శపించి శమీక మహాముని కుమారుడైన శృంగి ఆశ్రమానికి అరుదెంచి ధ్యానముద్రలో ఉన్న తండ్రిని దర్శించాడు. ఆయన మెడలో ఇంకా ఆ మృతసర్పం అలా వ్రేలాడుతూనే ఉంది.

1-476-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

""ఇయ్యెడ నీ కంఠమునను
నియ్యురగ కళేబరంబు నిటు వైచిన యా
య్య నిఁక నేమి సేయుదు
నెయ్యంబులు లేవు సుమ్ము నృపులకుఁ దండ్రీ!

టీకా:

ఈ = ఈ; ఎడన్ = తావున; నీ = నీ; కంఠమునను = మెడలో; ఈ = ఈ; ఉరగ = పాము; కళేబరంబున్ = శవమును; ఇటు = ఈ విధముగ; వైచిన = వేసిన; ఆ = ఆ; అయ్యన్ = పెద్దమనిషిని; ఇఁకన్ = ఇంకనూ; ఏమి = ఏమి; చేయుదున్ = చేయుదును; నెయ్యంబులు = స్నేహధర్మములు; లేవు = లేవు; సుమ్ము = సుమా; నృపులు = రాజులు {నృపుడు - నృ (నరులను) పాలించువాడు, రాజు}; కున్ = కి; తండ్రీ = తండ్రీ.

భావము:

“అయ్యో! తండ్రీ! ఈ రాజులకు పరువు మర్యాదలు తెలియవు. ఇతడెవడో మృతసర్పాన్ని తెచ్చి నీ కంఠంలో వేశాడు. మరి ఈ దొరగారికి ఎలా బుద్ధి చెప్పాలో ఏమో.

1-477-శా.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ప్రారంభంబున వేఁట వచ్చి ధరణీపాలుండు, మా తండ్రిపై
నేరం బేమియు లేక సర్పశవమున్ నేఁ డుగ్రుఁడై వైచినాఁ
డీరీతిన్ ఫణి గ్రమ్మఱన్ బ్రతుకునో? హింసించునో కోఱలన్?
రారే తాపసులార! దీనిఁ దివరే, క్షింపరే, మ్రొక్కెదన్.""

టీకా:

ప్రారంభంబున = ముందేమో; వేఁటన్ = వేటకి; వచ్చి = వచ్చి; ధరణీ = భూమిని; పాలుండు = పాలించువాడు - రాజు; మా = మా; తండ్రి = తండ్రి; పైన్ = పైన; నేరంబు = అపరాథము; ఏమియున్ = ఏమాత్రము; లేక = లేకుండగ; సర్ప = పాము; శవమున్ = కళేబరమును; నేఁడు = ఈ దినమున; ఉగ్రుఁడు = కోపిష్టి; ఐ = అయి; వైచినాఁడు = వేసినాడు; ఈ = ఈ; రీతిన్ = విధముగ; ఫణి = పాము; క్రమ్మఱన్ = మరల; బ్రతుకునో = బ్రతుకుతుందో ఏమో; హింసించునో = హింసించునో ఏమో; కోఱలన్ = కోరలతో; రారే = రండి; తాపసులార = మునులారా; దీనిన్ = దీనిని; తివరే = తీసివేయండి; రక్షింపరే = రక్షించండి; మ్రొక్కెదన్ = ప్రార్థించెదను.

భావము:

ఓ తాపసులారా! ఎవరో రాజుగారు ముందు వేటకోసం అని అడవికి వచ్చి నిరపరాధి అయిన మా తండ్రి మీద నిర్దాక్షిణ్యాంగా ఈ చచ్చిన పామును పడవేసి వెళ్లాడు. ఈ భయంకర సర్పం మళ్లీ బ్రతుకుతుందో ఏమో క్రూరమైన కోరలతో కాటు వేస్తుందేమో మీకు చేతులెత్తి నమస్కరిస్తాను. వేగిరం రండి. ఈ పామును తోసేయండి. మా తండ్రిని రక్షించండి.”

1-478-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అని వెఱపున సర్పంబుఁ దిగుచు నేర్పు లేక యెలుంగెత్తి యేడ్చుచున్న కుమారకు రోదనధ్వని విని, యాంగిరసుం డయిన శమీకుండు సమాధి సాలించి, మెల్లన కన్నులు దెఱచి, మూఁపున వ్రేలుచున్న మృతోరగంబు నీక్షించి, తీసి పాఱవైచి; కుమారకుం జూచి.

టీకా:

అని = అని; వెఱపునన్ = భయముతో; సర్పంబున్ = పామును; తిగుచు = తీసివేయు; నేర్పు = నేర్పు - సామర్థ్యము; లేక = లేక; ఎలుంగు = గొంతు - కంఠస్వరము; ఎత్తి = ఎత్తి, పెంచి; ఏడ్చుచున్ = ఏడుచుచు; ఉన్న = ఉన్నట్టి; కుమారకున్ = పుత్రుని; రోదన = ఏడుపు; ధ్వని = స్వరము; విని = విని; ఆంగిరసుండు = (బుద్ధిలో) బృహస్పతి; అయిన = అయినట్టి; శమీకుండు = శమీకుడు; సమాధిన్ = సమాధి; సాలించి = చాలించి; మెల్లన = మెల్లగా; కన్నులు = కళ్ళు; తెఱచి = తెరచి; మూఁపున = మెడలో; వ్రేలుచు = వ్రేలాడుచు; ఉన్న = ఉన్న; మృత = మరణించిన; ఉరగంబున్ = పామును; ఈక్షించి = చూసి; తీసి = తీసి; పాఱ = దూరముగ; వైచి = వేసి; కుమారకున్ = కొడుకుని; చూచి = చూసి.

భావము:

అంటూ భయంతో ఆ సర్పాన్ని తొలగించే నేర్పులేక పెద్దగా ఏడవసాగాడు. అనుగు నందనుని ఆక్రందనం ఆకర్ణించి, అంగీరస వంశంవాడైన శమీక మహాముని సమాధి చాలించి మెల్లగా కళ్ళు తెరిచాడు. భుజాన వ్రేలాడుతున్న భుజంగాన్ని తీసి దూరంగా పారవేసి కుమారుణ్ణి చూసి....

1-479-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

""ఏ కీడు నాచరింపము
లోకులకున్ మనము సర్వలోక సములమున్
శోకింప నేల పుత్రక
కాకోదర మేల వచ్చెఁ? గంఠంబునకున్.""

టీకా:

ఏ = ఏ; కీడున్ = కీడు, అపకారమును; ఆచరింపము = కలుగజేయము; లోకులు = జనులు; కున్ = కు; మనము = మనము; సర్వ = సమస్త; లోక = లోకులను; సములమున్ = సమానముగా చూచు వారము; శోకింపన్ = ఏడ్చుట; ఏల = ఎందుకు; పుత్రక = కుమారా; కాకోదరము = పాము; ఏల = ఎందుకు; వచ్చెన్ = వచ్చెను; కంఠంబు = మెడమీద; కున్ = కు.

భావము:

""నాయనా! మనం లోకంలో ఎవరికి ఎలాంటి అపకారము చేసేవాళ్ళం కాదు కదా. మనం, లోకంలో అందరిని సమానంగానే చూస్తాం కదా. అయినా, నా మెడలోకి ఈ పాము ఎలా వచ్చింది? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు?""
అని తండ్రి యైన శమీక మహర్షి పరీక్షితుని శపించిన శృంగిని అడిగాడు.

1-480-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అని యడిగినఁ దండ్రికిఁ గొడుకు, రాజు వచ్చి సర్పంబు వైచుటయుం దాను శపించుటయును వినిపించిన, నమ్ముని తన దివ్యజ్ఞానంబున నమ్మానవేంద్రుండు పరీక్షిన్నరేంద్రుం డని యెఱింగి, కొడుకువలన సంతసింపక యిట్లనియె.

టీకా:

అని = అని; అడిగినన్ = అడుగగా; తండ్రి = తండ్రి; కిన్ = కి; కొడుకు = కుమారుడు; రాజు = రాజు; వచ్చి = వచ్చి; సర్పంబున్ = పామును; వైచుటయున్ = వేసుటయును; తాను = తాను; శపించుటయును = శపించుటయును; వినిపించిన = వినిపించిన; ఆ = ఆ; ముని = ముని; తన = తన యొక్క; దివ్య = దివ్యమైన; జ్ఞానంబున = జ్ఞానము వలన; ఆ = ఆ; మానవ = మానవులలో; ఇంద్రుండు = శ్రేష్ఠుడు; పరీక్షిన్నరేంద్రుండు = పరీక్షిన్మహారాజు; అని = అని; ఎఱింగి = తెలిసికొని; కొడుకు = కుమారుని; వలనన్ = వలన; సంతసింపక = ఇష్టపడక; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

అని (శమీకుడు) ప్రశ్నించాడు. అప్పుడు శృంగి రాజు వచ్చి పామును వేయటం, ఆ రాజును తాను శపించటం తన తండ్రికి విన్నవించాడు. వెంటనే శమీకమహర్షి తన దివ్యదృష్టితో ఆ రాజు పరీక్షిన్నరేంద్రుడని తెలుసుకొని కొడుకు చేసిన పనికి సంతోషింపక ఇలా అన్నాడు-

1-481-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

""బెట్టిదమగు శాపమునకు
ట్టపు ద్రోహంబు గాదు, రణీకాంతుం
ట్టా! యేల శపించితి
ట్టీ! తక్షకవిషాగ్ని పాలగు మనుచున్.

టీకా:

బెట్టిదము = కఠినము; అగు = అయిన; శాపము = శాపము; కున్ = కు; దట్టపు = బలమగు; ద్రోహంబున్ = ద్రోహము; కాదు = కాదు; ధరణీ = భూమికి; కాంతున్ = భర్తని - రాజును; కట్టా = అయ్యో; ఏల = ఎందుకు; శపించితి = శపించితివి; పట్టీ = పుత్రా; తక్షక = తక్షకుడు అను; విష = విషము యొక్క; అగ్ని = అగ్నికి; పాలు = వశము; అగుము = అవ్వుము; అనుచున్ = అని.

భావము:

“నాయనా! ఇంతటి కఠోరమైన శాపం పెట్టటానికి అంతటి మహాపరాధం ఆ మహారాజు ఏంచేసాడు. తక్షకవిషాగ్ని జ్వాలల పాలు కమ్మని ఆ ధరణీపాలుణ్ణి, అయ్యయ్యో! ఎందుకు శపించావు?

1-482-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ల్లి కడుపులోన గ్ధుడై క్రమ్మఱఁ
మలనాభు కరుణఁ లిగినాఁడు;
లిమి గలిగి ప్రజలఁ బాలించుచున్నాడు;
దిట్టవడుగ! రాజుఁ దిట్టఁ దగునె?

టీకా:

తల్లి = తల్లి; కడుపు = గర్భము; లోన = లోపల; ధగ్దుఁడు = కాలిన వాడు; ఐ = అయి; క్రమ్మఱన్ = మరల; కమలనాభుడు = కృష్ణుని {కమలనాభుడు - కమల (పద్మము) నాభుడు (నాభి యందు కలవాడు), విష్ణువు}; కరుణన్ = కరుణతో; కలిగినాఁడు = బ్రతికినవాడు; బలిమిన్ = బలము - శక్తి; కలిగి = కలిగి ఉండి; ప్రజలన్ = జనులను; పాలించుచున్ = ఏలుచు; ఉన్నాడు = ఉన్నాడు; దిట్ట = సామర్థ్యము గల; వడుగ = ఓ బ్రహ్మచారీ; రాజున్ = రాజును; తిట్టన్ = తిట్టుట; తగునె = తగునా ఏమి, సరియైనదా ఏమి.

భావము:

పాపం! పరీక్షిత్తు తల్లి గర్భంలోనే దగ్ధుడైనాడు. మళ్ళీ శ్రీకృష్ణుని కటాక్షం వల్ల బ్రతికి బయటపడ్డాడు. ఇప్పుడు పెరిగి పెద్దవాడై పరాక్రమవంతుడై ప్రజలను పరిపాలిస్తున్నాడు. ఓ బ్రహ్మచారీ! అటువంటి మంచిరాజును శపించవచ్చా?

1-483-ఉ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

కారి లేని గొఱ్ఱియల కైవడిఁ గంటక చోర కోటిచే
నేఱి యున్నదీ భువన మీశుఁడు గృష్ణుఁడు లేమి నిట్టిచో,
భూరిపాలనంబు సమబుద్ధి నితం డొనరింపఁ, జెల్లరే!
యీ రిపాటి ద్రోహమున కిట్లు శపింపఁగ నేల? బాలకా!

టీకా:

కాపరి = కాపలా కాసేవాడు; లేని = లేని; గొఱ్ఱియల = గొఱ్ఱెల; కైవడిన్ = వలె; కంటక = దుష్టులు; చోర = దొంగలు; కోటి = పెద్ద సమూహము; చేన్ = చేత; ఏపు = అభివృద్ధి - బలము; అఱి = చెడి - లేక; ఉన్నది = ఉన్నది; ఈ = ఈ; భువనము = లోకము; ఈశుఁడు = ఈశ్వరుడు; కృష్ణుఁడు = కృష్ణుడు; లేమిన్ = లేకపోవుటచేత; ఇట్టిచో = ఈ విధముగ అయినచో; భూ = భూమిని; పరిపాలనంబు = ఏలుట; సమ = సమన్వయమగు; బుద్ధిన్ = బుద్ధితో; ఇతండు = ఇతడు; ఒనరింపన్ = చేయుచుండగ; చెల్లరే = తగునా ఏమి; చెల్లునా ఏమి; ఈ పరిపాటి = ఇంత చిన్న; ద్రోహము = అపరాధము, కీడు; కున్ = కు; ఇట్లు = ఈ విధముగ; శపింపఁగ = శపించుట; ఏల = ఎందుకు; బాలకా = పిల్లవాడా.

భావము:

వాసుదేవుడు లేకపోవటం మూలాన లోకమంతా చీకాకు పాలైంది. ప్రజలు కాపరిలేని గొఱ్ఱెల్లాగా ఆపద పాలయ్యారు. దొంగలూ దుండగులూ పెచ్చరిల్లారు. ఇటువంటి క్లిష్ట సమయంలో మన మహారాజు సమదృష్టితో సమర్థంగా ప్రజలను పాలిస్తున్నాడు. అయ్యో ఈ రవ్వంత అపరాధానికి ఇలా రాజును ఎందుకు శపించావు నాయనా?

1-484-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

పాపంబు నీచేత ప్రాపించె మన; కింక-
రాజు నశించిన రాజ్యమందు
లవంతుఁ డగువాఁడు లహీను పశు, దార,-
య, సువర్ణాదుల పహరించు;
జార చోరాదులు సంచరింతురు; ప్రజ-
న్యోన్య కలహంబు తిశయిల్లు;
వైదికంబై యున్న ర్ణాశ్రమాచార-
ర్మ మించుక లేక ప్పిపోవు;

1-484.1-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నంతమీఁద లోకు ర్థకామంబులఁ
గిలి సంచరింప, రణి నెల్ల
ర్ణసంకరములు చ్చును మర్కట
సామేయ కులము మేరఁ బుత్ర!

టీకా:

పాపంబున్ = పాపము; నీ = నీ; చేతన్ = చేతను; ప్రాపించెన్ = కలిగెను; మనకు = మనకు; ఇంక = ఇక; రాజు = రాజు; నశించిన = లేకపోయిన; రాజ్యము = రాజ్యము; అందున్ = లో; బలవంతుఁడు = బలముతో కూడినవాడు; అగు = అయిన; వాఁడు = వాడు; బల = బలము; హీను = తక్కువవాని; పశు = పశువులు; దార = స్త్రీలు; హయ = గుఱ్ఱములు; సువర్ణ = బంగారము; ఆదులన్ = మొదలగువానిని; అపహరించున్ = దొంగిలించును; జార = వ్యభిచారులు; చోర = దొంగలు; ఆదులు = మొదలగువారు; సంచరింతురు = మిక్కిలి తిరుగుదురు; ప్రజ = ప్రజలు; కున్ = కు; అన్యోన్య = ఒకరితోఒకరికి; కలహంబులు = జగడములు; అతిశయిల్లు = అధికము అగును; వైదికంబు = వేదానుసారమైనది; ఐ = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; వర్ణ = వర్ణములయొక్క {చతుర్వర్ణములు – బ్రాహ్మణ ,క్షత్రియ, వైశ్య, శూద్ర.}; ఆశ్రమ = ఆశ్రమములయొక్క {చతురాశ్రమములు – బ్రహ్మచర్య ,గృహస్త, వానప్రస్త, సన్యాస}; ఆచార = ఆచారముల - ఆచరింపబడు; ధర్మము = ధర్మము – విధములు; ఇంచుక = కొంచెము కూడ; లేక = లేనివై; తప్పి = తప్పి; పోవున్ = చరించును; అంత = ఆ; మీఁదన్ = పైన;
లోకులు = ప్రజలు; అర్థ = అర్థమునకు; కామంబులన్ = కామమునకు; తగిలి = లొంగిపోయి; సంచరింప = వర్తింపగ; ధరణిన్ = భూమి మీద; ఎల్లన్ = అంతట; వర్ణ = వర్ణములు; సంకరములు = కలుషితమగుటలు; వచ్చును = కలుగును; మర్కట = కోతుల; సారమేయ = కుక్కల; కులము = గుంపుల; మేరన్ = వలె; పుత్ర = కొడుకా.

భావము:

నీ మూలంగా మనకు పాపం ప్రాప్తించింది. రాజు మరణిస్తే రాజ్యంలో అరాచకం ప్రబలుతుంది. బలం కలవాడు బలం లేనివాడి మీద పడి వాడి సర్వస్వం దోచుకుంటాడు. జార చోరులు నిరాఘాటంగా విహరిస్తారు. ప్రజలలో పరస్పర కలహాలు పెరిగి పోతాయి. వేదానుసారమైన వర్ణాశ్రమాచారాలు సమూలంగా నశిస్తాయి, పరస్పర కలహాలు పెరిగి పోతాయి. ధర్మం నశించిపోగా లోకులు అర్థకామాల వెంటబడతారు. రాజ్యమంతటా వానర శునకాలలో వలె వర్ణసంకరం వ్యాపిస్తుంది.

1-485-ఉ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

భాతవంశజుం, బరమభాగవతున్, హయమేధయాజి, నా
చాపరున్, మహానయవిశారదు, రాజకులైకభూషణున్,
నీము గోరి నేఁడు మన నేలకు వచ్చిన;యర్థి భక్తి స
త్కాము సేసి పంపఁ జనుఁ గాక శపింపఁగ నీకు ధర్మమే?

టీకా:

భారత = భరతుని; వంశజున్ = వంశము నందు పుట్టినవాని; పరమ = ఉత్కృష్టమైన; భాగవతున్ = భాగవత మార్గానుయాయిని; భాగవతుని; హయ = అశ్వ; మేధ = మేధ; యాజి = యజ్ఞము చేసినవానిని; ఆచారపరున్ = ఆచారవంతుని; మహా = గొప్ప; నయ = నీతికల; విశారదున్ = నేర్పరిని; రాజ = రాజుల; కుల = సమూహమునకు; ఏక = ముఖ్యమైన; భూషణున్ = ఆభరణము వంటివానిని; నీరము = నీరు; కోరి = కోరి; నేఁడు = ఇవేళ; మన = మన యొక్క; నేల = ప్రదేశమున; కున్ = కు; వచ్చిన = వచ్చిన; అర్థిన్ = అర్థించువానిని; భక్తి = భక్తితో; సత్కారము = గౌరవము; చేసి = చేసి; పంపన్ = పంపుట; చనున్ = తగును; కాక = అంతే కాని; శపింపఁగన్ = శపించుట; నీకు = నీకు; ధర్మమే = ధర్మమా ఏమిటి.

భావము:

పవిత్రమైన భారతదేశంలో జన్నించాడు. పరమ భాగవతుడని పేరుగాంచాడు. అశ్వమేధం ఆచరించాడు. సదాచారసంపన్నుడూ, రాజనీతిజ్ఞడూ, రాజకులాలంకారుడూ అయిన అంతటి మహారాజు దాహమై మన తపోవనానికి వస్తే ఆదరంతో అతిథిసత్కారాలు ఆచరించి పంపాలి. అంతే కాని, ఇలా శపించటం ఏమి ధర్మమయ్యా?

1-486-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

భూతికి నిరపరాధమ
శాము దా నిచ్చె బుద్ధి చాపలమున మా
పాపఁడు; వీఁ డొనరించిన
పాము దొలఁగింపు కృష్ణ! రమేశ! హరీ!

టీకా:

భూ పతి = భూమికి భర్త అయినవాని, రాజు; కిన్ = కి; నిరపరాధమ = అపరాథ మేమిలేక; శాపమున్ = శాపమును; తాన్ = తాను; ఇచ్చెన్ = ఇచ్చెను; బుద్ధి = బుద్ధి; చాపలమున = చపలత్వముతో; మా = మా; పాపఁడు = పిల్లవాడు; వీఁడు = వీడు; ఒనరించిన = చేసిన; పాపమున్ = పాపమును; తొలఁగింపు = తొలగింపుము; కృష్ణ = కృష్ణా; పరమేశ = ఉత్కృష్టమైన ప్రభువా - పరమేశ్వరా; హరీ = పాపములను హరించువాడా - హరీ.

భావము:

ఓ! పరమేశ్వారా! శ్రీకృష్ణా! వాసుదేవా! నా పిల్లవాడు బుద్ధి చాపల్యంవల్ల భూపాలుడైన పరీక్షిత్తుకు శాపం పెట్టి పాపం కట్టుకొన్నాడు. దోషాన్ని తొలగించు తండ్రీ.

1-487-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

పొడిచినఁ, దిట్టినఁ, గొట్టినఁ,
డుచుందురు గాని పరమభాగవతులు; దా
రొడఁబడరు మాఱు సేయఁగఁ
గొడుకా! విభుఁ డెగ్గు సేయఁ గోరఁడు నీకున్.

టీకా:

పొడిచినన్ = పొడిచినను; తిట్టినన్ = తిట్టినను; కొట్టినన్ = కొట్టినను; పడుచున్ = పడుతు; ఉందురు = ఉంటారు; కాని = కాని; పరమ = ఉత్కృష్టమైన; భాగవతులు = భాగవతానుయాయులు - భాగవతులు; తారు = తాము; ఒడఁబడరు = సిద్ధపడరు; మాఱు = ప్రతీకారము; సేయఁగన్ = చేయుటకు; కొడుకా = పుత్రా; విభుఁడు = ప్రభువు; ఎగ్గు = కీడు; సేయన్ = చేయుటను; కోరఁడు = కోరుకొనడు; నీకున్ = నీకు.

భావము:

కుమార! కొట్టినా తిట్టినా పరమభక్తులైన వారు, పరమభాగవతులు శాంతంతో భరిస్తారే తప్ప ప్రతీకారం చెయ్యటానికి అంగీకరించరు. మన మహారాజు నీకు కీడు చేయాలనుకొనడు.
శమీకమహర్షి తన మెడలో పరీక్షిత్తు వేసిన చచ్చిన పామును తొలగించి, శపించిన తన పుత్రుడు శృంగికి ఇలా బుద్ధి చెప్పసాగాడు. పరమభాగవతుల తత్వం నిర్వచించిన మహా అద్భుత పద్య మిది.

1-488-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

చెలఁగరు కలఁగరు సాధులు
మిళితములయి పరులవలన మేలుం గీడున్
నెకొనిన నైన నాత్మకు
నొయవు సుఖదుఃఖచయము యుగ్మము లగుచున్.""

టీకా:

చెలఁగరు = రెచ్చిపోరు; కలఁగరు = క్రుంగిపోరు; సాధులు = మంచి నడవడిక కలవారు; మిళితములు = కలగలుపులు; అయి = అయి; పరుల = ఇతరుల; వలనన్ = వలన; మేలున్ = మంచి; కీడున్ = చెడులు; నెలకొనినన్ = కలిగినట్లు; ఐన = అయినను; ఆత్మ = ఆత్మ; కున్ = కి; ఒలయవు = కలుగవు; సుఖ = సుఖముల; దుఃఖ = దుఃఖముల; చయములు = సమూహములు; యుగ్మములు = ద్వంద్వములు; అగుచున్ = అవుతూ.

భావము:

ద్వంద్వాలకు కోపతాపాలకు లొంగరు, భగవంతునిపై ప్రపత్తి విడువరు, సుఖదుఃఖాలకు కలగరు. సజ్జనులు ఇతరులు చేసిన మేలులకు పొంగిపోరు, కీడులకు కుంగిపోరు. మహాత్ముల ఆత్మలను సుఖదుఃఖాలు ఆవహించవు.”
భాగవతుల లక్షణాలను తెలుపుతు భాగవతంలో తన కొడుకు పరీక్షిత్తును శపించుటకు సంతోషించని శృంగి తండ్రి శమీకమహర్షి నోట ఇలా పలికించారు.

1-489-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అని యిట్లు శమీకమహామునీంద్రుండు గ్రమ్మఱింప శక్తి లేని కొడుకు సేసిన పాపంబునకు సంతాపంబు నొంది, తన శిష్యు నొక మునికుమారునిం బిలిచి, యేతద్వృత్తాంతం బంతయు రాజున కెఱింగించి రమ్మని పంచె; నంత నా యభిమన్యుపుత్రుండు శమీకముని శిష్యునివలన శాపవృత్తాంతంబు విని కామక్రోధాది విషయాసక్తుండగు తనకుం దక్షకవిషాగ్ని విరక్తి బీజం బగు; ననుచుఁ గరినగరంబునకుం జని యేకాంతంబున.

టీకా:

అని = అని; యిట్లు = ఈ విధముగ; శమీక = శమీకుడు అను; మహా = గొప్ప; ముని = మునులలో; ఇంద్రుండు = శ్రేష్ఠుడు; క్రమ్మఱింపన్ = మరలింపుటకు; శక్తి = సామర్థ్యము; లేని = లేని; కొడుకు = కుమారుడు; సేసిన = చేసిన; పాపంబున = పాపమున; కున్ = కు; సంతాపంబున్ = వేదన; ఒంది = పొంది; తన = తనయొక్క; శిష్యున్ = శిష్యులలో; ఒక = ఒక; ముని = మునులలో; కుమారునిన్ = కుమారుని; పిలిచి = పిలిచి; ఏ = ఏదైతే ఉందో; తత్ = ఆ; వృత్తాంతంబు = సంగతిని; అంతయున్ = సమస్తమును; రాజు = రాజు; కున్ = కు; ఎఱింగించి = తెలియజేసి; రమ్ము = రావలసినది; అని = అని; పంచెన్ = పంపెను; అంతన్ = అంతట; ఆ = ఆ; అభిమన్యు = అభిమన్యుని; పుత్రుండు = కొడుకు, పరీక్షిత్తు; శమీక = శమీకుడు అను; ముని = ముని యొక్క; శిష్యు = శిష్యుని; వలనన్ = వలన; శాప = శాపము గురించిన; వృత్తాంతంబున్ = సంగతులు; విని = విని; కామ = కామము; క్రోధ = క్రోధము; ఆది = మొదలగు; విషయ = విషయము లందు; ఆసక్తుండు = తగులుకొన్నవాడు; అగు = అయినట్టి; తన = తన; కున్ = కు; తక్షక = తక్షకుని; విష = విషపు; అగ్ని = అగ్ని; విరక్తిన్ = విరక్తికి; బీజంబున్ = మూలకారణము; అగు = అగును; అనుచున్ = అనుచు; కరి = హస్తినా; నగరంబు = పురము; కున్ = కు; చని = వెళ్ళి; ఏకాంతంబున = ఒంటరితనములో.

భావము:

అని ఈ విధంగా శమీకమహాముని కుమారుడు చేసిన తిరుగులేని శాపరూపమైన పాపానికి సంతాపం చెందాడు. వెంటనే తన శిష్యుడైన ఒక ముని పుత్రుణ్ణి పిలిచి ఈ వృత్తాంత మంతా మహారాజుకు చెప్పిరమ్మని పంపించాడు. అభిమన్యు పుత్రుడైన పరీక్షిత్తు శమీక ముని శిష్యునివలన, శృంగి పెట్టిన శాపవృత్తాంతం విన్నాడు. కామక్రోధాది సంసార విషయాలలో మునిగి తేలుతున్న తనకు తక్షకుని విషాగ్ని కీలాజాలము, వైరాగ్యానికి మూల మౌతుందని విచారిస్తూ హస్తినాపురికి చేరి ఏకాంతంగా తనలో ఇలా అనుకొన్నాడు-

1-490-ఉ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

""టికి వేఁట వోయితి మునీంద్రుఁడు గాఢసమాధి నుండఁగా
నేటికిఁ దద్భుజాగ్రమున నేసితి సర్పశవంబుఁ దెచ్చి? నేఁ
డేటికిఁ బాపసాహసము లీ క్రియఁ జేసితి? దైవయోగమున్
దాఁటఁగ రాదు, వేగిరమ థ్యము గీడు జనించు ఘోరమై.

టీకా:

ఏమిటి = ఎందుల; కిన్ = కు; వేఁటన్ = వేటకొరకు; ఓయితిన్ = వెళ్ళితిని; ముని = మునులలో; ఇంద్రుఁడు = శ్రేష్ఠమైనవాడు; గాఢ = గాఢమైన; సమాధిన్ = సమాధిలో; ఉండగా = ఉండఁగా; ఏటి = ఎందుల; కిన్ = కు; తత్ = అతని; భుజ = భుజము; అగ్రమునన్ = పైన; ఏసితి = వేసితిని; సర్ప = పాముయొక్క; శవంబున్ = శవమును; తెచ్చి = తీసుకొని వచ్చి; నేడు = ఇవేళ; ఏటి = ఎందుల; కిన్ = కు; పాప = పాపముతో కూడిన; సాహసములు = తెగువలు; ఈ = ఈ; క్రియన్ = విధముగా; చేసితి = చేసితిని; దైవ = దైవము వలన; యోగమున్ = కూడునది, కలుగునది; దాఁటఁగన్ = దాటుటకు; తరించుటకు; రాదు = వీలుకాదు; వేగిరమ = శ్రీఘ్రమే; తథ్యము = తప్పక; కీడు = అశుభము; జనించు = కలుగును; ఘోరము = భయంకరము; ఐ = అయి.

భావము:

“నేను వేటకోసమని అరణ్యానికి ఎందుకు వెళ్లాను? ఆ మహాముని నిశ్చలధ్యాన సమాధిలో ఉన్నప్పుడు ఒక మృతసర్పాన్ని కొనివచ్చి ఆయన మెడలో ఎందుకు వేశాను? ఈ విధమైన పాపకార్యాలు ఎందుకు చేశాను? దైవ సంకల్పాన్ని ఎవ్వరూ అతిక్రమించలేరు. తప్పదు, ఘోరమైన కీడు జరిగి తీరుతుంది.

1-491-ఉ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

పాము విషాగ్నికీలలనుఁ బ్రాణము లేగిఁన నేఁగుఁగాక, యీ
భూమియు రాజ్యభోగములుఁ బోయిన నిప్పుడ పోవుఁగాక, సౌ
దానిఁ బోలు జీవనము థ్యముగాఁ దలపోసి యింక నే
నేని మాఱు దిట్టుదు మునీంద్రకుమారకు దుర్నివారకున్.

టీకా:

పాము = పాము యొక్క; విష = విషపు; అగ్ని = అగ్ని; కీలలను = మంటల వలన; ప్రాణములు = ప్రాణములు; ఏగిఁనన్ = పోయినచో; ఏఁగున్ = పోవును; కాక = కాక; ఈ = ఈ; భూమియున్ = ఆస్తియును; రాజ్య = రాజ్యము వలని; భోగములున్ = భోగములును {అష్టభోగములు - 1నిథి 2నిక్షేపము 3జల 4పాషాణ 5అక్షీణ 6ఆగామి 7సిద్ధ 8సాధ్యములు మరియొకవిధమున 1గృహము 2శయ్య 3వస్త్రము 4ఆభరణము 5స్త్రీ 6పుష్పము 7గంధము 8తాంబూలము}; పోయినన్ = పోయినచో; ఇప్పుడన్ = ఇప్పుడే; పోవున్ = పోవును; కాక = కాక; సౌదామనిన్ = మెరుపుతీగ; పోలున్ = వంటిదైన; జీవనము = జీవితము; తథ్యముగాన్ = సత్యమైనదిగా; తలపోసి = అనుకొని; ఇంక = ఇంక; నేన్ = నేను; ఏమి = ఏమి; అని = అని; మాఱున్ = ఎదురు; తిట్టుదున్ = తిట్టుదును; ముని = మునులలో; ఇంద్ర = శ్రేష్ఠుని; కుమారు = కొడుకు; కున్ = కును; దుర్నివార = నివారించుటకు కష్టమైనవాని; కున్ = కి.

భావము:

భీకరమైన తక్షకుని విషాగ్ని జ్వాలలకు ప్రాణాలు పోతేపోనీ! ఈ సామ్రాజ్యమూ, భోగభాగ్యాలూ లేకపోతే లేకపోనీ! విద్యుల్లత వంటి బ్రతుకు శాశ్వతమని భావించి దుర్నివారుడైన ఆ మునికుమారుణ్ణి నేను తిరిగి ఏమని శపింజేది.

1-492-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

రాజ ననుచుఁ బోయి రాజ్యగర్వంబున
నముకొఱకు వారి నము సొచ్చి
దందశూక శవముఁ దండ్రిపై వైచినఁ
బొలియఁ దిట్ట కేల పోవు సుతుఁడు?

టీకా:

రాజన్ = రాజును; అనుచున్ = అనుచు; పోయి = వెళ్ళి; రాజ్య = రాజ్యము వలని; గర్వంబున = మదముతో; వనము = నీరు; కొఱకున్ = కోసము; వారి = వారి యొక్క; వనమున్ = అశ్రమమును; సొచ్చి = ప్రవెశించి; దందశూక = పాము యొక్క; శవమున్ = శవమును; తండ్రి = తండ్రి; పైన్ = పైన; వైచినన్ = వేసిన; పొలియన్ = చచ్చునట్లు; తిట్టక = శపింపక; ఏల = ఎలా; పోవు = వెళ్ళును; సుతుఁడు = పుత్రుడు.

భావము:

మహారాజును గదా అని రాజ్యాహంకారంతో దాహంకోసం వారి తపోవనంలోకి ప్రవేశించి తండ్రిపై చచ్చినపామును పడవేస్తే కొడుకు చావమని శపించకుండా నోరు మూసుకు కూర్చుంటాడా?

1-493-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

గోవులకును, బ్రాహ్మణులకు,
దేతలకు నెల్ల ప్రొద్దుఁ దెంపునఁ గీడుం
గావించు పాపమానస
మే విధమునఁ బుట్టకుండ, నే వారింతున్,""

టీకా:

గోవులు = గోవులు; కున్ = కు; బ్రాహ్మణులు = బ్రాహ్మణులు; కున్ = కు; దేవతలు = దేవతలు; కున్ = కు; ఎల్ల = అన్ని; ప్రొద్దున్ = వేళలందు; తెంపునన్ = తెంపరితనముచో; కీడున్ = అశుభములు; కావించు = చేయు; పాప = పాపపు; చెడు; మానసము = బుద్ధి; ఏ = ఎట్టి; విధమునన్ = విధము వలన; పుట్టకుండన్ = కలుగకుండగ; నేన్ = నేను; వారింతున్ = ఆడ్డగలను.

భావము:

గోవులకూ, దేవతలకూ, బ్రాహ్మణులకూ, తెంపరితనముతో కీడు చెయ్యాలనే దుర్బుద్ధి నాలో ఏ సమయంలోనూ పుట్టకుండా నివారించుకొనుట ఎట్లు?”

1-494-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అని వితర్కించె.

టీకా:

అని = అని; వితర్కించె = విశిష్టముగ విమర్శించెను.

భావము:

అని తనలో తర్కించుకొన్నాడు.

1-495-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

దామోదరపదభక్తిం
గామాదుల గెల్చినాఁడు గావునఁ గరుణన్
భూమీశుఁ డలుగఁ డయ్యెను
సార్థ్యము గలిగి దోషసంగిన్ శృంగిన్.

టీకా:

దామోదర = తులసి మాలిక ఉదరమున కలవాని, కృష్ణుని {దామోదరః- దమాది సాధనలచే ఉదారమైన బుద్ధిద్వారా పొందబడువాడు, యశదాదేవిచే త్రాడుతో ఉదరమున కట్టబడినవాడు, లోకములు ఉదరమున కలవాడు, విష్ణుసహస్రనామాలు శ్రీశంకరభాష్యం 369వ నామం}; పద = పదముల ఎడ; భక్తిన్ = భక్తివలన; కామ = కామము; ఆదుల = మొదలగువానిని; గెల్చినాఁడు = జయించెను; కావునన్ = అందుచేత; కరుణన్ = దయతో; భూమి = భూమికి; ఈశుఁడు = ప్రభువు; పరీక్షిత్తు; అలుగన్ = కినియ కుండువాడు; అయ్యెను = అయ్యెను; సామర్థ్యము = శక్తి; కలిగిన్ = ఉండియు; దోష = అపరాధమును; సంగిన్ = కూడిన వానిని; శృంగిన్ = శృంగిని.

భావము:

దేవదేవుడైన వాసుదేవుని దివ్యచరణాల మీది భక్తి ప్రపత్తుల వల్ల కామక్రోధాది అరిషడ్వర్గాన్ని జయించి కరుణార్ధ్ర హృదయుడైన పరీక్షిత్తు తనకు సామర్థ్యం ఉండి కూడా, తనను శపించిన దోషమంటిన శృంగి మీద కోపగించ లేదు.

1-496-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అంత మునికుమారుండు శపించిన వృత్తాంతంబు దక్షకుండు విని యెడరు వేచి యుండె; నిటఁ దక్షకవ్యాళవిషానలజ్వాలాజాలంబునం దనకు సప్తమ దినంబున మరణం బని యెఱింగిన వాఁడు గావున, భూపాలుండు భూలోక స్వర్గలోక భోగంబులు హేయంబు లని తలంచి, రాజ్యంబు విసర్జించి, నిరశన దీక్షాకరణంబు సంకల్పించుకొని.

టీకా:

అంత = అంతట; ముని = ముని; కుమారుండు = కుమారుడు (శృంగి); శపించిన = శపించినట్టి; వృత్తాంతంబున్ = సమాచారమును; తక్షకుండు = తక్షకుడు; విని = విని; ఎడరు = సమయము కోసము; వేచి = ఎదురు చూచుచు; ఉండెన్ = ఉండెను; ఇటన్ = ఇక్కడ; తక్షక = తక్షకుడు అను; వ్యాళ = పాము; విష = విషపు; అనల = అగ్ని; జ్వాల = మంటల; జాలంబునన్ = సమూహముతో; తన = తన; కున్ = కి; సప్తమ = ఏడవ (7); దినంబునన్ = నాడు; మరణంబు = మరణము; అని = అని; ఎఱింగిన = తెలిసిన; వాఁడు = వాడు; కావున = అగుటవలన; భూ = భూమిని; పాలుండు = పాలించువాడు - రాజు; భూ = భూమి అను; లోక = లోకమందలి; స్వర్గ = స్వర్గము అను; లోక = లోకమందలి; భోగంబులు = భోగములు; హేయంబులు = అసహ్యకరమైనవి; అని = అని; తలంచి = తలచుకొని; రాజ్యంబున్ = రాజ్యమును; విసర్జించి = వదలిపెట్టి; నిరశన = నిరాహారము అను; దీక్ష = దీక్ష; కరణంబున్ = ఆచరించుటను; సంకల్పించుకొని = సంకల్పముతో నిర్ణయించుకొని.

భావము:

మునికుమారుడు రాజును శపించిన వృత్తాంతం విన్న తక్షకుడు సమయం కోసం ఎదురుచూస్తూన్నాడు. పరీక్షిన్నరేంద్రుడు తక్షకుని దారుణ విషాగ్ని జ్వాలల మూలాన తనకు ఏడవనాడు మరణం తప్పదని నిర్ణయించుకొన్నాడు. భూలోక భోగాలూ, స్వర్గలోక సుఖాలూ పనికిమాలినవని భావించాడు. రాజ్యాన్ని పరిత్యజించాడు. నిరాహార దీక్ష అవలంబించటానికి నిశ్చయించాడు.