పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : పరీక్షిత్తు వేటాడుట

 •  
 •  
 •  

1-454-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

వేదండపురాధీశుఁడు,
గోదండము సేతఁ బట్టికొని గహనములో
వేదండాదుల నొకనాఁ
డే దండలఁ బోవనీక యెగచెన్ బలిమిన్.

టీకా:

వేదండ = హస్తినా; పురా = పురమునకు; అధీశుఁడు = రాజు; కోదండము = విల్లు; చేతన్ = చేతిలో; పట్టికొని = పట్టుకొని; గహనము = అరణ్యము; లోన్ = లో; వేదండ = ఏనుగు; ఆదులన్ = మొదలగువాటిని; ఒక = ఒక; నాఁడు = దినమున; ఏ = ఏ; దండలన్ = ప్రక్కకు; పోవ నీక = వెళ్ళనీయకుండగ; ఎగచెన్ = తరిమెను; బలిమిన్ = బలము కొద్ది.

భావము:

ఒకనాడు కరిపూరాధీశ్వరుడైన పరీక్షిత్తు ఎక్కు పెట్టిన కోదండమును చేతబట్టి కాంతారభూముల్లో ఏనుగులు మొదలైన జంతువులను వెంటాడి వేటాడ సాగాడు.

1-455-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

గ్గములు ద్రవ్వి పడు మని
యొగ్గెడు పెనుదెరల, వలల, నురలు మృగములన్
గ్గఱి చంపెడు వేడుక
వెగ్గలమై చిత్తమందు వేఁటాడింపన్.

టీకా:

ఒగ్గములున్ = అవపాతములు {ఒగ్గములు - అవపాతములు - ఏనుగులు మొదలగునవి పడుటకు పైన కఱ్ఱలు కంపలు కప్పి లోపల వెలితిగ నుండు గోతులు}; త్రవ్వి = తవ్వి; పడుము = పడుము; అని = అని; ఒగ్గెడు = పరిచిన; పెను = పెద్ద; తెరలన్ = తెరలును; వలలన్ = వలలును; ఉరలున్ = ఉచ్చులుతోను; మృగములన్ = జంతువులను; డగ్గఱి = దగ్గరకు వెళ్ళి; చంపెడు = చంపవలెననే; వేడుక = కోరిక; వెగ్గలము = అధికము; ఎక్కువ; ఐ = అయి; చిత్తము = మనసు; అందున్ = లో; వేఁటాడింపన్ = వెంటాడగా.

భావము:

లోత్తైన కందకాలు త్రవ్వీ, పెద్ద పెద్ద వలలు పరచీ, ఉచ్చులు పన్నీ మృగాలనూ, పక్షులనూ పట్టుకొని బంధించే ఉత్సాహంతో అరణ్యమంతా విచ్చలవిడిగా తిరిగాడు.

1-456-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

కోముల గవయ, వృక, శా
ర్దూములఁ, దరక్షు, ఖడ్గ, రోహిత, హరి, శుం
డాముల, శరభ, చమర,
వ్యాముల వధించె విభుఁడు డి నోలములన్,

టీకా:

కోలములన్ = అడవి పందులను; గవయ = గురుపోతులను; అడవి దున్నలను; వృక = తోడేళ్ళను; శార్దూలములన్ = పెద్దపులులను; తరక్షు = సివంగులను; ఖడ్గ = ఖడ్గ మృగములను; రోహిత = కేసరి మృగములను - అడవిగొఱ్ఱెలను; హరి = సింహములను; శుండాలములన్ = ఏనుగులను; శరభ = శరభ మృగములను; చమర = చామర మృగములను; వ్యాలములన్ = కొండచిలువలను; వధించెన్ = సంహరించెను; విభుఁడు = ప్రభువు; వడిన్ = వేగముగ; ఓలములన్ = మాటులలో {ఓలములు - మాటులు - వేట కోసము ఏర్పరచిన మరుగు ప్రదేశములు.}.

భావము:

వనవరాహాలనూ, అడవిఎద్దులనూ, తోడేళ్ళనూ, పెద్దపులులనూ, సివంగులనూ, ఖడ్గమృగాలనూ, అడవిగొఱ్ఱెలనూ, సింహాలనూ, ఏనుగులనూ, శరభాలనూ, జడలబఱ్ఱెలనూ, కొండచిలువలనూ ఆ మహారాజు నైపుణ్యంతో పడగొట్టాడు.

1-457-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మృయులు మెచ్చ నరేంద్రుఁడు
మృరాజ పరాక్రమమున మెఱసి హరించెన్
మృధరమండలమునఁ గల
మృ మొక్కటి దక్క సర్వమృగముల నెల్లన్.

టీకా:

మృగయులు = వేటగాళ్ళు; మెచ్చన్ = మెచ్చుకొనేలా; నరేంద్రుఁడు = నరులకు ఇంద్రుడు; రాజు; మృగరాజపరాక్రమమున = సింహపరాక్రమముతో; మెఱసి = ప్రకాశించి - అతిశయించి; హరించెన్ = సంహరించెను; మృగ = లేడిని; ధర = ధరించిన; మండలమునన్ = బింబములో - చంద్రబింబములో; కల = ఉన్న; మృగము = మృగము; ఒక్కటి = ఒకటి మాత్రము; తక్క = తప్పించి; సర్వ = సమస్తమైన; మృగములన్ = జంతువులను; ఎల్లన్ = అన్నిటిని.

భావము:

ఆ నరేంద్రుడు మృగేంద్ర విక్రమంతో వేటగాళ్లు మెచ్చేటట్లుగా చంద్రమండలంలోని మృగాన్ని తప్ప అరణ్యంలో ఉన్న మృగాలన్నింటినీ వేటాడాడు.

1-458-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఇట్లు వాటంబయిన వేఁటతమకంబున మృగంబుల వెంబడిం బడి యెగచుచుం జరించుటంజేసి బుభుక్షా పిపాసల వలన మిగుల బరిశ్రాంతుండయి, ధరణీకాంతుండు చల్లని నీటి కొలంకుం గానక కలంగెడు చిత్తంబుతోఁ జని, యొక్క తపోవనంబు గని; యందు.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; వాటంబు = కౌతుక సహితము; వాడిది; అయిన = అయినట్టి; వేఁట = వేటమీది; తమకంబున = పరవశత్వముతో; మృగంబులన్ = జంతువులను; వెంబడిన్ = వెనకాతల; పడి = పడి; ఎగచుచున్ = తరుముతూ; చరించుటన్ = తిరుగుట; చేసి = వలన; బుభుక్షా = ఆకలియును; పిపాసల = దాహముల; వలనన్ = వలన; మిగులన్ = మిక్కిలి; పరిశ్రాంతుండు = అలసినవాడు; అయి = అయి; ధరణీకాంతుండు = రాజు, పరీక్షిత్తు {ధరణీకాంతుండు - భూమికిభర్త - రాజు, పరీక్షిత్తు}; చల్లని = చల్లని; నీటి = నీటి; కొలంకున్ = కొలనును - చెరువును; కానక = కనుగొన లేక; కలంగెడు = కలత పడిన; చిత్తంబు = మనసు; తోన్ = తో; చని = వెళ్ళి; ఒక్క = ఒక; తపస్ = తపస్సు చేసుకొను; వనంబున్ = వనమును; కని = చూసి - కనుగొని; అందున్ = అందులో.

భావము:

ఈ విధంగా మృగయాకౌతుకంతో మృగాల వెంటబడి తరుమూతూ పరుగులెత్తటం మూలాన ఆకలి దప్పుల వల్ల అలసి పోయాడు మహారాజు, పరిశ్రాంతుడైన ఆ భూకాంతుడు చల్లని జలాశయం కోసం వెదకి వేసారి ఒక తపోవనాన్ని ప్రవేశించాడు.

1-459-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మెలఁగుట చాలించి, మీలితనేత్రుఁడై,-
శాంతుఁడై కూర్చుండి, డత లేక,
ప్రాణ మనోబుద్ధి పంచేంద్రియంబుల-
హిరంగవీథులఁ బాఱనీక,
జాగరణాధిక స్థానత్రయము దాఁటి,-
రమమై యుండెడి దముఁ దెలిసి,
బ్రహ్మభూతత్వ సంప్రాప్య విక్రియుఁ డయి,-
తిదీర్ఘజటలుఁ ద న్నావరింప,

1-459.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

లఘు రురు చర్మధారియై లరుచున్న
పసిఁ బొడగని, శోషితతాలుఁ డగుచు,
నెండి తడిలేక కుత్తుక నెలుఁగు డింద,
మందభాషల నిట్లను నుజవిభుఁడు.

టీకా:

మెలఁగుట = కదలుట మెదలుట; చాలించి = ఆపి; మీలిత = మూసిన; నేత్రుఁడు = కన్నులు కలవాడు; ఐ = అయ్యి; శాంతుఁడు = శాంతము పొందిన వాడు; ఐ = అయ్యి; కూర్చున్ = కూర్చొని; ఉండి = ఉండి; జడత = మందకొడి తనము; లేక = లేకుండగ; ప్రాణ = ప్రాణమును; మనస్ = మనసును; బుద్ధిన్ = బుద్ధిను; పంచఇంద్రియంబులన్ = పంచఇంద్రియంబులను {పంచఇంద్రియంబులు - కళ్ళు చెవులు ముక్కు నోరు చర్మము}; బహిరంగ = బయటి; వీథులన్ = దారులలో; పాఱనీక = ప్రసరింపనీయక; జాగరణ = జాగృతము; అధిక = మొదలగు; స్థాన = అవస్థల {అవస్థాత్రయములు - జాగృత - మెలకువ, సుషిప్తి - నిద్ర, స్వప్న – కల.}; త్రయము = మూడు (3); దాఁటి = దాటి; పరమము = పైది –ఉత్తమమైనది; ఐ = అయ్యి; ఉండెడి = ఉండెడి; పదమున్ = అవస్థను తురీయము {నాలుగవ అవస్థ - తురీయము, క్రింది అవస్థాత్రయములు - జాగృత - మెలకువ, సుషిప్తి - నిద్ర – స్వప్న – కల,}; తెలిసి = తెలిసికొని – అందుకొని; బ్రహ్మ = బ్రహ్మము; ఆభూత = తన యందే ప్రతిష్టితమైన - తానే అయిన; తత్వ = తత్వము - స్వభావము; సంప్రాప్య = అందుకొన్న; విక్రియుడు = క్రియా శూన్యుడు - సమాధి స్థితుడు; అయి = అయ్యి; అతి = మిక్కిలి; దీర్ఘ = పొడవైన; జటలున్ = జటలు; తన్ను = తనను; ఆవరింపన్ = కప్పుకొనగ; అలఘు = కురచకాని – కుంచించుకుపోని; రురు = లేడి; చర్మ = చర్మమును; ధారి = ధరించినవాడు; ఐ = అయ్యి;
అలరుచున్ = ప్రకాశించుతు; ఉన్న = ఉన్న; తపసిన్ = తపసు చేయువాని - మునిని; పొడగని = చూసి - గుర్తించి; శోషిత = శోష వచ్చిన – ఎండిపోయిన; తాలుఁడు = నోరు కలవాడు - అంగిలి కలవాడు; అగుచున్ = అవుతూ; ఎండి = ఎండిపోయి; తడి = తడి – చెమ్మ; లేక = లేక పోయి; కుత్తుకన్ = గొంతుక లోని - అంగిలిలోని; ఎలుఁగు = కంఠ స్వరము; డిందన్ = మందగించగ - తగ్గగ; మంద = మెల్లని; భాషలన్ = పలుకులతో; ఇట్లు = ఈ విధముగ; అను = పలికెను; మనుజవిభుఁడు = పరీక్షిన్మహారాజు {మనుజవిభుడు - ప్రజలకు విభుడు – రాజు, పరీక్షిత్తు}.

భావము:

అక్కడ నిమీలితనేత్రాలతో కూర్చుని శాంతంగా తపస్సు చేస్తున్న శమీకమునిని చూచాడు. ఆ తపస్వి జాగ్రతం, స్వప్నం, సుషుప్తి అనే మూడు అవస్థలనూ అతిక్రమంచి నాలుగవదైన సమాధి అవస్థలో ఏకాగ్రచిత్తుడై, బ్రహ్మానుసంధానం చేసి ఉన్నాడు. పరీక్షిత్తు ఆ సంయమీంద్రుని సమీపించి దవడలు ఎండి, నాలుక తడారి, డగ్గుత్తికతో మెల్ల మెల్లగా.

1-460-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

“తోములు, దెమ్ము మా కీ
తోము వేఁటాడు వేళ దొల్లి పొడమ దీ
తోము క్రియ జలదాహము,
తోమువారలును లేరు, దుస్సహ మనఘా!”

టీకా:

తోయములు = నీరు; తెమ్ము = తీసుకొని రమ్ము; మాకు = మాకు; ఈ = ఈ; తోయము = తడవు; వేఁటాడు = వేటాడు; వేళ = సమయములో; తొల్లి = ఇంతకు ముందు; పొడమదు = కలుగదు; ఈ = ఈ; తోయము = విధము; క్రియ = వలె; జల = నీటి కోసము; దాహము = దాహము; తోయము = తోటి; వారలును = వారును; లేరు = లేరు; దుస్సహము = సహించుటకు కష్టమైనది; అనఘా = పాపము లేనివాడా.

భావము:

“మంచి నీళ్ళియ్యి పుణ్యాత్ముడ! నీకు పుణ్యం ఉంటుంది. వేటాడ లే నంత దాహంతో వచ్చా నిప్పుడు. ఇంత దుస్సహ మైన దాహం ఎప్పుడూ లేదు. మా వాళ్ళా అందబాటులో లేరు. తట్టుకోలేకపోతున్నా తొందరగా ఇయ్యి.”
పరీక్షిన్మహారాజు తీవ్ర దాహంతో ముని వాటిక చేరి తపోమగ్ను డైన శమీకుని చూసి నీళ్ళి మ్మని అడిగాడు. మహారాజు కదా ఎంత అందంగా అడుగు తున్నాడో చూడండి. (సాహిత్యంలో అందా లద్దడానికి వాడేవి అలంకారాలు. ఆడంబరానికి శబ్దాలంకారం ప్రసిద్ధి. రెండు కాని అంతకంటె ఎక్కువ అక్షరాలు ఉన్న పదాలు తిరిగి తిరిగి వస్తూ అర్థ బేధం ఉంటే అది యమకం).

1-461-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అని భూవరుండు శమీకమహాముని సమాధినిష్ఠానిమీలితనేత్రుండును విస్మృతబాహ్యాంతరింద్రియకృతసంచారుండును హరిచింతాపరుండునునై యుండుటం దెలియలేక.

టీకా:

అని = అని; భూవరుండు = రాజు, పరీక్షితు {భూవరుడు - భూమికిభర్త, రాజు}; శమీక = శమీకుడు అను; మహా = గొప్ప; ముని = ముని; సమాధి = సమాధి; నిష్ఠా = నియమానుసారము; నిమీలిత = మూసిన; నేత్రుండును = కళ్ళు కలవాడును; విస్మృత = మరచిన; బాహ్య = వెలుపలి; అంతర = లోపలి; ఇంద్రియ = ఇంద్రియములచే; కృత = చేయబడిన, చేసిన; సంచారుండును = కదలికలు ఉన్నవాడు; హరి = హరి యొక్క; చింతా = ధ్యానమున; పరుండును = నిమగ్నుడును; ఐ = అయి; ఉండుటన్ = ఉండుటను; తెలియన్ = తెలుసికొన; లేక = లేక.

భావము:

ఆ ముని మాట్లాడలేదు. ఆ మునీంద్రుడు నిమీలితనేత్రుడై, సమాధిస్థుడై బాహ్యేంద్రియజ్ఞానం లేక హరి చింతా పరతంత్రుడై ఉన్నాడని మహారాజు తెలుసుకోలేక ....

1-462-ఉ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

""న్నులు మూసి బ్రాహ్మణుఁడు ర్వముతోడుత నున్నవాఁడు, చే
న్నలనైన రమ్మనఁడు, సారజలంబులు దెచ్చి పోయఁ, డే
న్నన లైనఁ జేయఁడు, సగ్రఫలంబులు వెట్టఁ, డింత సం
న్నత నొందెనే? తన తశ్చరణాప్రతిమప్రభావముల్.

టీకా:

కన్నులు = కన్నులు; మూసి = మూసికొని; బ్రాహ్మణుఁడు = బ్రాహ్మణుడు; గర్వము = అహంకారము; తోడుత = తోకూడి; ఉన్నవాఁడు = ఉన్నాడు; చేన్ = చేతి; సన్నలన్ = గుర్తులతో; ఐన్ = అయినను; రమ్ము = రమ్ము; అనఁడు = అనుట లేదు; సార = మంచి; జలంబులున్ = నీరు; తెచ్చి = తీసుకొని వచ్చి; పోయఁడు = పోయుట లేదు; ఏ = ఏ విధమైన; మన్ననలు = మర్యాదలు; ఐనన్ = అయినను; చేయఁడు = చేయుట లేదు; సమగ్ర = పక్వమునకు వచ్చిన; పండిన; ఫలంబులు = పండ్లు; వెట్టఁడు = పెట్టుట లేదు; ఇంత = ఇంత ఎక్కువగ; సంపన్నతన్ = సంపదను; ఒందెనే = సంపాదించాడా ఏమి; తన = తన యొక్క; తపస్ = తపస్సు; చరణ = చేయుట వలన; అప్రతిమ = సాటిలేని; ప్రభావముల్ = ప్రభావములతో; గొప్పదనముతో.

భావము:

“ఈ బ్రాహ్మణుడు కళ్లు తెరవడు! ఎంత గర్వం! పోనీ రమ్మని చేతితో సైగ అయినా చెయ్యడు! మంచినీళ్లు ఇయ్యడు! ఏవిధమైన మర్యాదలూ చేయడు. పండిన ఫలమూ పెట్టడు. తన తపోశక్తితో సాటిలేని ప్రభావంతో అంత సంపదలు సంపాదించాడా?

1-463-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

వారిఁ గోరుచున్నవారికి శీతల
వారి యిడుట యెట్టివారికయిన
వారితంబుగాని లసిన ధర్మంబు;
వారి యిడఁడు దాహవారి గాఁడు.""

టీకా:

వారిన్ = నీరు; కోరుచు = అడుగుచు; ఉన్న = ఉన్న; వారు = వారు; కిన్ = కి; శీతల = చల్లని; వారి = నీరు; ఇడుట = ఇచ్చుట; ఎట్టి = ఎటువంటి; వారు = వారు; కిన్ = కి; అయినన్ = అయినను; వారితంబు = నివారింప బడుటకు - తప్పించుకొన; కాని = కాని, లేని; వలసిన = ముఖ్యమైన; ధర్మంబు = ధర్మము; వారి = నీరు; ఇడఁడు = ఇవ్వడు; దాహ = దాహమును; వారి = వారించువాడు; కాఁడు = కాడు.

భావము:

దాహంతో నోరెండి పోయి వాకిట్లోకి వచ్చి మంచినీళ్ళు అడిగిన అతిథికి, చల్లని మంచినీళ్ళు ఇవ్వటం ఎటువంటి వారికి అయినా సరే కాదనరాని కనీస కర్తవ్యమే. కాని ఇతడు మంచినీళ్ళు ఇవ్వటంలేదు, దాహం తీర్చటం లేదు.""
దాహంతో అల్లాడిపోతూ పరీక్షిత్తు నీ ళ్ళడిగితే ధ్యానంలో ఉన్న శమీకమహర్షి స్పందించ లేదు. అది గమనించక ఉక్రోషంతో పరీక్షిన్మహారాజు మరోలా అనుకుంటున్నాడు.

1-464-చ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ని మనుజేశ్వరుండు మృగయాపరిఖేదనితాంతదాహసం
నిత దురంతరోషమున సంయమి దన్నుఁ దిరస్కరించి పూ
ములుసేయఁడంచు మృతర్పమునొక్కటి వింటికోపునం
నివడి తెచ్చి వైచె నటు బ్రహ్మమునీంద్రుని యంసవేదికన్.

టీకా:

అని = అని; మనుజేశ్వరుండు = రాజు, పరీక్షిత్తు {మనుజేశ్వరుడు - మానవులకు ప్రభువు, రాజు}; మృగయా = వేట వలన కలిగిన; పరిఖేద = బాధతో - అలసటతో; నితాంత = అధికమైన; దాహ = దాహము వలన; సంజనిత = పుట్టుచున్న; దురంత = అంతులేని; రోషమున = రోషముతో; సంయమి = సంయమనము కలవాడు, తపస్వి; తన్నున్ = తనను; తిరస్కరించి = లెక్కచేయక; పూజనములు = మర్యాదలు; సేయఁడు = చేయడు; అంచున్ = అనుచును; మృత = మరణించిన; సర్పమున్ = పామును; ఒక్కటి = ఒకటి; వింటి = విల్లు యొక్క; కోపునన్ = కొప్పున - చివరతో - బాణముతో; పనివడి = పనిగట్టుకొని; తెచ్చి = తీసుకొనివచ్చి; వైచెన్ = వేసెను; అటు = అటు; బ్రహ్మ = బ్రహ్మ; మునీంద్రుని = ఋషి యొక్క; అంసవేదికన్ = గూడలందలి సమ స్థలములో, మెడలో.

భావము:

అలా అనుకుని పరీక్షిత్తు వేటలో కలిగిన అలసట, అధికమైన దాహములతో జనించిన దురంత రోషముతో ముని తనను లెక్కచేయటంలేదు, గౌరవించుట లేదు అంటూ, వింటి కొప్పుతో ఒక చచ్చిన పామును పనికట్టుకొని తీసుకొచ్చి ఆ బ్రహ్మర్షి భుజాన పడవేశాడు.

1-465-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"ఇట్లతండు ప్రత్యాహృతబాహ్యాంతరింద్రియుం డగుట నిమీలితలోచనుండు గా నోపునో? యట్లుగాక గతాగతులగు క్షత్రబంధులచే నేమియని మృషాసమాధి నిష్ఠుండుగా నోపునో?"యని వితర్కించుచు, వృథారోషదర్పంబున ముని మూఁపున గతాసువయిన సర్పంబు నిడి నరేశ్వరుండు దన పురంబునకుం జనియె; నంత సమీపవర్తులైన మునికుమారు లంతయుం దెలియం జూచి శమీకనందనుం డైన శృంగి కడకుం జని.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; అతండు = అతడు; ప్రత్యాహృత = వెనుకకు మరల్చబడిన; బాహ్య = బయటి; అంతర = లోపటి; ఇంద్రియుండు = ఇంద్రియములు కలవాడు; అగుటన్ = అయి ఉండుటను; నిమీలిత = మూసుకుపోయిన; లోచనుండున్ = కళ్ళు ఉన్నవాడు; కాన్ = అయి; ఓపునో = ఉండవచ్చునేమో; అట్లు = ఆ విధముగ; కాక = కాకపోయిన; గతా = పోయేవాళ్ళు; ఆగతులు = వచ్చేవాళ్ళు; అగు = అయిన; క్షత్రబంధులు = బ్రష్టుక్షత్రియులు {క్షత్రబంధువు - బ్రష్టులైన క్షత్రియులకు వాడు జాతీయము}; చేన్ = వలన; ఏమి = ఏమి; అని = అని; మృషా = కపట; సమాధి = సమాధి; నిష్ఠుండున్ = నిష్ఠలో ఉన్నవాడు; కాన్ = అయి; ఓపునో = ఉండవచ్చేమో; అని = అని; వితర్కించుచు = వ్యతిరిక్తముగ తర్కించుచు; వృథా = వ్యర్థమైన; అనవసరపు; రోష = రోషముతో కూడిన; దర్పంబున = దర్పముతో - గర్వముతో; ముని = ముని యొక్క; మూఁపున = మూపుమీద, మెడలో; గత = పోయిన; ఆసువు = ఆయువు; అయిన = కల, చనిపోయిన; సర్పంబున్ = పామును; ఇడి = ఉంచి - వేసి; నరేశ్వరుండు = రాజు, పరీక్షిత్తు {నరేశ్వరుడు - నరులకు ప్రభువు, రాజు}; తన = తన యొక్క; పురంబున = పురమున; కున్ = కు; చనియెన్ = వెళ్ళెను; అంత = అంతట; సమీప = సమీపములో; దగ్గరలో; వర్తులు = తిరుగుచున్నవారు; ఐన = అయినట్టి; ముని = మునుల యొక్క; కుమారులు = కొడుకులు; అంతయున్ = మొత్తం అంతా; తెలియన్ = తెలిసేలాగ; చూచి = చూసి; శమీక = శమీకుని యొక్క; నందనుండు = పుత్రుడు; ఐన = అయినట్టి; శృంగి = శృంగి; కడ = దగ్గర; కున్ = కి; చని = వెళ్ళి.

భావము:

“ఈ ముని ఏకాగ్రచిత్తంతో నిజంగానే నిష్ఠాగరిష్ఠుడై నిమీలిత నేత్రుడై కూర్చున్నాడా లేక ఎప్పుడూ వస్తూ పోతూ ఉండే సామాన్య రాజులతో ఏమి పని అని దొంగజపం చేస్తున్నాడా?” అని మనస్సులో వితర్కించుకొంటూనే భూపాలుడు ఆపుకోలేని కోపాటోపంతో దాపున పడి ఉన్న మృతసర్పాన్ని ముని మూపున వేసి హస్తినాపురానికి వెళ్లిపోయాడు. అప్పుడు చుట్టుప్రక్కల తిరిగుతున్న మునికుమారులు ఇదంతా చూసి శమీకముని కుమారుడైన శృంగి సమిపానికి వెళ్లి....

1-466-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

""నగంధ గజస్యందన
తురంగములనేలు రాజు తోయాతురుఁడై
రఁగన్ నీజనకునిమెడ
నుగముఁదగిలించిపోయెనోడక తండ్రీ!""

టీకా:

నర = నరులను; గంధ = మదమెక్కిన; గజ = ఏనుగులను; స్యందన = రథములను; తురంగంబులన్ = గుఱ్ఱములను; ఏలు = పాలించు; రాజు = రాజు; తోయ = దాహముతో; ఆతురుడు = ఆత్రుత కలవాడు; ఐ = అయి; పరఁగన్ = పనిగట్టుకొని; నీ = నీ; జనకుని = తండ్రి; మెడన్ = మెడలో; ఉరగమున్ = పామును; తగిలించి = చిక్కునట్లు చేసి; పోయెన్ = పోయెను; ఓడక = సంకోచించక; తండ్రీ = అయ్యా.

భావము:

“భటులు, ఏనుగులు రథాలు, గుఱ్ఱాలు అనే చతురంగ సైన్నానికి అధిపతి అయిన ఎవడో ఒక రాజు జలం కోసం వచ్చి సంకోచించకుండా నీ జనకుని కంఠంలో సర్పాన్ని తగిలించి పోయాడయ్యా” అని చెప్పారు.

1-467-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అని పలికిన, సమానవయోరూప మునికుమారలీలాసంగి యయిన శృంగి శృంగంబుల తోడి మూర్తి ధరించినట్లు విజృంభించి రోష సంరంభంబున నదిరిపడి, ”బల్యన్నంబుల భుజించి పుష్టంబు లగు నరిష్టంబులుం బోలె బలిసియు ద్వారంబుల గాచికొని యుండు సారమేయంబుల పగిది దాసభూతులగు క్షత్రియాభాసు లెట్లు బ్రాహ్మణోత్తములచే స్వరక్షకులుగ నిరూపితులయిరి? అట్టివార లెట్లు తద్గృహంబుల భాండసంగతంబగు నన్నంబు భుజింప నర్హు లగుదురు? తత్కృతంబు లయిన ద్రోహంబు లెట్లు నిజ స్వామిం జెందు?"నని మఱియు నిట్లనియె.

టీకా:

అని = అని; పలికిన = పలుకగ; సమాన = సమానమైన; వయస్ = వయస్సు కల; రూప = రూపము కల; ముని = మునుల యొక్క; కుమార = కుమారులతో; లీలా = క్రీడలకు; సంగి = కూడినవాడు; అయిన = అయినట్టి; శృంగి = శృంగి; శృంగంబులన్ = కొమ్ములతో; తోడి = కూడి యున్న (నందీశ్వరుని); మూర్తి = వేషమును - రూపమును; ధరించినట్లు = వేసుకొన్నట్లు; విజృంభించి = చెలరేగి; రోష = రోషము వలన; సంరంభంబునన్ = తొట్రుపాటుతో; అదిరి = అదిరి; ఉలికి; పడి = పడి; బలి = బలిగా పెట్టిన; అన్నంబులన్ = అన్నములను; భుజించి = తిని; పుష్టంబులు = బలిష్టులు; అగున్ = అయిన; అరిష్టంబులున్ = కాకులు; పోలెన్ = వలె; బలిసియున్ = బలము కల వైనప్పటికిని; ద్వారంబులన్ = ద్వారముల వద్ద; కాచికొని = ఎదురు చూచుచు; ఉండు = ఉండు; సారమేయంబుల = కుక్కల; పగిదిన్ = వలె; దాస = పనివాని; భూతులు = వంటివారు; అగు = అయినట్టి; క్షత్రియ = క్షత్రియ; అభాసులు = బ్రష్టులు; ఎట్లు = ఏ విధముగ; బ్రాహ్మణ = బ్రాహ్మణులను; ఉత్తముల = ఉత్తముల; చేన్ = చేత; స్వ = తమ; రక్షకులుగ = రక్షించువారుగ – పరిపాలకులుగ; నిరూపితులు = నియమింపబడినవారు; అయిరి = అయితిరి; అట్టి = అటువంటి; వారలు = వారు; ఎట్లు = ఏ విధముగ; తత్ = వారి; గృహంబులన్ = ఇండ్లలోని; భాండ = కుండలలో; సంగతంబు = కూడిఉన్నది; కూడు; అగు = అయినట్టి; అన్నంబున్ = అన్నమును; భుజింపన్ = తినుటకు; అర్హులు = అర్హత కలవారు – యోగ్యులు; అగుదురు = అవుతారు; తత్ = వారిచేత; కృతంబులు = చేయబడినవి; అయిన = అయిన; ద్రోహంబులు = కీడులు; ఎట్లు = ఏ విధముగ; నిజ = తమ; స్వామిన్ = యజమానిని; చెందున్ = చెందును; అని = అని; మఱియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

ఆ మాటలు విని తోడి మునికుమారులతో ఆటలాడుతున్న శృంగి కొమ్ములు తిరిగిన క్రోధరసంలాగా హుంకరించి, రోషావేశంతో అదరిపడుతూ ఇలా అన్నాడు- ”ఈ రాజులు బలిముద్దలు తిని బలిసిన కాకుల వంటివారు. ద్వారాలవద్ద కాచుకొని ఉండే సారమేయాల వంటివారు. గృహదాసులైన ఈ ఆభాస క్షత్రియులను భూసురోత్తములు తమ రక్షకులుగా ఎలా అయ్యారు. ద్వారపాలకులుగా ఉండదగినవారు వంటింటిలో ప్రవేశించి వండిన అన్నాన్ని భుజించటానికి ఎలా అర్హులైతారు. వారు చేసే ద్రోహాలకు గృహస్వామి ఎందుకు బాధ్యు డవుతాడు."ఇలా పలికి

1-468-ఉ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

""డు తన్ను దూషణము, లాశ్రమవాసులఁ గాని వైరులం
గూడఁడు, కందమూలములు గూడుగఁ దించు సమాధినిష్ఠుఁడై
వీడఁడు లోనిచూడ్కులను, విష్ణునిఁ దక్కఁ బరప్రపంచముం
జూడఁడు, మద్గురుండు, ఫణిఁ జుట్టఁగ నేటికి రాచవానికిన్?

టీకా:

ఆడడు = పలుకడు; తన్నున్ = తనను; దూషణములు = నిందలు; ఆశ్రమ = ఆశ్రమములో; వాసులన్ = వసించువారిని; కాని = తప్ప; వైరులన్ = శత్రువులను; కూడఁడు = కలవడు; కంద = కంద; మూలములు = మొదలగునవి (దుంపలు); కూడుగన్ = భోజనముగ; తించు = తినుచు; సమాధి = సమాధిలో; నిష్ఠుఁడు = నిమగ్నమైనవాడు; ఐ = అయి; వీడఁడు = వదలడు; లోని = (ఆత్మ) లోపలి; చూడ్కులను = చూపులను; విష్ణునిన్ = విష్ణుమూర్తిని; తక్కన్ = కాని; పర = ఇతరమైన; ప్రపంచమున్ = ప్రపంచార్థములను; చూడఁడు = చూడడు; మత్ = నా యొక్క; గురుండు = తండ్రి; ఫణిన్ = పామును; చుట్టఁగన్ = చుట్టుట; ఏటి = ఎందుల; కిన్ = కు; రాచ = రాజకులపు – క్షత్రియకులపు; వాడు = వాడు; కిన్ = కి.

భావము:

""మా తండ్రి తనను తూలనాడలేదే ఆశ్రమవాసులతోనే గాని తమ శత్రు రాజులతో కూడలేదే అడవిలో కందమూలాలు భుజిస్తూ అచంచల మనస్కుడై అంతర్ దృష్టిని వీడకుండా, విష్ణుమూర్తిని తప్ప ఇతర ప్రపంచాన్ని చూడకుండా, తపోనిష్ఠలో ఉన్న ఆయన మీద ఆ రాచవాడు పామును వేసిపోతాడా?

1-469-ఉ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

పోము హిరణ్యదానములఁ బుచ్చుకొనంగ, ధనంబు లేమియుం
దేము, స వంచనంబులుగ దీవనలిచ్చుచు వేసరింపఁగా
రాము, వనంబులన్ గృహవిరాములమై నివసింపఁ; జెల్లరే!
పామును వైవఁగాఁ దగునె? బ్రహ్మమునీంద్రు భుజార్గళంబునన్.

టీకా:

పోము = వెళ్ళము; హిరణ్య = బంగారు; దానములన్ = దానములను; పుచ్చుకొనంగ = తీసుకొనుటకు; ధనంబులు = విత్తములు (దక్షిణలు); ఏమియున్ = ఏవియును; తేము = తీసుకొనిరాము; సవంచనములుగన్ = మోసములతో కూడిన; దీవనలు = దీవనలు - ఆశీర్వాదములను; ఇచ్చుచున్ = ఇచ్చుచు; చేయుచు; వేసరింపఁగా = విసిగించుచు; రాము = రాము; వనంబులన్ = అడవిలో; గృహ = గృహస్తాశ్రమ; ఆశ్రమము నందే; విరాములము = విరతులము; ఐ = అయి; నివసింపన్ = ఉండగ; చెల్లరే = అయ్యో; పామును = పామును; వైవఁగా = వేయుట; తగునె = తగునా ఏమి – ఏమి ధర్మము; బ్రహ్మముని = బ్రహ్మర్షులలో; ఇంద్రు = శ్రేష్ఠుని; భుజా = భుజముల యొక్క; గళంబునన్ = కంఠములో.

భావము:

మేము హిరణ్యదానాలు పుచ్చుకోవటానికి పోమే ఆశీర్వాదాలని మోసం చేసి ధనం గుంజుకోమే! పరులను వేధించేవాళ్లం కామే! ఇళ్లూ వాకిళ్లూ విడిచిపెట్టి అడవుల్లోపడి ఉన్నామే! అటువంటప్పుడు బ్రహ్మర్షి అయిన మా తండ్రిగారి మెడలో పామును పడవేయటానికి ఆ రాజుకు ఏం పోయే కాలం వచ్చిందో.

1-470-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

పుమిఁగల జనులు వొగడఁగఁ
గుడుతురు గట్టుదురుఁ గాక కువలయపతులై
వుల నిడుమలఁ బడియెడి
డుగులమెడఁ నిడఁగ దగునె న్నగశవమున్?

టీకా:

పుడమిన్ = భూమి మీద; కల = కల; జనులున్ = జనులు; ఒగడఁగన్ = పొగడునట్లు; కుడుతురున్ = (తింటే) తిందురు; కట్టుదురున్ = (కడితే) కట్టుదురు; కాక = అంతేకాని; కువలయ = భూమండలమునకు; పతులు = భర్తలు; ఐ = ఐ ఉండి; అడవులన్ = అడవులలో; ఇడుమలన్ = బాధలు - ఇబ్బందులు; పడియెడి = పడు; బడుగుల = అశక్తుల – బలహీనుల; మెడన్ = మెడలో; ఇడఁగన్ = వేయుట; తగునె = తగునా ఏమి – ఏమి ధర్మము; పన్నగ = పాము; శవమున్ = శవమును.

భావము:

ప్రపంచాన్ని పాలించే ప్రభువు లయితే పంచభక్ష్యపరమాన్నాలు కడుపునిండా కుడవమనండి. విలువగల వలువలు ముడవమనండి. అంతేకాని అడవులలో ఇడుములు పడే బడుగు తాపసుల మెడలో పామును చుడతారా.

1-471-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

వంతుఁడు గోవిందుఁడు
తిం బెడఁబాసి చనిన శాసింపంగాఁ
గువారు లేమి దుర్జను
లెసి మహాసాధుజనుల నేఁచెద రకటా!

టీకా:

భగవంతుఁడు = మహిమాన్వితుడు; గోవిందుఁడు = కృష్ణుడు; జగతిన్ = భూలోకమును; పెడఁబాసి = విడిచిపెట్టి; చనినన్ = చనగా; వెళ్ళగా; శాసింపంగాన్ = కట్టుబాటుచేయుటకు; తగు = సామర్థ్యము కల; వారు = వారు; లేమిన్ = లేకపోవుటచేత; దుర్జనులు = చెడ్డమనుష్యులు; ఎగసి = చెలరేగి; మహా = గొప్ప; సాధు = సాత్వికులైన; జనులన్ = ప్రజలను; ఏఁచెదరు = బాధించెదరు; విసిగించెదరు; అకటా = అయ్యో.

భావము:

అయ్యో! భగవంతుడైన శ్రీకృష్ణుడు లోకాన్ని విడిచి వెళ్లిన తర్వాత సమర్థుడైన శాసకుడు ఎవరూ లేకపోవటంతో దుర్మార్గులు విజృంభించి నిరపరాధులైన సాధువులను బాధింప సాగారు.

1-472-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

“బాకులారా! ధాత్రీ
పాకు శపియింతు""ననుచుఁ లువడిని విలో
లాకుఁడగు మునికుంజర
బాకుఁ డరిగెం ద్రిలోకపాలకు లదరన్.

టీకా:

బాలకులారా = బాలకులారా; ధరిత్రీపాలకున్ = రాజును {ధరిత్రీపాలకుడు - భూమిని పాలించువాడు, రాజు}; శపియింతున = శపించెదను; అనుచున్ = అనుచు; పలు = మిక్కిలి; వడిని = వేగముతో; విలోల = చెదిరిన; అలకుఁడు = ముంగురులు కలవాడు; అగు = అయిన; మునికుంజరబాలకుఁడు = శృంగి {మునికుంజరబాలకుఁడు - మునులలో ఏనుగువంటి (శ్రేష్ఠుడైన) శమీకుని కుమారుడు, శృంగి}; అరిగెన్ = వెళ్ళెను; త్రి = మూడు (3); లోక = లోకముల; పాలకులు = పాలకులు - అధిపతులు; అదరన్ = ఉలికి పడునట్లు.

భావము:

“బాలకులాలా! వినండి. ఇప్పుడే ఆ భూపాలకునికి శాపం పెడతాను” అని మిక్కిలి వేగంగా చెదరిన ముంగురులతో నున్న మునిబాలకుడైన శృంగి ముల్లోకపాలకులు అదిరేటట్లు పెద్ద కేకలు వేస్తూ-