పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : ధరణీ ధర్మదేవత లుద్ధరణంబు

  •  
  •  
  •  

1-453-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

క్రమున మింటికై యెగయుఁగాక విహంగము మింటిదైన పా
ము గన నేర్చునే? హరిపరాక్రమ మోపినయంతఁ గాక స
ర్వము వివరింప నెవ్వఁడు ప్రర్తకుఁడౌ? మునులార! నాదు చి
త్తమునకు నెంత గానఁబడెఁ ప్పక చెప్పెద మీకు నంతయున్.

టీకా:

క్రమమునన్ = క్రమముగ - చక్కగ; మింటి = ఆకాశము; కై = నకు; ఎగయుఁన్ = ఎగురును; కాక = ఐతే ఐ ఉండవచ్చు - అయినప్పటికిని; విహంగము = పక్షి; మింటిది = ఆకాశమునది; ఐన = అయినట్టి; పారమున్ = అంతు - దరి; కనన్ = చూచుట – కనుగొనుట; నేర్చునే = నేర్చుకొన కలదా; హరి = హరి యొక్క; పరాక్రమము = తేజస్సు; ఓపిన = అనుమతించిన; అంతన్ = అంతే; కాక = కాకుండగ; సర్వము = సమస్తము; వివరింపన్ = వివరించుటకు; ఎవ్వండు = ఎవడు మాత్రము; ప్రవర్తకుఁడు = సామర్థ్యము కలవాడు; ఔ = అవుతాడు; మునులార = మునులారా; ఓ మునులూ; నాదు = నా యొక్క; చిత్తము = మనసు; కున్ = కు; ఎంతన్ = ఎంత అయితే; కానఁబడెన్ = కనబడెనో; తప్పక = తప్పకుండగ; చెప్పెదన్ = చెప్పుదును; మీకున్ = మీకు; అంతయున్ = అంతా.

భావము:

పక్షులు తమ శక్తి కొద్దీ రెక్కలాడిస్తూ ఎంత పైకి ఎగిరినా, ఆకాశం అంతు కనుక్కోలేవు. అదేవిధంగా, వాసుదేవుని మహావైభవాన్ని తనకు తెలిసినమాత్రం తప్ప సమగ్రంగా వివరించి చెప్పగల సమర్థు డెవడున్నాడు.