పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : కలి నిగ్రహంబు

 •  
 •  
 •  

1-415-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఇట్లాధేను వృషభంబుల రెంటిం గంటకుండై తన్నుచున్న రాజలక్షణ ముద్రితుండయిన శూద్రునిం జూచి, సువర్ణ పరికరస్యందనారూఢుం డగు నభిమన్యునందనుండు గోదండంబు సగుణంబు సేసి, మేఘగంభీరరవంబు లగు వచనంబుల నిట్లనియె.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; ఆ = ఆ; ధేను = ఆవు; వృషభంబులన్ = ఎద్దులను; రెంటిన్ = రెండింటిని; కంటకుడు = ముల్లు వంటివాడు; బాధపెడుతున్న వాడు; ఐ = అయి; తన్నుచున్న = తన్నుచున్న; రాజ = రాజు యొక్క; లక్షణ = లక్షణములు; ముద్రితుండు = గుర్తులు కలవాడు; అయిన = అయినట్టి; శూద్రునిన్ = శూద్రుని; చూచి = చూసి; సువర్ణ = బంగారు; పరికర = ఉపకరణములు కల, మంచ కల; స్యందన = రథమును; ఆరూఢుండు =; ఎక్కినవాడు; అగున్ = అయినట్టి; అభిమన్యునందనుండు = పరీక్షిత్తు; కోదండంబు = విల్లు; సగుణంబు = అల్లెత్రాడు కట్టబడినదిగా {గుణము - అల్లెత్రాడు, లక్షణము}; చేసి = చేసి; మేఘ = మేఘముల యొక్క; గంభీర = గంభీరమైన; రవంబులు = ధ్వనులు కలవి; అగు = అయిన; వచనంబులన్ = మాటలతో; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

“ఓ వృషభ రూపంలో ఉన్న ధర్మదేవా! మా కురువంశ నరేంద్రుల బాహుదండాలనే కోటగోడల మధ్య సురక్షితంగా ఉండే రాజ్యం లోని ప్రజలు, అధర్మంగా ఏ జీవులను బాధించరు, కన్నీరు కార్పించరు. దీనికి విరుద్దంగా నీ కనుల వెంట అన్యాయంగా బాష్పధారలు కార్పించిన దురాత్ముణ్ణి, నా అవక్రపరాక్రమంతో ఇప్పుడే నరుకుతాను. ఇదిగో చూడు!

1-416-శా.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

""నిన్నుం గొమ్ములఁ జిమ్మెనో? కదిసెనో? నిర్భీతివై గోవులం
న్నం గారణ మేమి? మద్భుజసనాక్షోణి నే వేళలం
దున్నేరంబులు సేయ రా; దెఱుఁగవా? ధూర్తత్వమున్ భూమిభృ
త్సన్నాహంబు నొనర్చె దెవ్వఁడవు? నిన్ శాసించెదన్ దుర్మతీ!

టీకా:

నిన్నున్ = నిన్ను; కొమ్ములన్ = కొమ్ములతో; చిమ్మెనో = చిమ్మెనో {చిమ్ముట - కొమ్ములతో పొడిచి దూరముగ తోయుట, జలాదులను విస్తారముగా జల్లుట}; కదిసెనో = సమీపించెనో, మీదికి వచ్చెనో; నిర్భీతివి = భయము లేనివాడవు; ఐ = అయి; గోవులన్ = గోవులను – అవు ఎద్దులను; తన్నన్ = తన్నుటకు; కారణము = కారణము; ఏమి = ఏమిటి; మత్ = నా యొక్క; భుజ = భుజముల; సనాథ = అండ కలిగిన; క్షోణిన్ = రాజ్యము నందు; ఏ = ఏ; వేళలు = సమయము; అందున్ = అందు; నేరంబులున్ = అపరాధములను; సేయరాదు = చేయరాదు; ఎఱుఁగవా = తెలియవా; ధూర్తత్వమున్ = మోసముతో; భూమిభృత్ = రాజరికపు {భూమిభృత్ - భూమికి భర్త, రాజు}; సన్నాహంబున్ = ఆటోపములు, యత్నములు; ఒనర్చెదు = చేసెదవు; ఎవ్వఁడవు = ఎవరవు; నిన్ = నిన్ను; శాసించెదన్ = శిక్షించెదను; దుర్మతీ = దుర్బుద్ధి కలవాడా.

భావము:

“ఎవడవురా నువ్వు? నిన్ను కొమ్ములతో చిమ్మలేదే; నీ మీదికి రాలేదే; ఏ పాపమూ ఎరుగని ఈ గోవులను భయం లేకుండా తన్నా వెందుకురా? నా భుజదండం సంరక్షించే ఈ మహీమండలంలో ఏ వేళా నేరాలు చేయకూడదని తెలియదా? దుర్బుద్ధితో రాజవేషాన్ని ధరించి రాజసం ఒలకబోస్తున్న ధూర్తుడా! నిన్ను కఠినంగా శిక్షిస్తాను.

1-417-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

గాండీవియుఁ జక్రియు భూ
మంలిఁ బెడఁబాసి చనిన దమత్తుఁడవై
దండింపఁ దగనివారల
దండించెదు నీవ తగుదు దండనమునకున్.""

టీకా:

గాండీవియున్ = అర్జునుడును {గాండీవి - గాండీవము అను విల్లు కలవాడు, అర్జునుడు}; చక్రియు = కృష్ణుడును; భూమండలిన్ = భూలోకమును; పెడఁబాసి = వదిలివేసి; చనినన్ = చనగా, వెళ్ళిపోగా; మద = మదముతో; మత్తుఁడవు = మత్తెక్కినవాడవు; ఐ = అయి; దండింపన్ = , శిక్షించుటకు; తగని = యుక్తము కాని; వారలన్ = వారిని; దండించెదు = దండించెదవు, శిక్షించెదవు; నీవ = నీవె; తగుదు = తగినవాడవు; దండనమున = , శిక్షింపబడుట; కున్ = కు.

భావము:

గాండీవధారి అయిన అర్జునుడూ, చక్రధారి అయిన శ్రీకృష్ణుడూ ఈ భూమండలాన్ని విడిచి వెళ్లారనే ధీమాతో మదోన్మత్తుడవై దండింపతగని సాధువులను దండిస్తున్న నీకు ప్రచండమైన రాజదండన తప్పదు.”

1-418-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అని వృషభంబు నుద్దేశించి యిట్లనియె.

టీకా:

అని = అని; వృషభంబున్ = ఎద్దును; ఉద్దేశించి = గురించి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

అని పలికి పరీక్షన్మహారాజు వృషభరాజాన్ని చూసి ఇలా అన్నాడు-

1-419-మ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

""కురుధాత్రీశ్వర బాహు వప్ర యుగళీ గుప్తక్షమా మండలిం
రికింపన్ భవదీయ నేత్ర జనితాంశ్శ్రేణిఁ దక్కన్, జనుల్
దొరఁగం జేయ రధర్మ సంజనిత జంతుశ్రేణిబాష్పంబులన్,
గురుశక్తిన్ విదళింతుఁ జూడు మితనిన్ గోమూర్తిదేవోత్తమా!

టీకా:

కురు = కురువంశపు; ధాత్రీశ్వర = రాజు యొక్క {ధాత్రీశ్వరుడు - ధాత్రి (భూమి)కి ఈశ్వరుడు, రాజు.}; బాహు = చేతులనే; వప్ర = కోటల; యుగళీ = జంటచేత; గుప్త = రక్షింపబడు; క్షమా = రాజ్యము లోని; మండలిన్ = ప్రదేశము నందు – రాజ్యములో; పరికింపన్ = చూడగా; భవదీయ = నీయొక్క; నేత్ర = కన్నులో; జనిత = జనించిన, పుట్టిన; అంభ = నీటి; శ్రేణిన్ = జాలువారుటను; తక్కన్ = తప్పించి; జనుల్ = ప్రజలు; తొరఁగన్ = స్రవించునట్లు; చేయరు = చేయరు; అధర్మ = అధర్మముగ; సంజనిత = జనించిన – పుట్టిన; జంతు = జంతువుల; శ్రేణి = సమూహముల; బాష్పంబులన్ = కన్నీటిని; గురు = గొప్ప; శక్తిన్ = బలముతో, సామర్థ్యముతో; విదళింతున్ = ఖండించివేసేదను; చూడుము = చూడుము; ఇతనిన్ = వీనిని; గో = ఆవు; మూర్తి = రూపమున ఉన్న; దేవ = దేవతలలో; ఉత్తమా = ఉత్తమా.

భావము:

“ఓ వృషభ రూపంలో ఉన్న ధర్మదేవా! కురువంశీయులైన నరేంద్రుల బాహుదండాలనే కోటగోడల నడుమ సురక్షితమైన ఉన్న ఈ ధరాచక్రంలోని జనులు, నీ కనుల వెంట స్రవించే బాష్పధారలు తప్ప అధర్మబాధితులైన ఏ యితర జీవుల కన్నీరు ఇంతవరకు చూసి ఎరుగరు. ఇదిగో చూడు! నా అవక్రపరాక్రమంతో ఈ దురాత్ముణ్ణి చించి చెండాడుతాను.

1-420-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

జాలిఁ బడ నేల? నా శర
జాలంబుల పాలు సేసి చంపెద వీనిన్
భూలోకంబున నిపుడే
నాలుగు పాదముల నిన్ను డిపింతుఁ జుమీ.

టీకా:

జాలిన్ = విచారములో; పడన్ = పడుట; ఏల = ఎందులకు; నా = నాయొక్క; శర = బాణముల; జాలంబుల = సమూహములకి; పాలు = వశము; చేసి = చేసి; చంపెద = సంహరించెద; వీనిన్ = వీనిని; భూలోకంబునన్ = భూలోకములో; ఇపుడే = ఇప్పుడే; నాలుగు = నాలుగు; పాదములన్ = కాళ్ళమీద; నిన్ను = నిన్ను; నడిపింతున్ = నడిపించెదను; చుమీ = చూడుమీ.

భావము:

ఓ ధర్మస్వరూపా! దిగులు పడబోకు, నా వాడితూపులతో ఈ పాపాత్ముణ్ణి రూపుమాపుతాను. నిన్ను ఇప్పుడే ఈ భూమి మీద మళ్లీ నాలుగు పాదాలతో నడిపించుతాను.

1-421-ఉ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

వావియైన గడ్డిఁ దిని, వాహిను లందు జలంబు ద్రావఁగా,
నీ రణంబు లెవ్వఁ డిటు నిర్దళితంబుగఁ జేసె? వాఁడు దా
ఖేరుఁడైన, వాని మణి కీలిత భూషణ యుక్త బాహులన్
వేని త్రుంచివైతు వినువీథికి నేగిన నేల డాఁగినన్.""

టీకా:

వాచవి = నోటికి రుచి; ఐన = అయినట్టి; గడ్డిన్ = గడ్డిని; తిని = తిని; వాహినులు = నదులు కాలువలు; అందున్ = అందు; జలంబున్ = నీరు; త్రావఁగా = తాగుచుండగ; నీ = నీ యొక్క; చరణంబులు = పాదములను; ఎవ్వఁడు = ఎవడు; ఇటు = ఈ విధముగ; నిర్దళితంబుగన్ = ఖండితముగ; చేసెన్ = చేసెను; వాఁడు = వాడు; తాన్ = తాను; ఖేచరుఁడు = ఆకాశమున తిరుగు వాడు; ఐన = అయినప్పటికిని; వాని = వాని యొక్క; మణి = రత్నములు; కీలిత = చెక్కిన; భూషణ = అలంకారములతో; యుక్త = కూడిన; బాహువులన్ = చేతులను; వే చని = శ్రీఘ్రముగ వెళ్ళి; త్రుంచి = ఖండించి; వైతున్ = వేయుదును; విను = ఆకాశ; వీథి = మార్గము; కిన్ = కు; ఏగినన్ = వెళ్ళిన; నేలన్ = నేలలో; డాఁగినన్ = దాగికొనినను.

భావము:

నోటికి రుచించిన గడ్డి పరకలు తిని, కాలవల్లో నీళ్ళు తాగి బతికే సాధు జీవివైన నీ పాదాలను ఇలా ఎవడు నరికేసాడు. వాడు ఆకాశంలో తిరిగే వాడైనా సరే వెంటనే వెళ్ళి వాడి చేతులు మణికంకణాదులుతో సహా నరికి పారేస్తాను. వాడిని వదలను. వాడు నింగికి ఎగిరిపోయినా, నేలలో దూరిపోయినా సరే వదలనే వదలను.""
(భూదేవి ధర్మదేవతలు గో వృషభ రూపాలలో ఒక చోట గడ్డి మేస్తున్నాయి. కలికాలం ప్రవేశించటం వల్ల, ఇద్దరు దీనంగా ఉన్నారు. పైగా ధర్మదేవత ఒంటికాలిమీద ఉంది. ఇంతలో కలిపురుషుడు వచ్చి ఇద్దరిని చితక తన్నుతున్నాడు. పరీక్షిత్తు విధివశాత్తు ఇదంతా చూసాడు. కోపంతో కలిని నిగ్రహిస్తు, గో వృషభ రూపులను ఓదారుస్తు, వృషభ రూపునితో ఇలా అంటున్నాడు.)

1-422-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అని మఱియు గోరూప యయిన భూదేవితో నిట్లనియె.

టీకా:

అని = అని; మఱియున్ = ఇంకనూ; గో = ఆవు; రూప = రూపము ధరించినది; అయిన = అయినట్టి; భూదేవి = భూదేవి; తోన్ = తో; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

అని పలికి పరీక్షిత్తు గోరూపధారిణి అయిన భూదేవితో ఇలా అన్నాడు

1-423-చ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

""ణితవైభవుం డగు మురాంతకుఁ డక్కట పోయె నంచు నె
వ్వలఁ గృశించి నేత్రముల వారికణంబులు దేకు మమ్మ! లో
బెడకు మమ్మ! మద్విశిఖబృందములన్ వృషలున్ వధింతు నా
గఁటిమిఁ జూడ వమ్మ! వెఱ మానఁ గదమ్మ! శుభప్రదాయినీ!

టీకా:

అగణిత = ఎంచుటకు వీలుకాని; లెక్కింపవీలుకాని; వైభవుండు = వైభవము కలవాడు; అగు = అయినట్టి; మురాంతకుడు = కృష్ణుడు {మురాంతకుడు - ముర అను రాక్షసుని సంహరించిన వాడు, కృష్ణుడు}; అక్కట = అయ్యో; పోయెన్ = చనెను; అంచున్ = అనుచును; ఏ = ఏ విధమైన; వగలన్ = శోకముతోను; కృశించి = కృశించిపోయి, చిక్కిపోయి; నేత్రముల = కన్నులలో; వారి = నీటి; కణంబులున్ = బిందువులను; తేకుము = తీసుకు రాకుము; అమ్మ = తల్లీ; లోన్ = లోలోపల; బెగడకుము = భయపడకు; బెంగపడకు; అమ్మ = తల్లీ; మత్ = నా యొక్క; విశిఖ = బాణముల; బృందములన్ = సమూహములచేత; వృషలున్ = పాపాత్ముని; వధింతున్ = సంహరించుదును; నా = నా యొక్క; మగఁటిమిన్ = మగతనమును, శౌర్యమును; చూడవమ్మ = చూడుము తల్లీ; వెఱ = భయపడుట; మానన్ = మానవలసినది; కద = కదా; అమ్మ = తల్లీ; శుభ = శుభములను; ప్రదాయినీ = ఇచ్చేదానా.

భావము:

“అమ్మా! అనంత వైభవోపేతుడైన శ్రీకృష్ణుడు ఈ లోకాన్ని వదలి వెళ్లిపోయాడనే ఆవేదనతో కృశించి కన్నీరు మున్నీరుగా ఏడువకు. మనస్సులో దిగులు పెట్టుకోబోకు, కల్యాణదాయిని వైన నిన్ను తన్నిన ఈ దుర్మార్గుణ్ణి ఇప్పుడే నా బాణాలతో నేల కూలుస్తాను, నా పౌరుషమును, చూడు తల్లీ! భయకంపితవు కాబోకు మమ్మా!

1-424-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

సాధువులగు జంతువులకు
బాలు గావించు ఖలుల భంజింపని రా
జాము నాయుస్స్వర్గ
శ్రీనములు వీటిఁబోవు సిద్ధము తల్లీ!

టీకా:

సాధువులు = అహింసా మార్గలము; అగు = అయినట్టి; జంతువుల = ప్రాణుల; కున్ = కు; బాధలున్ = బాధలు; కావించు = కలుగజేయు, పెట్టు; ఖలుల = దుష్టులను; భంజింపని = భంజకము చేయని, ఖండించని; రాజ = రాజులలో; అధముని = అధముని, నీచుని; ఆయుస్ = ఆయుష్షు; స్వర్గ = స్వర్గసుఖములు; శ్రీ = సిరి, శోభ; ధనములు = విత్తములు; వీటిఁబోవున్ = వ్యర్థమగుట; సిద్ధము = సిద్ధించును, తప్పదు; తల్లీ = తల్లీ.

భావము:

సాధులయిన జీవులను బాధించే దుర్మార్గులను రాజైనవాడు అవశ్యం శిక్షించాలి. అలా శిక్షించకుండా ఉపేక్షించిన రాజాధముని జీవితమూ, ఆయుస్సూ, ఐశ్వర్యమూ, సర్వం వ్యర్థం. ఈ మాట ముమ్మూటికీ యథార్థం తల్లీ!

1-425-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

దుష్టజననిగ్రహంబును
శిష్టజనానుగ్రహంబుఁ జేయఁగ నృపులన్
స్రష్ట విధించెఁ, బురాణ
ద్రష్టలు సెప్పుదురు పరమర్మము సాధ్వీ!""

టీకా:

దుష్ట = దుష్టులైన – చెడ్డవారైన; జన = ప్రజలను; నిగ్రహంబును = అదుపులోపెట్టుటయు – శిక్షించుటయు; శిష్జ = శిష్టులైన – మంచివారైన; జన = ప్రజలను; అనుగ్రహంబున్ = పాలించుటయు, రక్షించుటయు; చేయఁగన్ = చేయుటకు; నృపులన్ = రాజుని {నృపుడు - నృ (నరులను) పాలించువాడు, రాజు}; స్రష్ట = బ్రహ్మదేవుడు {స్రష్ట - సమస్తమును సృజించువాడు, బ్రహ్మదేవుడు}; విధించెన్ = నియమించెనని; పురాణ = పురాణములను; ద్రష్టలున్ = దర్శించినవారు; సెప్పుదురు = చెప్పుదురు; పరమ = అతిముఖ్యమైన; ధర్మము = ధర్మము, విధి; సాధ్వీ = సాధు శీలము కలదానా.

భావము:

సాధ్వీమణివైన పృథ్వీ! దుష్టులను శిక్షించటం కోసం శిష్టులను రక్షించటం కోసమే భగవంతుడైన బ్రహ్మదేవుడు రాజులను సృష్టించాడని శాస్త్రవేత్తలు చెబుతారు. కనుక ఇప్పుడు రాజునైన నాకు ఆర్తరక్షణం అన్నది పరమధర్మం.”

1-426-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అనిన ధర్మనందనపౌత్రునకు వృషభమూర్తి నున్న ధర్మదేవుం డిట్లనియె.

టీకా:

అనిన = అనగా; ధర్మనందనపౌత్రున = పరీక్షిత్తు {ధర్మనందనపౌత్రుడు - యమధర్మరాజు పుత్రుని మనుమడు, పరీకిన్మహారాజు}; కున్ = కి; వృషభ = ఎద్దుయొక్క; మూర్తిన్ = రూపమున; ఉన్న = ఉన్నటువంటి; ధర్మదేవుండు = ధర్మదేవత; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

ఇలా పలికిన ధర్మనందనుని మనుమడైన పరీక్షిన్నరేంద్రునితో వృషభరూపంలో ఉన్న ధర్మదేవుడు ఇలా అన్నాడు-

1-427-ఉ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

""క్రూరులఁ జంపి సాధువులకున్ విజయం బొనరించు నట్టి యా
పౌవవంశజాతుఁడవు భాగ్యసమేతుఁడ వౌదు తొల్లి మీ
వా రిటువంటివా రగుట వారిజనేత్రుఁడు మెచ్చి దౌత్యసం
చాము సేసెఁ గాదె నృపత్తమ! భక్తిలతానిబద్ధుఁడై.

టీకా:

క్రూరులన్ = క్రూరులను; చంపి = సంహరించి; సాధువుల = మంచివారి; కున్ = కి; విజయంబున్ = జయమును; ఒనరించునట్టి = కలుగ చేయునట్టి; ఆ = ఆ; పౌరవ = పురువు యొక్క; వంశ = వంశమునందు; జాతుఁడవు = జన్మించినవాడవు; భాగ్యసమేతుఁడవు = భాగ్యవంతుడవు; ఔదు = అయి ఉన్నావు; తొల్లి = పూర్వము; మీ = మీ; వారు = వాళ్లు; ఇటువంటి = ఇటువంటి; వారు = వారు; అగుటన్ = అగుట వలన; వారిజనేత్రుఁడు = కృష్ణుడు {వారిజనేత్రుఁడు - పద్మములవంటి కన్నులు కలవాడు, కృష్ణుడు}; మెచ్చి = మెచ్చుకొని; దౌత్య = దూతగా; సంచారమున్ = వ్యవహరించుట; సేసెన్ = చేసెను; కాదె = కాదా ఏమిటి; నృపసత్తమ = పరీక్షిన్మహారాజ {నృపసత్తముడు - నరులను పాలించు వారిలో శ్రేష్ఠుడు - మహారాజ, పరీక్షిత్తు}; భక్తి = భక్తి అనే; లతా = లతలచే; నిబద్ధుఁడు = చక్కగా బంధింప బడువాడు; ఐ = అయి.

భావము:

“నరనాథ శిరోమణీ! దుర్జనులను నిగ్రహించి, సజ్జనులను అనుగ్రహించే పురువంశంలో పుట్టిన ధర్మమూర్తులు కనుకనే భగవంతుడైన శ్రీకృష్ణుడు మీ వారి భక్తి శ్రద్ధలకు మెచ్చి దూతయై రాయబారాలు నడిపాడు.

1-428-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నరేంద్రా! యేము ప్రాణులకు దుఃఖహేతువులము గాము; మా వలన దుఃఖంబు నొందెడు పురుషుండు లేడు; వాది వాక్య భేదంబుల యోగీశ్వరులు మోహితులై భేదంబు నాచ్ఛాదించి, తమకు నాత్మ సుఖదుఃఖంబుల నిచ్చు ప్రభు వని చెప్పుదురు; దైవజ్ఞులు గ్రహదేవతాదులకుఁ బ్రభుత్వంబు సంపాదింతురు; మీమాంసకులు గర్మంబునకుం బ్రాభవంబుం బ్రకటింతురు; లోకాయతికులు స్వభావంబునకుఁ బ్రభుత్వంబు సంపాదింతురు; ఇందెవ్వరికిని సుఖదుఃఖ ప్రదానంబు సేయ విభుత్వంబు లేదు; పరుల వలన దుఃఖంబువచ్చిన నధర్మంబు పరులు సేసి రని విచారింప వలదు; తర్కింపను నిర్దేశింపను రాని పరమేశ్వరునివలన సర్వంబు నగుచుండు"ననిన ధర్మదేవునికి ధర్మనందనపౌత్రుం డిట్లనియె.

టీకా:

నరేంద్ర = రాజా {నరేంద్రుడు - నరులకు ఇంద్రుడు, రాజు.}; ఏము = మేము; ప్రాణులు = జీవులు; కున్ = కు; దుఃఖ = దుఃఖము కలుగుటకు; హేతువులము = కారణభూతులము; కాము = కాము; మా = మా; వలనన్ = వలన; దుఃఖంబు = బాధను; ఒందెడు = పొందెడు; పురుషుండు = మానవుడు; లేడు = లేడు; వాది = వాదించువారి; వాక్య = మాటల, వాదనలలో; భేదంబులన్ = వ్యత్యానుసారము, తేడానుబట్టి; యోగీశ్వరులు = యోగులలోశ్రేష్ఠులు; మోహితులు = మోహింపబడినవారు – భ్రమలో పడినవారు; ఐ = అయి; భేదంబున్ = భేద భావమును; ఆచ్ఛాదించి = ఆపాదించి {ఆచ్చాదించి - ఆపాదించి, లేనిది ఉన్నట్లు చెప్పు ఆరోపణ}; తమ = తమ; కున్ = కు; ఆత్మ = ఆత్నయే; సుఖదుఃఖంబులన్ = సుఖదుఃఖంబులను; ఇచ్చు = ఇచ్చెడి; ప్రభువు = అధికారి {ప్రభువు - ప్రభుత్వము కలవాడు, అధికారి, ఏలిక, సమర్థుడు, విష్ణువు}; అని = అని; చెప్పుదురు = చెప్పదురు; దైవజ్ఞులు = జ్యోతిష్కులు {దైవజ్ఞులు - దివి (గ్రహనక్షత్రములను) అధ్యయనము చేసి శుభాశుభమును చెప్పువారు, జ్యోతిష్కులు}; గ్రహదేవత = గ్రహ అధి దేవతలు; ఆదులు = మొదలగు వాని; కున్ = కి; ప్రభుత్వంబున్ = అధికారమును; సంపాదింతురు = చూపుదురు; మీమాంసకులు = మీమాంసకులు {మీమాంసకులు - పూర్వ మీమాంస యను మార్గానువర్తులు}; కర్మంబు = కర్మలు; కున్ = కే; ప్రాభవంబున్ = ప్రభావము ఉన్నదని; ప్రకటింతురు = చెప్పుదురు; లోకాయతికులు = లోకాయతికులు {లోకాయతికులు - చార్వాకులు, స్వభావమును అనుసరించి లోకములు ప్రాప్తించుననెడి వారు, లోకాయత మతస్థుఁడు.}; స్వభావంబు = స్వభావము; కున్ = నకు; ప్రభుత్వంబు = అధికారము; సంపాదింతురు = చూపుదురు; ఇందు = ఇందులో; ఎవ్వరు = ఏ ఒక్కరు; కిన్ = కిను; సుఖదుఃఖ = సుఖదుఃఖములను; ప్రదానంబున్ = ఇచ్చుటను; చేయు = చేయ; విభుత్వంబు = అధికారము; లేదు = లేదు; పరుల = ఇతరుల; వలనన్ = వలన; దుఃఖంబు = దుఃఖము; వచ్చినన్ = వచ్చినట్లయినను; అధర్మంబు = అధర్మమును; పరులు = ఇతరులు; సేసిరని = చేసిరని; విచారింపన్ = బాధపడుట; వలదు = చేయ వద్దు; తర్కింపను = ఊహించుటకును; నిర్దేశింపను = నిర్ణయించుటకును; రాని = సాధ్యముకాని; పరమేశ్వరుని = భగవంతుని; వలనన్ = వలన; సర్వంబున్ = సర్వమున, సమస్తమును; అగుచున్ = అవుతూ; ఉండును = ఉండును; అనిన = అనగా; ధర్మదేవుడు = ధర్మదేవత; కిన్ = కి; ధర్మనందనపౌత్రుండు = పరీక్షిత్తు {ధర్మనందనపౌత్రుడు - యమధర్మరాజు పుత్రుని మనుమడు, పరీకిన్మహారాజు}; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

రాజేంద్రా! మేము ఇతర ప్రాణులను బాధ పెట్టేవాళ్లం కాము. మా మూలంగా ఏ ప్రాణికీ ఎటువంటి ఆపదా కలుగదు. నానా విధాలైన వాదోపవాదాలకు సమ్మెహితులైన యోగీశ్వరులు ఆత్మయే సుఖదుఃఖాలు కల్పించే ప్రభువంటారు. దైవజ్ఞులు గ్రహాలకూ, దేవతలకూ ప్రభుత్వాన్ని ఆపాదిస్తారు; మీమాంసకులు కర్మానికే ప్రాభవం అంగీకరిస్తారు; లోకాయతికులు స్వభావానికి ప్రభుత్వం కట్టబెడతారు; కాని వారు చెప్పేవారిలో ఎవ్వరికీ సుఖదుఃఖాలను ఇచ్చే సామర్థ్యం లేదు; ఎవరి వల్లనో తమకు దుఃఖం కలిగిందనీ, ఎవరో తమకు ఎగ్గు చేశారనీ అనుకోవటం పొరపాటు. బుద్ధికీ మనస్సుకీ అతీతుడైన పరమేశ్వరుని వల్లనే సమస్తమూ జరుగుతుంది.” అని పలికే ధర్మదేవునితో ధర్మరాజు పౌత్రుడైన పరీక్షిత్తు ఇలా అన్నాడు....

1-429-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

""ర్మమూర్తివయ్య ర్మజ్ఞ! వృషరూప!
రమధర్మ మీవు లుకు త్రోవ,
పాపకర్ము చేయు పాపంబు సూచింపఁ
బాపకర్ముఁ డేఁగు థము వచ్చు.

టీకా:

ధర్మ = ధర్మమము; మూర్తివి = మూర్తీభవించిన వాడవు; అయ్య = తండ్రీ; ధర్మ = ధర్మము యొక్క; జ్ఞ = జ్ఞానము కలవాడవు; వృష = ఎద్దు యొక్క; రూప = రూపమున ఉన్నవాడా; పరమ = ఉత్తమమైన; ధర్మము = ధర్మము; ఈవు = నీవు; పలుకు = చెప్పు; త్రోవ = విధానము, విషయము; పాప = పాపమును; కర్ము = చేయువాడు, పాపి; చేయు = చేయు; పాపంబున్ = పాపమును; సూచింపన్ = తెలియజేయగా; పాప = పాప; కర్ముడు = కర్మము చేయువాడు, పాపి; ఏఁగు = వెళ్ళు; పథము = లోకము; వచ్చున్ = కలుగును.

భావము:

“వృషభ రూపంలో ఉన్న ధర్మదేవా! నీవు ధర్మమూర్తివి. ధర్మజ్ఞుడవు. నీ పలకుల తీరు పరమధర్మంగా ఉంది. పాపకర్మలు చేసేవాని పాపాన్ని ప్రకటించేవారు ఆ పాపి పోవు లోకానికే పోతారు.

1-430-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మఱియు దేవమాయవలన భూతంబుల వాఙ్మానసంబులకు వధ్యఘాతుక లక్షణం బగు వృత్తి సులభంబునం దెలియ రాదు; నీవుధర్మదేవతవు; కృతయుగంబునం దపశ్శౌచదయాసత్యంబు లనునాలుగు నీకు బాదంబు లని చెప్పుదురు; త్రేతాయుగంబునఁ బూర్వోక్త పాదచతుష్కంబు నం దొక్క పాదంబు క్షీణం బయ్యె; ద్వాపరంబునం పాద ద్వయంబు నశించెం గలియుగం బందు నివ్వడువుననిప్పుడు నీకుఁ బాదత్రయంబు భగ్నం బయ్యె నవశిష్టంబగు, భవదీయ చతుర్థ పాదంబున ధర్మంబు గల్యంతంబున నిగ్రహింప గమకించుచున్నయది విను మదియునుం గాక.

టీకా:

మఱియున్ = ఇంకను; దేవ = దేవుని; మాయ = మాయ; వలనన్ = వలన; భూతంబుల = జీవుల యొక్క; వాక్ = వాక్కునకు – బయటపడినదానికి; మానసంబుల = మనస్సుల – లోపల ఉన్నదాని; కున్ = కిని; వధ్య = వధింపబడు – దెబ్బ తిను; ఘాతుక = ఘాతముచేయు – దెబ్బ తీయు; లక్షణంబు = లక్షణము కలది; అగు = అయినట్టి; వృత్తి = ప్రవర్తన; సులభంబునన్ = సులభముగ; తెలియరాదు = తెలిసికొనుటకు సాధ్యముకాదు; నీవు = నీవు; ధర్మదేవతవు = ధర్మదేవతవు; కృతయుగంబునన్ = కృతయుగములో; తపస్ = తపస్సును; శౌచ = శౌచమును; దయ = దయయు; సత్యంబులు = సత్యమును; అను = అనే; నాలుగు = నాలుగు (4); నీకు = నీకు; పాదంబులు = కాళ్ళు; అని = అని; చెప్పుదురు = అందురు; త్రేతా = త్రేత అను; యుగంబునన్ = యుగములో; పూర్వ = ముందు; ఉక్త = చెప్పిన; పాద = కాళ్ళు; చతుష్కంబునన్ = నాలిగింటను; ఒక్క = ఒకటే (1); పాదంబు = కాలు; క్షీణంబు = నశించుట; అయ్యెన్ = జరిగెను; ద్వాపరంబునన్ = ద్వాపరములో; పాద = కాళ్ళు; ద్వయంబు = రెండు (2); నశించెన్ = నశించినవి; కలి = కలి అను; యుగంబు = యుగము; అందున్ = లోపల; ఈ = ఈ; వడువున = విధముగ; ఇప్పుడు = ఇప్పుడు; నీకున్ = నీకు; పాద = కాళ్ళు; త్రయంబు = మూడు (3); భగ్నంబు = నష్టము; అయ్యెన్ = అయ్యెను; అవశిష్టంబు = మిగిలినది; అగు = అయినట్టి; భవదీయ = నీయొక్క; చతుర్థ = నాలుగవ; పాదంబునన్ = కాలిమీద; ధర్మంబు = ధర్మము; కలి = కలికాలము యొక్క; అంతంబునన్ = అంతములో; నిగ్రహింపన్ = నిగ్రహించుకొనుటకు; గమకించుచు = ప్రయత్నించుచు; ఉన్నయది = ఉన్నది; వినుము = వినుము; అదియునున్ = అంతియే; కాక = కాకుండగ.

భావము:

వాక్కుకూ మనస్సుకూ అతీతమైన దైవమాయవల్ల జీవులకు మధ్యఘాతుక స్వరూపం సులభవేద్యం కాదు. నీవు ధర్మ దేవతవు. కృతయుగంలో నీకు తపం, శౌచం, దయ, సత్యం అనే నాలుగు పాదాలు ఉండేవని చెబుతారు. త్రేతాయుగంలో ఆ నాలుగు పాదాలలో ఒక పాదం భగ్నమయింది. ద్వాపరయుగం రాగానే రెండు పాదాలు లోపించాయి. ఇప్పుడు కలియుగంలో మూడు పాదాలు లుప్తమైపోయి సత్యంమనే ఒక్కపాదం మాత్రం మిగిలి ఉంది. ఆ పాదాన్ని కూడా కలియుగాంతంలో అధర్మం ఆక్రమించి భగ్నం చెయ్యాలని కాచుకొని ఉంది. ఇదుగో ఇటు చూడు-

1-431-మ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ముం బాపి రమావిభుండు గరుణం బాదంబులం దొక్కఁగా
స్థియై వేడుక నింతకాలము సుఖశ్రీ నొందె భూదేవి; త
చ్చణస్పర్శము లేమి శూద్రకులజుల్ శాసింతు రంచున్ నిరం
శోకంబున నీరు గన్నుల నిడెన్ ర్మజ్ఞ! వీక్షించితే.""

టీకా:

భరమున్ = భారమును; పాపి = పోగొట్టి; రమావిభుండు = లక్ష్మీపతి, కృష్ణుడు; కరుణన్ = కరుణతో; పాదంబులన్ = పాదములతో; తొక్కఁగాన్ = తొక్కుతుండగ; స్థిర = స్థిరముగ ఉన్నది – స్థిమితముగ ఉన్నది; ఐ = అయి; వేడుకన్ = వేడుకతో, వినోదముతో; ఇంత = ఇప్పటి; కాలము = వరకు; సుఖ = సుఖ; శ్రీ = సంపదను; ఒందె = పొందెను; భూదేవి = భూదేవి; తత్ = అతని; చరణ = పాదముల; స్పర్శము = స్పర్శ – తాకుట; లేమిన్ = లేకపోవుట వలన; శూద్ర = శూద్రపు; కులజుల్ = కులమున పుట్టిన వారు; శాసింతురు = ఏలెదరు; అంచున్ = అనుచు; నిరంతర = ఎడతెగని; శోకంబునన్ = బాధతో; నీరు = నీరు; కన్నులన్ = కన్నులలో; ఇడెన్ = పెట్టెను; ధర్మ = ధర్మము యొక్క; జ్ఞ = జ్ఞానము కలవాడా; వీక్షించితే = చూసితివా.

భావము:

శ్రీకృష్ణభగవానుడు అవతరించి భూభారం తీర్చాడు. శ్రీకృష్ణదేవుని శ్రీపాదస్పర్శవల్ల భూదేవి పులకించి సుస్థిరానందంతో మైమరిచి పోయింది. ఇప్పుడు భగవంతుని పాదస్పర్శకు దూరమై పాపాత్ము లైనవారు తనమీద పెత్తనం చలాయిస్తారేమో ననే భయంతో కన్నులవెంట బాష్పాలు కారుస్తున్నది. ధర్మస్వరూపా! ఈమెను వీక్షించు.”

1-432-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అని యిటు ధరణీధర్మదేవతల బుజ్జగించి, మహారథుండయిన విజయపౌత్రుండు క్రొక్కారు మెఱుంగు చక్కదనంబుఁ ధిక్కరించి దిక్కులకు వెక్కసంబయిన యడిదంబు బెడిదంబుగ జడిపించి పాపహేతు వయిన కలిని రూపుమాప నుద్యోగించిన, వాఁడు రాజరూపంబు విడనాడి, వాడిన మొగంబుతోడ, భయవిహ్వలుండై హస్తంబులు సాఁచి, తత్పాదమూల విన్యస్తమస్తకుండై, ప్రణామంబు సేసి.

టీకా:

అని = అని; ఇటు = ఇటుపక్క; ధరణీ = భూదేవి; ధర్మదేవతలన్ = ధర్మదేవతలను; బుజ్జగించి = సముదాయించి; మహారథుండు = గొప్పరథికుడు {మహారథుడు - 1) మహారథుడు- పదకొండువేలమంది (11000) విలుకాండ్రతో పోరాడెడి యోధుడు, తనను సారథిని గుఱ్ఱములను కాపాడుకొనుచు పోరాడెడి యోధుడు 2)అతిరథుడు - పెక్కువిలుకాండ్రతో పోరాడెడి యోధుడు 3)సమరథుడు - ఒకవిలుకానితో సరిగనిలిచి పోరాడెడి యోధుడు 4)అర్థరథుడు - ఒక్కవిలుకానితో పోరాడెడి యోధుడు}; అయిన = అయినట్టి; విజయపౌత్రుండు = పరీక్షితు {విజయుపౌత్రుడు - అర్జునుని మనుమడు , పరీక్షితు}; క్రొక్కారు = తొలకరి మబ్బు నందలి; మెఱుంగు = మెరుపు తీగ; చక్కదనంబున్ = చక్కదనమును; ధిక్కరించి = తిరస్కరించి; దిక్కుల = దిక్కుల; కున్ = కు; వెక్కసంబు = దుస్సహము; అయిన = అయినట్టి; అడిదంబున్ = కత్తిని; బెడిదంబుగన్ = భయంకరముగ; జడిపించి = జళిపించి {జడిపించు - జళిపించు, ఆడించు}; పాప = పాపమునకు; హేతువు = కారణము; అయిన = అయినట్టి; కలిని = కలిని; రూపుమాపన్ = సంహరించుటకు; ఉద్యోగించినన్ = సిద్ధపడగా; వాఁడు = వాడు; రాజ = రాజుల యొక్క; రూపంబున్ = రూపమును; విడనాడి = విడిచిపెట్టి; వాడిన = వాడిపోయిన; మొగంబు = ముఖము; తోడన్ = తో; భయ = భయముతో; విహ్వలుండు = విహ్వలుడు {విహ్వలుడు - భయాదులచే అవయవముల పట్టు తప్పినవాడు}; ఐ = అయి; హస్తంబులున్ = చేతులను; సాఁచి = చాచి; తత్ = అతని; పాదమూల = కాలి పాదములందు; విన్యస్త = ఉంచబడిన; మస్తకుండు = తల కలవాడు; ఐ = అయి; ప్రణామంబున్ = నమస్కారమును; చేసి = చేసి.

భావము:

ఈ విధంగా పరీక్షిన్నహారాజు ధరణినీ, ధర్మదేవుణ్ణీ ఊరడించాడు. మహారథుడూ, అర్జునుని మనుమడూ అయిన ఆ వీరాగ్రేసరుడు తొలకరి మెరుపుతీగలా తళ తళ మెరుస్తూ కళ్లకు మిరుమిట్లు గొలిపే దుస్సహమైన తన ఖడ్గాన్ని భయంకరంగా జళిపించి, పాపాత్ముడైన కలిని రూపుమాపాలని నిశ్చయించాడు. అప్పుడు తనను సంహరించటానికి ఉద్యుక్తుడైన మహారాజును చూసి, కలి రాజచిహ్నాలన్నీ విడిచి, వడలిన వదనంతో గడగడలాడుతూ భయవిహ్వలుడై ఆ రాజుపాదాల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి-I465

1-433-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

""కంపించె దేహ మెల్లం,
జంకు మో! రాజతిలక! రణాగతు ర
క్షింపు"" మని, తనకు మ్రొక్కినఁ
జంక కలిఁ జూచి నగచు నపతి పలుకున్.

టీకా:

కంపించె = వణుకు తున్నది; దేహము = శరీరము; ఎల్లన్ = అంతయు; చంపకుము = చంపవద్దు; ఓ = ఓ; రాజ = రాజులలో; తిలక = శ్రేష్ఠుడా; శరణు = శరణము వేడి; ఆగతున్ = వచ్చిన వానిని; రక్షింపుము = రక్షింపుము; అని = ని; మ్రొక్కినన్ = ప్రార్థించగా; చంపక = చంపకుండ; కలిన్ = కలిని; చూచి = చూసి; నగచు = నవ్వుతూ; జనపతి = జనులకు పతి, రాజు; పలుకున్ = పలికెను.

భావము:

“ఓ నృపాలతిలకా! భయంతో నా దేహమంతా కంపిచి పోతున్నది. నన్ను చంపవద్దు, నీ చరణాలను శరణు వేడుతున్నాను. నన్ను కరణించు” అని మ్రొక్కాడు. పరీక్షిత్తు కలిపురుషుణ్ణి చంపకుండా క్షమించి ఇలా మందలించాడు...

1-434-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

""అర్జునకీర్తిసమేతుం,
ర్జునపౌత్రుండు, భయర సావృత జనులన్
నిర్జితులఁ జంప నొల్లడు;
దుర్జనభావంబు విడిచి తొలఁగు దురాత్మా!

టీకా:

అర్జున = స్వచ్ఛమైన; కీర్తి = కీర్తి; సమేతుండు = కలిగినవాడు; అర్జున = అర్జునుని; పౌత్రుండు = మనుమడు; భయ = భయము అను; రస = రసముతో; ఆవృత = ఆవరించిన; జనులన్ = మానవులను; నిర్జితులన్ = జయములేని వారిని, ఓడినవారిని; చంపన్ = చంపుటకు; ఒల్లడు = ఒప్పుకొనడు; దుర్జన = చెడ్డవారి; భావంబున్ = భావమును; విడిచి = వదలి; తొలఁగు = దూరముగ పొమ్ము; దురాత్మా = చెడ్డ స్వభావము కలవాడా.

భావము:

“ఓయీ! అత్యంత నిర్మలయశోవిశాలుడైన అర్జునుని అనుగు మనుమడు ఓడి, ధైర్యం వీడి, దోసిలొగ్గిన వారిని వధింపడు. ఇక నీ ధూర్తస్వభావాన్ని విడిచి దూరంగా తొలగిపో దుర్మార్గుడా!

1-435-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నీవు పాపబంధుండవు, మదీయబాహుపాలితం బయిన మహీమండలంబున నిలువ వలవదు; రాజదేహంబునందు వర్తించు నిన్ను నసత్య, లోభ, చౌర్య, దౌర్జన్య, దురాచార, మాయాకలహ, కపట, కలుషాలక్ష్మ్యాది, ధర్మేతర సమూహంబు లాశ్రయించు; సత్యధర్మంబులకు నివాసం బగు బ్రహ్మావర్త దేశంబున యజ్ఞ విస్తార నిపుణు లయినవారు యజ్ఞేశ్వరుండయిన హరిం గూర్చి యాగంబు సేయుచున్నవారు, యజించు వారలకు సుఖప్రదాయనంబు సేయుచు, సకలభూతాంతర్యామి యై భగవంతుడయిన హరి జంగమ స్థావరంబులకు నంతరంగ బహిరంగముల సంచరించు వాయువు చందంబున నాత్మరూపంబున మనోరథంబుల నిచ్చుం; గావున, నీ విందుండ వలవ"దనుచు దండహస్తుం డయిన జముని కైవడి మండలాగ్రంబు సాఁచిన రాజవర్యునకుం గలి యిట్లనియె.

టీకా:

నీవు = నీవు; పాప = పాపమునకు; బంధుండవు = బంధువువి; మదీయ = నా యొక్క; బాహు = భజములచే; పాలితంబు = పాలింపబడుతున్నది; అయిన = అయినట్టి; మహీ = భూ; మండలంబునన్ = మండలములో; నిలువ = ఉండ; వలదు = వద్దు; రాజ = రాజువంటి; దేహంబు = దేహధారణ; అందున్ = అందు; వర్తించు = ఉండు; నిన్నున్ = నిన్ను; అసత్య = అసత్యము, అబద్దము; లోభ = లోభము; పిసినారి తనము; చౌర్య = చౌర్యము, దొంగతనము; దౌర్జన్య = దౌర్జన్యము, చెడ్డతనము; దురాచార = చెడు ఆచారము; మాయా = మోసముతోకూడిన; కలహ = కలహము, దెబ్బలాట; కపట = కపటము, మోసము; కలుష = కలుషము, పాపము; అలక్ష్మి = దౌర్భాగ్యము; ఆది = మొదలగు; ధర్మ = ధర్మమునకు; ఇతర = వ్యతిరేకమైన లక్షణముల; సమూహంబులు = గుంపులు; ఆశ్రయించున్ = చేరి ఉండును; సత్య = సత్యము; ధర్మంబులు = ధర్మములు; కున్ = కు; నివాసంబు = ఇల్లు; అగు = అయినట్టి; బ్రహ్మావర్త = బ్రహ్మావర్తన; దేశంబునన్ = దేశమున; యజ్ఞ = యజ్ఞమును; విస్తార = విస్తరించుటలో – బాగుగ చేయించుటలో; నిపుణులు = మంచి నేర్పు కలవారు; అయిన = అయినట్టి; వారు = వారు; యజ్ఞ = యజ్ఞమునకు; ఈశ్వరుండు = ఈశ్వరుడు, అధిపతి; అయిన = అయినట్టి; హరిన్ = హరిని; భగవంతుని; గూర్చి = గురించి; యాగంబున్ = యజ్ఞము; సేయుచు = చేయుచూ; ఉన్నవారు = ఉన్నారు; యజించు = యజ్ఞము చేయు; వారల = వారి; కున్ = కి; సుఖ = సుఖమును; ప్రదాయనంబు = ప్రసాదించుట, కలుగజేయుట; చేయుచు = చేయుచు; సకల = సమస్త; భూత = భూతముల; జీవుల; అంతర్ = లోపల; యామి = చరించువాడు; ఐ = అయి; భగవంతుడు = భగవంతుడు; అయిన = అయినట్టి; హరి = హరి; జంగమ = జంతువులు, పక్షులు {జంగమములు - కదలిక ఉన్న జీవులు, జంతువులు}; స్థావరంబుల = చెట్లు {స్థావరములు - స్థిరముగ ఒకే స్థలమున ఉండునవి, 2.చురుకుదనము లేనివి, వృక్షములు మొదలైనవి, వ్యు. స్థా - స్థా(గతి నివృతో) + వరచ్, కృ,ప్ర.}; కున్ = కును; అంతరంగ = అంతరంగముల, లోపల; బహిరంగములన్ = బహిరంగమున; బయట; సంచరించు = వర్తించు; కదులు; వాయువు = గాలి; చందంబునన్ = వలె; ఆత్మ = తన యొక్క; రూపంబునన్ = రూపమున; మనోరథంబులన్ = మనోకామ్యములను, కోరికలను; ఇచ్చును = ఇచ్చును; కావున = అందుచేత; నీవు = నీవు; ఇందు = ఇక్కడ; ఉండన్ = ఉండుటకు; వలవదు = వీలులేదు; అనుచు = అనుచు; దండ = దండము; హస్తుండు = చేత కలవాడు; అయిన = అయినట్టి; జముని = యముని; కైవడిన్ = వలె; మండలాగ్రంబున్ = ఖడ్గమును; సాఁచినన్ = చాచగా; రాజ = రాజులలో; వర్యుడు = వరించతగినవాడు, శ్రేష్ఠుడు; కున్ = కి; కలి = కలి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

పరమ పాపాత్ముడవైన నీకు నేను పాలించే ఈ భూమండలంలో స్థానం లేదు. రాజవేషధారి వైన నీలో అసత్యం, లోభం, దొంగతనం, దౌర్జన్యం, దురాచారం, మోసం, కలహం, కపటం, కలుషం, దౌర్భాగ్యం మొదలైన అధర్మ గుణాలు గూడుకట్టుకొని ఉన్నాయి. సత్యానికీ ఆలవాలమైన ఈ బ్రహ్మావర్తదేశంలో యజ్ఞవేత్తలైన పెద్దలు యజ్ఞేశ్వరుడైన శ్రీమహావిష్ణువును యజ్ఞాలతో ఆరాధిస్తూ ఉన్నారు. చరాచర ప్రపంచంలో వెలుపలా లోపలా నిండి సంచరించే వాయువులాగా సర్వాంతర్యామి అయిన ఆ స్వామి, వారికి సమస్త శుభాలూ చేకూరుస్తూ వారి కోరికలు తీరుస్తూ ఉంటాడు. అందువల్ల ఈ ప్రదేశంలో నీవు ఉండటానికి వీలులేదు.” అని కత్తిని పైకెత్తిన చక్రవర్తితో కలిపురుషుడు ఇలా పలికాడు-

1-436-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

""జదీశ్వర! నీ యడిదము
ధగితప్రభలతోడఁ ఱచుగ మెఱయన్
బెడెం జిత్తము గుండెలు
గిలెడి నిఁక నెందుఁ జొత్తు భావింపఁ గదే.

టీకా:

జగత్ = జగత్తునకు; ఈశ్వర = అధిపతీ; నీ = నీ యొక్క; అడిదము = ఖడ్గము; ధగధగిత = ధగధగలాడుతున్న; ప్రభల = కాంతుల; తోడన్ = తో; తఱచుగ = ఎక్కువగ; మెఱయున్ = మెరుయును; బెగడెన్ = భయపడిపోయెను; చిత్తము = మానసము; గుండెలు = గుండెలు; వగిలెడిన్ = పగిలి పోవు చున్నవి; ఇంకన్ = ఇంక; ఎందున్ = ఎందులో; చొత్తు = చొరబడను, దూరను; భావింపఁ గదే = ఆలోచింపుము.

భావము:

“జగత్పతీ! ధగద్ధగిత కాంతులతో మెరుస్తున్న నీ కరకు కరవాలాన్ని చూసి నా గుండెలు పగులుతున్నాయి. నా హృదయం బెదురుతున్నది. ఇప్పుడు నే నెక్కడికి పోయేది. ఎక్కడ ఉండేది నీవే ఆలోచించు.