పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : గోవృషభ సంవాదం

 •  
 •  
 •  

1-397-మ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

""నాంభఃకణజాల మేల విడువన్ నా తల్లి నీ మేను సా
మై యున్నది; మోము వాడినది; నీ న్నించు చుట్టాలకున్
దుఃఖంబులు నెందు వొందవు గదా? బంధించి శూద్రుల్ పద
త్రహీనన్ ననుఁ బట్టవత్తురనియో, తాపంబు నీ కేటికిన్.

టీకా:

నయన = కన్నులనుండి; అంభః = నీటి; కణ = కణముల; జాలము = సమూహము; ఏల = ఎందులకు; విడువన్ = విడువగా; నాతల్లి = నాతల్లి; నీ = నీయొక్క; మేను = శరీరము; స = కూడిన; ఆమయము = రోగములుకలది; ఐ = అయి; ఉన్నది = ఉన్నది; మోము = ముఖము; వాడినది = వాడిపోయినది; నీ = నిన్ను; మన్నించు = గౌరవించు; చుట్టాల = బంధువుల; కున్ = కును; భయ = భయములును; దుఃఖంబులున్ = దుఃఖములును; ఎందు = ఎక్కడను; ఒందవున్ = పొందకుండును; కదా = కదా; బంధించి = బంధించి; శూద్రుల్ = శూద్రులు; పద = పాదములు; త్రయ = మూడు; హీనన్ = నష్టపోయిన; ననున్ = నన్ను; పట్టన్ = పట్టుటకు; వత్తురు = వచ్చెదరు; అనియో = అనియా ఏమి; తాపంబు = వేదన; నీకు = నీకు; ఏటి = ఎందుల; కిన్ = కు.

భావము:

""తల్లీ! నీ కన్నుల నుంచి బాష్పధారలు ప్రవహిస్తున్నాయి యేమిటి? నీ దేహం వ్యాధిగ్రస్తమై ఉన్నదేమిటి? నీ వదనమంతా అలా వాడిపోయిందే మిటి? నీ ప్రియ బంధువులకు భయదుఃఖాలు ప్రాప్తించలేదు కదా? శూద్రులు ఒంటికాలితో కుంటుతూ ఉన్న నన్ను పట్టి బంధిస్తారేమోనని దిగులు పడుతున్నావా? పిచ్చి తల్లీ! ఎందుకిలా ఉన్నావు?

1-398-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఖములు లేమి నర్త్యుల కిటమీఁద-
ఖభాగములు లేక మాను ననియొ?
మణులు రమణుల క్షింప రనియొ? పు-
త్త్రులఁ దల్లిదండ్రులు ప్రోవరనియొ?
భారతి గుజనులఁ బ్రాపించుననియొ? స-
ద్విప్రులు నృపుల సేవింతు రనియొ?
కులిశహస్తుఁడు వాన గురియింపకుండఁగఁ-
బ్రజలు దుఃఖంబులఁ డుదురనియొ?

1-398.1-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

హీనవంశ జాతు లేలెదరనియొ? రా
జ్యములు పాడిగలిగి రుగవనియొ?
నుజు లన్న, పాన, మైథున, శయ, నాస
నాది కర్మసక్తు గుదు రనియొ?

టీకా:

మఖములు = యజ్ఞములు; లేమిన్ = లేకపోవుట వలన; అమర్త్యుల = దేవతల; కిన్ = కి; ఇట = ఇక; మీఁదన్ = పైన; మఖభాగములు = హవిర్భాగములు; లేక = లేక; మానున్ = పోవుననియు; అనియొ = అనియేమో; రమణులు = భర్తలు; రమణులన్ = భార్యలను; రక్షింపరు = కాపాడరు; అనియొ = అనియేమో; పుత్రులన్ = కొడుకులను; తల్లిదండ్రులు = తల్లిదండ్రులు; ప్రోవరు = పోషింపరు; అనియొ = అనియేమో; భారతి = సరస్వతి; కుజనులన్ = చెడ్డవారిని; ప్రాపించున్ = పొందును; అనియొ = అనియేమో; సత్ = మంచి; విప్రులు = బ్రాహ్మణులు; నృపులన్ = రాజులని {నృపులు - నరులను పాలించువారు, రాజులు}; సేవింతురు = కొలచెదరు; అనియొ = అనియేమో; కులిశహస్తుఁడు = ఇంద్రుడు {కులిశము హస్తమున కలవాడు - ఇంద్రుడు}; వానన్ = వర్షమును; కురియింపక = కురియింపక; ఉండఁగన్ = ఉండటవలన – పోవుటవలన; ప్రజలు = జనులు; దుఃఖంబులన్ = బాధలను; పడుదురు = పొందుదురు; అనియొ = అనియేమో;
హీన = తక్కువ; వంశ = వంశమందు; జాతులు = పుట్టినవారు; ఏలెదరు = పాలించెదరు; అనియొ = అనియేమో; రాజ్యములు = రాజ్యములు; పాడి = నీతి నియములు; కలిగి = కలిగి, సరిగ; జరుగవు = నడువవు; అనియొ = అనియేమో; మనుజులు = మానవులు; అన్న = భుజించుట; పాన = పానము చేయుట; మైథున = మైథునము; శయన = శయనించుట; ఆసన = ఆసీనులగుట; ఆది = మొదలగు; కర్మ = కర్మలందు; సక్తులు = ఆసక్తి కలవారు; అగుదురు = అవుతారు; అనియొ = అనియేమో.

భావము:

యజ్ఞాలు లేనందువల్ల ఇకముందు దేవతలకు హవిర్భాగాలు లభించవనీ; భర్తలు భార్యలను రక్షింపరనీ; పిల్లలు తల్లిదండ్రులను పోషించరనీ బాధపడుతున్నావా? సరస్వతి దుర్జనులను ఆశ్రయిస్తుందనీ; ఉత్తమ విప్రులు రాజులకు సేవ చేస్తారనీ; ఇంద్రుడు వర్షం కురిపించక ప్రజలు కష్టాల పాలవుతారనీ ఖేదపడుతున్నావా? హీన వంశ సంజాతులు రాజ్యాలు ఏలుతారనీ; దేశంలో న్యాయం నశించి పోతుందనీ; మానవులు ఆహార నిద్రా మైథునాది కర్మలయందు ఆసక్తు లౌతారనీ విచారిస్తున్నావా? ఎందుకు నీ కీ ఆవేదన?

1-399-మ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నీ! నీ భరమెల్ల డించుటకునై క్రాయుధుం డిన్ని హా
ముల్ దాను నరాకృతిన్ మెలఁగి నిత్యానందముం జేసి పో
యి నే నింక ననాథ నైతిఁ గుజనుం డెవ్వాఁడు శాసించునో?
పెను దుఃఖంబులఁ నేమి పొందు ననియో? భీతిల్లి చింతించుటల్.

టీకా:

జననీ = తల్లీ; నీ = నీ యొక్క; భరము = భారము; ఎల్లన్ = అంతటను; డించుట = దింపుట; కున్ = కోసము; ఐ = అయి; చక్రాయుధుండు = కృష్ణుడు; ఇన్ని = ఇన్ని; హాయనముల్ = సంవత్సరములు; తాను = తాను; నర = నరుని; ఆకృతిన్ = రూపమున; మెలఁగి = వర్తించగ; నిత్య = నిత్యమైన; ఆనందమున్ = సంతోషమును; చేసి = కలుగజేసి; పోయినన్ = పోవుటవలన; నేను = నేను; ఇంకన్ = ఇకపై; అనాథన్ = దిక్కులేని దానను; ఐతిన్ = అయితినని; కుజనుండు = చెడ్డమనిషి; ఎవ్వాఁడు = ఎవడు; శాసించునో = శాసించునో; పెను = పెద్ద; దుఃఖంబులన్ = బాధలు; ఏమి = ఏమి; పొందును = కలుగును; అనియో = అనియేమో; భీతిల్లి = భయపడి; చింతించుటల్ = వగచుటలు.

భావము:

భూభారాన్ని తగ్గించటం కోసం చక్రధరుడైన శ్రీహరి ఇన్ని సంవత్సరాలు మానవాకారం ధరించి, చరించి, ఆనందం చేకూర్చి అవతారం చాలించాడే. ఇక నేను దిక్కులేనిదాన నైనాను. ఏ దుర్మార్గుడు ఇక ముందు నన్ను పాలిస్తాడో, ఎటువంటి దుఃఖాలు ప్రాప్తిస్తాయో అని దిగులుపడి ఆక్రోశిస్తున్నావా? తల్లీ!

1-400-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

దెప్పర మగు కాలముచే
నెప్పుడు దేవతల కెల్ల నిష్టం బగు నీ
యొప్పిదము కృష్ణుఁ డరిగినఁ
ప్పెఁ గదా! తల్లి! నీవు ల్లడపడఁగన్.""

టీకా:

దెప్పరము = ఆపదలు కలిగించునది; అగు = అయినట్టి; కాలము = కాలము; చేన్ = వలన; ఎప్పుడున్ = ఎప్పుడును; దేవతలు = దేవతలు; కున్ = కు; ఎల్ల = అందరకు; ఇష్టంబు = ఇష్టము; అగు = అయినట్టి; నీ = నీ యొక్క; ఒప్పిదము = చక్కదనము; కృష్ణుఁడు = కృష్ణుఁడు; అరిగినన్ = వెళ్ళిన తరువాత; తప్పెన్ = తప్పెను; కదా = కదా; తల్లి = తల్లీ; నీవు = నీవు; తల్లడ = తల్లడిల్లు; పడఁగన్ = పడునట్లు.

భావము:

అనర్థాలకు ఆలవాలమైన కాలంలో కృష్ణుడు ఉన్నంత వరకూ దేవతలకు కూడా సంస్తవనీయమైనది నీ సౌభాగ్యం. ఇప్పుడు కృష్ణుడు వెళ్లిపోగానే అదృష్టం మారిపోయింది. అనర్థం వాటిల్లింది కదా తల్లీ!""

1-401-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అనిన భూదేవి యిట్లనియె.

టీకా:

అనిన = అని పలుకగా; భూదేవి = భూదేవి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

అనిన భూదేవి యిట్లనియె.

1-402-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

""ఈ లోకంబునఁ బూర్వము
నాలుగు పాదముల నీవు డతుఁవు నేఁ డా
శ్రీలనేశుఁడు లేమినిఁ
గాముచే నీకు నొంటి కాలయ్యెఁ గదే! ""

టీకా:

ఈ = ఈ; లోకమునన్ = లోకములో; పూర్వము = ఇదివరకు; నాలుగు = నాలుగు; పాదములన్ = పాదములతో; నీవు = నీవు; నడతుఁవు = నడుచుచుండెదవు; నేఁడు = ఇప్పుడు; ఆ = ఆ; శ్రీలలనేశుఁడు = కృష్ణుడు {శ్రీలలనేశుడు - శ్రీకరమైన స్త్రీ రుక్మిణికి భర్త, కృష్ణుడు}; లేమినిన్ = లేకపోవుటచేత; కాలము = కానికాలము; కాలప్రభావము; చేన్ = చే; నీకున్ = నీకు; ఒంటి = ఒకటే; కాలు = కాలు; అయ్యెన్ = ఆయిపోయింది; కదే = కదా ఏమి.

భావము:

""ధర్మదేవతా! స్వరూపుడవైన నీవు పూర్వం ఈ లోకంలో నాలుగు పాదాలతో నడుస్తూ ఉండేవాడివి. ఈ నాడు ఇందిరావల్లభుడైన గోవిందుడు లేనందువల్లనే కదా కాలప్రభావానికి లోబడి ఒంటి కాలితో నడుస్తున్నావు.

1-403-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మఱియు సత్య, శౌచ, దయా, క్షాంతులునుఁ, ద్యాగ, సంతోషార్జవంబులును, శమ, దమ, తపంబులును, సమత్వంబును, పరాపరాధ సహనంబును, లాభంబు గల యెడ నుదాశీనుండై యుండుటయును, శాస్త్రవిచారంబును, జ్ఞాన, విరక్తులును, నైశ్వర్య, శౌర్య, ప్రభా, దక్షత్వంబులును, స్మృతియును, స్వాతంత్ర్యంబునుఁ, గౌశల, కాంతి, ధైర్య, మార్దవ, ప్రతిభాతిశయ, ప్రశ్రయ, శీలంబులును, జ్ఞానేంద్రియ కర్మేంద్రియ,మనోబలంబులును, సౌభాగ్య, గాంభీర్య, స్థైర్యంబులును, శ్రద్దా, కీర్తి,,మానగర్వాభావంబులును, ననియెడి ముప్పదితొమ్మిది గుణంబులు నవియునుం గాక బ్రహ్మణ్యతా, శరణ్యతాది, మహాగుణ సమూహంబును శ్రీకృష్ణదేవుని యందు వర్తిల్లుం గావున.

టీకా:

మఱియున్ = ఇంకను; సత్య = సత్యము, నిజము; శౌచ = శౌచము, పరిశుభ్రత; దయ = దయ, జాలి; క్షాంతులును = క్షాంతులును, ఓర్పు; త్యాగ = త్యాగము, ఈవి; సంతోష = సంతోషము, అనందము; ఆర్జవంబులును = ఆర్జవములును; సూటియైన ప్రవర్తన; శమ = శమము, శాంతి; దమ = దమము – ఇంద్రియ నిగ్రహము; తపంబులును = తపములును, తపస్సు; సమత్వంబును = సమత్వమును {సమత్వము - కష్ట సుఖములెడ సమభావము}; పర = ఇతరుల; అపరాధ = తప్పుల ఎడ; సహనంబును = ఓర్పు; లాభంబు = లాభము; కల = ఉన్న; ఎడ = ఎడ; ఉదాశీనుండు = ఉదాశీనముగ ఉండు వాడు; ఐ = అయి; ఉండుటయును = ఉండుటయును; శాస్త్ర = శాస్త్రములను; విచారంబును = అభ్యసించుట, అధ్యయనము; జ్ఞాన = జ్ఞానము; విరక్తులును = విరక్తులును, వైరాగ్యము; ఐశ్వర్య = ఐశ్వర్యము; సంపద; శౌర్య = శౌర్యము; ప్రభ = ప్రభ; మెరుపు; దక్షత్వంబులును = దక్షత్వములును, సమర్థత; స్మృతియును = స్మృతియును, జ్ఞాపకము; స్వాతంత్ర్యంబును = స్వతంత్రతయును; స్వచ్ఛందముగ కార్య నిర్వహణ; కౌశల = కౌశల్యము; కుశలత; నేర్పరితనము; కాంతి = కాంతి; ఒప్పిదము; ధైర్య = ధైర్యము; సాహసము; మార్దవ = మార్దవము; మృదుత్వము; ప్రతిభ = ప్రతిభ; అప్పటికప్పుడు వికసించెడు బుద్ధి; అతిశయ = అతిశయము; అధిక్యత; ప్రశ్రయ = ప్రశ్రయము; అనునయము; శీలంబులును = శీలములును; మంచి నడవడిక; జ్ఞాన = జ్ఞానమును ఇచ్చు {జ్ఞానేంద్రియములు - 1త్వక్ 2చక్షుస్ 3శోత్ర 4జిహ్వ 5ఘ్రాణములు, పాఠ్యంతరము 1చెవులు 2కళ్ళు 3నాలుక 4చర్మము 5ముక్కు}; ఇంద్రియ = ఇంద్రియముల; కర్మ = కర్మమునకైన {కర్మేంద్రియములు - 1నోరు 2చేతులు 3కాళ్ళు 4గుదము 5ఉపస్థు, పాఠ్యంతరము 1వాక్, 2పాణి, 3పాద, 4పాయు, 5ఉపస్థులు}; ఇంద్రియ = ఇంద్రియముల; మనస్ = మనస్సు యొక్క; బలంబులును = బలములును; సౌభాగ్య = సౌభాగ్యము; అదృష్టము కలసివచ్చుట; గాంభీర్య = గాంభీర్యము; లోతైన స్వభావము; స్థైర్యంబులును = స్థైర్యము; స్థిరత్వము; శ్రద్ద = శ్రద్ధ; చేయుపని యందు లగ్నమగుట; కీర్తి = కీర్తి; యశము; మాన = మానము; చిత్తౌన్నత్యము; అభిమానము; గర్వ = గర్వము; అభావంబులును = లేకపోవుటలును, అణుకువ; అనియెడి = అనెడి; ముప్పది తొమ్మిది = ముప్పైతొమ్మిది; గుణంబులు = గుణములు; అవియునుంగాక = అవేకాక; బ్రహ్మణ్యత = బ్రహ్మణ్యత {బ్రహ్మణ్యత - బ్రహ్మ(వేదము)లను అనుసరించి జీవించుట, బ్రాహ్మణుల యెడ హితవు }; శరణ్యత = శరణ్యత {శరణ్యత - శరణుజొచ్చుటకు తగి ఉండుట}; ఆది = మొదలగు; మహా = గొప్ప; గుణ = గుణముల; సమూహంబును = సముదాయమును; శ్రీకృష్ణదేవుని = శ్రీకృష్ణుని; అందున్ = ఎడల; వర్తిల్లున్ = ప్రవర్తిల్లును; కావునన్ = అందుచేత.

భావము:

సత్యం, శౌచం, దయ, క్షమ, త్యాగం, సంతోషం, ఆర్జవం, శమం, దమం, తపస్సు, సమభావం, తితిక్ష, ఉపరతి, శ్రుతం, జ్ఞానం, వైరాగ్యం, ఐశ్వర్యం, శౌర్యం, తేజస్సు, సామర్థ్యం, స్మృతి, స్వాతంత్య్రం, కౌశలం, కాంతి, ధైర్యం, మార్దవం, ప్రతిభ, వినయం, శీలం, జ్ఞానేంద్రియ పటుత్వం, కర్మేంద్రియ పటుత్వం, మనోబలం, సౌభాగ్యం, గాంభీర్యం, స్థైర్యం, శ్రద్ధ, కీర్తి, గౌరవం, నిరహంకారం అనే ముప్పై తొమ్మిది సుగుణాలే కాకుండా వేదవిజ్ఞానం, శరణాగత పరిత్రాణం మొదలైన అనంత గుణగణాలు ఆ శ్రీ కృష్ణపరమాత్మ యందు అలరారుతుంటాయి.

1-404-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నాతీతము లగు స
ద్గుములు గల చక్రి సనిన ఘోరకలిప్రే
మునఁ బాప సమూహ
వ్ర యుతు లగు జనులఁ జూచి గచెదఁ దండ్రీ!

టీకా:

గణన = లెక్కించుటకు, ఎంచుటకు; అతీతములు = మిక్కిలినవి, వీలుకానివి; అగు = అయినట్టి; సత్ = మంచి; గుణములు = లక్షణములు; కల = కలిగిన; చక్రి = కృష్ణుడు {చక్రి - చక్రాయుధము ధరించువాడు, విష్ణువు, కృష్ణుడు}; చనినన్ = చనిన తరువాత; ఘోర = భయంకరమైన; కలి = కలిచేత; ప్రేరణమునన్ = ప్రేరేపించుట వలన, ఉసిగొల్పుట వలన; పాప = పాపముల; సమూహ = సమూహములు అను; వ్రణ = కురుపులు, పుండ్లు; యుతులు = కలిగినవారు; అగు = అయినట్టి; జనులన్ = ప్రజలను; చూచి = చూసి; వగచెదన్ = చింతించెదను; తండ్రీ = తండ్రీ.

భావము:

ఓ తండ్రీ! ఈ విధంగా లెక్కించటానికి శక్యంకాని సద్గుణాల రాశి చక్రధరుడు అవతారం చాలించగానే, కలుషాత్ముడైన కలిపురుషునిచే ఉసిగొల్పబడిన భయంకర పాపకృత్యాలు అనే పుండ్లతో కూడిన ప్రజాసమూహాన్ని చూడగానే నాకు దుఃఖం పొంగి వస్తున్నది.

1-405-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

దేతలకు, ఋషులకుఁ, బితృ
దేతలకు, నాకు, నీకు, ధీరులకును, నా
నార్ణాశ్రమములకును
గోవులకును బాధ యనుచుఁ గుందెద ననఘా!

టీకా:

దేవతలు = దేవతలు; కున్ = కు; ఋషులు = ఋషులు; కున్ = కును; పితృదేవతలు = వంశపురుషులు; కున్ = కు; నాకు = నాకు; ధీరులు = ధైర్యము కలవారల; కున్ = కును; నానా = అన్ని; వర్ణ = వర్ణములకు {చాతుర్వర్ణములు - 1బ్రాహ్మణ 2క్షత్రియ 3వైశ్య 4శూద్ర వర్ణములు}; ఆశ్రమముల = ఆశ్రమముల {చాతురాశ్రమములు - బ్రహ్మచర్య, గృహస్త, వానప్రస్త, సన్యాస.}; కును = కును; గోవుల = ఆవుల; కును = కును; బాధ = బాధ; అనుచున్ = అనుచు; కుందెదన్ = దుఃఖపడెదను; అనఘా = పాపములేనివాడా.

భావము:

ఓ పుణ్యపూర్తీ దేవతలకూ, పితృదేవతలకూ, ఋషులకూ, నాకూ, నీకూ, నానావిధాలైన వర్ణాశ్రమాలకూ, గోవులకూ, మహానుభావులకూ బాధలు ప్రాప్తిస్తున్నందుకు బాధపడుతున్నాను.

1-406-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

బ్రహ్మాదు లెవ్వని ద్రకటాక్ష వీ-
క్షణము వాంఛింతురు త్తపములఁ?
మలాలయము మాని మల యెవ్వని పాద-
మలంబు సేవించుఁ గౌతుకమునఁ?
రమ యోగీంద్రులు వ్యచిత్తములందు-
నిలుపుదు రెవ్వని నియతితోడ?
వేదంబులెవ్వని విమలచారిత్రముల్-
వినుతింపఁగా లేక వెగడువడియె?

1-406.1-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ట్టి వాసుదేవు బ్జ, వజ్రాంకుశ,
క్ర, మీన, శంఖ, చాప, కేతు
చిహ్నితంబులైన శ్రీచరణము లింక
సోఁక వనుచు వగపు సోఁకెనయ్య!

టీకా:

బ్రహ్మ = బ్రహ్మ; ఆదులు = మొదలగువారు; ఎవ్వని = ఎవనియొక్క; భద్ర = క్షేమకరమైన; కటాక్ష = దయతోకూడిన, కడ+అక్ష,కడకంటి; వీక్షణమున్ = చూపు; వాంఛింతురు = కోరుదురు; సత్ = మంచి; తపములన్ = తపస్సులతో; కమలాలయము = సరస్సునందు {కమలాలయము - కమలములకు స్థానము, సరస్సు}; మాని = ఉండుటమాని, వదలి; కమల = లక్ష్మి; ఎవ్వని = ఎవనియొక్క; పాద = పాదములు అను; కమలంబున్ = కమలమును; సేవించున్ = పూజించును; కౌతుకమునన్ = కుతూహలముతో; పరమ = గొప్ప; యోగ = యోగులలో; ఇంద్రులు = ఇంద్రులు; భవ్య = శుభమైన; చిత్తములు = మనస్సు; అందున్ = అందు; నిలుపుదురు = స్థిర పరచుకొందురు; ఎవ్వని = ఎవని; నియతి = నియములు; తోడన్ = తో; వేదంబులు = వేదములు; ఎవ్వని = ఎవని; విమల = నిర్మలమైన; చారిత్రముల్ = వృత్తాంతములు; వినుతింపఁగాన్ = కీర్తించ; లేక = లేక; వెగడు = తల్లడిల్లు, తడబాటు; పడియెన్ = పడినవి;
అట్టి = అటువంటి; వాసుదేవు = కృష్ణుని; అబ్జ = పద్మము వంటి; వజ్ర = వజ్రము వంటి; అంకుశ = అంకుశము వంటి; చక్ర = చక్రము వంటి; మీన = చేప వంటి; శంఖ = శంఖము వంటి; చాప = విల్లు వంటి; కేతు = జండా వంటి; చిహ్నితంబులు = గుర్తులు ఉన్నట్టివి; ఐన = అయినట్టి; శ్రీ = పవిత్రమైన; చరణములు = పాదములు; ఇంకన్ = ఇక మీదట; సోఁకవు = తగలవు; అనుచున్ = అనుకొనుచు; వగపు = విచారము; సోఁకెన్ = పుట్టెను; అయ్య = నాయనా.

భావము:

బ్రహ్మాది దేవతలంతా ఎంతో కాలం తపస్సులు చేసి చేసి ఏ దేవుని కల్యాణ కరుణా కటాక్షవీక్షణాలను కాంక్షిస్తారో, పద్మాలయ అయిన లక్ష్మీదేవి తన నివాసమైన పద్మాన్ని సైతం విడిచి, అత్యంత కుతూహలంతో ఏ దేవుని పాదపద్మాలను ఆరాధిస్తున్నదో, పరమ నిష్ఠాగరిష్ఠులైన మునిశ్రేష్ఠులు తమ పవిత్ర హృదయ ఫలకాలపై ఏ దేవుని పావన స్వరూపాన్ని నియమపూర్వకంగా నిలుపు కొంటున్నారో, సమస్త వేదాలూ ఏ దేవుని దివ్య చరిత్రలు సరిగా వర్ణించలేక తడబాటు పడుతున్నాయో, అటువంటి దేవాదిదేవుడైన వాసుదేవుని పద్మ, వజ్ర, అంకుశ, శంఖ, చక్ర, చాప, మీన, ధ్వజ రేఖలతో అలంకృతాలైన శ్రీచరణాలు ఇక మీద, నా మీద సోకవు గదా అని శోకిస్తున్నాను. తండ్రీ!

1-407-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

రిపాదంబులు సోఁకెడి
సిరికతమున నఖిల భువన సేవ్యత్వముతో
స్థి నైతి నిన్ని దినములు
రి నా గర్వంబు మాన్చి రిగె మహాత్మా!

టీకా:

హరి = హరి యొక్క; పాదంబులున్ = పాదములు; సోఁకెడి = తగలేటటువంటి; సిరి = భాగ్యము; కతమునన్ = వలన; అఖిల = సమస్త; భువన = భువనముల; సేవ్యత్వము = సేవింపబడుట; తోన్ = తో; స్థిరను = స్థిరముగ, కుదురుకొని ఉన్నదానను; ఐతిన్ = అయితిని; ఇన్ని = ఇన్ని; దినములు = రోజులు; హరి = హరి; నా = నా; గర్వంబున్ = మదమును; మాన్చి = పోగొట్టి; అరిగెన్ = చనెను; మహాత్మా = గొప్ప ఆత్మ కలవాడా.

భావము:

మహాత్మా! భగవంతుని పాదపద్మాలు నాపై సోకే మహాభాగ్యం నాకు లభించటం మూలాన అఖిలలోకాలకు ఆరాధ్యురాలనై ఇన్నాళ్ళూ కుదురుకొని యున్నాను. ప్రభువు నా అభిమానాన్ని అంతం చేసి ఇప్పుడు అంతర్థానం చెందాడు.

1-408-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

లీలాకారము దాల్చెను
శ్రీలనేశుండు ఖలుల శిక్షించి భవో
న్మూనము సేయుకొఱకును
నాలుగు పాదముల నిన్ను డిపించుటకున్

టీకా:

లీలాకారమున్ = లీలాకారము {లీలాకారము - క్రీడకై ధరించిన రూపమును}; నిజము కాని రూపమును}; తాల్చెను = ధరించెను; శ్రీలలనేశుండు = కృష్ణుడు {శ్రీలలనేశుడు - శ్రీకరమైన స్త్రీ రుక్మిణికి భర్త, కృష్ణుడు}; ఖలులన్ = దుష్టులను; శిక్షించి = శిక్షించి; భవ = సంసార బంధనములు; ఉన్మూలనమున్ = తొలగించుట; చేయు = చేయుట; కొఱకును = కోసము; నాలుగు = నాలుగు (4); పాదములన్ = కాళ్ళతో; నిన్ను = నిన్ను; నడిపించుట = నడపించుట; కున్ = కు.

భావము:

శ్రీమన్నారాయణుడు దుష్ట శిక్షణ కోసం, సంసార బంధాలను తొలగించుట కోసం, ధర్మస్వరూపుడవైన నిన్ను నాలుగు పాదాలతో నడిపించటం కోసం లీలామానుష దేహాన్ని ధరించాడు.

1-409-ఉ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ధురోక్తు లా నయము లా దరహాసము లా దయారసం
బా మురిపంబు లా తగవు లా గమనక్రియ లా మనోహర
ప్రేకరావలోకనము ప్రీతిఁ గనుంగొనలేమి మాధవుం
గామినులేల? నిర్దళితర్ములు యోగులుఁ బాయనేర్తురే?

టీకా:

ఆ = ఆ; మధుర = తీయని; ఉక్తులున్ = మాటలు; ఆ = ఆ; నయములున్ = లాలనలు; ఆ = ఆ; దరహాసములున్ = చిరునవ్వులు; ఆ = ఆ; దయ = దయతో కూడిన; రసంబున్ = రసము, రసభావము; ఆ = ఆ; మురిపంబులున్ = మురిపించుటలు, కులుకులు; ఆ = ఆ; తగవులున్ = చిలిపి తగవులు; ఆ = ఆ; గమన = నడచే; క్రియలున్ = విధానములు; ఆ = ఆ; మనస్ = మనసును; హర = చూరగొను; ప్రేమ = ప్రేమ; కర = పుట్టించునట్టి; అవలోకనము = చూపు; ప్రీతిన్ = ఇష్టముతో; కనుంగొన = చూచుకొనుటలు; లేమిన్ = లేకపొవుటను; మాధవున్ = కృష్ణుని; కామినులు = స్త్రీలు {కామిని - ప్రియ సంగము నందు మిక్కిలి ఆశ కలామె, స్త్రీ.}; ఏల = ఏమి; నిర్దళిత = తెంచుకొన్న; కర్ములు = కర్మములు కలవారు; యోగులున్ = యోగలైన; పాయన్ = సహించుటను; నేర్తురే = ఓపకలరా.

భావము:

మాధవుని లీలలు మరిచిపోలేము. ఆ తీయ తీయని మాటలు, ఆ నయగారాలు, ఆ చిరునవ్వులు, ఆ కనికరాలు, ఆ ముద్దు మురిపాలు, ఆ ప్రణయకలహాలు, ఆ సుందరమందయానాలు, మనస్సులను హరించే ఆ మధుర కటాక్షవీక్షణాలు దూరమై పోతాయే అనే విచారంతో అంగనలే కాదు సర్వసంగ పరిత్యాగులైన యోగులు కూడా ఆ దయామయుని వియోగాన్ని సహించలేరు.

1-410-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మెల్లన నాపై యాదవ
ల్లభుఁ డడుగిడఁగ మోహశనై నేరం
జిల్లగ రోమాంచము క్రియ
మొల్లములై మొలచు సస్యములు మార్గములన్.""

టీకా:

మెల్లన = మెల్లగా; నా = నా; పై = పైన; యాదవవల్లభుఁడు = కృష్ణుడు {యాదవవల్లభుఁడు - యాదవులకు ప్రియమైనవాడు, కృష్ణుడు}; అడుగు = అడుగు; ఇడఁగన్ = పెట్టగా; మోహ = మోహమునకు; వశను = లొంగినదానను; ఐ = అయి; నేన్ = నేను; రంజిల్లగ = అనురాగ ముప్పతిల్లగా; రోమాంచము = గగుర్పాటు; క్రియన్ = వలె; మొల్లములు = అధికములు; ఐ = అయి; మొలచు = అంకురించు; సస్యములు = ధాన్యపుగింజలు; మార్గములన్ = దారులమ్మట.

భావము:

ఆ గోపికా వల్లభుండు నా పైన మెల్ల మెల్లగా అడుగుల పెడుతూ నడుస్తుంచే ఆనంద పారవశ్యంలో నా ఒళ్లు గగుర్పొడిచేది. నా దేహం నిండా మొలిచిన ఆ పులకాంకురాలే దట్టమైన సస్యాంకురాలై అడుగడుగునా పొడచూపేవి.""

1-411-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అని యిట్లు పూర్వవాహినియైన సరస్వతీతీరంబున ధర్మదేవుండును, భూమియు; వృషభ, ధేనురూపంబుల భాషింప రాజర్షి యైన పరీక్షిద్భూవరుండు డగ్గఱియె; నా సమయంబున.

టీకా:

అని = అని; ఇట్లు = ఈ విధముగ; పూర్వ = పూర్వము; తూర్పు దిక్కునకు; వాహిని = ప్రవహించునది; ఐన = అయినట్టి; సరస్వతీ = సరస్వతీ నదీ; తీరంబున = గట్టున; ధర్మదేవుండును = ధర్మదేవతయును; భూమియు = భూదేవియును; వృష = ఆవు; ధేను = ఎద్దు; రూపంబులన్ = రూపములతో; భాషింపన్ = మాట్లాడగ; రాజర్షి = రాజర్షి {రాజర్షి - వైదిక సంప్రదాయ అనువర్తి యైన రాజు}; ఐన = అయినట్టి; పరీక్షిత = పరీక్షిత్తు; భూవరుండు = మహారాజు {భూవరుడు - భూమికిభర్త, రాజు}; డగ్గఱియెన్ = దగ్గరయ్యెను; ఆ = ఆ; సమయంబునన్ = సమయమునకు.

భావము:

ఈ విధంగా వృషభ ధేను రూపాలతో ధర్మదేవుడూ, భూదేవి ఇద్దరూ తూర్పుగా ప్రవహించే సరస్వతీ నది ఒడ్డును సంభాషించు కొంటున్న సమయంలో రాజర్షి అయిన పరీక్షిన్మహీపాలుడు అచ్చటికి వచ్చాడు. అప్పుడు-

1-412-శా.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

కైలాసాచలసన్నిభంబగు మహాగంభీరగోరాజముం
గాక్రోధుఁడు, దండహస్తుఁడు, నృపాకారుండు, క్రూరుండు, జం
ఘాలుం డొక్కఁడు, శూద్రుఁ డాసురగతిం గారుణ్యనిర్ముక్తుఁడై
నేలం గూలఁగఁ దన్నెఁ బంచితిలఁగా నిర్ఘాతపాదాహతిన్.

టీకా:

కైలాస = కైలాస; అచల = పర్వతమునకు; సన్నిభంబు = సమానము; అగు = అయి నట్టి; మహా = చాలా; గంభీర = గంభీర మైన; గో = ఎద్దులలో; రాజమున్ = శ్రేష్ఠ మైన దానిని; కాల = యముని వలె మిక్కిలి; క్రోధుఁడు = కోపిష్టి; దండ = దుడ్డుకఱ్ఱను; హస్తుఁడు = చేత పట్టుకున్న వాడు; నృప = రాజు యొక్క; ఆకారుండు = ఆకారమున ఉన్న వాడు; క్రూరుండు = క్రూరుడు; జంఘాలుండు = వడిగ నడచు వాడు {జంఘాలుడు - పిక్క గట్టి కల వాడు, మిక్కిలి వేగంగా నడచువాడు.}; ఒక్కఁడు = ఒకడు; శూద్రుఁడు = శూద్రుడు; ఆసుర = అసురుని; గతిన్ = వలె; కారుణ్య = దయను; నిర్ముక్తుఁడు = విడిచిన వాడు; ఐ = అయి; నేలన్ = నేలమీద; కూలంగన్ = కూలిపోవు నట్లు; తన్నెన్ = తన్నెను; పంచితిలఁగాన్ = మూత్రము పోసుకునేలాగ {పంచితిలు(క్రియ) - గోవు మూత్రము విడుచు}; నిర్ఘాత = పిడుగుపాటు వంటి; పాద = కాలి; హతిన్ = తన్నుతో.

భావము:

కదలి వచ్చిన కైలాస పర్వతంలా తెల్లగా గంభీరంగా అంతెత్తు ఉన్న ఉత్తమ మైన ఆ మహా వృషభాన్ని క్రోధోన్మత్తుడు, కఠోరచిత్తుడు, రాజవేషధారి, దుడ్డుకఱ్ఱ పట్టుకొన్న వాడు, బలమైన పిక్కలు కల వాడు అయిన ఒక శూద్రుడు కటిక రాక్షసుడిలా కనికరం అన్నది లేకుండా కాలితో బలంగా తన్నాడు. అంతటి వృషభ రాజం మూత్రం విసర్జిస్తూ నేలపై కూలిపోయింది. (పరీక్షిన్మహారాజు జైత్రయాత్ర పిమ్మట తిరిగి వెళ్తు, ఇలా శూద్రుని రూపంలో ఉన్న కలిపురుషుడు ఎద్దు రూపంలో ఉన్న ధర్మదేవతను తన్నటం చూసాడు.)

1-413-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మఱియును.

టీకా:

మఱియును = ఇంకను.

భావము:

వాడు అంతటితో ఆగలేదు

1-414-శా.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

లోలాంగక నశ్రు తోయ కణ జాలాక్షిన్, మహాంభారవన్,
బాలారూఢ తృణావళీకబళలోవ్యాప్త జిహ్వాగ్ర, నాం
దోస్వాంతనజీవవత్స నుదయద్దుఃఖాన్వితన్, ఘర్మకీ
లాలాపూర్ణశరీర, నా మొదవు నుల్లంఘించి తన్నెన్ వడిన్.

టీకా:

ఆలోల = వణుకుతున్న; అంగకన్ = అవయవములు కలది; అశ్రు = కన్నీటి; తోయ = నీటి; కణ = బిందువులు; జాల = జాలువారుతున్న, చిమ్ముతున్న; అక్షిన్ = కన్నులు కలది; మహా = పెద్దగా; అంభా = అంభా అనుచు; రవన్ = అరచినది; బాల = కొత్తగ; ఆరూఢ = మొలకెత్తిన; తృణ = గడ్డి; వళీ = సముదాయపు; కబళ = కడిపై, ముద్దపై; లోభ = ఆపేక్ష వలన; వ్యాప్త = చాచిన; జిహ్వ = నాలుక; అగ్రన్ = చివర కలది; ఆందోళ = చలించిన, దుఃఖపడిన; స్వాంతన్ = మనసు కలదానిని; అజీవ = చనిపోయిన; వత్సన్ = దూడ కలదానిని; ఉదయ = పెల్లుబుకుచున్న; దుఃఖ = దుఃఖము; అన్వితన్ = కూడి ఉన్నదానిని; ఘర్మ = చెమట; కీలాలా = నీటితో; పూర్ణ = నిండిన; శరీరన్ = శరీరము కలది; ఆ = ఆ; మొదవున్ = పాడియావును; ఉల్లంఘించి = ఎగిరి దూకి; తన్నెన్ = తన్నెను; వడిన్ = బలంగా.

భావము:

గడగడ వణుకుతూ కన్నుల వెంబడి అశ్రుధారలు కారుస్తున్న దాన్ని, గొంతెత్తి అంబా అని అరుస్తున్నదాన్ని, జంపుగా పెరిగిన లేత పచ్చిక మేయటానికి నాలుక చాస్తున్న దాన్ని, చెదరిన గుండెకలదాన్ని, లేగదూడ లేకుండా ఒంటరిగా వచ్చిన దాన్ని, ఉబికి వస్తున్న దుఃఖము కలదానిని, సేదజలంతో నిండిన దేహం కలదానిని, ఆ గోమాతను, ఆ పాపాత్ముడు ఎగిరి తన్నాడు.