పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : కృష్ణనిర్యాణంబు వినుట

  •  
  •  
  •  

1-378-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భూములవలన నెప్పుడు
భూములకు జన్మ మరణ పోషణములు ని
ర్ణీములు సేయుచుండును
భూమయుం డీశ్వరుండు భూతశరణ్యా!

టీకా:

భూతముల = జీవుల; వలనన్ = వలన; ఎప్పుడు = ఎప్పుడును; భూతముల = తోటి జీవుల; కున్ = కు; జన్మ = పుట్టుకలు; మరణ = మరణములు; పోషణములు = పోషణములను; నిర్ణీతములు = నిర్ణయించుటలు; చేయుచుండును = చేయుచుండును; భూత = సర్వభూతములలో; మయుండు = నిండి ఉండువాడు; ఈశ్వరుండు = భగవంతుడు; భూతశరణ్యా = రాజా {భూతశరణ్యుడు - ఆశ్రయించిన ప్రజలకు శరణము ఇచ్చువాడు, రాజు.}.

భావము:

ఆశ్రితవత్సలా! అన్నా! ధర్మరాజా! పరమేశ్వరుడు సర్వభూతాంతర్యామి. ఆయన ప్రాణులకు సృష్టి స్థితి సంహారాలు తోటి ప్రాణుల వలననే కలుగజేస్తు ఉంటాడు. (అర్జునుడు అన్న ధర్మరాజుకి కృష్ణనిర్యాణము తెలుపుతు ఆప్తునిగా భగవంతునిగా స్మరిస్తున్న సందర్భంలోది ఈ పద్యం.)