పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : గ్రంథకర్త వంశ వర్ణనము

 •  
 •  
 •  

1-24-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  కౌండిన్యగోత్ర సంలితుఁ, డాపస్తంబ-
సూత్రుండు, పుణ్యుండు, సుభగుఁడైన
భీమన మంత్రికిఁ బ్రియపుత్త్రుఁ డన్నయ,-
లకంఠి తద్భార్య గౌరమాంబ,
మలాప్తు వరమునఁ నియె సోమన మంత్రి,-
ల్లభ మల్లమ, వారి తనయుఁ
డెల్లన, యతనికి నిల్లాలు మాచమ,-
వారి పుత్త్రుఁడు, వంశర్ధనుండు

1-24.1-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

లిత మూర్తి, బహుకళానిధి, కేసన;
దాన మాన నీతి నుఁడు, ఘనుఁడు,
నకు లక్కమాంబ ర్మగేహిని గాఁగ
నియె; శైవశాస్త్రతముఁ గనియె.

టీకా:

కౌండిన్య = కౌండిన్యస; గోత్ర = గోత్రంలో; సంకలితుఁడు = ఆవిర్భవించినవాడు; ఆపస్తంభ = ఆపస్తంభ; సూత్రుండు = సూత్రానుయాయి; పుణ్యుండు = పుణ్యాత్ముడు; సుభగుఁడు = సౌభాగ్యసంపన్నుడు; ఐన = ఐనటువంటి; భీమనమంత్రి = భీమనమంత్రి; కిన్ = కి; ప్రియ = ప్రియమైన; పుత్త్రుఁడు = కొడుకు; అన్నయ = అన్నయ; కలకంఠి = మంచి వాక్కు ఉన్నామె; తత్ = అతని; భార్య = భార్య; గౌరమాంబ = గౌరమాంబ; కమల = పద్మముల; ఆప్తు = బంధువు - సూర్యుని; వరమున = వరమువలన; కనియె = కనినది; సోమనమంత్రిన్ = సోమనమంత్రిని; వల్లభ = (అతని) భార్య; మల్లమ = మల్లమ; వారి = వారి; తనయుఁడు = కొడుకు; ఎల్లన = ఎల్లన; అతని = అతని; కిన్ = కి; ఇల్లాలు = భార్య; మాచమ = మాచమ; వారి = వారి; పుత్త్రుఁడు = కొడుకు; వంశ = వంశమును; వర్ధనుండు = ఉద్ధరించినవాడు;
లలిత = అందమైన; మూర్తి = రూపుగలవాడు; బహు = అనేక; కళా = కళల; నిధి = సంపన్నుడు; కేతన = కేతన; దాన = దానగుణము; మాన = మన్నింపదగిన గుణము; నీతి = నీతితో కూడిన ప్రవర్తన; ధనుఁడు = ధనముగాకలవాడు; ఘనుఁడు = గొప్పవాడు; తను = అతను; కున్ = కి; లక్కమాంబ = లక్కమాంబ; ధర్మ = ధర్మబద్ధమైన; గేహిని = గృహిణి - భార్య; కాఁగ = అయ్యి యుండగా; మనియె = జీవించెను; శైవశాస్త్ర = శైవమును; మతమున్ = మతముగా; కనియెన్ = స్వీకరించినాడు.

భావము:

ఇక మా వంశ చరిత్ర. కౌండిన్యసగోత్రంలో ఆవిర్భవించిన వాడు. అపస్తంబసూత్ర అనుయాయి, పుణ్యాత్ముడు, ధన్యాత్ముడు అయిన వాడు భీమన మంత్రి. ఆయన కుమారుడు అన్నయ్య. ఆయన అర్ధాంగి గౌరమాంబ. ఆ దంపతులకు సూర్యుని వరప్రసాదం వల్ల సోమన జన్మించాడు. ఆయన ఇల్లాలు మల్లమ్మ. ఆ సతీపతుల సంతానం ఎల్లన. ఆయన భార్య మాచమ్మ. వారిద్దరికీ వంశవర్థనుడైన కేసనమంత్రి ఉదయించాడు. చక్కనివాడు, పెక్కు కళలలో ప్రసిద్ధుడు, దాత, నీతిమంతుడు, ఆభిమానధనుడు ఐన కేసన్నగారు లక్కమాంబను సహధర్మచారిణిగా వరించి శాస్త్ర సమ్మతమైన శైవమతాన్ని స్వీకరించాడు.

1-25-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

వదు నిలయము వెలువడి,
వదు పరపురుషు గుణముఁ, నపతి నుడువుం
వదు, వితరణ కరుణలు
విడువదు, లక్కాంబ; విబుధ విసరము వొగడన్.

టీకా:

నడవదు = వెళ్ళదు; నిలయము = ఇల్లు; వెలువడి = విడిచి; తడవదు = తలపులోకి రానీయదు; పర = పరాయి; పురుషు = మగవారి; గుణము = గుణాలను; తన = తన; పతి = పతి; నుడువున్ = మాటను; గడవదు = దాటదు; వితరణ = దాన గుణము; కరుణలు = జాలిని; విడువదు = విడిచి పెట్టదు; లక్కాంబ = లక్కమాంబ; విబుధ = మంచి జ్ఞానుల; విసరము = సమూహం; పొగడన్ = కీర్తించగ.

భావము:

ఆ లక్కమాంబ మహా యిల్లాలు. యింటి బయటకు కాలు పెట్టి ఎరుగదు. పరపురుషుల సంగతి తలచుట ఎరుగదు. భర్త మాట జవదాటి ఎరుగదు. దాన ధర్మాలకు, దయా దాక్షిణ్యాలకు పెట్టింది పేరు. పెద్దల మన్ననలను పొందిన మహా సాధ్వి.

1-26-ఉ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మానిను లీడుగారు బహుమాన నివారిత దీనమానస
గ్లానికి, దాన ధర్మ మతిగౌరవమంజులతాగభీరతా
స్థానికి, ముద్దుసానికి, సదాశివపాదయుగార్చనానుకం
పాయవాగ్భవానికిని, మ్మెర కేసయ లక్కసానికిన్.

టీకా:

మానినులు = స్త్రీలు, {మానిని - మంచిమానము కలామె, స్త్రీ, మానస్యో ఇతి మానినీ (వ్యుత్పత్తి)}; ఈడు = సాటి; కారు = రారు; బహుమాన = తను చేసిన బహుమానములచే; నివారిత = తొలగింపబడిన; దీన = దీనులయొక్క; మానస = మనసులలోని; గ్లాని = దఃఖముగలామె; కిన్ = కి; దాన = దాన; ధర్మ = ధర్మ; మతి = బుద్ధి; గౌరవ = గౌరవ; మంజులతా = మృదువైన; గభీరతా = గంభీరమైన ప్రవర్తనలకి; స్థాని = నిలయమైనామె; కిన్ = కి; ముద్దు = మనోజ్ఞమైన; సాని = అధికురాలు; కిన్ = కి; సదా = ఎల్లప్పుడూ; శివ = శివునియొక్క; పాద = పాదముల; యుగ = ద్వయాన్ని; అర్చన = పూజించుటందు; అనుకంపా = దయాకలిత; నయ = మృదు; వాక్ = సంభాషణలో; భవాని = పార్వతీదేవి లాంటి ఆమె; కిన్ = కి; బమ్మెర = బమ్మెర; కేసయ = కేసయగారి; లక్కసాని = లక్కాంబ; కిన్ = కు.

భావము:

లక్కమాంబ బీదసాదలను ఆదరించి వారి కష్టాలు పోగొట్టే చల్లని తల్లి. ఔదార్యానికీ, బుద్థి చాతుర్యానికి, సౌందర్యానికి, గాంభీర్యానికి ఆమె పెట్టిందిపేరు. సదా, సదాశివుని పాదాలు అర్చిస్తూ, దయతో కూడిన నయవాక్కులతో, సాక్షాత్తు భవానీమాతలా కనిపించే ఆ కేసయ గారి ధర్మపత్నికి సామాన్య కాంతలు సాటిరారు.

1-27-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మానినికిం బుట్టితి
మే మిరువుర, మగ్రజాతుఁ డీశ్వరసేవా
కాముఁడు తిప్పన, పోతన
నావ్యక్తుండ సాధుయ యుక్తుండన్.

టీకా:

ఆ = అటువంటి; మానిని = మంచి మానము గలామె {మానిని - మంచిమానము కలామె, స్త్రీ, మానస్యో ఇతి మానినీ (వ్యుత్పత్తి)}; కిన్ = కి; పుట్టితిమి = పుట్టితిమి; మేము = మేము; ఇరువురము = ఇద్దరము; అగ్ర = ముందు; జాతుడు = పుట్టినవాడు - అన్న; ఈశ్వర = శివ; సేవా = పూజయందు; కాముఁడు = కోరికగలవాడైన; తిప్పన = తిప్పన; పోతన = పోతన అనే; నామ = పేరుతో; వ్యక్తుండ = తెలియబడేవాడిని; సాధు = మంచితనం; నయ = నీతి; ఉక్తుండన్ = ఉన్నవాడిని.

భావము:

ఆమెకి మేమిద్దరం కొడకులం పుట్టాము. పెద్దవాడు తిప్పన, ఆయన ఈశ్వరార్చన కళాశీలుడు. నేను చిన్నవాణ్ణి. నా పేరు పోతన. పెద్దల అడుగుజాడల్లో నీతి యుక్త సాధువర్తనతో మెలగే వాడిని.

1-28-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అయిన నేను, నా చిత్తంబున శ్రీరామచంద్రుని సన్నిధానంబు గల్పించుకొని.

టీకా:

అయిన = ఐనటువంటి; నేను = నేను; నా = నాయొక్క; చిత్తంబున = మనసులో; శ్రీ = శ్రీ; రామచంద్రుని = రామచంద్రుని; సన్నిధానంబు = సాన్నిధ్యము; కల్పించుకొని = కల్పించుకొని.

భావము:

అట్టి నేను శ్రీ రామచంద్రుణ్ణి నా నిండుగుండెలో నిలుపుకొన్నవాడని అయి.