పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : యాదవుల కుశలం బడుగుట

 •  
 •  
 •  

1-346-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఖేమున నింద్రసూనుఁడు
యావపురినుండి వచ్చి గ్రజుఁ గని త
త్పాముల నయనసలిలో
త్పాకుఁడై పడియె దీనుభంగి నరేంద్రా!

టీకా:

ఖేదమునన్ = దుఃఖముతో; ఇంద్రసూనుడు = అర్జునుడు {ఇంద్రసూనుడు - ఇంద్రుని పుత్రుడు, అర్జునుడు}; యాదవ = యాదవుల యొక్క; పురి = నగరము; నుండి = నుండి; వచ్చి = వచ్చి; అగ్రజుఁనిన్ = అన్నను; కని = చూసి; తత్ = అతని; పాదములన్ = పాదములమీద; నయన సలిల = కన్నీరు; ఉత్పాదకుఁడు = కలిగినవాడు; ఐ = అయి; పడియెన్ = పడెను; దీనున్ = దీనుని; భంగిన్ = వలె; నరేంద్ర = రాజా {నరేంద్రుడు - నరులకు ఇంద్రుడు, రాజు.}.

భావము:

ఇంతలో ద్వారకానగరం నుంచి వచ్చిన అర్జునుడు అశ్రుపూరిత నేత్రాలతో భరింపరాని దుఃఖంతో దీనుడై అగ్రజుని పాదాలపై వాలాడు.

1-347-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ల్లటిలిన యుల్లముతోఁ
ల్లడపడుచున్న పిన్నమ్మునిఁ గని వె
ల్వెల్లనగు మొగముతో జను
లెల్లను విన ధర్మపుత్రుఁ డిట్లని పలికెన్.

టీకా:

పల్లటిలిన = అల్లకల్లోలమైన; ఉల్లము = మనస్సు; తోన్ = తో; తల్లడపడుచున్న = తల్లడిల్లుచున్న; పిన్న = చిన్న; తమ్మునిన్ = తమ్ముడిని; కని = చూసి; వెల్వెల్లన్ = వెలవెలబోతున్నది; అగు = అయిన; మొగము = ముఖము; తోన్ = తో; జనులు = ప్రజలు; ఎల్లను = అందరును; వినన్ = వినుచుండగ; ధర్మపుత్రుడు = ధర్మరాజు {ధర్మపుత్రుడు - యమధర్మరాజు కొడుకు, ధర్మరాజు}; ఇట్లని = ఈవిధముగ; పలికెన్ = అడిగెను.

భావము:

అల్లకల్లోలమైన మనస్సుతో తల్లడిల్లిపోతున్న చిన్న తమ్ముణ్ణి చూసి ధర్మరాజు ముఖం వెలవెలబోయింది. ఆయన అందరూ వింటుండగా అర్జునునితో ఇలా పలికాడు....

1-348-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

""మాతామహుండైన నశూరుఁ డున్నాడె?-
మంగళమే మనమాతులునకు?
మోదమే నలుగురు ముగురు మేనత్తల?-
కానందమే వారి యాత్మజులకు?
క్రూర కృతవర్మ లాయు స్సమేతులే?-
జీవితుఁడే యుగ్రసేనవిభుఁడు?
ల్యాణయుక్తులే ద సారణాదులు-
మాధవుతమ్ములు మానధనులు?

1-348.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నందమే మనసత్యకనందనునకు?
ద్రమే శంబరాసురభంజనునకుఁ?
గుశలమే బాణదనుజేంద్రకూఁతుపతికి?
ర్షమే పార్థ! ముసలికి లికి బలికి?

టీకా:

మాతామహుండు = తల్లి యొక్క తండ్రి, తాత; ఐన = అయినట్టి; మన = మన యొక్క; శూరుఁడు = శూరసేనుడు; ఉన్నాడే = ఉన్నాడా; మంగళమే = శుభమేనా; మన = మన యొక్క; మాతులున = మేనమామ; కున్ = కి; మోదమే = సంతోషమేనా; నలుగురుముగురు = నలుగురు+ముగురు, ఏడుగురు {వసుదేవుని భార్యలు - ఏడుగురు}; మేనత్తల = మేనత్తల; కున్ = కు; ఆనందమే = ఆనందమేనా; వారి = వారియొక్క; ఆత్మజుల = పిల్లల; కున్ = కి; అక్రూర = అక్రూరుడును; కృతవర్మలు = కృతవర్మయును; ఆయుః = ఆయుష్షు; సమేతులే = కలిగి ఉన్నారా; జీవితుఁడే = జీవించి ఉన్నాడా; ఉగ్రసేన = ఉగ్రసేన; విభుఁడు = ప్రభువు; కల్యాణ = శుభములతో; ఉక్తులే = కూడి ఉన్నారా; గద = గదుడు; సారణ = సారణుడు; ఆదులు = మొదలగువారు; మాధవు = కృష్ణుని {మాధవుడు - మాధవి (లక్ష్మి)భర్త, కృష్ణుడు}; తమ్ములు = తమ్ముళ్ళు; మాన = అభిమానము; ధనులు = ధనముగా కలవారు;
నందమే = ఆనందమే; మన = మనయొక్క; సత్యక = సత్యకుని {సత్యకనందనుడు - సాత్యకి}; నందనున = కొడుకు, సాత్యకి; కున్ = నకు; భద్రమే = క్షేమమే; శంబర = శంబరుడు అను {శంబరాసురభంజనుడు - ప్రద్యుమ్నుడు}; అసుర = రాక్షసుని; భంజనున = చంపినవాని, ప్రద్యుమ్నుని; కున్ = కి; కుశలమే = బాగున్నాడా; బాణ = బాణుడు అను {బాణదనుజేం ద్రకూఁతుపతి - బాణాసుర పుత్రిక పతి, అనిరుద్ధుడు}; దనుజ = రాక్షసుని; ఇంద్ర = ప్రభువు; కూఁతు = కూతురు యొక్క; పతి = భర్త, అనిరుద్ధుని; కిన్ = కి; హర్షమే = సంతోషమేనా; పార్థ = అర్జునా; ముసలి = బలరాముని {ముసలి - ముసలాయుధము ధరించినవాడు, బలరాముడు}; కిన్ = కి; హలి = బలరాముని {హలి - హలాయుధము ధరించినవాడు, బలరాముడు}; కిన్ = కి; బలి = బలరాముని; కిన్ = కిని.

భావము:

నాయనా అర్జునా మన మాతామహుడైన శూరసేనుడు కుశలమే కదా మన మేనమామ వసుదేవుడు సుఖంగా ఉన్నాడు కదా మన మేనత్తలు ఏడుగురూ సంతోషంగా ఉన్నారు కదా వారి కొడుకు లందరూ క్షేమమే కదా అక్రూర కృతవర్మలకు ఆరోగ్యమే కాదా ఉగ్రసేన మహారాజు తిన్నగా తిరుగుతున్నాడా మానధనులూ వాసుదేవుని సోదరులూ అయిన గదుడు, సారణుడు మొదలైన వారంతా కుశలమేనా మన సాత్యకి క్షేమమేనా ప్రద్యుమ్నుడు బాగా ఉన్నాడా అనిరుద్ధుడు కులాసాగా ఉన్నాడా మన పెద్దబావ బలరాముడు సుఖంగా ఉన్నాడా.

1-349-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మఱియు నంధక, యదు, భోజ, దశార్హ, వృష్ణి, సాత్వతులు మొదలయిన యదువంశ వీరులును, హరికుమారులైన సాంబ సుషేణప్రముఖులును, నారాయణానుచరులైన యుద్ధవాదులును, గృష్ణసహచరులైన సునంద నందాదులును, సుఖానందులే?"యని, యందఱ నడిగి ధర్మజుండు గ్రమ్మఱ నిట్లనియె.

టీకా:

మఱియున్ = ఇంకనూ; అంధక = అంధకులు; యదు = యాదవులు; భోజ = భోజులు; దశార్హ = దశార్హులు; వృష్ణి = వృష్ణికులు; సాత్వతులు = సాత్వతులు; మొదలయిన = మొదలగు; యదు = యాదవ; వంశ = వంశపు; వీరులును = వీరులును; హరి = కృష్ణుని, భగవంతుని; కుమారులు = పుత్రులు; ఐన = అయినట్టి; సాంబ = సాంబుడు; సుషేణ = సుషేణుడు మొదలగు; ప్రముఖులును = ముఖ్యమైనవారును; నారాయణ = నారాయణునకు, కృష్ణునకు; అనుచరులు = తోటివారు; ఐన = అయినట్టి; యుద్ధవ = యుద్ధవుడు; ఆదులునున్ = మొదలగువారును; కృష్ణ = కృష్ణుని; సహచరులు = స్నేహితులు; ఐన = అయినట్టి; సునంద = సునందుడు; నంద = నందుడు; ఆదులును = మొదలగువారును; సుఖా = సుఖమును; నందులే = ఆనందమును కలవారేనా; అని = అని; అందఱన్ = అందరిని; అడిగి = అడిగి; ధర్మజుండు = ధర్మరాజు {ధర్మజుడు - యమధర్మరాజు కొడుకు, ధర్మరాజు}; క్రమ్మఱ = మరల; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఇంకా అంధకులూ, యాదవులూ, భోజులూ దశార్హులు, వృష్ణులూ, సాత్వతులూ మొదలైన యదువంశ వీరులందరూ క్షేమంగా ఉన్నారా? శ్రీకృష్ణుని పుత్రులైన సాంబుడూ, సుషేణుడూ మొదలైనవారూ, అనుచరులైన ఉద్ధవుడూ మొదలైనవారూ, సహచరులైన నందుడూ, సునందుడూ మొదలైన వారూ సుఖంగాను, ఆనందంగానూ ఉన్నారా?” అని ఈవిధంగా అందరి క్షేమమూ అడిగి ఇంకా ఇలా అన్నాడు ధర్మరాజు.

1-350-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

""వైకుంఠవాసుల డువున నెవ్వని-
లమున నానందరితు లగుచు
వెఱవక యాదవ వీరులు వర్తింతు?-
మరులు గొలువుండు ట్టి కొలువు
వికె నాకర్షించి రణసేవకులైన-
బంధుమిత్రాదుల పాదయుగము
నెవ్వడు ద్రొక్కించె నింద్రపీఠముమీఁద?-
జ్రంబు జళిపించి వ్రాలువాని

1-350.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ప్రాణవల్లభ కెంగేలఁ బాదు సేసి
మృతజలములఁ బోషింప లరు పారి
జాత మెవ్వఁడు గొనివచ్చి త్యభామ
కిచ్చె? నట్టి మహాత్మున కిపుడు శుభమె?

టీకా:

వైకుంఠ = వైకుంఠ లోకమున; వాసుల = వసించువారి; వడువునన్ = వలె; ఎవ్వని = ఎవని; బలమునన్ = బలము వలనైతే; ఆనంద = ఆనందముతో; భరితులు = నిండినవారు; అగుచు = అవుతూ; వెఱవక = బెదరక; యాదవ = యాదవులలో; వీరులు = వీరులు; వర్తింతురు = చరించెదరో; అమరులు = దేవతలు యొక్క {ఇంద్ర సభామండపము - సుధర్మామండపము}; కొలువు = ఆస్థానమున; ఉండున్ = ఉండునో; అట్టి = అటువంటి; కొలువు = కొలువు తీరే / సభా / ఆస్థానము; చవికెన్ = మండపమును / సుధర్మామండపము; ఆకర్షించి = తిగిచి; చరణ = పాదములను; సేవకులు = సేవించువారు; ఐన = అయిన; బంధు = బంధువులు; మిత్ర = మిత్రులు; ఆదుల = మొదలగువారి; పాద = పాదములయొక్క; యుగమున్ = జంటలచే; ఎవ్వడున్ = ఎవడైతే; ద్రొక్కించెన్ = త్రొక్కించెనో; ఇంద్ర = ఇంద్రుని; పీఠము = సింహాసనము; మీఁద = మీద; వజ్రంబున్ = వజ్రాయుధమును {వజ్రాయుధముజళిపించువాడు - ఇంద్రుడు}; జళిపించి = జళిపించి {ఇంద్రునిభార్య - శచీదేవి}; వ్రాలువాని = ఆసీనుడగువాని / ఇంద్రుని; ప్రాణవల్లభ = భార్య / శచీదేవి;
కెంగేలన్ = చేతులతో; పాదు = పాదు; చేసి = చేసి; అమృత = అమృతము అను; జలములన్ = నీటితో; పోషింపన్ = పెంచుతుండగ; అలరు = అలరారే; పారిజాతము = పారిజాతమును; ఎవ్వఁడు = ఎవడైతే; కొనివచ్చి = తీసుకొనివచ్చి; సత్యభామ = సత్యభామ; కున్ = కు; ఇచ్చెన్ = ఇచ్చెనో; అట్టి = అటువంటి; మ హా = గొప్ప; ఆత్మున = ఆత్మ కలవాని / కృష్ణుని; కున్ = కి; ఇపుడు = ఇప్పుడు; శుభమే = శుభమేనా.

భావము:

అర్జునా! ఏ మహానుభావుని అండదండలవల్ల వైకుంఠంలో నివసించే వారిలాగా, ద్వారకలో నివసించే యాదవవీరులు ఆనందసహితులలై భయరహితులై ఉంటున్నారో, ఏ మహానుభావుడు దేవతలు కొలువు తీర్చే సుధర్మామంటపంలో తన భక్తులనూ బంధువులనూ మిత్రులనూ కూర్చుండ పెట్టాడో, ఏ మహానుభావుడు, వజ్రాయుధం ధరించి ముక్కోటి దేవతల మధ్య ముత్యాల గద్దెపై కొలువు తీర్చే ఇంద్రుని ప్రాణేశ్వరి అయిన శచిదేవి తన చేతులతో పాదుచేసి అమృతం పోసి పెంచిన పారిజాత వృక్షాన్ని, దివినుంచి భువికి తీసుకొని వచ్చి తన ప్రియురాలైన సత్యభామకు బహూకరించాడో-ఆమహానుభావుడు వాసుదేవుడు క్షేమమేనా?

1-351-శా.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

న్నా! ఫల్గున! భక్తవత్సలుఁడు, బ్రహ్మణ్యుండు, గోవిందుఁ డా
న్నానీకశరణ్యుఁ డీశుఁడు, జగద్భద్రానుసంధాయి, శ్రీ
న్నవ్యాంబుజ పత్రనేత్రుఁడు, సుధర్మామధ్యపీఠంబునం
దున్నాఁడా బలభద్రుఁ గూడి సుఖియై యుత్సాహియై ద్వారకన్?

టీకా:

అన్నా = నాయనా; ఫల్గున = అర్జునా; భక్త = భక్తులయందు; వత్సలుండు = ఆపేక్ష కలవాడు; బ్రహ్మణ్యుండు = వేదధర్మమును నిలుపువాడు; గోవిందుఁడు = కృష్ణుడు {గోవిందుడు - గోవులకు ఒడయుడు, గోవులను పాలించు వాడు, గో (ఆవులకు, జీవులకు) విందుడు, పాలించువాడు, విష్ణువు, కృష్ణుడు.}; ఆపన్న = ఆపద చెందిన; అనీక = జనసమూహమునకు; శరణ్యుఁడు = శరణ్యమైన వాడు, కృష్ణుడు; ఈశుఁడు = అధిపతి, కృష్ణుడు; జగత్ = జగత్తులకు; భద్ర = భద్రమును; అనుసంధాయి = కలుగజేయు వాడు, భగవంతుడు; శ్రీమాన్ = శ్రీమంతమైన; నవ్య = లేత; అంబు = నీటిలో; జ = పుట్టిన (పద్మము) యొక్క; పత్ర = పత్రమువంటి; నేత్రుడు = కన్నులు ఉన్నవాడు, భగవంతుడు; సుధర్మా = సుధర్మామండపము యొక్క; మధ్య = మధ్యన ఉన్న; పీఠంబునన్ = ఆసనమునందు; ఉన్నాఁడా = ఉన్నాడా; బలభద్రున్ = బలభద్రునితో; కూడి = కలిసి ఉండి; సుఖి = సుఖముగ ఉన్నవాడు; ఐ = అయి; ఉత్సాహి = ఉత్సాహముతో ఉన్నవాడు; ఐ = అయి; ద్వారకన్ = ద్వారకలో.

భావము:

నాయనా! అర్జునా! భక్తుల యందు వాత్సల్యం కురిపించే వాడూ, బ్రహ్మణ్యుడూ, ఆపన్నశరణ్యుడూ, సర్వేశ్వరుడూ, లోకాలకు మేలు కలిగించేవాడూ, శోభవంతములై అప్పుడప్పుడే వికసిస్తున్న తామరరేకుల వంటి కన్నులు కలవాడూ, అయిన గోవిందుడు ద్వారకలో సుధర్మ సభా మండపం మధ్యన సింహాసనం మీద అన్నగారైన బలరామునితో కూడి సుఖంగా ఉత్సాహంగా ఉన్నాడా.

1-352-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

రామకేశవులకును
సారామలభక్తి నీవు లుపుదువు గదా;
గారాములు సేయుదురా
పోరాముల బంధు లెల్ల ప్రొద్దు? జితారీ !

టీకా:

ఆ = ఆ; రామ = బలరామనకు; కేశవుల = కృష్ణున, భగవంతున; కును = కును; సార = చిక్కని; అమల = నిర్మలమైన; భక్తిన్ = భక్తిని; నీవు = నీవు; సలుపుదువు = చేయుదువు; కదా = కదా; గారాములు = గౌరవములు; సేయుదురా = చేయుదురా; పోన్ = పోవుటల యందు; రాములన్ = వచ్చుటల యందును; బంధులు = బంధువులు; ఎల్ల = అన్ని; ప్రొద్దున్ = వేళలందు; జితారి = అర్జునా {జితారి - జయింపబడిన శత్రువులు కలవాడు, అర్జునుడు.}.

భావము:

విజయా! ఆ రామకృష్ణులను నీవు స్థిరమైన భక్తితో సేవించావు గదా? అక్కడి మన చుట్టాలంతా నిన్ను అనుదినం రాకపోకలందు అప్యాయంగా అనురాగంగా ఆదరించారు కదా?

1-353-శా.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మున్నుగ్రాటవిలో వరాహమునకై ముక్కంటితోఁ బోరుచో,
న్నాహంబునఁ గాలకేయుల ననిం క్కాడుచోఁ, బ్రాభవ
స్కన్నుండై చను కౌరవేంద్రు పనికై గంధర్వులం దోలుచోఁ,
న్నీరెన్నడుఁ దేవు తండ్రి! చెపుమా ల్యాణమే చక్రికిన్?

టీకా:

మున్ను = ఇంతకు ముందు; ఉగ్ర = భయంకరమైన; అటవి = అడవి; లోన్ = అందు; వరాహమున = పంది; కై = కోసము; ముక్కంటి = శివుని {ముక్కంటి - మూడు కన్నులు ఉన్నవాడు, శివుడు}; తోన్ = తో; పోరు చోన్ = యుద్ధము చేయు నప్పుడు కాని; సన్నాహంబునన్ = పోరుకు దిగి నప్పుడు; కాలకేయులన్ = కాలకేయులను రాక్షసులను; అనిన్ = యుద్ధములో; జక్కాడు చోన్ = చెండాడుచు నున్నప్పుడు కాని; ప్రాభవ = వైభవమును; స్కన్నుండు = కోల్పోయిన వాడు; ఐ = అయి; చను = వెళ్లు; కౌరవేంద్రు = దుర్యోధనుని {కౌరవేంద్రుడు - కురువంశపు రాజు, దుర్యోధనుడు}; పని = పని; కై = కోసము; గంధర్వులన్ = గంధర్వులను; తోలు చోన్ = పారదోలు నప్పుడు కాని; కన్నీరు = కన్నీరు; ఎన్నడున్ = ఎప్పుడును; తేవు = తీసుకొని రాలేదు, కార్చ లేదు; తండ్రి = నాయనా; చెపుమా = చెప్పుము; కల్యాణమే = శుభమేనా; చక్రి = కృష్ణుని {చక్రి - చక్రాయుధము ధరించువాడు, విష్ణువు, కృష్ణుడు}; కిన్ = కి.

భావము:

“ఇదేమి టయ్యా? కళ్ళల్లో నీళ్ళు కారుతున్నాయి. పూర్వం భయంకరమైన ఆ అడవిలో పంది కోసం మూడు కళ్ళున్న ఆ పరమేశ్వరునితో పోరే టప్పుడు కాని, సర్వసన్నాహాలతో వెళ్ళి కాలకేయులను కదనరంగంలో చీల్చి చెండాడే టప్పుడు కాని, పరువు పోయి వైభవం కోల్పోయిన దుర్యోధనుని విడిపించే పనిలో గంధర్వులను తరిమే టప్పుడు కాని ఇంతకు ముందు ఎప్పుడు కంట నీరు పెట్టి ఎరుగవు కదా. ఇప్పుడే మయిం దయ్యా? కృష్ణుడు కులాసాగానే ఉన్నాడా? చెప్పు

1-354-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అదియునుం గాక.

టీకా:

అదియునున్ = అంతే; కాక = కాకుండా.

భావము:

అంతే కాకపోతే

1-355-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

డితివో శత్రువులకు,
నాడితివో సాధు దూషణాలాపములం;
గూడితివో పరసతులను,
వీడితివో మానధనము వీరుల నడుమన్;

టీకా:

ఓడితివో = ఓడిపోయావా ఏమిటి; శత్రువుల = పగవారి; కున్ = కి; ఆడితివో = పలికితివా ఏమిటి; సాధు = మంచివారిని; దూషణ = దూషించు; ఆలాపములన్ = మాటలతో; కూడితివో = కలిసితివా ఏమిటి; పర = ఇతరుల; సతులను = భార్యలను; వీడితివో = విడిచితివా ఏమిటి; మాన = మానము అను; ధనము = సంపదను; వీరుల = వీరుల; నడుమన్ = మధ్యన.

భావము:

పగవారితో పోరాడి ఓడిపోలేదు కదా? సజ్జనులను తూలనాడలేదు కదా? పరాంగనలను కూడలేదు కదా? అరివీరుల నడుమ అభిమానాన్ని వీడలేదు కదా?

1-356-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ప్పితివో యిచ్చెదనని;
చెప్పితివో కపటసాక్షి; చేసిన మేలున్
దెప్పితివో; శరణార్థుల
రొప్పితివో ద్విజులఁ, బసుల, రోగుల, సతులన్;

టీకా:

తప్పితివో = తప్పితివా ఏమిటి; ఇచ్చెదను = ఇస్తాను; అని = అని చెప్పి; చెప్పితివో = చెప్పితివా ఏమిటి; కపట = దొంగ; సాక్షి = సాక్ష్యము; చేసిన = చేసినటువంటి; మేలున్ = సహాయమును; దెప్పితివో = దుస్సహమగునట్లు చెప్పితివా ఏమిటి; శరణార్థులన్ = శరణుకోరినవారిని; రొప్పితివో = తరిమికొట్టితివా ఏమిటి; ద్విజులన్ = బ్రాహ్మణులను కాని {ద్విజుడు - పుట్టుక ఉపనయనము అనెడి ద్వి (రెండు) జుడు (జన్మములు గలవాడు), బ్రాహ్మణుడు}; పసులన్ = పసువులను కాని; రోగులన్ = రోగిష్టివారిని కాని; సతులన్ = స్త్రీలను కాని.

భావము:

అన్నమాట తప్పలేదు కదా? దొంగసాక్ష్యం చెప్పలేదు కదా? ఇతరులకు మేలు చేసి తిరిగి చెప్పలేదు కదా? శరణార్థుల మీదా, బ్రాహ్మణుల మీదా, గోవుల మీదా, రోగులమీదా, స్ర్తీల మీదా పొరపాటున బాణాలు గుప్పలేదు కదా?

1-357-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

డిచితివో భూసురులనుఁ;
గుడిచితివో బాలవృద్ధగురువులు వెలిగా;
విడిచితివో యాశ్రితులను;
ముడిచితివో పరుల విత్తములు లోభమునన్;""

టీకా:

అడిచితివో = అణగ్గొట్టితివా ఏమిటి; భూసురులను = బ్రాహ్మణులను {భూసురుడు - భూమికి సురుడు (దేవుడు), బ్రాహ్మణుడు}; కుడిచితివో = తింటివా ఏమిటి; బాల = పిల్లలను కాని; వృద్ధ = ముసలివారిని కాని; గురువులు = గురువులను కాని; వెలిగా = విడిచి పెట్టి; విడిచితివో = విడిచిపెట్టావా ఏమిటి; ఆశ్రితులను = ఆశ్రయించినవారిని; ముడిచితివో = మూటగట్టితివా ఏమిటి; పరుల = ఇతరుల; విత్తములు = ధనములను; లోభమునన్ = పిసినారితనముతో.

భావము:

ఆరాధ్యులైన భూసురులను అణచివేసావా? లేకపోతే బాలురకు వృద్ధులకు గురువులకు పెట్టకుండా కుడిచినావా? శరణని చేరిన వారిని కాపాడకుండా వదలిపెట్టావా? పోనీ పరుల ధనాలను లోభం కొద్దీ ముడిచేసావా? తప్పు చేసినవాడికి కాని నీ కెందుకయ్యా యీ విచారం?""

1-358-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అని పలికినం గన్నీరు కరతలంబునం దుడిచికొనుచు గద్గదస్వరంబున మహానిధిం గోలుపోయిన పేదచందంబున నిట్టూర్పులు నిగిడించుచు నర్జునుం డన్న కిట్లనియె.

టీకా:

అని = అని; పలికినన్ = పలుకగా; కన్నీరు = కన్నీరు; కరతలంబునన్ = అరచేతితో; తుడిచికొనుచు = తుడుచుకొనుచు; గద్గద = గద్గదమైన; స్వరంబున = స్వరముతో; మహా = గొప్ప; నిధిన్ = నిధిని, ధనరాశిని; కోలుపోయిన = పోగొట్టుకొన్న; పేద = పేదవాని; చందంబునన్ = వలె; నిట్టూర్పులు = నిట్టూర్పులు {నిట్టూర్పు - నిడు (దీర్ఘమైన) ఊర్పు (శ్వాస), మనసులోని శ్రమకు సంకేతము}; నిగిడించుచు = పెద్దగా చేస్తూ; అర్జునుండు = అర్జునుడు; అన్న = అన్న; కున్ = కు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

ధర్మజుడు ఇలా ప్రశ్నించగానే అరచేతులతో అశ్రువులు తుడుచుకొంటూ, గద్గదకంఠంతో, పెన్నిధిని పోగొట్టుకొన్న పేదవాని మాదిరిగా వేడి వేడి నిట్టూర్పులు నిగిడిస్తూ అర్జునుడు అన్నగారితో ఇలా అన్నాడు-