పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : విదురాగమనంబు

  •  
  •  
  •  

1-309-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బాలాజన శాలా ధన
లీలావన ముఖ్య విభవ లీన మనీషా
లాసు లగు మానవులనుఁ
గాము వంచించు దురవగాహము సుమతీ!

టీకా:

బాల = పిల్లలు; జన = అంతఃపుర స్త్రీలు; శాలా = భవనములు; ధన = ధనములు; లీలావన = ఉద్యానవనములు; ముఖ్య = మొదలగు; విభవ = వైభవము లందు; లీన = మునిగి, లీనమై; మనీషా = ప్రజ్ఞ; లాలసులు = రుచి మరిగిన వారు; అగు = అయినట్టి; మానవులను = మనుష్యులను; కాలము = కాలము; వంచించు = మోసము చేయును; దురవగాహము = తరించుటకు కష్టమైనది, అంతు చిక్కనిది; సుమతీ = మంచి బుద్ధి కల వాడా, శౌనకా.

భావము:

శౌనక మహర్షి! అందమైన బిడ్డలు, అందచందాల అంగనలు, ఆనంద సౌధాలు, అపార సంపదలు, అలరారే ఉద్యానవనాలు మొదలైన భోగభాగ్యాల యందు మునిగితేలుతూ, సుఖలాలసు లైన మానవులను కాలం మోసం చేస్తు ఉంటుంది. కాల ప్రవాహాన్ని తెలిసికొనుట దుస్సాధ్యం సుమా.