పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : కృష్ణుడు భామల జూడబోవుట

 •  
 •  
 •  

1-269-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

తిలక మేటికి లేదు తిలకనీతిలకమ!-
పువ్వులు దుఱుమవా పువ్వుఁబోఁడి!
స్తూరి యలఁదవా స్తూరికాగంధి!-
తొడవులు దొడవవా తొడవుతొడవ!
లహంసఁ బెంపుదే లహంసగామిని!-
కీరముఁ జదివింతె కీరవాణి!
తలఁ బోషింతువా తికాలలిత దేహ!-
రసి నోలాడుదే రసిజాక్షి!

1-269.1-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మృగికి మేఁత లిడుదె మృగశాబలోచన!
గురుల నాదరింతె గురువివేక!
బంధుజనులఁ బ్రోతె బంధుచింతామణి!
నుచు సతులనడిగెచ్యుతుండు."

టీకా:

తిలకము = నుదిటి బొట్టు; ఏటి = ఎందుల; కిన్ = కు; లేదు = లేదు; తిలకనీ = తిలకము ధరించువారిలో, స్త్రీలలో; తిలకమా = గౌరవింపదగినదానా; పువ్వులున్ = పువ్వులను; తుఱుమవా = ధరింపవా; పువ్వున్ = పువ్వులవంటి; బోఁడి = శరీరము కలదానా; కస్తూరి = కస్తూరి అనే శ్రేష్ఠ మైన సుగంధం; అలఁదవా = రాయవా; కస్తూరికా = కస్తూరివంటి; గంధి = వాసన కలదానా; తొడవులు = ఆభరణములు; తొడవవా = ధరింపవా; తొడవు = ఆభరణములకే; తొడవ = ఆభరణమా; కలహంసన్ = (మధుర కంఠధ్వని) కలహంసలను; పెంపుదే = పెంచుతున్నావా; కలహంస = చక్కటిహంస; గామిని = నడక కలదానా; కీరమున్ = చిలుకలకు; చదివింతె = మాటలు చెప్పుతావా; కీర = చిలుకపలుకుల వంటి; వాణి = కంఠము కలదానా; లతలన్ = లతలను; పోషింతువా = పెంచుతావా; లతికా = పూలతీగవలె; లలిత = సుకుమార; దేహ = దేహము కలదానా; సరసిన్ = కొలనులో; ఓలాడుదే = జలకాలాడుదే; సరసిజ = పద్మముల వంటి; అక్షి = కన్నులు ఉన్నదానా;
మృగి = లేడి; కిన్ = కి; మేఁతల్ = గడ్డి, మేతలు; ఇడుదె = ఇచ్చెదవా; మృగ = లేడి; శాబ = పిల్లకి వంటి; లోచన = కన్నులు ఉన్నదానా; గురులన్ = గురువులను, పెద్దలను; ఆదరింతె = ఆదరించెదవా; గురు = గొప్ప; వివేక = వివేకము కలదానా; బంధుజనులన్ = బంధువులను; ప్రోతె = రక్షింతువా; బంధు = బంధువులకు; చింత = తలచినవి; ఆమణి = ఇచ్చుదానా; అనుచున్ = అంటూ; సతులన్ = భార్యలను; అడిగెన్ = అడిగెను; అచ్యుతుండు = కృష్ణుడు {అచ్యుతుడు - నాశము లేని వాడు, విష్ణువు}.

భావము:

నుదుటికి బొట్టంత ఉన్నతురాలా! నుదట బొట్టెందుకు పెట్టుకోలేదు? పువ్వులాంటి మృదువైన మోహనాంగి! తలలో పూలు పెట్టుకోవా? కస్తూరి పరిమాళాలు వెదజల్లే కాంతా! కస్తూరి రాసుకోవా? అలంకారాలకే అందాన్నిచ్చే అందగత్తె! ఆభరణాలు అలంకరించుకోవా? హంసనడకల చిన్నదాన! కలహంసలని పెంచుతున్నావా? చిలుకపలుకుల చిన్నారి! చిలుకలకి పలుకులు నేర్పుతున్నావా లేదా? పూతీగె అంతటి సుకుమారమైన సుకుమారి! పూలమొక్కలు పెంచుతున్నావా? పద్మాక్షి! కొలనులలో ఈతలుకొడుతున్నావు కదా? లేడికన్నుల లేమ! లేడికూనలకి మేత మేపుతున్నావు కదా? మహా వివేకవంతురాలా! పెద్దలను చక్కగా గౌరవిస్తున్నావు కదా? బందుప్రేమకి పేరుపొందిన పడతీ! బంధువుల నందరిని ఆదరిస్తున్నావు కదా?” అంటూ ప్రియకాంతల నందరినీ పరామర్శించాడు.