పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : గోవిందుని ద్వారకాగమనంబు

  •  
  •  
  •  

1-259-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

జాతాక్షుఁడు సూడ నొప్పె ధవళఛ్ఛత్రంబుతోఁ, జామరం
బుతోఁ, బుష్ప పిశంగ చేలములతో, భూషామణిస్ఫీతుఁ డై
లినీభాంధవుతో, శశిధ్వజముతో, క్షత్రసంఘంబుతో,
భిచ్ఛాపముతోఁ, దటిల్లతికతో, భాసిల్లు మేఘాకృతిన్.

టీకా:

జలజాతాక్షుడు = కృష్ణుడు {జలజాతాక్షుడు - జలజాత (పద్మములవంటి) అక్షుడు, కృష్ణుడు, విష్ణువు}; చూడన్ = చూచుటకు; ఒప్పె = చక్కగా ఉన్నాడు; ధవళత్ = తెల్లని; ఛత్రంబు = గొడుగుల; తోన్ = తో; చామరంబుల = చామరముల; తోన్ = తో; పుష్ప = పుష్పములతో; పిశంగ = కపిలవర్ణము గల; చేలముల = వస్త్రముల; తోన్ = తో; భూషా = భూషణములలోని; మణి = మణులు; స్పీతుఁడు = అధికముగా కలవాడు; ఐ = అయి; నలినీభాంధవు = పద్మముల బంధువు, సూర్యుని; తోన్ = తో; శశిధ్వజము = చంద్రుని (కుందేలు గుర్తుగల వాడు, చంద్రుడు); తోన్ = తో; నక్షత్ర = తారకల; సంఘంబు = సమూహము; తోన్ = తో; బలభిచ్ఛాపము = ఇంద్రధనుస్సు; తోన్ = తో; తటిల్లతిక = మెరుపుల; తోన్ = తో; భాసిల్లు = ప్రకాశించు; మేఘ = మేఘము యొక్క; ఆకృతిన్ = ఆకృతితో.

భావము:

ఆ కమలనేత్రుడు శ్యామసుందరుడు శ్వేతఛత్రం అనే సూర్యునితో, చామరా లనే చంద్రునితో, పూలనే నక్షత్రాల సమూహంతో, కపిలవర్ణము గల అంబరాలనే ఇంద్రధనుస్సుతో, భూషణాలలోని మణుల కాంతులనే మెరుపు తీగలతో భాసిల్లే మేఘంలా ప్రకాశిస్తున్నాడు.