పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : గోవిందుని ద్వారకాగమనంబు

  •  
  •  
  •  

1-254-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చెచ్చెరఁ గరినగరికి నీ
విచ్చేసిన నిమిషమైన వేయేండ్లగు నీ
వెచ్చోటికి విచ్చేయక
చ్చికతో నుండుమయ్య మా నగరమునన్.

టీకా:

చెచ్చెరన్ = తొందరతొందరగా; కరినగరి = హస్తినాపురము; కిన్ = నకు; నీవు = నీవు; విచ్చేసిన = వెళ్ళిన; నిమిషము = నిమిష మాత్రపు సమయము; ఐన = అయినను; వేయి = పది వందల; ఏండ్లు = సంవత్సరములు; అగు = వలె ఉండును; నీవు = నీవు; ఎచ్చోటి = ఎక్కడ; కిన్ = కును; విచ్చేయక = వెళ్ళకుండగ; మచ్చిక = ప్రేమ; తోన్ = తో; ఉండుము = ఉండుము; అయ్య = తండ్రీ; మా = మాయొక్క; నగరమునన్ = నగరములో.

భావము:

ప్రభు! నీవు మాటిమాటికి హస్తినాపురానికి వెళ్తున్నావు. అలా వెళ్ళినప్పు డల్లా ప్రతి నిమిషము మాకు పదివందల సంవత్సరాల లాగ అనిపిస్తున్నది. అందుచేత, మా ద్వారకానగరాన్ని వదలి ఎక్కడకి వెళ్ళకుండా ప్రేమగా ఇక్కడే ఉండిపోవయ్య నల్లనయ్య!