పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : భీష్మనిర్యాణంబు

 •  
 •  
 •  

1-218-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఇట్లు పీతాంబరధారియుఁ, జతుర్భుజుండు, నాదిపూరుషుండు, బరమేశ్వరుండు, నగు హరియందు నిష్కాముండై, విశుద్ధం బగు ధ్యానవిశేషంబుచే నిరస్తదోషుఁ డగుచు, ధారణావతియైన బుద్ధిని సమర్పించి, పరమానందంబు నొంది, ప్రకృతివలన నైన సృష్టిపరంపరలఁ బరిహరించు తలపున మందాకినీ నందనుం డిట్లనియె.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; పీతాంబరధారియున్ = కృష్ణుడు {పీతాంబరధారి - పచ్చని వస్త్రములు ధరించువాడు, హరి}; చతుర్భుజుండున్ = కృష్ణుడు {చతుర్భుజుడు - నాలుగు చేతులవాడు, విష్ణువు, విష్ణుసహస్రనామములలోని 140వ నామము}; ఆదిపూరుషుండున్ = కృష్ణుడు {ఆదిపురుషుడు - సృష్టికి మొదటినుండి ఉన్న పురుషుడు (కారకుడు), విష్ణువు}; పరమేశ్వరుండున్ = కృష్ణుడు {పరమేశ్వరుడు - పరమమైన ఈశ్వరుడు, సర్వోత్కృష్టమైన మరియు సర్వుల (బ్రహ్మాది పిపీలకపర్యంతము)ను నియమించు వాడు, కృష్ణుడు, విష్ణువు, శివుడు}; అగు = అయిన; హరి = కృష్ణుని {హరి - సర్వ దుఃఖములను, పాపములను హరించు వాడు, ప్రళయకాలమున సర్వము తన గర్భమున హరించుకొనువాడు, విష్ణువు, హకారముతో కూడిన నిశ్వాసము రేఫతో కూడిన కంఠనాదము - ఓంకారము}; అందున్ = అందు; నిష్కాముండు = కోరికలు లేనివాడు; ఐ = అయి; విశుద్ధంబు = మిక్కిలి శుద్ధమైనది; అగు = అయిన; ధ్యాన = ధ్యానము యొక్క; విశేషంబు = విశిష్ఠిత; చేన్ = చేత; నిరస్త = తొలగింపబడిన; దోషుండు = దోషములు గలవాడు; అగుచు = అవుతూ; ధారణావతి = ధారణకలిగినది {ధారణావతి - ధారణా భగవంతునిఁ దప్ప మఱియొకటి నెఱుఁగమి, (ఇది యోగాంగములలో నొకటి)}; (ఇది యోగాంగములలో నొకటి)}; ఐన = అయిన; బుద్ధిని = బుద్ధిని; సమర్పించి = లగ్నముచేసి; పరమ = పరమమైన; ఆనందంబునన్ = ఆనంద స్థితిని; ఒంది = పొంది; ప్రకృతి = ప్రకృతి; వలనన్ = సిద్ధము; ఐన = అయిన; సృష్టిపరంపరలన్ = పునర్జన్మములను; పరిహరించు = నివారించు; తలపున = ఉద్దేశముతో; మందాకినీనందనుండు = భీష్ముడు {మందాకినీనందనుడు - గంగాదేవి పుత్రుడు, భీష్ముడు}; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

మందాకినీనందను డైన భీష్ముడు సమస్త దోషాలను నిరస్తం చేసి నిష్కామభావంతో, నిర్మలధ్యానంతో పీతాంబరధురుడు, చతుర్భుజుడు, పురాణపురుషుడు, పరమేశ్వరుడు అయిన గోవిందుని యందు ఏకాగ్రబుద్ధిని సంధానించి పరమానంద భరితుడై ప్రకృతిసిద్ధాలైన సంసారబంధాలను పరిహరించే ఉద్ధేశంతో ఈ విధంగా ప్రస్తుతించాడు

1-219-మ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"త్రిగన్మోహన నీలకాంతిఁ దను వుద్దీపింపఁ, బ్రాభాత నీ
బంధుప్రభమైన చేలము పయిన్ రంజిల్ల, నీలాలక
వ్ర సంయుక్త ముఖారవింద మతిసేవ్యంబై విజృంభింప, మా
వియుం జేరెడు వన్నెలాఁడు మది నావేశించు నెల్లప్పుడున్.

టీకా:

త్రి = మూడు; జగత్ = లోకములను; మోహన = మోహింప చేయగల; నీల = నీలమైన; కాంతిన్ = కాంతితో; తనువు = శరీరము; ఉద్దీపింపన్ = బాగా ప్రకాశిస్తుండగ; ప్రాభాత = ఉదయ కాలపు; నీరజ = పద్మములకు; బంధు = బంధువు, సూర్యుని; ప్రభము = కాంతి కలది; ఐన = అయిన; చేలము = వస్త్రము; పయిన్ = పైన; రంజిల్లన్ = ఎఱ్ఱగా ప్రకాశిస్తుండగ; నీల = నల్లని; అలక = ముంగురుల యొక్క; వ్రజ = సమూహముతో; సంయుక్త = కూడిన; ముఖ = ముఖము అనే; అరవిందము = పద్మము; అతి = మిక్కిలి; సేవ్యంబు = సేవింపదగినది; ఐ = అయి; విజృంభింపన్ = చెలరేగుతూ; మా = మా యొక్క; విజయున్ = అర్జునుని; చేరెడు = చేరి యుండు; వన్నెలాఁడు = విలాసవంతుడు; మదిన్ = మనస్సును; ఆవేశించున్ = ప్రవేశించును గాక; ఎల్లప్పుడున్ = ఎల్లప్పుడూ.

భావము:

“ముల్లోకాలకు సమ్మోహనమైన నీలవర్ణ కాంతులతో నిగనిగలాడే మనోహరమైన దేహం గలవాడు; పొద్దుపొడుపు వేళ వెలుగులు చిమ్ముతున్న బాలభానుని ప్రభలతో మెరిసిపోతున్న బంగారు వర్ణపు వస్త్రం ధరించువాడు; నల్లని ముంగురులు కదలాడుతుండే వాడు; ముద్దులు మూటగట్టుతున్న ముఖపద్మం కలవాడు; మా అర్జునుణ్ణి విజయుణ్ణి చేస్తు చేరి ఉండే అందగాడు; అయిన శ్రీకృష్ణ భగవానుడు నా మదిలో నిరంతరం నిలిచిపోవాలి.

1-220-మ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

రింఖాముఖ ధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై,
జాతశ్రమ తోయబిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో,
ముం బార్థున కిచ్చువేడ్క, నని నాస్త్రాహతిం జాల నొ
చ్చియుఁ బోరించు మహానుభావు మదిలోఁ జింతింతు నశ్రాంతమున్.

టీకా:

హయ = గుఱ్ఱముల; రింఖా = కాలి గిట్టల; ముఖ = చివళ్ళ నుండి లేచు; ధూళి = దుమ్ము వలన; ధూసర = బూడిదవర్ణము; పరిన్యస్త = పైపూత గా ఉన్న; అలక = ముంగురులుతో; ఉపేతము = కూడినది; ఐ = అయి; రయ = వేగమువలన; జాత = పుట్టినట్టి; శ్రమ = శ్రమచేత పట్టిన; తోయ = నీటి, చెమట; బిందు = బిందువులతో; యుతము = కూడినది; ఐ = అయి; రాజిల్లు = ఎఱ్ఱనైన; నెఱ = నిండు; మోము = ముఖము; తోన్ = తో; జయమున్ = జయమును; పార్థున = అర్జునున; కున్ = కు; ఇచ్చు = ఇవ్వవలె ననే; వేడ్కన్ = కోరికతో; అనిన్ = యుద్ధములో; నా = నా యొక్క; శస్త్ర = శస్త్రముల; ఆహతిన్ = దెబ్బల వలన; చాలన్ = అధికముగ; నొచ్చియున్ = నొప్పి చెందియు; పోరించు = యుద్ధమును చేయించు; మహానుభావున్ = మహానుభావుని; మది = మనసు; లోన్ = లో; చింతింతున్ = స్మరింతును; అశ్రాంతమున్ = ఎల్లప్పుడూ.

భావము:

గుఱ్ఱాల కాలిగిట్టల వల్ల రేగిన ధూళితో దుమ్ముకొట్టుకుపోతున్నా; ముంగురులు చెదిరి పోతున్నా; అధికమైన రథ వేగానికి అలసట చెంది ఒళ్ళంతా చెమట్లు కారుతున్నా; ముచ్చటైన ముఖమంతా ఎఱ్ఱగా అవుతున్నా; నా శస్త్రాస్త్రాలు తగిలి ఎంత నొప్పెడుతున్నా లెక్క చెయ్యకుండా అర్జునుడికి విజయాన్ని చేకూర్చాలనే ఉత్సాహంతో అతనిని ప్రోత్సహిస్తు యుద్ధం చేయిస్తున్న మహానుభావుడు శ్రీకృష్ణపరమాత్మని నా మనస్సులో నిరంతరం ధ్యానిస్తుంటాను.

1-221-మ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

రుమాటల్ విని నవ్వుతో నుభయసేనామధ్యమక్షోణిలో
రు లీక్షింప రథంబు నిల్పి పరభూపాలావళిం జూపుచుం
భూపాయువు లెల్లఁ జూపులన శుంత్కేళి వంచించు నీ
మేశుండు వెలుంగుచుండెడును హృత్పద్మాసనాసీనుఁడై.

టీకా:

నరు = అర్జునుని; మాటల్ = మాటలను; విని = విన్న వాడై; నవ్వు = నవ్వు; తోన్ = తూ; ఉభయ = రెండు; సేనా = సేనల; మధ్యమ = మధ్యన ఉన్న; క్షోణి = ప్రదేశము; లోన్ = లో; పరులు = శత్రువులు; ఈక్షింపన్ = చూచుచుండగ; రథంబున్ = రథమును; నిల్పి = నిలబెట్టి; పర = శత్రువు లైన; భూపాల = రాజుల యొక్క; ఆవళిన్ = సమూహమును; చూపుచున్ = చూపెడుతూ; పర = శత్రువు లైన; భూప = రాజుల యొక్క; ఆయువులు = ప్రాణములు; ఎల్లన్ = అన్నిటిని; చూపులన = చూపులతోనే; శుంభత్ = మెరయుచున్న; కేళి = విలాసముతో; వంచించున్ = లాగికొను; ఈ = ఈ; పరమేశుండు = పరమమైన ఈశుండు, హరి; వెలుంగుచు = ప్రకాశిస్తూ; ఉండెడును = ఉండుగాక; హృత్ = హృదయ మనే; పద్మ = పద్మమును; ఆసనా = ఆసనముగ; ఆసీనుఁడు = స్వీకరించినవాడు; ఐ = అయి.

భావము:

ఏ లోకేశ్వరుడు అర్జునుడు అడిగాడని చిరునవ్వు చిందిస్తు, పగవారి కళ్ళెదురుగానే రథాన్ని తీసుకు వెళ్ళి ఉభయ సేనలకు మధ్యప్రదేశంలో నిలబెట్టాడో; చిరునవ్వులు చిందిస్తూనే కౌరవపక్ష రాజు లందరిని పేరుపేరునా చూపిస్తు ఆ చూపులతోనే వాళ్ళ ఆయువులన్నీ చిదిమేసాడో; ఆ శ్రీకృష్ణపరమాత్మ నా హృదయపద్మంలో పద్మాసనం వేసుకొని స్థిరంగా వసించుగాక.

1-222-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

వారిఁ జంపఁజాలక
వెనుకకుఁ బో నిచ్చగించు విజయుని శంకన్
యోగవిద్యఁ బాపిన
మునివంద్యుని పాదభక్తి మొనయున్ నాకున్.

టీకా:

తన = తన యొక్క; వారిన్ = వారిని; చంపన్ = చంపుట; చాలక = చేయలేక; వెనుకకున్ = వెనక్కి; పోన్ = వెళ్లుటను; ఇచ్చగించు = కోరుతున్న; విజయుని = అర్జునుని; శంకన్ = సందేహమును; ఘన = గొప్ప; యోగ = యోగమును గూర్చిన; విద్యన్ = విద్యవలన; పాపిన = పోగొట్టిన; ముని = మునులచే; వంద్యుని = స్తుతింపబడువాని, కృష్ణుని; పాద = పాదముల మీది; భక్తి = భక్తి; మొనయున్ = ఉద్భవించును గాక; నాకున్ = నాకు.

భావము:

రణరంగంలో తన బంధుమిత్రుల ప్రాణాలు తీయడానికి ఇష్టపడక వెనుదీస్తున్న ధనుంజయునికి మహా మహిమాన్వితమైన గీతోపదేశం చేసి, సందేహాలు పోగొట్టి, యుద్ధంలో ముందంజ వేయించిన వాని; మునులచే స్తుతింపబడు పరముని పాదభక్తి నాలో పరిఢవిల్లుగాక.

1-223-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

కుప్పించి యెగసినఁ గుండలంబుల కాంతి-
గనభాగం బెల్లఁ ప్పికొనఁగ;
నుఱికిన నోర్వక యుదరంబులో నున్న-
గముల వ్రేఁగున గతి గదలఁ;
క్రంబుఁ జేపట్టి నుదెంచు రయమునఁ-
బైనున్న పచ్చనిటము జాఱ;
మ్మితి నాలావు గుఁబాటు సేయక-
న్నింపు మని క్రీడి రలఁ దిగువఁ;

1-223.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

రికి లంఘించు సింహంబురణి మెఱసి
"నేఁడు భీష్మునిఁ జంపుదు నిన్నుఁ గాతు
విడువు మర్జున!" యనుచు మద్విశిఖ వృష్టిఁ
దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు.

టీకా:

కుప్పించి = దుమికి; యెగసినన్ = పరుగెడుతుండగ; కుండలంబుల = (చెవి) కుండలముల యొక్క; కాంతిన్ = కాంతి; గగన = ఆకాశ; భాగంబు = భాగము; ఎల్లన్ = సమస్తము; కప్పికొనఁగన్ = నిండిపోగా; ఉఱికిన = దుముకిన; ఓర్వక = ఓర్చుకొనలేక; ఉదరంబు = పొట్ట; లోన్ = లోపల; ఉన్న = ఉన్నట్టి; జగముల = జగత్తుల; వ్రేఁగున = వడి వలన; జగతి = భూమి; కదలన్ = కదలగా; చక్రంబున్ = చక్రమును; చేన్ = చేత; పట్టి = పట్టి; చనుదెంచు = వచ్చుచున్న; రయమునన్ = వేగమువలన; పైన = పైన; ఉన్న = ఉన్నట్టి; పచ్చని = పచ్చని; పటము = బట్ట; జాఱన్ = జారగ; నమ్మితిన్ = నమ్ముకొంటిన; నా = నాయొక్క; లావున్ = పరువును; నగుఁబాటు = నవ్వులపాలు; సేయక = చేయకుము; మన్నింపుము = మన్నించుము; అని = అని; క్రీడి = అర్జునుడు; మరలన్ = వెనుకకు; దిగువన్ = లాగుచుండగా; కరి = ఏనుగు; కి = కొరకు;
లంఘించు = దూకు; సింహంబు = సింహము; కరణి = వలె; మెఱసి = ప్రకాశించుచు; నేఁడు = ఈవేళ; భీష్మునిన్ = భీష్ముని; చంపుదున్ = సంహరించెదను; నిన్నున్ = నిన్ను; కాతు = కాపాడుదును; విడువుము = వదులు; అర్జున = అర్జునా; అనుచున్ = అనుచూ; మత్ = నాయొక్క; విశిఖ = బాణముల; వృష్టిన్ = వానను; తెరలి = తప్పించుకొని; చనుదెంచు = వచ్చు; దేవుండు = దేవుడు; దిక్కు = శరణమగుగాక; నాకు = నాకు.

భావము:

ఆ నాడు యుద్ధభూమిలో నా బాణవర్షాన్ని భరించలేక నా మీదికి దుమికే నా స్వామి వీరగంభీర స్వరూపం ఇప్పటికీ నాకు కళ్ళకు కట్టినట్లే కన్పిస్తున్నది;
కుప్పించి పై కెగరగా కుండలాల కాంతులు గగనమండలం నిండా వ్యాపించాయి; ముందుకు దూకడంతో తుళ్ళే బొజ్జలోని ముజ్జగాలనే పిండాండం వడికి బ్రహ్మాండం కంపించిపోయింది; చేతిలో చక్రాన్ని ధరించి అరుదెంచే వేగానికి పైనున్న బంగారుచేలం జారిపోయింది; “నమ్ముకొన్న నన్ను నలుగురిలో నవ్వులపాలు చేయవ ” ద్దని మాటిమాటికి కిరీటి వెనక్కు లాగుతున్నా లెక్కచేయకుండ “అర్జునా! నన్ను వదులు. ఈ నాడు భీష్ముని సంహరించి నిన్ను కాపాడుతాను” అంటూ కరిపైకి లంఘించే కంఠీరవం లాగా నా పైకివస్తున్నాడు. అట్టి గోపాల దేవుడే నాకు రక్ష.

1-224-మ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

కున్ భృత్యుఁడు వీనిఁ గాఁచుట మహార్మంబు వొమ్మంచు న
ర్జుసారథ్యము పూని పగ్గములు చేఁ జోద్యంబుగాఁ బట్టుచున్
మునికోలన్ వడిఁ బూని ఘోటకములన్ మోదించి తాడించుచున్
నులన్మోహము నొందఁ జేయు పరమోత్సాహుం బ్రశంసించెదన్.

టీకా:

తన = తన; కున్ = కు; భృత్యుఁడు = సేవకుడు; వీనిన్ = ఇతనిని; కాఁచుట = కాపాడుట; మహా = ముఖ్యమైన; ధర్మంబు = ధర్మము; ఒమ్ము = పొమ్ము; అంచున్ = అనుచు; అర్జున = అర్జునుని; సారథ్యము = రథసారథ్యము; పూని = చేపట్టి; పగ్గములు = పగ్గములను; చేన్ = చేతితో; చోద్యంబుగాన్ = ఆశ్చర్యకరముగ; బట్టుచున్ = పట్టుకొని; మునికోలన్ = ములుగఱ్ఱను; వడిన్ = త్రిప్పు వేగమును; పూని = కూడి ఉండి; ఘోటకములన్ = గుఱ్ఱములను; మోదించి = సంతోషపరచి; తాడించుచున్ = అదలించుచు; జనులన్ = ప్రజలను; మోహము = మోహము; ఒందన్ = పొంద; చేయు = చేయుచున్న; పరమ = మిక్కిలి; ఉత్సాహున్ = ఉత్సాహముగలవానిని; ప్రశంసించెదన్ = స్తోత్రము చేసెదను.

భావము:

ఇతడు అర్జునుడు నా సేవకుడు. ఇతనిని కాపాడవలసి ఉన్నది అంటున్నాడు. అది పరమ ధర్మముట. అందుకని, అర్జునుని రథానికి సారథ్యము చేస్తున్నాడు. పగ్గములను ఆశ్చర్యకరముగ పట్టుకొన్నాడు. మిక్కిలి ఉత్సాహంతో ములుగఱ్ఱ వేగముగా తిప్పుతూ, గుఱ్ఱములను మోదిస్తూ, తాడిస్తున్నాడు. చూసే ప్రజలను మోహింపజేస్తున్నాడు. చూడు అదిగో అట్టి ఆ శ్రీకృష్ణుని స్తోత్రము చేస్తున్నాను.

1-225-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

లుకుల నగవుల నడపుల
లుకల నవలోకనముల నాభీరవధూ
కుముల మనముల తాలిమి
కొలుకులు వదలించు ఘనునిఁ గొలిచెద మదిలోన్.

టీకా:

పలుకులన్ = పలుకులతోను; నగవులన్ = చిరునవ్వులతోను; నడపులన్ = ప్రవర్తనలలోను; అలుకలన్ = అలుకలుతోను; అవలోకనములన్ = చూపులతోను; ఆభీర = గోపికా; వధూ = స్త్రీ; కులముల = సమూహముల; మనముల = మనసులలోని; తాలిమి = ఓర్పు, ధైర్యము; కొలుకులు = కొల్చుటలు; వదలించు = సడలించు; ఘనునిన్ = గొప్పవానిని; కొలిచెదన్ = పూజించెదను; మది = మనస్సు; లోన్ = లోపల.

భావము:

తియ్యని మాటలతో మందహాసాలతో, ప్రవర్తనలతో, ప్రణయకోపాలతో, వాల్చూపులతో వ్రజవధూమణుల వలపులు దోచుకొనే వాసుదేవుడిని మనస్సులో మరీ మరీ సేవిస్తాను.

1-226-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మునులు నృపులుఁ జూడ మును ధర్మజుని సభా
మందిరమున యాగమండపమునఁ
జిత్రమహిమతోడఁ జెలువొందు జగదాది
దేవుఁ డమరు నాదు దృష్టియందు.

టీకా:

మునులు = మునులు; నృపులు = రాజులు; చూడ = చూస్తుండగ; మును = పూర్వము; ధర్మజుని = ధర్మరాజు యొక్క {ధర్మజుడు - యమధర్మరాజు కొడుకు, ధర్మరాజు}; సభా = సభదీర్చు; మందిరమున = భవనములో; యాగ = యజ్ఞముచేయు; మండపమునన్ = మండపములో; చిత్ర = చిత్రమైన; మహిమ = ప్రాభవము; తోడన్ = తో; చెలువొందు = అందాలొలికించు; జగత్ = విశ్వమునకు; ఆది = మూలపు; దేవుఁడు = దేవుడు; అమరున్ = కుదురుకొనుగాక; నాదు = నా యొక్క; దృష్టి = చూపుల; అందున్ = లోపల.

భావము:

మునీంద్రులు, నరేంద్రులు చూస్తూ ఉండగా యింతకు మునుపు ధర్మరాజు సభామందిరంలోని యజ్ఞ మండపంలో చిత్ర విచిత్ర ప్రభావాలతో ప్రకాశించే విశ్వనాథుడు నా చూపుల్లో స్థిరంగా యున్నాడు.

1-227-మ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

సూర్యుండు సమస్తజీవులకుఁ దా నొక్కొక్కఁడై తోఁచు పో
లి నే దేవుఁడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జ
న్య దంబంబుల హృత్సరోరుహములన్ నానావిధానూన రూ
కుఁడై యొప్పుచునుండు నట్టి హరి నేఁ బ్రార్థింతు శుద్ధుండనై.""

టీకా:

ఒక = ఒకే; సూర్యుండు = సూర్యుడు; సమస్త = సమస్తమైన; జీవులు = జీవులు; కున్ = కును; తాన్ = తను; ఒక్కొక్కఁడు = ఒక్కొక్కడుగా; ఐ = అయి; తోఁచు = కనిపించు; పోలికన్ = విధముగ; ఏ = ఏ; దేవుండు = దేవుడు; సర్వ = సమస్తమైన; కాలము = కాలమునందు; మహా = గొప్ప; లీలన్ = లీలతో; నిజ = తననుండి; ఉత్పన్న = జనించిన; జన్య = జీవుల; కదంబంబుల = సమూహముల; హృత్ = హృదయ; సరోరుహములన్ = పద్మములలోను {సరోరుహము - సరసున రుహము (పుట్టినది), పద్మము}; నానావిధ = అనేక రకములైన; ఆనూన = గొప్పవియైన; రూపకుఁడు = రూపముకలవాడు; ఐ = అయి; ఒప్పుచు = ఒప్పుతు; ఉండున్ = ఉండును; అట్టి = అటువంటి; హరిన్ = హరిని {హరి - సర్వ దుఃఖములను, పాపములను హరించు వాడు, ప్రళయకాలమున సర్వము తన గర్భమున హరించుకొనువాడు, విష్ణువు, హకారముతో కూడిన నిశ్వాసము రేఫతో కూడిన కంఠనాదము - ఓంకారము}; నేన్ = నేను; ప్రార్థింతు = పూజింతు; శుద్ధుండను = పరిశుద్ధుడను; ఐ = అయి.

భావము:

ఉన్న ఒకే ఒక్క సూర్యుడు సకల జీవరాసులకు ఒక్కొక్కడుగా కానవస్తాడు కదా. ఆ విధంగానే తాను సృష్టించిన నానావిధ ప్రాణి సమూహాల హృదయ కమలాలలో నానా విధాల రూపాలతో సర్వకాల సర్వావస్థల యందు తన లీలా విలాసంతో తనరారే నారాయణుని పవిత్రహృదయంతో ప్రార్థిస్తున్నాను.""

1-228-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అని యిట్లు మనోవాగ్దర్శనంబులం బరమాత్ముం డగు కృష్ణుని హృదయంబున నిలిపికొని, నిశ్వాసంబులు మాని, నిరుపాధికం బయిన వాసుదేవ బ్రహ్మంబు నందుం గలసిన భీష్మునిం జూచి సర్వజనులు దివసావసానంబున విహంగంబు లూరకయుండు తెఱంగున నుండిరి; దేవ మానవ వాదితంబులై దుందుభి నినాదంబులు మొరసె; సాధుజన కీర్తనంబులు మెఱసెఁ; గుసుమ వర్షంబులు గురిసె; మృతుం డయిన భీష్మునికి ధర్మజుండు పరలోక క్రియలు సేయించి ముహూర్త మాత్రంబు దుఃఖితుం డయ్యె; నంత నచ్చటి మునులు కృష్ణునిఁ తమ హృదయంబుల నిలిపికొని సంతుష్టాంతరంగు లగుచుం దదీయ దివ్యావతార నామంబులచే స్తుతియించి స్వాశ్రమంబులకుం జనిరి; పిదప నయ్యుధిష్ఠిరుండు కృష్ణసహితుండై గజపురంబునకుం జని గాంధారీ సమేతుం డయిన ధృతరాష్ట్రు నొడంబఱచి తత్సమ్మతంబున వాసుదేవానుమోదితుండై పితృపైతామహంబైన రాజ్యంబుఁ గైకొని ధర్మమార్గంబునఁ బ్రజాపాలనంబు సేయుచుండె"నని చెప్పిన విని సూతునకు శౌనకుం డిట్లనియె.

టీకా:

అని = అని; ఇట్లు = ఈ విధముగ; మనస్ = మనసులోను; వాక్ = మాటలలోను; దర్శనంబులన్ = దర్శనములలోను; పరమ = పరమమైన; ఆత్ముండు = ఆత్మగలవాడు; అగు = అయిన; కృష్ణుని = కృష్ణుని {కృష్ణుడు - 1. నల్లనివాడు, 2. భక్తుల హృదయములు ఆకర్షించువాడు, 3. శ్లో. కృషిర్భూవాచకశ్శబ్దో నశ్చ నిరృతివాచకః, పూర్ణానంద పరబ్రహ్మ కృష్ణ ఇత్యభీయతే., పూర్ణానంద పరబ్రహ్మము, కృష్ణుడు, నల్లనివాడు, 4. కృఞకరణే అను ధాతువుచేత సృష్టిస్థితిలయములను చేయువాడు, 5. శ్లో. కృషిర్భూవాచకశ్శబ్దోనశ్చ నిర్వృతివాచకః, తయోరైక్యాత్పరంబ్రహ్మ కృష్ణ ఇత్యభిధీయతే (ప్రమాణము), అజ్ఞానబంధమును తెంచివేయువాడు, కృష్ణుడు}; హృదయంబున = మనసులో; నిలిపికొని = స్థిరపరచుకొని; నిశ్వాసంబులు = ఊపిరితీసుకొనుట; మాని = మానివేసి; నిరుపాధికంబు = హేతువుకు అతీతమగునది; అయిన = అయినట్టి; వాసుదేవ = ఆత్మలలో వసించే దైవమైన; బ్రహ్మంబు = బ్రహ్మ, వాసుదేవ బ్రహ్మ; అందున్ = లో; కలసిన = కలసిపోయిన; భీష్మునిన్ = భీష్ముని; చూచి = చూసి; సర్వ = సమస్త; జనులు = ప్రజానీకము; దివస = దినమునకు; అవసానంబున = అంతమున, సాయం సంధ్యలో; విహంగంబులు = పక్షులు; ఊరక = నిశ్శబ్దముగ; ఉండు = ఉండే; తెఱంగునన్ = విధమున; ఉండిరి = ఉన్నారు; దేవ = దేవతలచే; మానవ = మానవులచే; వాదితంబులు = మ్రోగింపబడుచున్నవి; ఐ = అయిన; దుందుభి = దుందుభుల; నినాదంబులు = శబ్దములు; మొరసెన్ = మ్రోగినవి; సాధుజన = సజ్జనులు చేసిన; కీర్తనంబులు = స్తుతులు; మెఱసె = ప్రకాశించినవి; కుసుమ = పూల; వర్షంబులు = వానలు; కురిసె = వర్షించినవి; మృతుండు = చనిపోయినవాడు; అయిన = అయినట్టి; భీష్ముని = భీష్ముని; కిన్ = కి; ధర్మజుండు = ధర్మరాజు {ధర్మజుడు - యమధర్మరాజు కొడుకు, ధర్మరాజు}; పరలోకక్రియలు = శ్రాద్ధకర్మలు {పరలోకక్రియలు - మరణానంతరము జీవి, పై లోకములకేగుటకు చేసెడి విధులు, కార్యక్రమము, ఉత్తరక్రియలు}; చేయించి = చేయించి; ముహూర్త = ముహూర్త; మాత్రంబు = కాలము; దుఃఖితుండు = దుఃఖించిన వాడు; అయ్యెన్ = అయ్యెను; అంతన్ = అంతట; అచ్చటి = అక్కడ ఉన్న; మునులు = మునులు; కృష్ణునిన్ = హరిని; తమ = తమ యొక్క; హృదయంబులన్ = హృదయములలో; నిలిపికొని = స్థిరపరచుకొని; సంతుష్ట = సంతృప్తి చెందిన; అంతరంగులు = అంతరంగము గలవారు; అగుచున్ = అవుతూ; తదీయ = అతని యొక్క; దివ్య = దివ్యమైన; అవతార = అవతారములను; నామంబులు = నామములు; చేన్ = చేత; స్తుతియించి = ప్రార్థించి; స్వ = తమ యొక్క; ఆశ్రమంబులు = ఆశ్రమములు; కున్ = కు; చనిరి = వెళ్ళిరి; పిదపన్ = ఆతరువాత; ఆ = ఆ; యుధిష్ఠిరుండు = ధర్మరాజు; కృష్ణ = కృష్ణునితో; సహితుండు = కూడుకొన్నవాడు; ఐ = అయి; గజపురంబున్ = హస్తినాపురము; కున్ = నకు; చని = వెళ్ళి; గాంధారీ = గాంధారితో; సమేతుండు = కూడినవాడు; అయిన = అయినట్టి; ధృతరాష్ట్రున్ = ధృతరాష్ట్రుని; ఒడంబఱచి = ఒప్పించి; తత్ = అతని; సమ్మతంబునన్ = ఒప్పుకోలుతో; వాసుదేవ = వసుదేవసుతుని, కృష్ణుని; అనుమోదితుండు = అనుమతిపొందినవాడు; ఐ = అయి; పితృ = తండ్రి నుండి వచ్చినదియు; పైతామహంబు = వంశపారంపర్యము {పైతామహము - తాతలకు సంబంధించినది, అనువంశికము}; ఐన = అయినట్టి; రాజ్యంబున్ = రాజ్యమును; కైకొని = స్వీకరించి; ధర్మ = ధర్మబద్ధమైన; మార్గంబునన్ = విధముగ; ప్రజా = ప్రజలను; పాలనంబు = పరిపాలించుట; సేయుచుండెన్ = చేయుచుండెను; అని = అని; చెప్పిన = చెప్పగా; విని = ఆలకించి; సూతున = సూతున; కున్ = కు; శౌనకుండు = శౌనకుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

ఈ ప్రకారంగా గాంగేయుడు మనస్సుద్వారా, వాక్కులద్వారా, దృక్కులద్వారా శ్రీకృష్ణపరమాత్మను హృదయంలో పదిలపరచుకొని; నిశ్వాసాన్ని నిరోధించి; నిరుపాధిక పరబ్రహ్మమైన వాసుదేవునిలో ఐక్యమైయ్యాడు. అప్పుడు అది చూసి అక్కడ ఉన్న వారందరూ సంధ్యా సమయంలో పక్షుల్లా మౌనం వహించారు; దేవలోకంలోను, మానవ లోకంలోను దుందుభులు ధ్వనించాయి; సాధుసంకీర్తనలు వినిపించాయి; పూలవానలు కురిశాయి; తనువు చాలించిన దేవనదీ పుత్రునికి దహన సంస్కారాలు జరిపించి; ధర్మరాజు ముహూర్తకాలం దుఃఖించాడు. అక్కడి మును లందరు శ్రీకృష్ణుని రూపం తమ మనస్సులలో నిలుపుకొని; ఆయన దివ్యావతారాలను కొనియాడుతూ సంతోషితస్వాంతులై తమ తమ ఆశ్రమాలకు తరలిపోయారు. అనంతరం ధర్మనందనుడు నందనందనునితో కలిసి హస్తినాపురానికి వెళ్లాడు. అక్కడ గాంధారీ సహితుడైన ధృతరాష్ట్రుణ్ణి ఒప్పించి అతని అంగీకారంతో, శ్రీకృష్ణుని ఆమోదంతో తన తాత తండ్రులు పరిపాలించిన రాజ్యాన్ని స్వీకరించినవాడై ధర్మం తప్పకుండా ప్రజలను పరిపాలించసాగాడు.”ఇలా చెప్పగానే శౌనకుడు సూతమహర్షిని ఇలా అడిగాడు.

1-229-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"నము లపహరించి నతోడఁ జెనకెడు
నాతతాయి జనుల ని వధించి
బంధు మరణ దుఃఖ రమున ధర్మజుఁ
డెట్లు రాజ్యలక్ష్మినిచ్చగించె?""

టీకా:

ధనములు = ధనములను; అపహరించి = దొంగిలించి; తన = తన; తోడన్ = మీద; చెనకెడు = గొడవచేయువారు; ఆతతాయి = హత్యలు చేయువారైన; జనులన్ = మానవులను; అనిన్ = యుద్ధములో; వధించి = సంహరించి; బంధు = బంధువుల; మరణ = మరణమువలన కలిగెడు; దుఃఖ = బాధ యొక్క; భరమున = భారముతో; ధర్మజుఁడు = ధర్మరాజు; ఎట్లు = ఏవిధముగ; రాజ్యలక్ష్మిన్ = రాజ్యమును; ఇచ్చగించె = అంగీకరించెను.

భావము:

తన సిరిసంపదలన్నీ అపహరించి తనతో యుద్ధానికి సిద్ధమైన దుర్మార్గపు ఆతతాయిలను (ఇంటికి నిప్పు పెట్టేవాడు, విషము పెట్టేవాడు, కత్తితో నరికేవాడు, ధనము దోచుకొనే వాడు, నేల నపహరించేవాడు, ఇతరుల భార్యను చెరపట్టేవాడు వీరారుగురుని ఆతతాయి అంటారు) సమరంలో సంహరించిన ధర్మరాజు చుట్టాలందరు మరణించారనే దుఃఖభారంతో కూడి ఉండి ఈ రాజ్యభారాన్ని భరించటానికి ఏ విధంగా అంగీకరించాడు అని అడిగాడు.

1-230-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అనిన సూతుం డిట్లనియె.

టీకా:

అనిన = అనగా; సూతుండు = సూతుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

ఇలా అడిగిన శౌనకుడికి, సూతుడు ఇలా సమాధానం చెప్పాడు.