పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : కృతిపతి నిర్ణయము

  •  
  •  
  •  

1-20-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కొంఱకుఁ దెనుఁగు గుణమగుఁ,
గొంఱకును సంస్కృతంబు గుణమగు, రెండుం
గొంఱికి గుణములగు, నే
నంఱ మెప్పింతుఁ గృతుల య్యై యెడలన్.

టీకా:

కొందఱు = కొంతమంది; కున్ = కి; తెనుఁగు = తెలుగు {తెనుగుగుణమగు - తెలుగు(దేశీయ) పదాల ప్రయోగం ఎక్కువ వుంటే నచ్చుతుంది}; గుణము = బాగుగ; అగున్ = ఉండును; కొందఱకును = కొంతమందికి; సంస్కృతంబు = సంస్కృతము {సంస్కృతంబుగుణమగుట - సంస్కృతమూలపదాల ప్రయోగం ఎక్కువ వుంటే నచ్చుట}; గుణము = బాగుగ; అగున్ = ఉండును; రెండున్ = రెండూ; కొందఱి = కొంతమంది; కిన్ = కి; గుణములగు = బాగుగ ఉంటాయి; నేన్ = నేను; అందఱ = అందర్ని; మెప్పింతు = మెప్పిస్తాను; కృతులన్ = రచనలలో; ఆయ్యై = ఆయా; ఎడలన్ = సందర్భానుసారంగా.

భావము:

తెలుగు పదాలతో కూర్చి వ్రాసినవి కొంతమందికి నచ్చుతాయి. సంస్కృత పదాలుతో కూర్చి వ్రాసిన రచనలు మరికొంతమందికి నచ్చుతాయి. ఇంకొంతమందికి రెండు రకాల పదప్రయోగాలు నచ్చుతాయి. నేను అందరు మెచ్చుకొనేలా భాగవతం ఆంధ్రీకరిస్తాను.