ప్రథమ స్కంధము : అశ్వత్థామని తెచ్చుట
- ఉపకరణాలు:
భూపాలకులకు విప్రుల
గోపింపం జేయఁ దగదు కోపించినఁ, ద
త్కోపానలంబు మొదలికి
భూపాలాటవులఁ గాల్చు భూకంపముగన్.""
టీకా:
భూపాలకులు = రాజుల; కున్ = కి; విప్రులన్ = బ్రాహ్మణులను; కోపింపన్ = కోపించుట; చేయన్ = చేయుటకు; తగదు = తగినది కాదు; కోపించినన్ = కోపము చేసినచో; తత్ = ఆ యొక్క; కోప = కోపము అనే; అనలంబు = అగ్ని; మొదలి = మొదలకి; కిన్ = అంటా; భూపాల = రాజులు అను; అటవులన్ = అడవులను; కాల్చు = కాల్చివేయును; భూ = భూమి; కంపముగన్ = కంపించునట్లుగా.
భావము:
ప్రజాపాలకులగు క్షత్రియులు బ్రాహ్మణులకు కోపం తెప్పించేలా చేయరాదు. అలా చేస్తే, విప్రుల కోపాగ్ని జ్వాల కార్చిచ్చులా భూకంపంలా వారి వంశాల నాశనానికి దారితీస్తుంది.”