పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : అశ్వత్థామని తెచ్చుట

  •  
  •  
  •  

1-164-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

క్కట! పుత్త్ర శోక జనితాకులభార విషణ్ణచిత్తనై
పొక్కుచు నున్న భంగి నినుఁ బోరఁ గిరీటి నిబద్ధుఁ జేసి నేఁ
డిక్కడ కీడ్చి తెచ్చుట సహింపనిదై భవదీయ మాత, నేఁ
డెక్కడ నిట్టి శోకమున నేక్రియ నేడ్చుచుఁ బొక్కుచున్నదో?""

టీకా:

అక్కట = అయ్యో; పుత్త్రశోక = పుత్రులు పోయిన దుఃఖం వలన; జనిత = పుట్టిన; ఆకుల = బాధ యొక్క; భార = భారముతో; విషణ్ణ = దుఃఖ పడిన; చిత్తన్ = మనసు కల దానను; ఐ = అయి; పొక్కుచున్ = కుమిలిపోతూ; ఉన్న = ఉన్నట్టి; భంగిన్ = విధంగానే; నినున్ = నిన్ను; పోరన్ = యుద్ధములో; కిరీటి = అర్జునుడు; నిబద్ధున్ = బంధింపబడిన వానిగా; చేసి = చేసి; నేఁడు = ఇవాళ; ఇక్కడ = ఇక్కడ; కున్ = కు; ఈడ్చి = లాక్కొంటూ; తెచ్చుటన్ = తీసుకొచ్చుటను; సహింపనిది = ఓర్చుకో లేనిది; ఐ = అయి; భవదీయ = మీ యొక్క; మాత = తల్లి; నేఁడు = ఇవాళ; ఎక్కడన్ = ఎక్కడ; ఇట్టి = ఇలాంటి; శోకమున = దుఃఖముతో; ఏ = ఏ; క్రియన్ = విధంగా; ఏడ్చుచున్ = ఏడుస్తూ; పొక్కుచు = కుమిలిపోతూ; ఉన్నదో = ఉన్నదోకదా.

భావము:

పుత్రశోకంతో బరువెక్కి వ్యాకుల మైన చిత్తంతో నేను ఇక్కడ ఏడుస్తు ఉన్నాను. అలాగే పోరాటంలో అర్జునుడు నిన్ను కట్టేసి ఈడ్చుకొచ్చాడన్న విషయం తెలిసి, అయ్యయ్యో! అశ్వత్థామా! అక్కడ మీ అమ్మ కూడా తట్టుకోలేక ఎంతటి దుఃఖంతో కుమిలి పోతూ ఉంటుందో కదా.”