పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : ఉపోద్ఘాతము

  •  
  •  
  •  

1-9-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అం, నవాంబుజోజ్జ్వలకరాంబుజ, శారదచంద్రచంద్రికా
డంర చారుమూర్తి, ప్రకస్ఫుట భూషణ రత్నదీపికా
చుంబిత దిగ్విభాగ, శ్రుతిసూక్తి వివిక్త నిజప్రభావ, భా
వాంరవీధి విశ్రుతవిహారిణి, నన్ గృపఁ జూడు భారతీ!

టీకా:

అంబ = తల్లీ; నవ = అప్పుడే పుట్టిన; అంబుజ = పద్మములతో; ఉజ్వల = ప్రకాశిస్తున్న; కర = చేతులనే; అంబుజ = పద్మములు కలదాన; శారద = శరదృతువు లోని; చంద్ర = చంద్రుని; చంద్రిక = వెన్నెల; ఆడంబర = డాబు గల; చారు = అందమైన; మూర్తి = స్వరూపము కలదానా; ప్రకట = ప్రకాశించే; స్ఫుట = కొట్టొచ్చినట్లు కనబడెడి; భూషణ = ఆభరణాల లోని; రత్న = రత్నాల; దీపికా = కాంతి; చుంబిత = స్పృశించు; దిక్ = దిక్కుల; విభాగ = విభాగాలు యున్నదానా; శ్రుతి = వేద; సూక్తి = సూక్తులచే; వివిక్త = వెల్లడింపబడిన; నిజ = స్వంత; ప్రభావ = ప్రభావము కలదానా; భావ = భావాలనే; అంబర = ఆకాశ; వీధి = వీధిలో; విశ్రుత = విస్తృతముగా; విహారిణి = విహరించేదానా; నన్ = నన్ను; కృప = దయ; అన్ = తో; చూడు = అనుగ్రహించుము; భారతీ = సరస్వతీదేవీ.

భావము:

తల్లీ! వికాస ప్రకాశాలకి ప్రతీకగా అప్పుడే వెల్లి విరుస్తున్న పద్మం అలంకరించిన హస్తంతో, శరచ్చంద్రుని వెన్నెల వికాసానికి చల్లదనానికి అనురూప మైన శ్వేత స్వరూపంతో, విజ్ఞాన స్వరూపాలై దిగ్దిగంతాలు సర్వం వెలిగిస్తున్న ఆభరణాల లోని మణి మాణిక్యాల కాంతులతో, వేదసూక్తులు వెల్లడిచేసే స్వీయ ప్రభావంతో, ఉత్తమతమ భావాల పరంపరలలో విస్తృతంగా విహారిస్తుండే భారతీదేవి! నీ దయాపూరిత దృక్కులతో అనుగ్రహించమ్మా!.
అంబ నంవాంబుజోజ్వల. . . పద్యం -1-9-ఉ. ఎఱ్ఱన భారతం నుండి గ్రహించబ బడింది. ఇది మన బమ్మఱ పోతనామాత్యులు పూర్వకవులపై నుండే గౌరవం కొలది / ఈ పద్యంలోని మాధుర్యంపై ఇష్టం చేత తన భాగవతారంభ పద్యాలలో చేర్చారు. ఇది బహుధా ముదవహం అని నా భావన.