పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : గోపికల తాదాత్మ్యత (మధురభక్తి ప్రదం)

  1
పూతన యై యొక్క పొలఁతి చరింపంగ-
శౌరి యై యొక కాంత న్నుగుడుచు;
బాలుఁడై యొక భామ పాలకు నేడ్చుచో-
బండి నే నను లేమఁ బాఱఁదన్ను;
సుడిగాలి నని యొక్క సుందరి గొనిపోవ-
రి నని వర్తించు బ్జముఖియు;
కుఁడ నే నని యొక్క డఁతి సంరంభింపఁ-
ద్మాక్షుఁడను కొమ్మ రిభవించు;

  2
నెలమి రామకృష్ణు లింతు లిద్దఱు గాఁగ
గోపవత్సగణము కొంద ఱగుదు
సురవైరి ననుచు బల యొక్కతె చీరుఁ
సుల మనెడి సతుల రతముఖ్య!

  3
"లోకమెల్లఁ గుక్షిలోపల నున్నది
మాధవుండ నేను మాత వీవు
చూడు"మనుచు నొక్క సుందరి యొకతెకు
ముఖము దెఱచి చూపు ముఖ్యచరిత!

  4
"వెన్నలు దొంగిలి తినియెడి
వెన్నుఁడ"నని యొకతె నుడువ వేఱొక్కతె చే
న్నల యశోద నంచునుఁ
గ్రన్ననఁ గుసుమముల దండఁ ట్టు నిలేశా!

  5
"కాళియఫణి యిది వీరలు
కాళియఫణి సతులు మ్రొక్కఁ డఁగిరి నే గో
పాకుమారుఁడ"ననుచును
లీలాగతి నాడు నొక్క లేమ నరేంద్రా!

  6
"తరుణులు గోపకు లందఱు
రిహయుఁ డిదె వాన గురిసె రి నే"నని భా
సు చేలాంచల మొక్కతె
గిరి నెత్తెద ననుచు నెత్తుఁ గెంగేల నృపా!

  7
"మీలు గోపకు లే నసు
రారిని దావాగ్ని వచ్చె టు చూడకుఁడీ
వారించెద"నని యొక్కతె
చేరి బయల్ కబళనంబు చేయు నరేంద్రా!

  8
ఇతి బమ్మెఱ పోతనామాత్య కృత శ్రీమత్తెలుగు భాగవత దశమస్కంధ పూర్వభాగ అంతర్గత గోపికల తాదాత్మ్యత (మధురభక్తి ప్రదం)