పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : ఉద్ధవుడు గన్న శ్రీకృష్ణుడు. (శుభప్రదం)

  1
స్మత్ప్రియస్వామి చ్యుతుఁ బరు సత్త్వ-
గుణగరిష్ఠుని రజోగుణవిహీను
సురుచిరద్వారకాపురసమాశ్రయు ననా-
శ్రయు నీలనీరదశ్యామవర్ణు
ళదరవిందసుంరపత్రనేత్రు ల-
క్ష్మీయుతుఁ బీతకౌశేయవాసు
విలసితవామాంకవిన్యస్త దక్షిణ-
రణారవిందు శశ్వత్ప్రకాశు

  2
నచతుర్భాహు సుందరాకారు ధీరుఁ
జెన్నుగల లేతరావిపై వెన్నుమోపి
యున్న వీరాసనాసీను న్నుఁగన్న
తండ్రి నానంద పరిపూర్ణు నుజహరుని.

  3
కంటిఁగంటి భవాబ్ధి దాటఁగఁ గంటి నాశ్రితరక్షకుం
గంటి యోగిజనంబుడెందముఁ గంటిఁ జుట్టముఁ గంటి ము
క్కంటికింగనరాని యొక్కటిఁ గంటిఁ దామరకంటిఁ జే
కొంటి ముక్తివిధానముం దలకొంటి సౌఖ్యము లందగన్.

  4
ఇతి బమ్మెఱ పోతనామాత్య కృత శ్రీమత్తెలుగు భాగవత తృతీయ స్కంధ అంతర్గత ఉద్ధవుడు గన్న శ్రీకృష్ణుడు. (శుభప్రదం)