పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తోత్రాలు కీర్తనలు : విజయగోపాల మంగళ హారతి

Facebook@Subrahmanyam Bhamidipati
2016-08-11·
విజయగోపాలతే మంగళం జయ విశ్వంభరతే మంగళం
నందయశోదా నందన సుందర మందస్మిత ధృతమంధర
నందసునందాది వందిత పాదారవింద గోవింద జయమంగళం
చారుకదంబక తరుమూలాశ్రిత చంచలమణిమయకుండల
దారుణవైరిసం హరణపరాత్పర దాసపోషణతేమంగళం
చందనచంపక తులసీకల్పక శీతలవనసంచారిణే
వాచామగోచరచరిత సదానంద వాసుదేవాయతేమంగళం
గోపీమండలగూఢపరాయణ గోవిందగోకులనాయక
ఆపదుద్ధారక అఖిలజనాధార తాపహరణతేమంగళం
వర్ధితగోబృందవనమాలిన్ గోవర్ధనగిరిధర వామన
తీర్థీకృత "శివనారాయణతీర్థ" మానససారస మంగళం