పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవత - జగదభిరక్షణ కాండ : పాండవులు దిగ్విజయ యాత్రకై వెడలుట

టుల బలాఢ్యుఁడై హదేవుఁ డెలమి
 దక్షిణంబున రిగె పెంపొంది; 
కులుఁడుదగ్రసైన్యము తన్ను గొలువఁ 
బ్రటితంబుగ నేఁగెఁ డమటి కడకు; 
బలోపేతుఁడై దలి యర్జునుఁడు
దు దిక్కునకు నుద్ధతవృత్తి నడచె; 
సేమంబుతోడుత నెఱిఁ బూర్వదిశకు
భీబలాఢ్యుఁడై భీముఁడుఁ గదలె;  - 520
నీభంగిఁ జని దిక్కులెల్ల సాధించి
యాభీలరణకేళి హితుల నోర్చి
రిహయమాణిక్యన నిష్కములును
రత్నభూషణాలు లొప్పఁ దెచ్చి
ర్మనందనునకుఁ గ వేఱవేఱ
ర్మిలి నొప్పించి నుజు లిట్లనిరి. 
నాథ! విను జరాసంధుఁడు దక్క
 కరి వెట్టని హివుఁడు లేడు
వాని నిర్జింప కధ్వరకృత్యమునకుఁ
బూనఁగఁ దలఁచుట బుద్ధిగా దెందు.” 
ని పల్క నుర్వీశుఁగు ధర్మసుతునిఁ
నుఁగొని బోధించి కంసారి పలికె.