అనుయుక్తాలు- పారిభాషికపదాలు : వ్యతీపాతము - యోగములు
వ్యతీపాతము– 5. పూర్ణిమా సోమవారముల కలయిక, సోమవారమున పున్నమి అగుట (సూర్యారాయాంధ్ర), అమావాస్య రవివారముల కూడిక (సం. వాచ), తే., పరఁగ సంక్రమణి వ్యతీపాతలందు, సభల భక్తిని వినునట్టి సజ్జనులకు... తె.భాగ. 4-383- తే. . . 6. కార్యాచరణమునకు అశుభముగా ఎంచబడెడి సూర్య చంద్రుల కలయిక, 2. సూచింపబడు మహోపద్రవము. 4. విష్కంభాది యోగములలో పదిహేడవది (27 లో 17)
యోగములు ఇరవైయేడు:
యోగములు – (ఆంధ్రవాచస్పతము) విష్కంభాది.= 1)విష్కంభము, 2)ప్రీతి, 3)ఆయుష్మత్తు (ఆయుష్మాన్, ఆయుష్మతము), 4)సౌభాగ్యము, 5)శోభనము, 6)అతిగండము, 7)సుకర్మము, 8)ధృతి, 9)శూలము, 10)గండము, 11)వృద్ధి, 12)ధ్రువము, 13)వ్యాఘ్రాతము, 14)హర్షణము, 15)వజ్రము, 16)సిద్ధి, 17)వ్యతీపాతము, 18)వరీయస్సు, 19)పరిఘ, 20)శితము, 21)సిద్ధము, 22)సాధ్యము, 23)శుభము, 24)శుభ్రము, 25)బ్రహ్మము, 26)ఐంద్రము, 27)వైధ్రుతి