పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : వాజుల నీరాజనము

వాజులనీరాజనములు వ్యాఖ్యానము 10.1-767 (వచనము)

వాజులనీరాజనము అశ్వాదులకు నీరాజనము అనెడి కర్పూరహారతులిచ్చెడి కార్యక్రమము. శరదృతువునందు రాజులు యుద్ధయాత్రలకు పోవునప్పుడు తమ గుర్రములు, ఏనుగులు, రథములు మున్నగువానికి కర్పూర హారతులు యిచ్చి, ఆ హారతుల మంటలు సవ్యముగా తిరిగిన జయసూచకములు అని చూసుకొనెడి వాడుక కలదు. 

దీనికి ప్రమాణము – 

 శ్లో. తస్మైసమ్యఘ్ఘుతో వహ్ని 

 ప్రదక్షిణార్చిర్వ్యాజేన హస్తేనేవ జయందదౌ. (రఘువంశము) 

 శ్లో. తస్మైసమ్యఘ్ఘుతో వహ్ని 

 ఉన్మీలయతి తురంగమ కరి రథనీరాయనాంకుర్యాత్. (వరహమిహురుడు) 

 శ్లో. తస్మైసమ్యఘ్ఘుతో వహ్నిఅందుచేత, పై వాజి శబ్దము గజరథాశ్వ సూచకముగా గ్రహింపనగును.(ఆధారము - సర్వారాయాంధ్రవారి ఆంధ్రమహాభాగవతము).