పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : త్రికూట పర్వత వర్ణన

8-24 మరియు 8-25 పద్యాలు

వృక్షములు

1 అమలక = ఉసిరి
2 అశోక = అశోకము
3 ఆమ్రాతక = అంబాళము
4 కందరాళ = కలజువ్వి
5 కదంబ = కడిమి
6 కదళీ = అరటి
7 కపిత్థ = వెలగ
8 కరవీర = గన్నేరు
9 కాంచన = ఉమ్మెత్త
10 కుంద = మొల్ల
11 కుటజ = కొండమల్లె
12 కురంటక = పచ్చగోరింట
13 కురవక = ఎఱ్ఱగోరింట
14 కేతకీ = మొగలి
15 కోవిదార = కాంచనపుచెట్లు
16 క్రముక = పోక
17 ఖర్జూర = ఖర్జూరము
18 చందన = చందనము
19 చంపక = సంపెంగ
20 చూత = మామిడి
21 జంబీర = నిమ్మ
22 జంబూ = నేరేడు
23 తక్కోల = తక్కోలము
24 తమాల = చీకటిమానులు
25 తాల = తాడి
26 నాగ = పొన్న
27 నారికేళ = కొబ్బరి
28 పనస = పనస
29 పలాశ = మోదుగ
30 పిచుమంద = వేప
31 పున్నాగ = సొరపొన్న
32 ప్రయాళు = మోరటి
33 బదరీ = రేగు
34 బిల్వ = మారేడు
35 భల్లాతకి = జీడిమామిడి
36 మందార = మందారము
37 మధూక = ఇప్ప
38 మరువక = మరువము
39 మల్లికమతల్లిక = మంచిమల్లెలు
40 మాతులుంగ = మాదీఫలము
41 మాధవీ = గురివింద
42 రసాల = తియ్యమామిడి
43 లవంగ = లవంగము
44 లుంగ = పుల్లమాదీఫలము
45 వంజుళ = ప్రబ్బ
46 వకుళ = పొగడ
47 వట = మఱ్ఱి
48 శతపత్ర = తామర
49 శింశుప = ఇరుగుడు
50 శిరీష = దిరిసెన
51 సరళ = తెల్లతెగడ
52 సాల = మద్ది
53 సింధువార = వావిలి
54 హింతాల = గిరికతాడి చెట్టు

వృక్షసంబంధ
1 అంకురితము = మొలక
2 కుసుమ = పూవు
3 కోరకము = మొగ్గ
4 పల్లవి = చిగురించిన చిగుర్లు
5 ఫలితము = పండినది
6 లలిత = చక్కటివి
7 విటపము = కొమ్మ
8 విటపి = కొమ్మలుగల చెట్లు
9 వీరుధము = పొద

నీటిపూలు
1 కమల = పద్మములు
2 కల్హార = ఎర్రకలువలు
3 కాంచన = బంగారుకాంతితోకూడిన కలువలు
4 కుముద = తెల్లకలువలు

జంతువులు
1 కంఠీరవములు = సింహములు
2 కిటి = సీమపందులు
3 ఖడ్రమృగములు = ఖడ్గమృగములు
4 గండభేరుండములు = గండభేరుండ పక్షలు
5 గంధగజములు = మదపుటేనుగులు
6 గవయములు = గురుపోతులు
7 చమరములు = చమరీమృగములు
8 ఝిల్లీ = ఈలపురుగు
9 ఫణి = పాములు
10 భల్లములు = ఎలుగుబంట్లు
11 భల్లుకములు = ఎలుగుబంట్లు
12 మర్కటములు = కోతులు
13 మల్లాద్భుత = అద్భుతమైన కోతులు
14 మహిషములు = దున్నపోతులు
15 మహోరగములు = కొండ చిలవలు
16 మార్జాలములు = పిల్లులు
17 లులాయక = అడవిదున్నలు
18 వరాహములు = అడవి పందులు
19 వలిముఖ = కొండముచ్చలు
20 శరభక = శరభమృగములు
21 శరభములు = శరభమృగములు
22 శల్యములు = ముళ్ళపందులు
23 శశములు = కుందేళ్ళు
24 శార్దూలములు = పులులు
25 సారంగములు = జింక
26 సాలావృకములు = తోడేళ్ళు
27 హరి = సింహములు

పక్షులు
1 కాక = కాకులు
2 ఘూక = గుడ్లగూబలు
3 పిక = కోయిల
4 శుక = చిలుక

నీటిపక్షులు
1 కలహంస = కలహంసలు
2 కారండవ = కారండవములు
3 కోయష్టిక = చీకుకొక్కెరలు
4 చక్రవాక = చక్రవాకములు
5 జలకుక్కుట = నీటికోళ్ళు
6 బక = కొంగలు
7 బలాక = కొక్కెరలు
8 శకుంత = శకుంతలములు

విలువైన రాళ్ళు
1 కనకము = బంగారము
2 కమలరాగములు = కమలరాగమణులు
3 కలధౌతము = వెండి
4 గోమేధికములు = గోమేధికమలు
5 తుహినకరకాంతలు = చంద్రకాంతశిలలు
6 నీలములు = నీలమణులు
7 పుష్యరాగములు = పుష్యరాగములు
8 మణి = మణులు
9 మరకతములు = పచ్చలు
10 వజ్రములు = వజ్రములు
11 వైఢూర్యములు = వైఢూర్యములు

వ్యక్తులు
1 కింపురుష = కింపురుషుల
2 కిన్నర = కిన్నరల
3 గంధర్వ = గంధర్వుల
4 గరుడ = గరుడుల
5 చారణ = చారణుల
6 భిల్ల = భిల్లులు, చెంచులు
7 భిల్లీ = భిల్లుస్త్రీలు, చెంచితలు
8 విద్యాధర = విద్యాధరుల
9 విబుధ = జ్ఞానుల
10 సిద్ధ = సిద్ధుల

వ్యక్తుల పలుకులు
1 ప్రసంగములు = చర్చలు
2 సంగీతములు = పాటలు
3 సల్లాపములు = మంచిమాటలు

నేలలు
1 తరంగిణి = సెలయేరు
2 పులినము = ఇసుకతిన్నె
3 మణితలము = మణిశిల, ఎర్రమన్ను నేల
4 వాలుము = ఇసుక