అనుయుక్తాలు- పారిభాషికపదాలు : తన్మాత్రలు - సృష్టి
తన్మాత్రలు - సృష్టి
- మహత్తత్త్వం నుండి క్రియాశక్తి రూపమైన అహంకారం పుట్టింది.
- అహంకారం 3 రకాలుగా విడిపోయింది. అవి, 1) వైకారికం, 2) తైజసం, 3) తామసం
- వైకారికాహంకారం – మనస్సుకూ, పంచేంద్రియాలకూ, అకాశాది పంచభూతాలకూ – ఉత్పత్తి స్థానం. దేవతారూపం.
- తైజసాహంకారం – బుద్ధిరూపం, ప్రాణరూపం
- తామసాహంకారం - ఇంద్రియార్థాలతో కూడినది, ప్రయోజన మాత్రం
- తైజసాహంకారం వల్ల బుద్ధితత్త్వం పుట్టింది.
- బుద్ధితత్త్వం లక్షణాలు: 1) ద్రవ్యాన్ని ప్రకాశింపజేసే జ్ఞానం, 2) ఇంద్రియానుగ్రహం, 3) సంశయం, 4) మిథ్యాజ్ఞానం, 5)నిద్ర, 6) నిశ్చయం, 7) స్మృతి
- తైజసాహంకారం వల్ల క్రియాజ్ఞాన సాధనాలు ఏర్పడుతాయి
- జ్ఞానేంద్రియాలు = ఐదు - క్రియాశక్తి
- కర్మేంద్రియాలు = ఐదు – జ్ఞానశక్తి
- తామసాహంకారం నుండి శబ్దతన్మాత్ర పుట్టింది.
- శబ్దతన్మాత్రం నుండి ఆకాశం పుట్టింది.
- ఆకాశం నుండి శ్రోత్రేంద్రియం (చెవి) పుట్టింది.
- చెవి శబ్దాన్ని గ్రహిస్తుంది. శబ్దజ్ఞానజనకం అవుతున్నది.
- శబ్దతన్మాత్రం వల్ల ఆకాశం ఏర్పడింది.
- ఆకాశం సకల జీవులకు లోపల వెలుపల అవకాశం ఈయటమే కాక ఆత్మకూ, ప్రాణాలకూ, ఇంద్రియాలకూ ఆశ్రయంగా ఉంటుంది.
- ఆకాశం వల్ల స్పర్శమూ, స్పర్శం వల్ల వాయువూ, వాయువు వల్ల స్పర్శను గ్రహించగల చర్మమూ పుట్టింది.
- చర్మం – స్పర్శజ్ఞానం, మెత్తదనం, గట్టిదనం, చల్లదనం, వెచ్చదనం
- వాయువు లక్షణాలు – కదలుట, కదలించుట, వేరుచేయుట, కలుపుట, ద్రవ్యనేతృత్వం, శబ్దనేతృత్వం, సర్వేంద్రియాత్మకత్వం
- ద్రవ్యాల వాసన చెప్పేది ద్రవ్యనేతృత్వం.
- దూరంగా ఉన్న శబ్దాన్ని చెవికి వినిపింపజేయటం శబ్దనేతృత్వం.
- వాయువు వల్ల రూపం పుట్టింది.
- రూపం వలన తేజస్సు కలిగింది.
- రూపానికి వృత్తులు - ఉపలంభకత్వం (అనుభవం కలుగడం), ద్రవ్యాకారసమత్వం (ద్రవ్యంయొక్క ఆకారాన్ని ఉన్నదున్నట్లుగా చూపడం), ద్రవ్యోపసర్జనం (ద్రవ్యం అప్రధానం కావడం), ద్రవ్యపరిణామ ప్రతీతి (ద్రవ్యంయొక్క మార్పు తెలియడం).
- తేజస్సుకు సాధారణ ధర్మాలు - ద్యోతం, పచనం, పిపాస, ఆకలి, చలి.
- ద్యోతానికి ప్రకాశం, పచనానికి బియ్యం మొదలైన పాకం, పిపాసకు పానం, ఆకలికి ఆహారం, చలికి శోషణం అనేవి వృత్తులు.
- తేజస్సు వల్ల రసతన్మాత్రం పుట్టింది.
- రసతన్మాత్ర వల్ల జలం పుట్టింది.
- జిహ్వ రసాన్ని గ్రహించేది అయింది.
- రసం – వగరు, చేదు, కారం, పులుపు, తీపి, ఉప్పు మున్నగునవి
- జలం వృత్తులు - ఆర్ద్రం కావడం, ముద్ద గట్టడం, తృప్తినివ్వడం, జీవనం, మాలిన్యాన్ని నివారించడం, మెత్తపరచడం, తాపాన్ని పోగొట్టడం, బావిలో జెలలు ఏర్పడి అడుగున ఉన్న జలం పైకెగయడం
- జలం నుండి గంధతన్మాత్రం పుట్టింది.
- గంధతన్మాత్రం వలన పృథ్వి (భూమి) ఏర్పడింది.
- ఘ్రాణేంద్రియం (ముక్కు) గంధాన్ని గ్రహించేది.
- గంధం – ఇంగువ వంటి మిశ్రమ గంధం, దుర్గంధం, సుగంధం, శాంతగంధం, ఉగ్రగంధం, ఆమ్లగంధం మున్నగునవి.
- భూమి సాధారణ ధర్మాలు లేదా వృత్తులు - ప్రతిమల రూపాన్నీ వాటి ఆకారాలనూ నిలుపుకోవడం, జలం మొదలైన వాటితో అవసరం లేకుండా స్వతంత్రంగా నిలబడ గలగటం, జలాదులకు తాను ఆధారమై ఉండటం, ఆకాశం, వాయువు, తేజస్సు, బలం వీనిని విభజించడం, సకల జీవరాసులకు దేహంగా పనిచేయటం
- ఆకాశం అసాధారణ గుణం శబ్దం శ్రవణేంద్రియం గ్రహిస్తుంది
- వాయువు అసాధారణ గుణం శబ్దం స్పర్శం త్వగింద్రియం గ్రహిస్తుంది
- తేజస్సు అసాధారణ గుణం శబ్దం స్పర్శం రూపం నేత్రేంద్రియం గ్రహిస్తుంది.
- జలం అసాధారణ గుణం శబ్దం స్పర్శం రూపం రసం. జిహ్వేంద్రియం గ్రహిస్తుంది.
- పృథివి అసాధారణ గుణం శబ్దం స్పర్శం రూపం రసం గంధం. ఘ్రాణేంద్రియం గ్రహిస్తుంది.
- సప్త తత్త్వాలు - మహత్తు, అహంకారం, పంచతన్మాత్రలు
- సప్త తత్త్వాలు కలిసి - చైతన్యం లేని అండం పుట్టింది
- చైతన్యం లేని అండం లో సర్వేశ్వరుడు చైతన్యం కూడి అండం పుట్టింది అదే హిరణ్మగర్భం, బ్రహ్మాండం
- అండాన్ని పొదువుకొని పృథివి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, అహంకారం, మహత్తు అనే ఆవరణాలు ఒకదాని కంటె ఒకటి పదింతలు ప్రమాణం కలిగి ఉంటాయి.