పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : కైలాస పర్వత వర్ణన

: కైలాసపర్వతము వర్ణన:

4-135-వ.

తెలుగుభాగవతం చతుర్థ స్కంధంలో 135 వచనంలో కైలాసపర్వతాన్ని వర్ణిస్తు అక్కడి సౌగంధికా వన వర్ణనలో చెప్పబడిన వివిధ చెట్లు, పక్షులు, జంతువులు, పూలు మున్నగువాని ఈ జాబితా ఆస్వాదించండి

చెట్లు
(48 రకాలు)
పక్షులు
(11 రకాలు)
జంతువులు
(13 రకాలు)
పూలు
(3 రకాలు)
ప్రజలు
1. మందార = మందారచెట్లు
2. పారిజాత = పారిజాతవృక్షములు
3. సరళ = తెల్లతెగడచెట్లు
4. తమాల = కానుగచెట్లు
5. సాల = మద్దిచెట్లు
6. తాల = తాడిచెట్లు
7. తక్కోల = తక్కోలచెట్లు
8. కోవిదార = ఎర్రకాంచనచెట్లు
9. శిరీష = శిరీషపూలచెట్లు
10. అర్జున = తెల్లమద్ధిచెట్లు
11. చూత = తియ్యమామిడిచెట్లు
12. కదంబ = కడిమిచెట్లు
13. నీప = మంకెన, కడిమి చెట్లు
14. నాగ = నాగమల్లి, సర్పగంధి చెట్లు
15. పున్నాగ = సురపొన్న చెట్లు
16. చంపక = సంపెంగ చెట్లు
17. పాటల = కలిగొట్టు చెట్లు
18. అశోక = అశోకవృక్షములు
19. వకుళ = పొగడచెట్లు
20. కుంద = మొల్ల
21. కురవక = ఎర్రగోరింటచెట్లు
22. కనకామ్ర = కనకాంబరముచెట్లు
23. శతపత్ర = తామర
24. కింశుక = మోదుగచెట్లు
25. ఏలా = ఏలక్కాయ చెట్లు
26. లవంగ = లవంగచెట్లు
27. మాలతీ = జాజి
28. మధూక = ఇప్పచెట్లు
29. మల్లికా = మల్లెచెట్లు
30. పనస = పనసచెట్లు
31. మాధవీ = మాదీఫలచెట్లు
32. పూలగురివింద
33. కుటజ = కొండమల్లి
34. ఉదుంబర = అత్తి
35. మేడిచెట్టు
36. అశ్వత్థ = రావిచెట్టు
37. ప్లక్ష = జువ్విచెట్లు
38. వట = మర్రిచెట్లు
39. హింగుళ = ఇంగువచెట్లు
40. భూర్జ = బూజపత్త్ర, కాగితపుచెట్లు
41. పూగ = పోకచెట్లు
42. జంబూ = నేరేడుచెట్లు
43. ఖర్జూర = ఖర్జూర, రాజపూగచెట్లు
44. ప్రియాళు = మోరటిచెట్లు
45. నారికేళ = కొబ్బరిచెట్లు
46. ఇంగుద = అందుగచెట్లు
47. వేణు = గారివెదురు
48. కీచక = బొంగువెదురుచెట్లు

పక్షులు

1. కలకంఠ = కోకిలలు
2. కాలకంఠ = నెమళ్ళు
3. కలవింక = పావురములు
4. రాజకీర = రామచిలుకలు
5. మత్తమధుకర = మదించిన తుమ్మెదలు

నీటిపక్షులు

6.కలహంస=రాయంచ
7. కారండవ = కొక్కిరాలు
8. సారస = బెగ్గురుపక్షలు
9. చక్ర = చక్రవాకపక్షులు
10. బక = కొంగలు
11. జలకుక్కుట = నీటికోళ్ళు
జంతువులు
1. సింహ = సింహములు
2. తరక్షు = సివంగి
3. శల్య = ముళ్ళపందులు
4. గవయ = అడవిదున్నలు
5. శరభ = శరభమృగములు
6. శాఖామృగ = కోతులు
7. వరాహ = అడవిపందులు
8. వ్యాఘ్ర = పెద్దపులులు
9. కుర్కుర = కుక్కలు
10. రురు = నల్లచారల దుప్పులు
11. మహిష = అడవిదున్నలు, ఎనుబోతులు
12. వృక = తోడేళ్ళు
13. సారంగ = లేళ్ళు
పూలు
1. కమల = పద్మములు, తామర పూలు
2. కహ్లార = తెల్లకలువలు
3. కైరవ = ఎర్రకలువలు
4-133-ఉ.
మరియు
4-134-సీ.
కిన్నరలు
కింపురుషులు
గంధర్వులు
సిద్ధులు
గుహ్యకులు
దేవతాస్త్రీలు.