అనుయుక్తాలు- పారిభాషికపదాలు : షోడశ వికారాలు - కళలు
షోడశవికారములు
షోడశవికారములు = ఏకాదశేంద్రియములు 11 [పంచ జ్ఞానేంద్రియములు (కన్ను, ముక్కు, నాలుక, చెవి, చర్మము), పంచ కర్మేంద్రియములు (కాళ్ళు, చేతులు, వాక్కు, గుదము, గుహ్యేంద్రియము), బుద్ధి] మరియు పంచ భూతములు 5 (భూమి, జలము, వాయువు, అగ్ని, ఆకాశము)
- - - - మరొక విధము - - -
షోడశవికారములు = పంచప్రాణములు (5) అంతఃకరణ (1) ఙ్ఞానేంద్రియములు (5) కర్మేంద్రియములు (5)
షోడశమనోవికారములు= 1 కామము 2 క్రోధము 3 లోభము 4 మోహము 5 మదము 6 మాత్సర్యము 7 రాగము 8 ద్వేషము 9 ఈర్ష్య 10 అసూయ 11 దర్పము 12 దంభము 13 భయము 14 అహంకారము 15 స్వప్నము 16 భ్రాంతి అనే పదహారు మనోవికారాలు.
షోడశకళలు = పంచఙ్ఞానేంద్రియములు (5); పంచకర్మేంద్రియముల (5); మనస్సు (1);పంచేంద్రియార్థంబులను (5)--- మొత్తము 16 --- షోడశకళలు గలది లింగశరీరము
షోడశోపాధులు = పంచఙ్ఞానేంద్రియములు (5); పంచకర్మేంద్రియముల (5); మనస్సు (1);పంచేంద్రియార్థంబులను (5)--- మొత్తము 16 --- పదిహేడవది (17 వది) జీవుడు
ఏకాదశేంద్రియములు = [పంచ జ్ఞానేంద్రియములు (కన్ను, ముక్కు, నాలుక, చెవి, చర్మము), పంచ కర్మేంద్రియములు (కాళ్ళు, చేతులు, వాక్కు, గుదము, గుహ్యేంద్రియము), బుద్ధి]
చతుర్దశేంద్రియములు = కర్మేంద్రియములు (5) ఙ్ఞానేంద్రియములు (5) అంతఃకరణ చతుష్టయము (4)
అంతఃకరణచతుష్టయము =
1మనస్సు | సంకల్పము |
2బుద్ధి | నిశ్చయము |
3చిత్తము | చింతనము |
4అహంకారము | అహంభావము |
పంచకృత్యములు =
1. సృష్టి | 2. స్థితి | 3. లయము | 4. తిరోధానము | 5. అనుగ్రహము |