అనుయుక్తాలు- పారిభాషికపదాలు : షట్చక్రములు - మూలాధారాది
కుండలిని – సప్తచక్రములు
1. మూలాధారము, 2. స్వాధిస్థానము, 3. మణి పూరకము, 4. అనాహతము, 5. విశుద్ధము, 6. ఆజ్ఞ, వాటిపైన సహస్త్రారము
శరీరమున వున్న ముఖ్యమయిన సుషుమ్న నాడి మెదడు నుండు వెన్నెముక మధ్య నున్న రంధ్రములో వ్రేలాడి వెన్నెముక చివరి భాగము వరకు వచ్చి యున్నది. ఈ వెన్నెముక పూసల వంటి 33 (ముప్పది మూడు) ఎముకలు ఒక దానిపై ఒకటి అమర్చబడి మెడ నుండి చివర వరకు ఒక గొట్టము వలె తిన్నని రంధ్రముగా ఏర్పడినది. ఈ రంధ్రముననే వెన్ను బాము ప్రేలాడు చున్నది. ఈ వెన్ను బాము మధ్యలో సూక్ష్మ నాడి యగు బ్రహ్మ నాడి వున్నది. మెదడు నుండి స్థూల శరీరములకు సంబంధించిన నాడులు వెను బాములోనికి వచ్చి ఇరు ప్రక్కల నుండి శరీర భాగముల లోనికి విస్తరించి ప్రసరించుచున్నది. కంద స్థానమని చెప్పబడిన సూక్ష్మ నాటి మందల కేంద్రము నుండి సూక్ష్మ నాడులు శరీర మంతటను వ్వాపించు చున్నవి. ఈ నాడులు సుషుమ్న నాడిని ఒక్కొక్క చోట కలిసి కేంద్రములు ఏర్పర్చుచున్నది. ఈ కేంద్రములే షట్చక్రములు. ఇటులనే స్థూల దేహమున నున్న నాడులు కూడ ఒకొక్కచోట కలియుచున్నవి. స్థూల శరీరమున ఏర్పడిన నాడీ కేంద్రములను ఆంగ్ల వైద్య పరి భషలో "ప్లెక్స్" అని పిలువబడుచున్నవి. సూక్ష్మ శరీరమున వున్న ఈ నాడి కేంద్రములకు, సూక్ష్మ నాడీ కేంద్రములకు సన్నిహితమైన సంబంధము కలిగి యున్నది. సూక్ష్మ శ్రీరమున వున్న ఈ నాడీ కేంద్రములను మూలాధారము, స్వాధిస్థానము, మణి పూరకము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞ, సహస్త్రారములని ఏడు కేంద్రములు చక్రములని పిలువబడు చున్నవి. సూక్ష్మ నాడీ మండలమున జరుగు సర్వ వ్వాపారములు స్థూల శరీరమునకు సూక్ష్మ శరీరమునకు గల సంబంధము నీరు, ఆవిరికీ వున్న సంబంధము వంటిది. సూక్ష్మ శరీరమున వున్న ఏడు చక్రములుగ శాస్త్రమున అతి ప్రాముఖ్యములైనవి. అన్ని చక్రేములకు పైనున్న ఏడవ చక్రమైన సహస్త్రామున పరమేశ్వరునికి నిలయమని చెప్పబడినది. ఈ విషయము నిరూపించుటకే శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ఏడు కొండలపై ప్రతిష్టించిరి. ఏడు కొండల వాడని శ్రీ వేంకటేశ్వర స్వామిని భక్తులెల్లరు కొలుచుచున్నారు. ఈ చక్రముల స్థానములు శరీరమున వున్న నెలవులను మరి కొన్ని వివరణములను తెలిసికొందము.
చక్ర వివరణ:-
(1) మూలాధార చక్రము:... కంద స్థానమనునది నాభికిని లింగ స్థానమునకు మధ్యగా నున్నది. అట్టి కంద స్థానమునకు దిగువను వెన్నను బామునకు చివరను గుద స్థానమునకు కొంచెము పైగా నున్నది. ఇది నాల్గు దళములు గల పద్మము. “వం, శం, షం, సం” అను నాలుగు బీజాక్షరములు ఇందు ఉత్పన్నమయినవి. ఇది పృద్వీ (భూమి) తత్వము గలది. ఆకారమున చతురస్త్రముగా నుండును. వాసనతో కూడిన పశుపు రంగుగా నుండును. ఆ చక్రమునకు ఆధి దేవత విఘ్నేశ్వరుడు. దేవత ఢాకిని, భీజాక్షరము "లం " ఇందు బ్రహ్మ గ్రంధి అను నాడీ కేంద్రము యున్నది. దీనిని ఆంగ్ల వైద్య శాస్త్రమున “శాక్రల్ ప్లెక్సన్ " అని చెప్ప బడినది.
(2) స్వాధిష్టాన చక్రము.. ఇది ఆరు దళములు గల పద్మము. ఈ ఆరు దళముల నుండి, “బం, భం, మం, యం, లం” అను ఆరు అక్షరములు (శబ్దములు) ఉద్భవించినవి. జల స్థానము. ఇది నెల బాలుని చందమున చల్లని వర్ణముతో నుండును. ఇది రస తత్వము గలది. ఈ చక్రమునకు ఆధి దేవత బ్రహ్మ, దేవత రాకిని. "వం” అను బీజాక్షరము ఇందున కల్గినది. అలోపతి వైద్య శాస్త్రమున దీనిని “ప్రోస్టేట ప్లెక్సన్” అనబడినది.
(3) మణి పూరక చక్రము.... ఇది నాభి స్థానమున కలదు. ఇది పది దళములు గల పద్మము. ఆ పది దళముల యందు “డం, ఢం, ణం, తేం, థం, ధం, నం, పం, ఫం,” ఇవి అగ్ని మండలము త్రికోణాకృతి గలది. ఎరుపు వర్ణము గలది. రూపము లేక దృష్టి దీని తత్వము. “రం” అను బీజాక్షరము యందు ఉత్పన్నయయినది. మూడు కన్నులు గల శంకరుడు ఆధి దేవత. దేవత లాకిని. అలోపతి వైద్య శాస్త్రమున ఇది "సోలారు ప్లెక్సన్ " అని పిలువబడినది.
(4) అనాహత చక్రము.... ఇది హృదయ పద్మమున కలదు. దీనికి పన్నెండు (12) దళములు. దీని దళముల నుండి “కం, ఖం, గం., ఘం, చం, జం, ఘం, టం, ఠం,” అను పన్నెండు శబ్ధములు కల్గినవి. "యం" అను బీజాక్షరము దీని నుండి ఉత్పన్నమయినది. వాయు మండల ప్రాంతము. ధూమ్ర వర్ణము కలది. ఆరు కోణము కలది. ఆధి దేవత రుద్రుడు. దేవత కాకిని. ఆనాహత శబ్దమును నాదము ఇందుండి వినబడును
(5) విశుద్ధ చక్రము... కంఠ మూలమున (16)_ పదునారు దళములు గల గుండ్రని పద్మము. దీని దళములనుండి “అం, ఆం, ఇం, ఈం, ఉం, ఊం, ఋం, ఋం, ఎం, ఐం, ఓం, ఔం, అం, అః” అను శబ్దములు ఉత్పత్తి అయినవి. "హం" భీజాక్షరము, ఆకారము గుండ్రనిది. నీలి రంగు గల్గి ఆకాశ తత్వము గలది. దీని కార్యము శబ్దము. మహేశ్వరుడు దీని ఆధి దేవత. శాకిని దేవత. దీనిని అలోపతి వైద్య శాస్త్రమున “ఫరింగియల్” అనియు "లంరిగియల్ ప్లెక్సన్ " అని పిలువ బడు చున్నది.
(6) ఆజ్ఞా చక్రము..... శిరసు నందలి భృఊమధ్యమున హిందువులు తిలక దారణ చేయు ప్రడేశమున (2) రెండు దళములు గల పద్మము గుండ్రముగా నున్నది. “హం, క్షం,” అను రెండు శబ్దములు. చక్ర దళము నుండి ఉత్పన్నమయినది. "ఓం" అనునది బీజాక్షరము, పరమ శివుడు హంస రూపమున ఇందున్నాడు. అవ్వక్తము, అహంకారము, మనస్సు అనునది ఈ చక్రము యొక్క తత్వములు. సంకల వికల్పములు దీని కార్యము. అనగా మనస్సునకు స్థానము మనసు మెలకువలో వున్నప్పుడు శరీర మంతయు ప్రసరించి యుండగా నిద్రలో ఈ చక్ర స్థానమున నిలిచి యుండునని చెప్పబడినది. హాకిని దేవత. ఇందు రుద్ర గ్రంధి వున్నది. ఇది అలోపతి వైద్య శాస్త్రమున "కేవర్నన్ ప్లెక్సన్ " అని పిలువబడు చున్నది.
(7) సహస్త్రార చక్రము... దీనిని బ్రహ్మ రంద్రమనిరి. ఇది మానవుని ప్రాణ స్థానము. పరబ్రహ్మకు నిలయము శరీరమున నవ ద్వారములున్నవి. మరియు ఇది పదియవ ద్వారముగా యోగ శాస్త్రమున గణించిరి మూలాధారాది షట్చక్రముల నుండి పయనించి బ్రహ్మ, విష్ణు, రుద్ర గ్రంధులను చేధించుకొని శక్తి స్వరూపిణి యగు కుండలిని పరబ్రహ్మస్థానమగు సహస్త్రామున చేర యోగి అనిర్వచనీయ నందమును మునిగి నిర్వికల్ప సమాధిని పొందును. ఈ చక్రమందు అనేక యోగ నాడులుండుట చే సహస్రారమని చెప్పబడినది. ఈ చక్రమును లెక్కించకయే మిగిలిన ఆరు చక్రములనే షట్చక్రములని పిలిచిరి. ఇది “పీనయల్ గ్లాండ్” అను ప్రదేశమున నడి నెత్తి మీద వున్నది. నిర్గుణ బ్రహ్మను ఈ చక్రమున ధ్యానించుటకు అనుకూల మయినది.
బ్రఃహ్మనాడి యందు ఈ ఏడు చక్రములే గాక గ్రంధిత్రయమను పేర మూడు గ్రంధులున్నవి. అవి బ్రహ్మ గ్రంధి మూలాధార చక్రమునందును, విష్ణు గ్రంధి అనాహత చక్రమందును, రుద్ర గ్రంధి అజ్ఞా చక్రమునందును వున్నవి. సహజముగా సుషుమ్న నాడీ మార్గము మూసికొని వుండును. దానితో బాటు అందున వున్న ఈ మూడు గ్రంధులు కఠినముగా వుండును. కంధ స్థానమని చెప్పబడు సూక్ష్మ నాడీ మండల కేంద్రమున మహా శక్తి స్వరూపణియగు "కుండలిని " సర్పాకృతిని చుట్టలుగా చుట్టుకొని ఉండును.