పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : సర్గ లేదా సృష్టి భేదాలు

3-344-వ.

సర్గం లేదా సృష్టి భేదాలు

నవవిధ సృష్టి- - - త్రివిధ సృష్టి - - - - ద్వివిధ సృష్ఠి

రెండు రకాల సృష్టి
ద్వివిధ సర్గం
మూడు రకాల సృష్టి
త్రివిధ సర్గం
ప్రాకృతములువైకృతములుకాలముద్రవ్యముగుణం

తొమ్మిది రకాల సృష్ఠి
నవవిధ సర్గము

ప్రాకృతములు------వైకృతములు--
మహత్తుఅహంకారంభూతఇంద్రియదేవ గణతామస గణ-స్థావరములుతిర్యక్కులుఆర్వాక్ స్రోతము
(నరులు)

ప్రాకృత సృష్టి- [ప్రకృతిలోని] భగవంతుని లీలావిలాసాలు.--
ప్రథమ సర్గ మహత్తత్త్వము నారాయణుని సమీపంలో గుణ భేదాన్ని పొందుతుంది.--
ద్వితీయ సర్గ అహంకారతత్త్వము ద్రవ్య జ్ఞాన క్రియాత్మక మైనది--
తృతీయ సర్గ భూత సృష్టి పంచ భూతములు (ఆకాశము, తేజస్సు, వాయువు, జలము, పృథివి) ; పంచతన్మాత్రాల ద్రవ్యశక్తితో కూడినవి (శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు)
చతుర్థ సర్గ ఇంద్రియ సృష్టి దశేంద్రియములు (జ్ఞానేంద్రియములు అయిదు మరియు కర్మేంద్రియములు అయిదు) {జ్ఞానేంద్రియములు (చర్మము, కన్నులు, చెవులు, నాలుక, ముక్కు); మరియు కర్మేంద్రియములు (వాక్కు, చేతులు, కాళ్ళు, పాయువు, ఉపస్థు)}
పంచమ సర్గ దేవ గణము దేవతా గణాలు; సాత్వికాహారం వలన పుట్టినవి, మనోమయమైనది--
షష్ఠ సర్గ తామస గణ ఆవరణ విక్షేపాలు; ప్రాణిసమూహానికి అజ్ఞానకృతాలైనవి--
వైకృత సృష్టి --వికారములు కలిగిన భగవంతుని లీలా విలాసాలు
సప్తమ సర్గ స్థావరములు; అవ్యక్తమైన చైతన్యంతో తమోమయము లైనవి, ఎదుగుదల కలవి, సంచారము చేయ లేనివి 1) వనస్పతులు పూలు పూయకుండానే ఫలించేవి; రావి, మేడి, పనస, మఱ్ఱి మొదలైనవి
--- 2) ఓషధులు పూచి ఫలించిన వెంటనే నశించునవి; వడ్లు, యవలు, పెసలు మొదలైనవి
--- 3) తీగెలు పైకి ఎగబ్రాకటానికి అవకాశం లేనివి; మాలసి, మల్లే మొదలైనవి
--- 4) గట్టి బెరడు కలిగినవి వెదుళ్ళు మొదలైనవి
--- 5) లతా విశేషాలు నేలలో దృఢమైన వేళ్ళు గలిగి నేలపై బాగా విస్తరించేవి; దుబ్బులు, పొదలు;
--- 6) వృక్షాలు పుష్పించి ఫలాలను ఇచ్చేవి; మామిడి మొదలైనవి
అష్టమ సర్గ తిర్యక్కులు (చైతన్యం సంచారము కలవి), రేపు అనే జ్ఞానం లేనివి, ఆహారం మొదలైన వాటి యందు మాత్రమే ఆసక్తి కలవి, వాసన చూసి తెలుసుకోగలవి, మనస్సులో పెద్దగా ఆలోచనలు చేయలేనివి 1) భూచరములు అ) చీలిన గిట్టలు కలవి; ఎద్దు, ఎనుము, మేక, జింక, పంది, ఒంటె, గురుపోతు, నల్లచారల దుప్పి, పొట్టేలు (తొమ్మిది).
---- ఇ) చీలని గిట్టలు కలవి; గాడిద, కంచరగాడిద, గుఱ్ఱము, గౌర మృగం, శరభ మృగం, చమరీ మృగం, (ఆరు)
---- ఉ) అయిదు వేళ్ళు కలవి; కుక్క, నక్క, తోడేలు, పులి, పిల్లి, కుందేలు, ఏదుపంది, సింహం, కోతి, ఏనుగు, తాబేలు, ఉడుము (పన్నెండు)
--- 2) జల చరాలు; మొసలి మొదలైనవి.
--- 3) ఖేచరములు (పక్షులు); రాబందు, గ్రద్ద, కొంగ, డేగ, తెల్లపిట్ట, గబ్బిలం, నెమలి, హంస, బెగ్గరు పక్షి, జక్కువ పక్షి, కాకి, గుడ్లగూబ మొదలైనవి
నవమ సర్గఆర్వాక్ స్రోతము (నరులు) రజోగుణంతో పురికొల్పబడునవి, కర్మలు చేయుటలో నేర్పు కలవి, దుఃఖంలో కూడా సుఖాన్ని కోరేవి.--
దేవసర్గ1) విబుధులు---
-2) పితృదేవతలు---
-3) సురాదులు---
-4) గంధర్వులు, అప్సరసలు---
-5) యక్షులు, రాక్షసులు---
-6) భూత, ప్రేత, పిశాచాలు---
-7) సిద్ధ, చారణులు---
-8) కిన్నర, కింపురుషులు---
కుమార సర్గ9) కుమార సర్గ సనత్కుమార సర్గం దైవత్వ, మానవత్వ సృష్టి, ప్రాకృత వైకృతముల రెంటి స్వభావం కలది; సనకుడు; సనందనుడు; సనత్కుమారుడు; సనత్సుజాతుడు-