అనుయుక్తాలు- పారిభాషికపదాలు : సప్తవింశతి తత్వములు
7-237-వ.
(అ) | - | మూలప్రకృతి, మహత్తు, అహంకారం, శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం అనే ఎనిమిది (8) “ప్రకృతులు” (అష్టప్రకృతులు). | - | 8 |
(ఇ) | - | సత్త్వము, రజస్సు, తమస్సు అనే ఈ మూడు (3) “ప్రకృతి గుణాలు”. | - | 3 |
(ఉ) | - | నోరు, చెయ్యి, కాలు, గుదం, మర్మావయవం అనే ఈ అయిదు (5) కర్మేంద్రియాలు; కన్ను, చెవి, చర్మం, ముక్కు, నాలుక అనే ఈ అయిదు (5) జ్ఞానేంద్రియాలు; నేల, నీరు, ఆకాశం, గాలి, అగ్ని అనే ఈ అయిదు (5) పంచభూతాలు; మనసు ఒకటి (1); మొత్తం ఈ పదహారు (16) షోడశ వికారాలు | - | 16 |
(ఎ) | - | మొత్తం ఇరవై ఏడింటిలోను (27) సప్తవింశతి తత్వాలలో ఆత్మ సాక్షీభూతంగా ఉంటుంది. | - | 27 |
ఇంకొక విధంగా
పంచ తన్మాత్రలు | - | శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం | - | 5 |
పంచ జ్ఞానేంద్రియములు | - | కన్ను, చెవి, చర్మం, ముక్కు, నాలుక | - | 5 |
పంచ కర్మావయవములు | - | కన్ను, చెవి, చర్మం, ముక్కు, నాలుక | - | 5 |
పంచ భూతములు | - | నేల, నీరు, ఆకాశం, గాలి, అగ్ని | - | 5 |
గుణత్రయము | - | సత్త్వము, రజస్సు, తమస్సు | – | 3 |
మనస్సు | - | ఒకటి | - | 1 |
మూలప్రకృతి | - | ఒకటి | - | 1 |
మహత్తు | - | ఒకటి | - | 1 |
అహంకారం | - | ఒకటి | - | 1 |
సప్తవింశతి తత్వాలు మొత్తం | - | - | - | 27 |