పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : సప్తవిధ వాయువులు

సప్తవాయువులు
7-285-వ.
వికీపీడియా నుండి
కశ్యపుడు, దితిల సంతానమైన సప్త మరుత్తులు లేదా సప్తమారుతములు లేదా సప్త వాయువులు వివిధ మండలములలో వ్యాపించిన వాయువులకు అధిపతులుగా భగవంతుడు నియమించెనని పురాణ గాధ. ఈ 7 వాయువులు:

 • 1) ఆహవ వాయువు: మేఘ మండలమునకు, భూమండలమునకు మధ్య ప్రసరించునది.
 • 2) ప్రవహ వాయువు: సూర్య మండలమునకు, మేఘ మండలమునకు మధ్య ప్రసరించునది.
 • 3)అనువహ వాయువు: చంద్ర మండలమునకు, సూర్య మండలమునకు మధ్య ప్రసరించునది.
 • 4)సంవహ వాయువు: నక్షత్ర మండలమునకు, చంద్ర మండలమునకు మధ్య ప్రసరించునది.
 • 5) వివహ వాయువు: గ్రహ్ర మండలమునకు, నక్షత్ర మండలమునకు మధ్య ప్రసరించునది.
 • 6) పరావహ వాయువు: సప్తర్షి మండలమునకు, గ్రహ మండలమునకు మధ్య ప్రసరించునది.
 • 7) పరివహ వాయువు: ధ్రువ మండలమునకు, సప్తర్షి మండలమునకు మధ్య ప్రసరించునది.
సప్తవిధ వాయువులు

మరొక విధము
సప్తవిధ వాయువులు –

 • 1ఆవహము (),
 • 2ప్రవహము (ఇది గ్రహములకు సంచారము గావించును),
 • 3సంవహము,
 • 4ఉద్వహము,
 • 5 నిహవము,
 • 6పరిహవము (ఇది సప్తర్షులను స్వర్గం గను వహించును),
 • 7పరాహవము (పరివహత వాయువునకు మీదిది)

అను ఈ ఏడు వాయువులు. [సరి అయిన ఆధారం దొరకవలసి ఉంది.]