పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : సనకాదులు చెప్పిన మార్గాలు

4-621

పృథునకు భక్తియోగం పెంపొందుటకు సనకాదులు చెప్పిన మార్గాలు:-

 1. శ్రద్ధ,
 2. భాగవత ధర్మాలను ఆచరించడం,
 3. ఆయా ధర్మ విశేషాలందు జిజ్ఞాస,
 4. ఆధ్యాత్మిక యోగనిష్ఠ,
 5. యోగీశ్వరులను ఉపాసించడం,
 6. నిరంతరం శ్రీహరి పుణ్యకథలను ఆలకించడం,
 7. అర్థలుబ్ధులూ ఇంద్రియలోలురూ అయినవారికి దూరంగా ఉండడం,
 8. అట్టి వారికి అభిమతాలైన అర్థకామాల మీద ఆసక్తి లేకుండడం,
 9. హరిగుణామృత రసాస్వాదనం తప్ప ఇతర వస్తువులందు విరక్తి,
 10. ఆత్మారామస్థితి,
 11. ఏకాంత వాసమందు అభిరుచి,
 12. అహింస,
 13. ఇంద్రియనిగ్రహం,
 14. ఆత్మ హితానుసంధానం,
 15. సంతత భగవత్కథా చింతనం,
 16. యమనియమాలు,
 17. ఇతర భక్తి మార్గాలను నిందింపకుండా ఉండడం,
 18. తన యోగక్షేమాలకోసం ఎటువంటి కార్యాలను చేయకుండడం,
 19. శీతోష్ణాది ద్వంద్వాలను సహించడం,
 20. హరిభక్తుల చెవులకు అలంకారాలైన భగవంతుని సుగుణాలను అభివర్ణించడం మొదలైనవి.
  • భక్తి పెంపొందుట వలన: ఉత్తమాచార్యుల అనుగ్రహం,
  • బ్రహ్మనిష్ఠుల స్నేహం,
  • ఈషణత్రయ పరిత్యజం,
  • జ్ఞాన వైరాగ్యం,
  • అహంకారం దహనం,
  • హృదయగ్రంధి దహనం,
  • కర్తృత్వ భోక్తృత్వ విమోచనం,
  • లింగదేహ నాశనం,
  • ఆత్మనాశనం