పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : పంచవిధ నిషిద్ధాన్నములు

పంచవిధనిషిద్ధాన్నములు

1) ఉచ్చిష్టము = ఎంగిలి, భుజింపగా మిగిలినది;
2) చండికా నివేదితము = కాళికాదేవికి నైవేద్యముపెట్టినది;
3) విదూషితము = అపరిశుభ్రమైనది (కేశ = వెంట్రుకలు ఉన్నది; శునక = కుక్క ముట్టినది; మార్జాల = పిల్లిముట్టినది; కంక = పక్షి ముట్టినది; క్రిమి = పురుగులు పట్టినది; పిపీలిక = చీమలు పట్టినది; ఆది = మొదలగు వానిచే అపరిశుభ్యమైనది);
4) ఆమిషాన్నము = మాంసాహారము;
5) వృషలాహితము = శూద్రులు {వృషలుడు - శూద్రునికి బ్రాహ్మణస్త్రీ యందు పుట్టినవాడు} తెచ్చినది;
అనెడి ఈ ఐదు విధములైన ఆహారములు తీసుకొనరాదని నిషేధింపబడ్డాయి; వీటిని నిషిద్ధాన్నములు అంటారు.