పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : నాసత్యులు

9-57-వ.

నాసత్యుడు, దస్రుడు అను అశ్వనీకుమారులు, దేవవైద్యులు, దస్రులు; వీరిని నాసత్యులు అంటారు.
వివరణ: సూర్యుని భార్య సంజ్ఞాదేవి వినోదార్థం అశ్వని (ఆడు గుఱ్ఱము) రూపము ధరించగా, సూర్యుడు అశ్వ రూపము ధరించాడు, ఆ సమయములో వారికి అతిలోక సుందరులు అయిన నాస్యత్యుడు ద్రస్యుడు అని ఇద్దరు పుట్టారు, వారే అశ్వనీదేవతలు. అలా అశ్వని నాసనుండి పుట్టుటచే నాసత్యులు అని పేరు వచ్చింది అని కొందరు అంటారు.
వ్యు. (న అసత్యమ్ అనయోః, నఞః ప్రకృతిభావః, బ.వ్రీ.) అసత్యము లేని వారు.