పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : నైమిశారణ్యం-పదాలు

నైమిశారణ్య వర్ణన

నైమిశారణ్యం వర్ణిస్తూ వాడిన పదాలలో ఉపమానం చెప్పదగిన వాటికి చెందిన పదాలకు చెందిన నానార్థాలు సరిపోయేలా వాడారు;
ఆ పదాలు వాటి రెండు రకాల అర్థాలు జాబితా క్రింద ఇవ్వబడ్డాయి:-

వ. సం.పదం = వనానికి చెందిన అర్థం / నానార్థం{ఉపమాన పదం}
1 మాధవి = పూలగురివింద చెట్లు గురువింద
గురువింద


/ లక్ష్మి{విష్ణువు అంతఃపురం}
2 మన్మథ = వెలగ చెట్లు / మన్మథుడు{విష్ణువు అంతఃపురం}
3 శారద = ఏడాకులఅరటి చెట్లు / సరస్వతీదేవి{బ్రహ్మలోకం}
4 వహ్ని = చిత్రమూలం / అగ్నిదేవుడు{శివుడి సభ}
5 వరుణ = ఉలిమిరి చెట్లు / వరుణదేవుడు{శివుడి సభ}
6 సమీరణ = మరువము / వాయుదేవుడు{శివుడి సభ}
7 చంద్ర = పెద్ద ఏలకి చెట్లు క్యేలకి పూలు
క్యేలకి పూలు

/ చంద్రుడు{శివుడి సభ}
8 రుద్ర = రుద్రాక్ష / ఏకాదశ రుద్రులు{శివుడి సభ}
9 హైమవతి = కరక చెట్లు / పార్వతీదేవి{శివుడి సభ}
10 కుబేర = నంది వృక్షాలు / కుబేరుడు{శివుడి సభ}
11 వృషభ = అడ్ఢపర చెట్లు / వృషభవాహనము{శివుడి సభ}
12 గాలవ = లొద్దుగ చెట్లు / గాలవముని{శివుడి సభ}
13 శాండిల్య = మారేడు చెట్లు / శాండిల్య ముని{శివుడి సభ}
14 పాశుపత = శ్రీవల్లీ చెట్లు / శివభక్తులు{శివుడి సభ}
15 జటి పటల = జువ్వి చెట్లు / ముని సమూహముల{శివుడి సభ}
16 ఐరావత = నారిజ చెట్లు / ఏనుగు ఐరావతము{ఇంద్రుడి ఇల్లు}
17 అమృత = ఉసిరిక చెట్లు / అమృతము{ఇంద్రుడి ఇల్లు}
18 రంభ = అరటి చెట్లు / అప్సరస రంభ{ఇంద్రుడి ఇల్లు}
19 గణిక = అడవిమొల్లలు సన్నజాజి (అడవి మల్లె)
సన్నజాజి (అడవి మల్లె)


/ దేవవేశ్యల{ఇంద్రుడి ఇల్లు}
20 ఉన్మత్త = ఉమ్మెత్త / మదించిన{మురాసురుడి ఇల్లు}
21 రాక్షస = బలురక్కెస / రాక్షసుల{మురాసురుడి ఇల్లు}
22 వంశ = వెదురు / సమూహాలు{మురాసురుడి ఇల్లు}
23 శంఖ = శంఖాలు / నవనిధులు లోని శంఖము{కుబేరుడి ఖజానా}
24 పద్మ = పద్మ పుష్పాలు / నవనిధుల లోని పద్మము{కుబేరుడి ఖజానా}
25 కుంద = మొల్లలుకుంద మల్లి
కుంద మల్లి


/ నవనిధుల లోని కుందము{కుబేరుడి ఖజానా}
26 ముకుంద = ఎర్ర తామరలు / నవనిధుల లోని ముకుందము{కుబేరుడి ఖజానా}
27 నిరంతర = దట్టమైన / అంతరము లేని{రాముడి యుద్ధం}
28 శర = రెల్లు పొదలు / బాణ{రాముడి యుద్ధం}
29 అనలశిఖ = శక్రపుష్పి పూవులు / అగ్నిజ్వాలలు{రాముడి యుద్ధం}
30 బహుళంబు = తఱచుగా ఉన్నది / అనేకం ఉన్నది{రాముడి యుద్ధం}
31 అర్జునోద్భేదంబు = మద్ది అంకురాలు కలది / కార్తవీర్యార్జుని సంహారం కలది{పరశురాముడి యుద్ధం}
32 అరిష్ట = వేప చెట్లు / అరిష్టాసురుడు{రాక్షసుల యుద్ధాలు}
33 జంభ = నిమ్మ చెట్లు / జంభాసురుడు{రాక్షసుల యుద్ధాలు}
34 నికుంభ = దంతి చెట్లు / నికుంభాసురుడు{రాక్షసుల యుద్ధాలు}
35 ద్రోణ = తుమ్మ చెట్లు / ద్రోణుడు{కురుపాండవుల యుద్ధం}
36 అర్జున = మద్ధి చెట్లు / అర్జునుడు{కురుపాండవుల యుద్ధం}
37 కాంచన = సంపెంగ చెట్లు కాంచన (సంపంగి)
కాంచన (సంపంగి)
/ బంగారు{కురుపాండవుల యుద్ధం}
38 స్యందన = నిమ్మి చెట్లు / రథాలు{కురుపాండవుల యుద్ధం}
39 కదంబ = కడిమి చెట్లు కదంబము (కడిమి)
కదంబము (కడిమి)
/ సమూహము{కురుపాండవుల యుద్ధం}
40 మహోన్నత = చాలా ఎత్తైన / చాలా ఉన్నతమైన{కురుపాండవుల యుద్ధం}
41 శల్య = మంగ చెట్లు కొండ మంగ పూలు
కొండ మంగ పూలు
/ శల్యుడు{కర్ణుడి యుద్ధం}
42 సహకారంబు = మామిడి చెట్లు కలది / సహాయము కలది{కర్ణుడి యుద్ధం}
43 నల = వట్టివేరు / నలు డనే వానర వీరుడు{రామసేతువు నిర్మాణం}
44 నీల = నీలి చెట్లు / నీలు డనే వానర వీరుడు{రామసేతువు నిర్మాణం}
45 పనస = పనస చెట్లు / పనసు డనే వానర వీరుడు{రామసేతువు నిర్మాణం}
46 అద్రి = చెట్ల / (వానరులనే) కొండల{రామసేతువు నిర్మాణం}
47 నానా = వివిధ రకాలైన / వివిధము లైన{శివ భజన}
48 అశోక = అశోక చెట్లు అశోకము
అశోకము
/ శుభ{శివ భజన}
49 లేఖా = పంక్తుల కొద్దీ / పత్రికల{శివ భజన}
50 ఫలితంబు = వృక్షాలు ఉన్నదై / ఫలితాన్ని ఇచ్చేది{శివ భజన}
51 పున్నాగ = సుర పొన్నలు / పున్నాగ పుష్పాల పున్నాగ
పున్నాగ
{మన్మథుడి విల్లు}
52 శిలీముఖ = తుమ్మెదల / బాణాల{మన్మథుడి విల్లు}
53 కేసర = పొన్న చెట్లు / జూలు{నరసింహుడి రూపం}
54 కరజ = కానుగ చెట్లు / గోళ్ళు{నరసింహుడి రూపం}
55నట = దుండిగ చెట్లు / నటులు{నాట్యరంగం}
56 నటీ = దొండ చెట్లు / నటీమణులు{నాట్యరంగం}
57 సుషిర = గువ్వగుతిక చెట్లు / వాద్యవిశేషాలు{నాట్యరంగం}
58 చందన = చందనవృక్షాలు చందన (మంచి గంధము) చెట్టు
చందన (మంచి గంధము) చెట్టు
/ మంచిగంథము{పార్వతీదేవి నుదురు}
59 కర్పూరతిలకా = కలిగొట్లు బొట్టుగ చెట్ల / కర్పూరతిలకము{వర్షాకాలం రాక}
60 ఇంద్రబాణాసన = మరువం నల్లగోరింట వేగిస చెట్లు / ఇంద్రధనస్సు{వర్షాకాలం రాక}
61 మేఘ = తుంగముస్తెలు చెట్లు / మేఘాలు{వర్షాకాలం రాక}
62 కరక = దానిమ్మ చెట్లు దానిమ్మ పూలు (దాడిమ పువ్వులు)
దానిమ్మ పూలు (దాడిమ పువ్వులు)
/ వడగళ్లు{వర్షాకాలం రాక}
63 గాయత్రీ = చండ్ర చెట్లు / గాయత్రీ మంత్రం{వేదములు}
64 విరాజితంబు = మంచి పంక్తులు కలది / ప్రకాశిస్తున్నది{వేదములు}
65 సరళ = తెల్లతెగడ చెట్లు / సరళత్వము{మహాకావ్యం}
66 మృదులతా = కోమలమైన తీగలు / సౌకుమార్యములు{మహాకావ్యం}
67 సుపర్ణ = సుందరమైన ఆకులు / గరుత్మంతుడు{వినత గృహం}
68 సుమనస్ = మంచి పుష్పాల / దేవతలు{అమరవతీ నగరం}
69 మధు = పూదేనె / మధుడనే రాక్షస వీరుడు{కైటభాసురుడి సభ}
70 అమృత = తియ్యని / మోక్షమును{విష్ణుభక్తి}
71 ఫలదంబు = పండ్లుకలది / ప్రసాదించేది{విష్ణుభక్తి}
72 పరాగంబు = పుప్పొడి కలది / ధూళి కలది{అర్డునుడి సేన}
73 హరి = సింహము / విష్ణుమూర్తి{వైకుంఠపురం}
74 ఖడ్గ = ఖడ్గమృగము / (నందకము) విష్ణుమూర్తి ఖడ్గము{వైకుంఠపురం}
75 పుండరీక = బెబ్బులి / పండరీకుడు{వైకుంఠపురం}
76 విలసితంబు = క్రీడలు కలది / ప్రకాశిస్తున్నది{వైకుంఠపురం}
77 కృష్ణసార = నల్లజింకలు / కృష్ణుని శక్తిసామర్థ్యములు{నందుడి గొల్లపల్లి}
78 రామ = పెద్దదుప్పి / రాముడు{లంకానగరం}
79 మహిషి = దున్నపోతు / భార్య{లంకానగరం}
80 వంచక = నక్క / వంచించినవా డైన రావణాసురుడు{లంకానగరం}
81 గజ = ఏనుగులు / వానర వీరుడు గజుడు{సుగ్రీవుడి సైన్యం}
82 గవయ = కురుఁబోతులు / వానర వీరుడు గవయడు{సుగ్రీవుడి సైన్యం}
83 శరభ = శరభమృగము / వానర వీరుడు శరభుడు{సుగ్రీవుడి సైన్యం}
84 నీలకంఠ = నెమళ్ళు / శివుడు{నారాయణస్థానం}
85 హంస = హంసలు / పరమహంసలు{నారాయణస్థానం}
86 కౌశిక = గుడ్లగూబలు / కౌశిక మహర్షి{నారాయణస్థానం}
87 భరద్వాజ = ఏంట్రిత పక్షులు / భరద్వాజ మహర్షి{నారాయణస్థానం}
88 తిత్తిరి = తీతువు పక్షులు / తిత్తిరి మహర్షి{నారాయణస్థానం}
89 ఏకచక్ర = చక్రవాక పక్షులు / ఏకచక్రపురము{మహాభారతం}
90 బక = కొంగ / బకాసురుడు{మహాభారతం}
91 కంక = రాబందులు / కంకుభట్టుగ పిలవబడ్డ ధర్మరాజు{మహాభారతం}
92 ధార్తరాష్ట్ర = హంసలు
{దార్తరాష్ట్ర -
కాళ్ళు, ముక్కు ఎఱ్ఱగాను,
మిగతా శరీరం తెల్లగా
నుండే హంసలు}
/ ధృరాష్ట్రుని కొడుకులైన కౌరవులు{మహాభారతం}
93 శకుని = శకుని పక్షులు / శకుని{మహాభారతం}
94 నకుల = ముంగిసలు / నకులుడు{మహాభారతం}
95 ఉరుతర = మంచి / మేలుజాతి{సూర్యరథం}
96 ప్రవాహంబు = జల ప్రవాహాలు కలది / గుఱ్ఱములు కలది{సూర్యరథం}
97 బహువితత = మిక్కిలి / మిక్కిలి విశాలమైన{వానాకాలపు సంధ్యాసమయం}
98 జాతిసౌమనస్యంబు = జాజిపూలు కలది / జాతీయ భావాలు కలది{వానాకాలపు సంధ్యాసమయం}