పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : మాయాదేవి పద్నాలుగు పేర్లు

నందుని భార్య యశోద కడుపున మాయాదేవి పుట్టింది.

శ్రీకృష్ణుడు తన అవతార సందర్భంలో ఆ మాయాదేవికి ఒసగిన పద్నాలుగు (14) నామములు.
(10.1-8-61)
1) దుర్గ = దుర్గాదేవి {దుర్గ - కాశీక్షేత్రమున దుర్గ (వనాది దుర్గమ స్థావరములు కలది, ఎరుగుటకు చాలా కష్టమై నామె)}
2) భద్రకాళి = భద్రకాళి {భద్రకాళి - భద్రేశ్వర క్షేత్రమున భద్రకాళి (నిత్యమంగళ స్వరూపము నీలవర్ణము కలామె)}
3) విజయ = విజయ {విజయ - వరాహశైల క్షేత్రమున విజయ (చండ మండ భండాసురులను గెల్చినామె)}
4) వైష్ణవి = వైష్ణవీదేవి {వైష్ణవి - మాత్రుకాక్షేత్రమున వైష్ణవి (సర్వ లోకములకు వెలుపల లోపల ఉండెడియామె)}
5) కుముద = కుముద {కుముద - మానసక్షేత్రమున కుముద (భూమికి సంతోషమును కలుగజేయునామె, భూలోకులకు ఆనందము కలిగించెడియామె, రాక్షసులను నవ్వుచునే (వంచనతో కూడిన) చంపెడి యామె)}
6) చండిక = చండికాదేవి {చండిక - అమరకుండకక్షేత్రమున చండిక (కోపము గలామె, చండాసురుని చంపినామె)}
7) కృష్ణ = కృష్ణ {కృష్ణ - హస్తినాపురక్షేత్రమున కృష్ణ (సృష్టి స్థితి సంహారము తిరోధానము అనుగ్రహము అనెడి పంచ (5) కృత్యములు చేసెడి యామె, మహామునుల మనసులను ఆకర్షించెడి యామె)}
8) మాధవి = మాధవి {మాధవి - శ్రీశైలక్షేత్రమున మాధవి (మధ్నాతీతి మాధవి, శత్రువులైన రాక్షసులను శిక్షించునామె)}
9) కన్యక = కన్యక {కన్యక - కన్యాకుబ్జక్షేత్రమున కన్యక (సకల జనులచేత కోరబడెడియామె)}
10) మాయ = మాయ {మాయ - మాయానగరక్షేత్రమున మాయ (లక్ష్మీదేవిచే కొలువబడెడి యామె, అఙ్ఞానులకు కనబడని యామె)}
11) నారాయణి = నారాయణి {నారాయణి - సుపార్శ్వక్షేత్రమున నారాయణి (సర్వులందు విఙ్ఞానరూపము ఉండునామె)}
12) ఈశాన = ఈశాన {ఈశాన - రుద్రకోటిక్షేత్రమున ఈశాన (ఐశ్వర్యములు కలామె)}
13) శారద = శారద {శారద - బ్రహ్మక్షేత్రమున శారద (నలుపు (తమోగుణము) తెలుపు (సత్త్వగుణము) ఎరుపు (రజోగుణము) లను శారను కలిగించునామె)}
14) అంబిక = అంబిక {అంబిక - సిద్ధవనక్షేత్రమున అంబిక (సర్వ మాతృ రూపిణి)}