పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : కౌమోదకి, కౌస్తుభము, పాంచజన్యము

10.1-1235-వ.. & 10.2-157-మ.
1) కౌమోదకి = విష్ణుమూర్తి గద పేరు
వ్యుత్పత్తి: కుం భూమిం మోదయతి హర్షయతీతి కుమోదకో విష్ణుః తస్యేయం కౌమోదకీ,
 భూమిని సంతోషింపజేయు విష్ణు సంబంధమయినది
వ్యుత్పత్తి: కోః మోదకః - కుమోదకః=విష్ణుః, కుమోదకస్య ఇయమ్ - కుమోదక+ఇణ్
త.ప్ర. కుమోదకుని (విష్ణుని) ఆయుధము.

2) కౌస్తుభము : విష్ణువు వక్షస్థలమందలి మణి.
వృత్పత్తి - కుం (భూమిమ్) స్తుభ్నాతి = కుస్తుభః = సముద్రః - కుస్తుభే భవః = కుస్తుభః+ అణ్ = కౌస్తుభః
భూమిని ఆవరించి ఉన్నది అగుటచే సముద్రము కుస్తుభము అనబడును, అందు పుట్టినది కౌస్తుభము

3) పాంచజన్యము విష్ణుమూర్తి శంఖము, శ్రీకృష్ణుని శంఖము
వ్యుత్పత్తి: పంచజనః +ఞ్ - ఞ్యాః వా
పంచజనుడు అను రాక్షసుని ఎముకచే నిర్మింపబడుటచే దీనికి ఈ వ్యవహారము

శ్రీవత్సము = శ్రీమహావిష్ణువు వక్షమున గల ఒక సుడి / మచ్చ.
శ్వేతరోమావర్తము
వృత్పత్తి - వద+స = వత్సః; శ్రీ.యుతః వత్సః
శాకసా. మహత్వమును తెలియజేయు చిహ్నము.

4) శమంతకము : విష్ణువు హస్తమునందలి మణి., సత్రాజిత్తు శ్రీకృష్ణునకు సత్యభామతో పాటు సమర్పించిన ఒక మణి