పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : ముందుమాట

పారిభాషికపదములు - అకారాది విషయ సూచిక

కొన్ని పారిభాషిక పదాలకు పదాలకు సంబంధించిన వివరణలు కొన్నిటిని అక్కడ టిప్పణుల వద్ద కన్న విడిగా క్రోడీకరించుట యుక్తమని భావించి, అనువుగా వుంటుందని సంకలనంచేసాను. అవే యీ అనుయుక్తాలు లేదా పారిభాషికపదాల వివరణలు. వీటిని వివిధ నిఘంటువులు, బాలశిక్షలాంటి పుస్తకాలు, తెలుగు వికిపీడియా వంటి కొన్న అంతర్జాజాల స్థలములు, భాగవతముపై కొందరు మహానుభావుల వ్యాఖ్యానాలు మున్నగు వివిధ గ్రంధాల నుండి తీసుకొని సంకలనం చేసాను. వాటిని అందించిన మహర్షులు, మహాత్ములు, పండితులు, ప్రచురణకర్తలు, సంస్థలు, నాకు వాటిని అందించిన ఉత్తములు అందరికి నా హృదయపూర్వక కృతఙ్ఞతా నమస్కారాలు. దీంట్లో ఏ పొరబాట్లు, తప్పులు కనబడినా సహృదయంతో మన్నించగలరని మనవి.

ఇట్లు,భాగవతగణనాధ్యాయి, ఊలపల్లి సాంబశివ రావు