పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : చెట్ల భాగాలు

10.1-1601-ఉ. పద్యంలో చెప్పిన ఒక తోటలోని చెట్లు తీగల, భాగాల పేర్లు


 1. పురీవనంబులు = పట్టణపు ఉద్యానవనములందలి
 2. వృక్ష = చెట్లు
 3. లతా = తీగలు
 4. గంధములు = సువాసనలు
 5. కోరక = మొగ్గలు
 6. జాలక = పసరుమొగ్గలు
 7. స్తబక = పూలగుత్తులు
 8. కుట్మల = అర విరిసిన మొగ్గలు
 9. పుష్ప = పువ్వులు
 10. మరంద = మకరందము
 11. లతా = తీగలు
 12. ప్రకాండ = చెట్టుమొదళ్ళు
 13. విటప = కొమ్మలు
 14. ఛద = ఆకుల
 15. పల్లవ = చిగుళ్ళు
 16. వల్లరీ = పూచిన లేత కొమ్మలు
 17. శిఫా = ఊడలు
 18. పరాగ = పుప్పొడి
 19. మూల = వేళ్ళు
 20. ఫల = పండ్లు

10.1-1601-ఉ.

శ్రీమణీయ గంధములఁ జెన్నువహించుఁ బురీవనంబులం
గోక జాలకస్తబక కుట్మల పుష్పమరందపూర వి
స్ఫాలతా ప్రకాండ విటచ్ఛద పల్లవవల్లరీ శిఫా
సాపరాగ మూల ఫల సంభృత వృక్షలతా విశేషముల్.