అనుయుక్తాలు- పారిభాషికపదాలు : చతుర్ వ్యూహములు
వ్యూహ చతుష్టయము - పరమేశ్వరుని రూపములు
3-895-సీ.
వ. సంఖ్య | పరమేశ్వరుని రూపము | వృత్తులు |
---|---|---|
1. | వాసుదేవ | మనస్సు |
2. | ప్రద్యుమ్న | బుద్ధి |
3. | అనిరుద్ధ | చిత్తము |
4. | సంకర్షణము | అహంకారము |
చతుర్వూహములు
వాసుదేవవ్యూహం: ఆకలిదప్పులు, శోకమోహాలు, జరామరణాలు అనే ఆరు ఊర్ములనుండి విడివడినదై ఐశ్వర్యం, వీర్యం, యశస్సు, శ్రీ, జ్ఞానం, వైరాగ్యం అనే షడ్గుణాలతో పరిపూర్ణమై సత్త్వగుణ ప్రధానమై, నిర్మలమై, శాంతమై, నిత్యమై, భక్తజన సంసేవ్యమై అలరారుతూ ఉంటుంది ఈ మహత్తత్వం.
సంకర్షణవ్యూహం: వైకారికమైన సాత్త్వికాహంకారాన్ని అధిష్ఠించి సంకర్షణవ్యూహం ఒప్పుతుంటుంది. వేయి పడగలతో ప్రకాశించేవాడూ, అనంతుడూ అయిన సంకర్షణ పురుషుడు మహానుభావుడై పంచభూతాలతో, పంచేంద్రియాలతో, మనస్సుతో నిండి ఉంటాడు. కర్త, కార్యం, కారణం అనే రూప భేదాలు కలిగి శాంతత్వం, ఘోరత్వం, మూఢత్వం మొదలైన లక్షణాలతో ఉల్లాసంగా ఉంటాడు. ఈ మేటి వ్యూహమే రెండవదైన సంకర్షణ వ్యూహం. దీనినుంచే మనస్తత్త్వం పుట్టింది.
ప్రద్యుమ్నవ్యూహం: మనస్తత్త్వానికి చింతనం సహజం. ఆ చింతనం సామాన్య చింతనం, విశేష చింతనం అని రెండు విధాలు. వీనినే క్రమంగా సంకల్పం, వికల్పం అని పేర్లు. ఈ సంకల్ప వికల్పాల వల్లనే సృష్టిలోని వస్తువులు వేరువేరు లక్షణాలతో మనకు కనిపిస్తాయి. వీని వల్లనే వివిధ కామాలు ఉత్పన్నమౌతాయి. కనుకనే ఇది ప్రద్యుమ్నవ్యూహం అని చెప్పబడుతుంది.
అనిరుద్ధవ్యూహం: సంగతి చెబుతాను. ఇదే ఇంద్రియాలన్నిటికి అధీశ్వరమై, యోగీంద్రు లందరకు సంసేవ్యమై, శరత్కాలమందలి నల్లకలువ వలె శ్యామల వర్ణంతో విరాజిల్లుతూ ఉంటుంది.