పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : బ్రహ్మదేవుని సృష్టి విశేషాలు

బ్రహ్మదేవుని పుత్రులు

పద్యం 3-376 లో చూపిన బ్రహ్మదేవుని పదిమంది పుత్రులు -
1. దక్షుడు; 2. నారదుడు; 3. పులహుడు; 4. పులస్త్యుడు; 5. భృగువు; 6. క్రతువు; 7. అంగిరసుడు; 8. వసిష్ఠుడు; 9. మరీచి; 10. అత్రి;
మరియు బ్రహ్మదేవుని ఇతర పుత్రులు -
11. కర్దముడు; 12. నిరృతి; 13. సరస్వతి; 14. మన్మధుడు; 15. నీలలోహితుడు అను రుద్రుడు; 16. సనత్సుజాతుడు; 17. సనత్కుమారుడు; 18. సనందనుడు; 19. సనకుడు; 20.స్వాయంభువ; 21. శతరూప.

బ్రహ్మదేవుని సృష్టి విశేషాలు

3-367-సీ. నుండి 3-388-వ.

 1. ఒక సగ దేహం నుండి - స్వాయంభువుడు; రెండో సగ దేహం నుండి - శతరూప; ఉద్భవించారు ఈ ఆది దంపతులకు → [1] పుత్రులు ప్రియవ్రతుడు; [2] ఉత్తానపాదుడు; పుత్రికలు [1]ఆకూతి(ఈమె భర్త రుచి ప్రజాపతి); [2]దేవహూతి (ఈమె భర్త కర్దమ ప్రజాపతి); [3] ప్రసూతి (ఈమె భర్త దక్ష ప్రజాపతి).


 2. లీలా విశేషాలు నుండి → శబ్దబ్రహ్మ


 3. ప్రాణంవల్ల → బృహతీ ఛందస్సు
 4. మజ్జవల్ల → పంక్తి ఛ్చందస్సు
 5. ఎముకలనుండి → జగతీ ఛందస్సు
 6. కీళ్ళువల్ల → అనుష్టుప్ ఛందస్సు
 7. మాంసం వలన → త్రిష్టుప్ ఛందస్సు
 8. చర్మం నుండి → గాయత్రీ ఛందస్సు
 9. రోమాలనుండి → ఉష్ణిక్ ఛందస్సు
 10. హృదయంలోని ఆకాశంనుండి → ఓంకారం


 11. ఉత్తర ముఖంనుండి → సువః వ్యాహృతి
 12. పశ్చిమ ముఖంనుండి → భవః వ్యాహృతి
 13. దక్షిణ ముఖంనుండి → భూః వ్యాహృతి
 14. తూర్పు ముఖంనుండి → అన్వీక్షకి, త్రయి, వార్తా, దండనీతి న్యాయవిద్యా చతుష్కం


 15. ఉత్తర ముఖంనుండి → సన్యాస ఆశ్రమం
 16. పశ్చిమ ముఖంనుండి → వానప్రస్థ ఆశ్రమం
 17. దక్షిణ ముఖంనుండి → గార్హస్థ్య ఆశ్రమం
 18. తూర్పు ముఖంనుండి → బ్రహ్మచర్య ఆశ్రమం


 19. ఉత్తర ముఖంనుంచి → చతురాశ్రమాలు లోని సన్యాసం
 20. పశ్చిమ ముఖంనుంచి → చతురాశ్రమాలు లోని వానప్రస్థం
 21. దక్షిణ ముఖంనుంచి → చతురాశ్రమాలు లోని గార్హస్థ్యం
 22. తూర్పు ముఖంనుంచి → చతురాశ్రమాలు లోని బ్రహ్మచర్యం


 23. ఉత్తర ముఖంనుంచి → ధర్మపాదం అయిన తపస్సు
 24. పశ్చిమ ముఖంనుంచి → ధర్మపాదం అయిన దానం
 25. దక్షిణ ముఖంనుంచి → ధర్మపాదం అయిన ధనం
 26. తూర్పు ముఖంనుంచి → ధర్మపాదం అయిన విద్య


 27. ఉత్తర ముఖంనుంచి → కర్మ తంత్రాలు వాజపేయం మరియు గోసవం
 28. పశ్చిమ ముఖంనుంచి → కర్మ తంత్రాలు అస్తోర్యామం మరియు అతిరాత్రం
 29. దక్షిణ ముఖంనుంచి → కర్మ తంత్రాలు చయనం మరియు అగ్నిస్టోమం
 30. తూర్పు ముఖంనుంచి → కర్మ తంత్రాలు షోడశి మరియు ఉర్ధ్యము


 31. అన్ని ముఖాలనుంచి → ఇతిహాస పురాణాలు


 32. ఉత్తర ముఖంనుంచి → స్ధాపత్యం అనే శిల్పవేదం
 33. పశ్చిమ ముఖంనుంచి → గాంధర్వవేదం
 34. దక్షిణ ముఖంనుంచి → ధనుర్వేదం
 35. తూర్పు ముఖంనుంచి → ఆయుర్వేదం


 36. ఉత్తర ముఖంనుంచి → బ్రహ్మ ఋత్విక్కు చేసే ప్రాయశ్చిత్తం అనే కాండ
 37. పశ్చిమ ముఖంనుంచి → ఉద్గాత చేసే స్తోమాలు అనే ఋగ్వేద మంత్రాలు
 38. దక్షిణ ముఖం నుంచి → అధ్వర్వుడు చేసే ఇజ్య, స్తుతులు అనే మంత్ర స్తోత్రాలూ
 39. తూర్పు ముఖం నుండి → హోత చేసే శస్త్రములు అను మంత్ర స్తోత్రాలు


 40. ఉత్తర ముఖంనుండి → అధర్వవేదము
 41. పశ్చిమ ముఖంనుండి → సామవేదము
 42. దక్షిణ ముఖంనుండి → యజుర్వేదము
 43. తూర్పు ముఖమునుండి → ఋగ్వేదము


 44. పురుషాంగంనుండి → సముద్రాలు
 45. పెదవులనుండి, → లోభం
 46. కనుబొమ్మలనుండి → క్రోధం
 47. వెన్నునుండి → మృత్యువు
 48. కుడి వైపు స్తనంనుండి → ధర్మం


 49. నీడనుండి → కర్దముడు
 50. అపానంనుండి → నిరృతి
 51. ముఖమునుండి → సరస్వతి
 52. ఆత్మనుండి → మన్మధుడు
 53. కన్నులనుండి → అత్రి
 54. మనస్సునుండి → మరీచి
 55. ప్రాణంనుండి → వసిష్ఠుడు
 56. ముఖంనుండి → అంగిరసుడు
 57. చేతి నుండి → క్రతువు
 58. చర్మంనుండి → భృగువు
 59. చెవులనుండి → పులస్త్యుడు
 60. నాభి నుండి → పులహుడు
 61. తొడనుండి → నారదుడు
 62. బొటనవ్రేలు నుండి → దక్షుడు
 63. భ్రుకుటి నుండి → నీలలోహితుడు అను రుద్రుడు → → రుద్రగణాలు
 64. దివ్యదృష్టితో → సనత్సుజాతుడు
 65. దివ్యదృష్టితో → సనత్కుమారుడు
 66. దివ్యదృష్టితో → సనందనుడు
 67. దివ్యదృష్టితో → సనకుడు


 68. సృష్టి ఆరంభంలో → అవిద్యాపంచకం (1. మోహం, 2. మహామోహం, 3. అంధతామిస్రం, 4. తామిస్రం, 5. చిత్త విభ్రమం)