అనుయుక్తాలు- పారిభాషికపదాలు : భాండీరక వటము
భాండీరకవటము 10.1-749
భాండీరకము - కుంభవిశేషము (ఒక రకమైన కుండ), నవద్వారకలిత దేహమనువచ్చు గమనిక - శ్లో. నవద్వారేవపుఃకుంభే ప్రాణవాతాంబు పూరితే, తిష్ఠతీత్యద్భుతం మన్యేగచ్చతీతి కిమద్భుతం., నవద్వారములు కల కుంభము ప్రాణవాయువుచే అద్భుతముగా నిండి ఉన్నది ఎంత అద్భుతమైనది ఈ దేహము.వటము ఊడలు వేళ్ళు అధికముగాగల వటవృక్షము సంసారముతో పోల్చబడుచుండును.ఈ భాండీరకము అను పేరుగల వటవృక్షం వద్ద ఆ లీలామానుష శిశువు శ్రీకృష్ణుల వారు తోటి గోపబాలురతో ఆటలాడారని, అడవిలో దావాగ్ని చుట్టుముట్టగా వారిని కన్నులు మూసుకొన మని తన యోగబలంతో చిటికెలో భాండీరకం చేర్చా రని. మఱియు, ప్రలంభాసుర సంహారం వేదిక అని వర్ణించబడింది.