పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : అక్షౌహిణి వివరణ

అక్షౌహిణి – సేనాసమూహవిశేషము

అక్షౌహిణి వరకు సంఖ్యావివరములు

1 రధము + 1 ఏనుగు + 3 గుర్రాలు + 5 కాలిబంట్లు కలిస్తే = ఒక పత్తి

పత్తి x 3 = సేనాముఖము (అంటే 3 రధములు + 3 ఏనుగులు + 9 గుర్రాలు + 15 కాలిబంట్లు)
సేనాముఖము x 3 = గుల్మము (అంటే 9 రధములు + 9 ఏనుగులు + 27 గుర్రాలు + 45 కాలిబంట్లు)
గుల్మము x 3 = గణము (అంటే 27 రధములు + 27 ఏనుగులు + 81 గుర్రాలు + 135 కాలిబంట్లు)
గణము x 3 = వాహిని (అంటే 81 రధములు + 81 ఏనుగులు + 243 గుర్రాలు + 405 కాలిబంట్లు)
వాహిని x3 = పృతన (అంటే 243 రధములు + 243 ఏనుగులు + 729 గుర్రాలు + 1215 కాలిబంట్లు)
పృతన x 3 = చమువు (అంటే 729 రధములు + 729 ఏనుగులు + 2187 గుర్రాలు + 3645 కాలిబంట్లు)
చమువు x 3 = అనీకిని (అంటే 2187 రధములు + 2187 ఏనుగులు + 6561 గుర్రాలు + 10935 కాలిబంట్లు)
అనీకిని x 10 = అక్షౌహిణి (అంటే 21870 రధములు + 21870 ఏనుగులు + 65610 గుర్రాలు + 109350 కాలిబంట్లు)

అక్షౌహిణి కన్నా పెద్దవి - సుగ్రీవుని సైన్యము లెక్క

అక్షౌహిణి కన్నా పెద్దవి - సుగ్రీవుని సైన్యము లెక్క
అక్షౌహిని X 18 = ఏకము
ఏకము X 8 = కోటి ( ఈ కోటి మన కోటి కాదు )
కోటి X 8 = శంఖము
శంఖము X 8 = కుముదము
కుముదము X 8 = X 8 = పద్మము
పద్మము X 8 = నాడి
నాడి X 8 = సముద్రము
సముద్రము X 8 = మహాసముద్రము
మహాసముద్రము X 2 = వెల్లువ
అంటే = 36691,71,39,200 సైన్యాన్ని వెల్లువ అంటారు.

ఇలాంటి 70 వెల్లువలు సుగ్రీవుని దగ్గర ఉన్నట్లుగా కంబ రామాయణం చెపుతుంది.

అంటే 366917139200 X 70 = 2,5684239,97,44,000 మంది వానర వీరులు సుగ్రీవుని దగ్గర వుండేవారు.వీరికి నీలుడు అధిపతి.గమనిక - (వికిపీడియా నుండి గ్రహించడమైనది. (తెవికె.ఓఆర్ జి/వికి/అకౌహిణి))