పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : ప్రపంచము

ప్రపంచము

10.1-560 (సీసం)1.పంచభూతములు 2.పంచఙ్ఞానేంద్రియములు 3.పంచకర్మేంద్రియములు 4.పంచతన్మాత్రలు 5.పంచవాయువులు అనెడి పంచకప్రవర్తకమగునది ప్రపంచము. 

 1.భూతపంచకము - భూమి జలము తేజస్సు వాయువు ఆకాశము. 

2.ఙ్ఞానేంద్రియపంచకము - కన్ను చెవులు ముక్కు నాలుక చర్మము. 

3.కర్మేంద్రియపంచకము - కాళ్ళు చేతులు నోరు గుదము గుహ్యము. 

4.మాత్రాపంచకము - శబ్దము స్పర్శము రూపము రుచి గంధము. 

5.వాయుపంచకము - ప్రాణము అపానము వ్యానము ఉదానము సమానము.